ఈ వార్తలు చదువుతుంటే మన ఆచారాలవెనుక ఎంత సత్యముందో తెలుస్తుంది
>> Tuesday, February 21, 2012
ఉపవాసం మేలే!
లండన్, ఫిబ్రవరి 20: శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నారా? అయితే, మీ ఆయుష్షు పెరిగినట్లే. వారానికి ఒకటి లేదా రెండ్రోజులు ఉపవాసం చేస్తే ఆయుష్షు పెరుగుతుందని లండన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాంకోవర్‌లో జరిగిన అమెరికన్ అసోషియేషన్ ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ సమావేశంలో ఈ వివరాలను లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ పరిశోధకులు వెల్లడించారు. ఒకటో రెండ్రోజులు ఉపవాసం ఉంటే కేలరీలు అందక మెదడులో రసాయనిక సందేశాలు అందించే వ్యవస్థ చురుగ్గాఅవుతుంది. దీంతో అల్జీమర్స్, పార్కిన్‌సన్ ఇతర వ్యాధుల నుంచి మెదడు రక్షణ పొందుతుంది. "ఉపవాసం ఆయుష్షును పెంచుతుంది. అయితే, విపరీతంగా ఉపవాసం చేయకూడదు.'' అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్‌కు చెందిన ప్రొఫెసర్ మార్క్ మాట్స్‌న్ చెప్పారు.
===============================================================
పాములలకూ 'తాగడం' వచ్చు!
లండన్, ఫిబ్రవరి 20: పాములు నీళ్లు తాగలేవన్న భావనను తోసిపుచ్చుతూ వాటికీ 'తాగడం' వచ్చునని తాజా పరిశోధన తేటతెల్లం చేసింది. కాకపోతే అవి నోటితో కాకుండా చర్మంతోనే తాగుతాయట! అదెలాగ? అనుకుంటున్నారా... ఈ సందేహంతోనే బెత్లెహామ్‌లోని లీ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం రంగంలో దిగింది. కొన్ని సర్పజాతులు తమ కింది దవడ దిగువనున్న చర్మపు ముడుతలను స్పాంజిలా ఉపయోగిస్తాయని వారు తేల్చారు. ఈ పద్ధతిని 'కాపిల్లరీ యాక్షన్'గా వ్యవహరిస్తారు. 'బోవా కన్‌స్ట్రిక్టర్' జాతి పాములు తమ నోటిలోని సన్నని రంధ్రం ద్వారా నీటిని పీల్చుకుంటాయని 1993 ప్రాంతంలో కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.
కానీ, ఇందుకు సాక్ష్యాలేవీ లేవని డేవిడ్ కండాల్ నేతృత్వంలో తాజా పరిశోధన నిర్వహించిన బృందం స్పష్టం చేసింది. బోవాతోపాటు 'అకిస్ట్రోడాన్ పిషివోరస్, హెటెరోడాన్ ప్లాటిరైనో, పాంతిరోఫిస్ స్పిలాయిడ్స్' జాతి పాముల నోటిలో ఒత్తిడి కలిగించే సెన్సర్లను ఈ బృందం అమర్చింది. ఈ పరిశోధనలో ఏం తేలిందంటే... ఏదైనా పెద్ద ఎరను మింగినపుడు వాటి కింది దవడ దిగువన ముడుతలుగా ఉండే చర్మం బాగా సాగుతుంది. ఇవే ముడుతలను ఆ పాములు నీటిమీద స్పాంజిలా అద్ది, తేమను పీల్చుకుని గొంతులోకి పంపుతాయని పరిశోధకుల బృందం వివరిస్తోంది.
ఆంధ్రజ్యోతి.com
1 వ్యాఖ్యలు:
లంఖణం పరమౌషధం, అన్నారు.
Post a Comment