హనుమద్రక్షల వెల ఎంత ? శ్రీరామ నామ జపమంత.హనుమాన్ చాలీసా పారాయణమంత.
>> Monday, March 4, 2013
హనుమద్రక్షలు అంటే యంత్రములు కావు. యాగనిర్వహణా సమయంలో పీఠంలోనూ, అటు పలుప్రాంతాలలో ఉన్న భక్తులు కూడా హనుమాన్ చాలీశా పారాయణములు,శ్రీరామ నామ జపములు చేయగానూ,వేదవిదుల వేదోక్తమంత్రాలతోనూ శక్తిపూరితం కాబడిన తోరములు ఇవి.
వీటిఖరీదు ఇంత అని నిర్ణయించటానికి మన ఆర్ధికశాస్త్ర ప్రమాణములు చాలవు.
ఇక కలియుగంలో భగవంతుని ప్రసాదాలను,దర్శనములను ,భజనలను కూడా వెలకట్టి విక్రయిస్తారని భవిష్యపురాణము,భాగవతములలో ఆనాడే హెచ్చరించి ఉన్నారు పెద్దలు. పరమాత్మ మమ్మలను ఆపాపపు పనులవైపు వెల్లనివ్వలేదు.
మరి హనుమద్రక్షలకు వెల లేదా ? అనవచ్చు.
ఉన్నది .
అదెంత ? అంటే
రామనామ జపమంత. హనుమాన్ చాలీసా పారాయణమంత గా నిర్ణయించబడినది .
ఈతోరము ధరించేవారు రోజూ కనీసం నూటాఎనిమిది సార్లు రామనామమును జపించాలి. నిత్యం ఒక్కసారన్నా హనుమాన్ చాలీశాను పఠించాలి. శారీరకంగా జపం చేయలేనిస్థితి లో ఉంటే వారికొరకు ఇతరులు చేయవచ్చు. జపమంటే మీరు భయపడేంత నియమాలు కావు. రోజూ స్నానం చేయగనే ఓ పదినిమిషాలు పాటు కుదిరికగా కూర్చుని ,శ్రీరామజయరామ జయజయరామ, అనే మంత్రాన్ని జపించండి , హనుమాన్ చాలీశా పారాయణం చేయండి. అలాచదవలేకపోతే ఏ సెల్ ఫోన్లోనో ఉంచుకుని ఆన్ చేసి వింటూ కళ్ళుమూసుకుని స్వామియొక్క రూపాన్ని గమనిస్తుండండి చాలు. అయ్యా నియమముగా చేయటం మావల్ల కాదుధర్మంగా వ్యవహరించటం కుదురుతుందా అంటారా !!
మరేంపరవాలేదు . భక్తిగా ఆయన పాదాలు పట్టుకోండి చాలు. ఆయన సద్గురువు కూడా . మనజీవితాలను ఆయనచేతిలోకి తీసుకుని ఎలా చక్కని శిల్పంలా మలుస్తారో చూడడి.
ఆ మాత్రం దానికే పొంగిపోయి సర్వత్రా మీకు రక్షణగా ఉంటాడు . హనుమంతుడు .అంతటి భక్తజన సులభుడాయన. అప్పుడు అది రక్ష అవుతుంది
అదేదో చేతికి కట్టుకుంటే పనైపోద్దనుకుంటే ,మీరు స్మరణచేసి ఆయనను ఆశ్రయించకుంటే మీరు ధరించే ఓ అలంకరణ వస్తువుతో సమానమవుతుంది గాని ఫలితం ఉండదు అంతగా .
. పోస్ట్ ఖర్చుభరించే స్థితిలో మేములేముగనుక పోస్ట్ ఖర్చుగానీ రిప్లై కవర్ గానీ పంపినవారందరికీ యాగం పూర్తయిన నెలరోజులదాకా పంపుతూనే ఉంటాము ప్రతిసంవత్సరముకూడా
జైశ్రీరాం
0 వ్యాఖ్యలు:
Post a Comment