శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవుడున్నాడా ? అబ్దులకలాం గారికి వారి ప్రొఫెసర్ గారికి జరిగిన సంవాదం

>> Wednesday, November 9, 2011


దేవుడు ఉన్నాడని ఆస్తికులు, లేనే లేడని నాస్తికులు వాదిస్తారు. వీరిద్దరూ ఎదురుపడితే వాడివేడి వాదన తప్పనిసరి. ఇలాంటి ఆసక్తికర ఘట్టం ఒక కళాశాల తరగతి గదిలో ప్రొఫెసర్, స్టూడెంట్‌ల మధ్య జరిగింది. ఆసక్తికరంగా సాగిన ఆ వాదప్రతివాదాలు మీ కోసం.

ప్రొఫెసర్: దేవుడనే వాడున్నాడా? ఉంటే ఎలాగుంటాడు? దేవుడు మంచివాడా చెడ్డవాడా?

స్టూడెంట్: దేవుడు ఉన్నాడని మాత్రం నేను నమ్ముతాను.

ప్రొఫెసర్: అయితే దేవుడు శక్తిసంపన్నుడా?

స్టూడెంట్: కచ్చితంగా దేవుడు శక్తి సంపన్నుడే.

ప్రొఫెసర్: మరి దేవుడు అంత శక్తివంతుడే అయితే నా సోదరుడు కూడా దేవుడిని నమ్ముతాడు. మరి అతడి అకాల మరణాన్ని మీ దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు?

(స్టూడెంట్ మౌనంగా ఊరుకున్నాడు)

ప్రొఫెసర్: సరే...అదలా ఉంచు...దెయ్యం ఉందని నమ్ముతావా?

స్టూడెంట్: నమ్ముతానన్నట్లు తలూపాడు.

ప్రొఫెసర్: మరి దెయ్యం మంచిదా చెడ్డదా?
స్టూడెంట్: చెడ్డదే!

ప్రొఫెసర్: బాగుంది...మరి దెయ్యాన్ని సృష్టించింది ఎవరు? స్టూడెంట్: దేవుడే! ప్రొఫెసర్: మరి దేవుడు సృష్టించిన దెయ్యం చెడ్డది ఎలా అవుతుంది?

(స్టూడెంట్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనం వహించాడు)

ప్రొఫెసర్: లోకంలో మంచి చెడు, పాపం పుణ్యం, ప్రేమ ద్వేషం, ఇలా అన్నీ రెండు పార్శ్వాలుంటాయి. పంచేంద్రియాలతోనే మనం ఏ వస్తువునైనా గుర్తించగలమని మన సైన్స్ చెబుతోంది. దేవుడనే శక్తిని పంచేంద్రియాలలో ఏదీ గుర్తించలేనపుడు దేవుడి ఉనికిని ఎలా విశ్వసించగలం?

స్టూడెంట్: మీరేమయినా చెప్పండి. నేను భగవంతుడిని నమ్ముతాను.

ప్రొఫెసర్: నమ్మకాలు, విశ్వాసాలు కావోయ్...ఆధారాలు చూపు (శిష్యుడిని నిలదీస్తున్నట్లు అడిగాడు)
(గురువు గారికి గుణపాఠం చెప్పాలనుకుని, ఎదురుదాడి మొదలెట్టాడు స్టూడెంట్)

స్టూడెంట్: సార్! వేడి అనే పదార్థం ఉందా? ప్రొఫెసర్: ఉంది నాయనా...

స్టూడెంట్: మరి చల్లదనం?

ప్రొఫెసర్: అదీ ఉంది.

స్టూడెంట్: గురూజీ మీ వాదన తప్పు.. వేడిలో అనేక దశలు ఉన్నాయి...వేడిని ఎంతటి తీవ్రస్థాయికైనా తీసుకువెళ్లొచ్చు. అలాగే తక్కువ స్థాయికి తీసుకురావచ్చు. కాని శీతలం అనే మాటకే అర్థం లేదు. అది కేవలం భావన మాత్రమే.. చల్లదనాన్ని కొలిచే సాధనమేదీ లేదు. వేడిగా లేకపోవడమే చల్లదనానికి నిర్వచనం. వేడి ఒక శక్తి... ఒక ఇంధనం..వేడికి వ్యతిరేకం శీతలం కాదు. వేడి లేకపోవడమే శీతలం.(గురువు ఆశ్చర్యంగా శిష్యుడి వాదన వినసాగాడు).

స్టూడెంట్: ఇక చీకటి మాటేమిడి గురూజీ...చీకటి అనేది ఉందంటారా?

ప్రొఫెసర్: అవును...చీకటి ఉంది...చీకటి లేకపోతే రాత్రి ఎందుకవుతుంది?

స్టూడెంట్: మళ్లీ మీరు పొరబడ్డారు...చీకటి అంటే వెలుగు లేకపోవడం. అంతేకాని చీకటి అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. వెలుగును మనం ఎన్నో రకాల కాంతులతో చూడవచ్చు. మసక వెలుతురు నుంచి ఉజ్వలమైన ప్రకాశాన్ని వీక్షించవచ్చు. వెలుగు ఎక్కడ లేదో అదే చీకటి. వాస్తవానికి చీకటి అంటూ ఏదీ లేదు. చీకటిని ఎంతటి దట్టమైన స్థితికి తీసుకుపోగలరు మీరు?

ప్రొఫెసర్: ఇంతటీ నువ్వు చెప్పదలచుకున్నది ఏమిటి?

స్టూడెంట్: మీ తాత్వికత లోపభూయిష్టమన్నదే నా అభిప్రాయం...

ప్రొఫెసర్: నా సిద్ధాంతం తప్పా? అదేమిటో నువ్వే చెప్పు!

స్టూడెంట్: గురువు గారు..మీది ద్వైదీ భావ సిద్ధాంతం. జీవం ఉందంటారు...మరణం ఉందంటారు..అలాగే మంచి దేవుడు...చెడ్డ దేవుడు అంటారు. మేము ఉన్నాడని భావించే దేవుణ్ని మీరు ఒక ప్రాణమున్న వస్తువుగా నిరూపించమని సవాలు చేస్తున్నారు. నిజానికి మీరు నమ్మే సైన్స్ మనిషి ఆలోచనలను ఏ పరికరంతో పసిగట్టగలదు? ఏ సైన్స్ నేత్రాలకు మనిషి మేథస్సు కనపడుతుంది? జీవానికి వ్యతిరేక అర్థం కాదు మరణమంటే...మరణమనేది ఘనీభవించిన పదార్థం కాదు. జీవం నశించడమే మరణం. కోతి నుంచి మనిషి పుట్టాడని మీరు పాఠాలు బోధిస్తుంటారు కదా...అది నిజమని మీరు నమ్ముతారా?

ప్రొఫెసర్: మానవ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అది నిజమే...

స్టూడెంట్: మీ కళ్లతో మీరు మానవ పరిణామ క్రమాన్ని చూశారా గురూజీ? (ఈ వాదన ఎక్కడికి దారితీస్తోందో గురువుకు అర్థమైపోయింది. ఓడిపోతున్నానన్న భావనకు వచ్చేస్తూ తల అడ్డంగా వూపాడు)

స్టూడెంట్: ఈ లోకంలో ఎవరూ మానవ పరిణామ క్రమాన్ని స్వయంగా చూడలేదు. ఆ పరిణామ క్రమం సర్వ కాలాలలో జరుగుతూ ఉంటుందని మీరు పిల్లలకు బోధిస్తుంటారు..మీరు శాస్త్రవేత్తలా లేక మీరు నమ్మింది చెప్పే ప్రచారకులా?(క్లాసులో విద్యార్థులంతా గొల్లుమన్నారు. ) ఈ క్లాసులో మన గురువుగారి మెదడును ఎవరైనా చూశారా? (పిల్లల నవ్వులతో క్లాసు రూము మార్మోగింది).

స్టూడెంట్: గురువుగారి మెదడును మీలో ఎవరైనా కంటితో చూశారా? నాసికతో వాసన చూశారా? కనీసం ఎవరైనా తాకి చూశారా?అలా ఎవరూ చేయలేకపోయి ఉంటే గురువు గారు నమ్మే సిద్ధాంతం ప్రకారం ఆయనకు మెదడు లేనట్లే..మీ పాఠాలను మేము ఎందుకు వినాలి? (క్లాసులో నిశ్శబ్దం ఆవరించింది. శిష్యుడి వాక్ప్రవాహంలో తడిసి ముద్దయిన గురువు గొంతు పెకిలించుకుంటూ...)

ప్రొఫెసర్: అలాంటి విషయాలను విశ్వాసంతో ముడిపెట్టాలి నాయనా...

స్టూడెంట్: నేనూ అదే అంటున్నాను గురూజీ.....మనిషికి దేవుడికి మధ్య ఉండే అనుబంధం నమ్మకమే. ఆ నమ్మకమే సృష్టిని ముందుండి నడిపిస్తోంది...మనం కూడా అదే నమ్మకంతో ముందుకు సాగాలి.
ఇంత ఆసక్తిగా సాగిన ఈ వాదసంవాదం యదార్థంగా జరిగిన సంఘటన. దీంట్లో కొసమెరుపు ఏమిటంటే ఈ వాదనలో గురువును మూడు చెరువుల నీళ్ళు తాగించిన శిష్యుడు మరెవరో కాదు మన మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ కావడం విశేషం.

4 వ్యాఖ్యలు:

Anonymous November 9, 2011 at 7:10 AM  

చాలా మంచి సంవాదం మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. "మీరు శాస్త్రవేత్తలా లేక మీరు నమ్మింది చెప్పే ప్రచారకులా?" ఇవ్వాళ అనేక మంది సైన్సుని అడ్డంపెట్టుకుని చేసే పనే ఇది.

Anonymous November 9, 2011 at 5:08 PM  

మేస్టారూ మనీ మనీ సినిమాలో కోటా శ్రీనివాస్ రావ్ అన్నట్టు...

" సేమ్ స్టోరీ... సేమ్ క్లాస్ రూం. డయలాగ్స్ ఆల్సో సేమ్... బట్ పర్సన్స్ చేంజ్డ్... " నౌ కలాం కే నాం పే సేమ్ ఇస్టొరీ ...

ఎక్కడో నే చదివిన వర్షన్ లో ఆ స్టూడెంట్ పేరు నీల్స్ భోర్ అని ఓ చోట, ఓ పిలాసఫీ స్టూడెంట్ అని మరోచోట వుండింది. ఇపుడు మీరు ఆయన క్లామే అని నమ్మ బలుకుతున్నారు. :))

ఒరిజినల్ రెఫర్ చేయకుండా ఇలా వాడేసుకోవడం ఏమంత బాగ లేదు. ఒరిజినల్ లింక్ ఇవ్వండి. పురాణాలను, శతకాలను, ప్రభంధాలనూ ఇలాంటి ప్రక్షిప్తాలతో భ్రస్టు పట్టించారు, ఇక ఇక్కడ కూడానా?! కలాం గారి తమిళ భజన బృందం ఇలాంటి కాపీ కథలు అల్లి దేశం మీదికి వదలుతూ వుంటుంది అనేది నిజమే అనిపిస్తోంది.

..nagarjuna.. November 9, 2011 at 10:55 PM  

ఈ సంభాషణలు ఐస్టీన్, అతని ఉపాధ్యాయుడికి మధ్య జరిగాయని విన్నాను దుర్గేస్వరగారు. ఓసారి ఈ వీడియో చూడండి

www.youtube.com/watch?v=HvhGeNzdRZA

durgeswara November 10, 2011 at 8:55 AM  

స్వామీ !

ఇది నిన్న ఆంధ్రజ్యోతి లో సకల విభాగంలో ప్రచురించబడిన వ్యాసం . దీనిమూలమేదో నాకు తెలియదు .వ్యాసం బాగుంది అని ఇక్కడుంచాను . అంతే.అయితే సాధారనంగా నేను ఎక్కడనుంచన్నా సేకరించిన వ్యాసాలవద్ద ఫలానా చోటనుంచి అనివ్రాస్తాను ఇప్పుడు హడావుడిలో మరచిపోయాను . మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదములు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP