శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మనిషి ఆనందంగా జీవించాలంటే ఎలా నడుచుకోవాలి?

>> Thursday, January 19, 2012

శ్రీగురుభ్యోన్నమః
నమస్తే


యథాలాపంగా ఒక పుస్తకం చదువుతుంటే, ఈ క్రింద విషయం కనపడింది. అందరికీ
తెలిసినదే అందరూ చెప్పేదే ఐనా ఇటువంటి విషయం పునరావృత్తి అవుతూ ఉండాలి,
ఎప్పుడూ మనకి గుర్తుకు వస్తూండాలి, ఎంతవరకూ అంటే ఆ విషయం మనలో పూర్తిగా
జీర్ణించుకుపోయి మనం అదే ఆచరించే వరకూ.

అందరికీ తెలిసిన విషయమే అందరు పెద్దలు చెప్పిన విషయమే ఐనా మళ్ళీ
పొందుపరచడానికి సాహసించాను.

మనిషి ఆనందంగా జీవించాలంటే ఎలా నడుచుకోవాలి? మన ఋషులు ఈ విషయమై ఏం
బోధించారు?

మనిషి ఆనందంగా జీవించటానికి మనిషి ఒక ప్రయాణికునిలా జీవించాలి. ఎలా అంటే
రైలులో బెర్తు రిజర్వు చేసుకుని ప్రయాణం తరవాత రైలుని బెర్తుని ఎలా వెంట
తీసుకుపోకుండా అక్కడే వదిలేస్తామో, అలా ఇది నా స్వంతం అన్న భావన లేకుండా
జీవించాలి. నేను యజమానిని కాదు అన్న భావనతో జీవించాలి. అప్పుడే మనిషి ఏ
భయమూ లేక ఆనందంగా జీవిస్తాడు అలా అలవాటైన మనిషి అద్వైత దర్శనం చేయడానికి
యోగ్యుడౌతాడు.

ఇదే భావాన్ని డబ్బుకి, ఇంటికి, సంపాదనకి, భార్యకి, పిల్లలకి, బంధువులకి,
చదువుకి, ఆఖరికి తన శరీరానికి కూడా అన్వయించుకోవడం నేర్చుకోవాలి. ఐతే ఇది
ఒక్కరోజుతో అబ్బేదికాదు. సాధన చేత కర్తృత్వభావాన్ని పెంపొందించుకుని
బాధ్యత అన్న భావన తగ్గించుకున్న నాడు, ఒక్కోమెట్టుగా నమః నమః నయితి నయితి
అంటూ ఇది నాది కాదు అన్న భావనని పెంపొందించుకున్న నాడు, మనిషి ఆనందంగా
జీవించి అనంతరం శాశ్వతానందమైన మోక్షానికి దగ్గరౌతాడు.

నాది అనే (యాజమాన్య) భావన లేకుండా దొరికినదానితో తృప్తిపడి చక్కగా
దొరికినదానిని ధర్మానుగుణంగా అనుభవించగలిగితే ఆ మనిషి నిత్యమూ ఆనందం
పొందుతున్నవాడు అని మన మహర్షులు మనకి బోధించారు.

మరి వీటన్నిటికి నేను యజమానిని కాకపోతే ఎవరు? ఆ భావన ఎలా
స్థిరపరచుకోవాలి? ఏదైనా ఉదాహరణ చూపండి.

అన్నిటికీ యజమాని భగవంతుడే. నయితి భావనతోనే ఇవన్నీ మనకిచ్చినవి భగవంతుడే
అన్న భావనను పైన చెప్పినట్టుగా సాధనచే ఒక్కో వస్తువునూ, బంధుత్వాన్నీ
పరిశీలిస్తూ అలవర్చుకోవాలి. అరే నా ఇల్లు అంటున్నాను, ఇది ఎక్కడిది
ఎవరిచ్చారు ఎలావచ్చింది అనే పరిశీలాత్మకా దృష్టిచే అలవర్చుకోవాలి.
ఇక ఉదాహరణ అంటే, పైన చెప్పిన రైలు ఉదంతాన్నే తీసుకుందాం, మనం ఎక్కిన
రైలు,బోగీ, బెర్తు, రైలు నడిచిన పట్టాలు, దానిశక్తి, దాన్ని నడిపేవారు,
రైలు ఆగే స్టేషనూ అన్నీ రైల్వే డిపార్టుమెంటువే. కానీ ఆ రైల్వే
డిపార్టుమెంటు తప్ప అన్నీ మనకు కనపడతాయి. భగవంతుడూ అలానే యజమాని ఐన ఆయన
మనకి కనపడకుండా మన జీవన ప్రయాణానికి కావలసినవన్నీ సమకూరుస్తాడు. కానీ
మనిషి అన్నీ తనవనుక్కుని స్వార్థంతో జీవించి జీవితాన్ని దుఃఖమయం
చేసుకుంటాడు.

వీటన్నిటిమీదా బంధుత్వాలమీద మమకారాన్ని మెల్లి మెల్లిగా వీడాలి, కేవల
కర్తృత్వ భావనతో జీవించాలి.

ఇది కేవలంగా ప్రాథమిక సాధకునిగా వ్రాసినదిమాత్రమే, సాధనలో ప్రాథమికం దాటి
పై స్థాయిలలో ఉన్నవారు ఏమైనా సిద్ధాంత పరమైన వేదాంత పరమైన తేడాలుంటే
మన్నించగలరు.


మీ..........

ayyamgaari nagendra kumar

1 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni January 20, 2012 at 8:20 AM  

chaalaa manchi vishayaalu. Ardham chesukovadaaniki prayatnisthaanu. Dhanyavaadamulu.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP