క్షమించాలి .ఇప్పుడు కాదు, మార్చి 16 వతేదీ న నూతనసంవత్సర శుభాకాంక్షలు చెపుతాను.
>> Friday, January 1, 2010
నేను ఈరోజు నూతనసంవత్సరంగా భావించటం లేదు .అందువలన మితృలెవరికీ నేనుగా శుభాకాంక్షలు పంపలేదు.అన్యధా భావించకండి.
వందల సంవత్సరాల బానిసత్వం నుంచి మనం విడివడ్డా ,భావజాలం నుంచి మాత్రం విడిపోకుండా తెల్లవాడు అలవాటుచేసినదాన్నల్లా ఆచరించ లేక పోతున్నాను. ఎందుకంటే అర్ధంపరమార్ధం లేని పండుగలను జరుపుకుని ఆనందించలేకపోతున్నాను. చాదస్తం కాకపోతే ఏమిటిదని విమర్శకుదిగకండి ఓసారి నామాటను కూడా ఆలోచించి చూడండి . నేనూ చిన్నతనం లో, కాలేజీ రోజులలో వేలంవెర్రిగా అనుసరించినవాడినే మూలం తెలుసుకున్నంతవరకు.కాబట్టి జనవరి ఒకటి ని నూతన సంవత్సరంగా పాటించేవారిని నేను విమర్శించటం లేదు .ఓసారి ఆలోచించి చూడమని కోరుతున్నాను. ఈ పుణ్యభూమిలో పుట్టిన జీవిగా విజ్ఞాన ఖనులైన మహర్షులు సూచించిన పర్వదినాలనే పాటిస్తున్నాను . ఇతరుల సాంప్రదాయాలను గౌరవించవచ్చు గాని వేలం వెర్రిగా అనుసరించటం భారతమాత బిడ్డలకు తగదని కోరుతున్నాను.
జనవరి ఒకటి నూతన సంవత్సరంగా అంగీకరించటం పట్ల నావ్యతిరేకతను కూడా ఆలోచించి చూడండి్ ఓసారి.
ముందుగా కొత్తసంవత్సరం అని దీనిని ఎందుకనలేము?
------------------------------------------------
ఏదైనా నూతనత్వం కలిగితే దానిని కొత్తది అనవచ్చు. కాలప్రవాహం లో ఏదైనా మార్పులకు గుర్తుగా దీనిని పాటిస్తున్నామా ! అంటే . ఇప్పుడు ఏ ఋతువు,గాని కాలంగాని మార్పు జరగటం లేదు. కాబట్టి ఈరోజుకు అది వర్తించదు.
చారిత్రకంగా ఏదన్నా ప్రమాణమున్నదా?
-----------------------------------
ఎవరైనా మహాపురుషుని జీవితం తోగాని ,ప్రపంచం లో జరిగిన గొప్పసంఘటనతో గాని ఈరోజుకు ఎటువంటి సంబంధం లేదు.
స్థిరమైనదా !
-----------
అదీకాదు . పాశ్చాత్యులు తమ నూతన సంవత్సర ప్రారంభకాలాన్ని అనేక సార్లు మార్చుకున్నారు . ఏప్రిల్ లో కొంతకాలం నూతన సంవత్సరం ప్రారంభంగా అనుసరించి .తరువాత జనవరిగామార్చుకున్నా పాత ఆచారాన్నే అనుసరించేవారిని ఏప్రిల్ ఫూల్స్ అని గేలిచేసేవారు. అలాపలురకాలుగా మార్పుచెంది ఇప్పుడు జనవరి ఒకటి అంటున్నారు.
ఖగోళంలో ఏదన్నా మార్పులు జరుగుతున్నాయా!
--------------------------------------
ఈసమయం లో ఖగోళంలో స్థిరంగా ప్రతిసారీ సంభవించే మార్పులు ప్రత్యేకంగా ఏమీ లేవు.
అసలు ఒకరోజు అంటే అర్ధమేమిటి?
---------------------------
రోజుఅంటే ఒకపగలు,ఒక రాత్రి ని కలిపి ఆకాలప్రమాణాన్ని రోజు అంటారు .అలా కాక అర్ధరాత్రి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజని ఎలా అంగీకరించాలో తలబద్దలు కొట్టుకున్నా అర్ధం కాదు.
వెర్రితలల ఆచారం
---------------
పిశాచాలు సంచరించే నిశిరాత్రిలో హాపీ న్యూ.....ఇయర్ అంటూ వెర్రికేకలు ,మందుచిందులు , సమాజ ఆరోగ్యానికి అంత క్షేమము కావేమో కదా!
ఇది జనానికి ఎంతమేలు చేస్తుందో తెలియదుగాని , వ్యాపారులకుమాత్రం లాభం చేకూరుస్తుంది. అనుకరణ భావం మనకు బాగా వంటపట్టి ,ధూమపాన ,మద్యపాన ,వ్యభిచారాది అనాచారాలు ఆకర్షనీయమై పోయాయి. మనం మనఆచారాలు ఆటలు ,పాటలు వదలి అన్నీ అనుకరిస్తూ అప్పనంగా దండుకునేందుకు విదేశీ దోపిడిదారుల కొక వినియోగదారులగుంపుగా మారిపోతున్నాము . వాళ్ళేది చెబితే అదే ప్రమాణం. రంగునీళ్లకంపెనీవాడు ప్రోత్సహించే క్రికెట్ మన అభిమాన క్రీడ . వాడెక్కడో సప్తసముద్రాల అవతల ఆచరిస్తున్నా వాళ్లు జరుపుకునేదే మనకూ పండుగ ..పబ్బుగబ్బులు ,కురచదుస్తులు , ఫాస్ట్ ఫుడ్డులు , పాశ్చాత్య జీవితాలే మన ఆదర్శాలుగా మార్చుకోవాలా? ఏం ! మనం మనంగా ,మన ఆచారాలు మనవిగా బ్రతకలేమా ?
జనవరి ఒకటి పాశ్చాత్యుల నూతన సంవత్సరం .జరుపుకోనివ్వండివారిని. . ప్రపంచం లో పరస్పర సహకారం దృష్ట్యా దానిని వ్యవహారాలలో ప్రయోజనం వరకు అనుసరిచటం సబబేగాని ,దానినే అనుకరించటం ఏమంత బాగుంటుంది? చెప్పండి . దానిని వాళ్లకంటె ఎక్కువగా మనం పూసుకోవాల్సిన అవసరం ఉందంటారా?ఇలా అనుకరిస్తూ పోయి మనమిప్పుడు144 సెక్షణ్ లతో ఈ వేడుకలు జరుపునేంత అభివృద్ది సాధించాము ,ఇకచాలిస్తే మంచిదేమో మేధావులు ఆలోచించాలి .
ఋతువులలో మార్పుకు శ్రీకారంగా వసంత ఋతువు ఆగమనం తో మనం నూతన సంవత్సరాన్ని జరుపుకుందాం . ఈరోజు మన అలవాట్లే పిల్లలు ప్రామాణికంగా ఆచరిస్తారు. ఏస్థితి కొస్తున్నామో ఆవేదనతో ఓ బ్లాగర్ ఆవేదనకూడా ఈ క్రిందలింక్ కూడా చూడండి .మూలకారణాలు వెతకండి .
http://apmediakaburlu.blogspot.com/2010/01/blog-post.html
3 వ్యాఖ్యలు:
తెల్లవాడుఎంతదొచుకెల్లినా ఆంద్రప్రదేశ్నిదాన్యాగారముగా చేసినవారినిమరచిపోకండి(కాటన్ లాంటివారు)v
>>"venkateswararao.avvaru గారు, తెల్లోడి పండుగ చేసుకుంటే తప్పులేదు కానీ, అది చేసుకునే పద్ధతే బాగాలేదంటున్నాము. అర్ధరాత్రి మందు కొడుతూనే, విషెష్ చెప్పాలని రూలేమన్నా ఉందా ఆ పండుగలో. 144 సెక్షన్‌లో వేడుకలు చేసుకోవాల్సి వస్తుందంటేనే అర్థమవుతోంది ఎంత వికారం ఉందో ఆ పండుగలో.
తెల్లవారిన తర్వాత శుభాకాంక్షలు చెప్పుకుంటే వచ్చే నష్టమేమైనా ఉందా? అఫ్‌కోర్స్ నష్టముంది. అది కార్పోరేటు కంపెనీలకు, ఫైవ్‌స్టార్ హోటళ్ళకు.
ఇతరులకు మంచిని నేర్పటమేకాదు ,మంచివిషయాలను ఇతరులనుంచి గ్రహించటం,చేసిన మేలు మరువక పోవటం ఈ జాతి యొక గొప్పలక్షణం .అయితే మంచిని స్వీకరించటానికి ,గుడ్డిగా అన్నీ అనుకరించటానికీ చేలా తేడావుంది వెంకటేశ్వరరావు గారూ.
Post a Comment