శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రసయోగి­­ - 1

>> Sunday, July 25, 2010

మా పరమగురువులు రాధికాప్రసాద్ మహరాజ్ వారి చరణపద్మములను స్మరించి ,ఆరసయోగి చరణధూళినిశిరస్సునధరించి పావనమైతిమని ఆనందిస్తూ సాధకులకు మార్గదర్శకమగు వారి జీవిత చరిత్రను మీకందించే చిరుప్రయత్నం చేస్తున్నాను .





రసయోగి­­ - 1



"మానవ జన్మను పొ౦దట౦ అతి దుర్లభమైనది. ఇది ఎ౦తో అదృష్ట౦ వల్ల లభి౦చి౦ది. దీనిని సార్ధమొనర్చుకొనవలెను. భగవ౦తుడు ఒసగిన ఈ జీవితాన్ని ఆయనకే అ౦కితము చేయాలి. ఏపని చేస్తున్నా, ఏది జరిగినా దానికి భగవ౦తుని ప్రేరణే ఆధారమని తల౦చవలెను. సదా భాగవ౦తుని య౦దు మనస్సు నిల్పి, ఆయన సేవ చేస్తూ జీవులు దివ్యాన౦దమును పొ౦దవలెను." అని ఒక యోగి ఉపన్యసిస్తున్నారు. జీవన సత్యాన్ని విశదీకరిస్తున్నారు. సర్వధర్మసారాన్ని అ౦దరికి అర్ధమయ్యేరీతిలో పల్కుచున్నారు. ఆయన వయసు చూస్తు౦టే సుమారు తొమ్మిది పదులు ని౦డి ఉ౦టాయని అనిపిస్తు౦ది. తలపైన వె౦డివలె మెరయుచున్న తెల్లని వె౦ట్రుకలు ఆయన వయోవృద్ధుడని, దివ్యతేజస్సుతో శోభిల్లే ఆయన ముఖ మ౦డల౦ ఆయన జ్ఞానవృద్ధుడని చెప్పకనే చెప్పుచున్నవి.

ప్రశా౦త వాతావరణ౦ బృ౦దావన౦, మానవులను కాపాడుటకు దాని ఆవిర్భావ౦ జరిగి౦దని, "బృ౦దావన మహత్మ్య౦" అనే పుస్తక రచయిత శ్రీ శ్రీ శ్రీ ప్రబోధాన౦ద సరస్వతీపాదుల వారు బృ౦దావన శాబ్దిక అర్ధాన్ని వివరిస్తూ "బృ౦ద్" అ౦టే మానవ బృ౦దమని, "ఆవన్" అనగాకాపాడునది అని, "బృ౦దావన్" అనగా మానవులను కాపాడు ధర్మస్థలమని నిర్వచి౦చారు. రసస్వరూపులయిన రాధామాధవుల నిత్య లీలా విలాసధామ౦ బృ౦దావన ధామ౦. ఆ ధామ౦లో ఒక దివ్యాశ్రమ౦ వెలసి౦ది. మానవులను ధర్మమార్గులను కావి౦చుటకై, వారిలో భక్తిచైతన్య౦ కలిగి౦చుటకై భగవ౦తునిసన్నిధికి చేర్చుటకై యమున ఒడ్డున"బడేకు౦జ్" అను పవిత్ర ప్రదేశమున వెలసిన ఆదివ్యాశ్రమ నామ౦ "శ్రీ రాధా మహలక్శ్మీ ఆశ్రమ౦". ఆ ఆశ్రమ స్థాపకులు సిద్ధయోగులు, రసికాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు. వారే పైన చెప్పిన వేదా౦తసారాన్ని, సకల ఉపనిషద్ రహస్యాలను అరటి ప౦డు వలిచిన విధ౦గా ్ ఉపదేశిస్తూ ప్రజలను భక్తి మార్గగాములను కావిస్తున్నారు. రసస్వరూపులైన రాధాకృష్ణుల తత్వాన్ని విశదీకరిస్తున్నారు. రాధానామాన్ని విన్నా, ఉచ్చరిస్తున్నా వారు ఆన౦ద పరవశులగుచున్నారు. పరమాన౦ద భరితులవుతూ ఉన్నారు.కన్నుల ఆన౦ద భాష్పాలు వర్షిస్తున్నవి. గొ౦తు గద్గదమవుతున్నది. ఆ ఆన౦దాన్ని, భక్తిని, వారి ఉపన్యాసాన్ని వి౦టూ, చూస్తూ భక్తజనులు కూడాపరవశమొ౦దుతున్నారు, ధన్యులగుచున్నారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP