శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీ రామ నామజపలిఖిత ప్రతులతో భద్రగిరికి బయలుదేరిన హనుమద్రక్షాయాగ కార్యకర్తలు

>> Friday, February 22, 2013

స్వామి హనుమ దయవలన హనుమద్రక్షాయాగం ఐదవ ఆవృతి ఆనందోత్సాహాలతో కొనసాగి పూర్ణాహుతి జరిగినది.
ఇక ఈ యాగంలో చాలీసా పారాయనం తోపాటు రామనామ జపమును కూడా జోడించి స్వామి హనుమకు అత్యంతప్రీతికరంగా సాధనలు జరుపబడ్డాయి. దేశవిదేశాలనుండి కూడా ఈ  జపయాగంలో పాల్గొని రామనామ లిఖిత ప్రతులను రామభక్తులు అందజేశారు.   ఐదవ ఆవృతి ప్రారంభసమయంలోనే     నాలుగవ ఆవృతిలో పాల్గొన్న మితృలు  కొందరిచే   రామకార్యముకూడా ఈసారి చేయాలని సంకల్పింపజేశారు స్వామి.  ,అయ్యంగారి నాగేంద్రగారి  నాయకత్వంలో భద్రాచలంలో  ఈనెల ఇరవై మూడు ,నుండి ఇరవై అయిదువరకు వరుసగా శ్రీరామ యాగం,సీతారామకళ్యాణం,మూడవరోజు రామపట్టాభిషేకం కార్యక్రమాలకు ఏర్పాట్లు జరిగాయి.
అనుకున్నప్రకారం   హనుమద్రక్షాయాగంలో  పాల్గొని శ్రీరామనామములు లిఖించిన ప్రతులన్నింటినీ తీసుకువెళ్ళి శ్రీరామప్రభువుల పాదసన్నిధికి చేర్చాలని  ఈరోజు మన పీఠం నుండి కార్యకర్తలు బయలుదేరారు.  రేపు తెల్లవారేసరికి భద్రగిరికి చేరుకుని  మనాయ్య రామయ్యను మన అమ్మసీతమ్మను దర్శించుకుని భక్తులందరి తరపున వారికి ప్రతులను సమర్పించుట జరుగుతుంది.  దాసబృందం తరపున ఈదాసులమొచ్చాము స్వామీ! అని వారికి నివేదించుట జరుగుతుంది.  ఈకార్యక్రమంలో పాల్గొనేందుకు అటు విశాఖమన్యంనుండి గిరిపుతృలు ,ఇటూ రాయలసీమ బిడ్డలు, అటు తెలంగాణా యోధులు రామదండు వలె కదలి వస్తున్నారు.
మనందరకూ స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్ధనలు చేయటం జరుగుతుంది.



[ కార్యక్రమ బాధ్యతలను తలకెత్తుకున్న వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో ఎక్కువమందికి ఇప్పటివరకు భద్రాచలంలో శ్రీరామ కార్యం  వివరాలు తెలియజేయలేకపోయాము.  మన్నించగలరు.
ఈమధ్యలో నెట్ అందుబాటులో ఉండదు గనుక  నాతో మాట్లాడవలసి వస్తే నాకు ఫోన్ చేయగలరు.
జైశ్రీరాం  9948235641]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP