శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మాతృస్వరూపులైన స్త్రీలకోసం ఈ సూత్రాలు.అందుకొని అందరికీ పంచండి

>> Wednesday, July 15, 2009


శుభాలు పొందుటకు స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలను విధించారు మన పెద్దలు. భర్త అనురాగం పెరగటానికి సంతానభాగ్యానికి సిరిసంపదలు పొందటానికి వ్యాధులు రాకుండావుండటానికి ఈనియమాలు పాటించి చూడండి.

౧. మంగళ సూత్రం లో పిన్నీసులు వుంచరాదు అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి వుంచుతారు .మంగళ సూత్రం వేదమంత్రాల సహితంగా ప్రభావితము కాబడిన భర్త ఆయువు పట్టు.మంగళ సూత్రము రూపములో హృదయం వద్ద చేరివున్నది. ఇనుప వస్తువులు[పిన్నీసులు ,ఇనుముతో చేసినవి] దివ్యశక్తులను ఆకర్షించుకొను గుణముకలవి. కనుక అవి మంగళ సూత్రము లో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి .భర్తకు అనారోగ్యం ,భార్యాభర్తలపట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. కనుక వెంటనే ఈ అలవాటు వెంటనే సరి చేసుకోవాలి.
౨. స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలామంచిది. . ఈగాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక ,వీని శబ్దము శుభాలను ,అనురాగాలను పెంచుతుంది.

౩.ఇంట్లో గుర్రం బొమ్మలు వుంచుట అంత క్షేమము కాదని డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలామంది నమ్మకం .
౪.సంపదలను ,ఎక్కువగా ప్రదర్షించటం వలన నరఘోష ఏర్పడుతుంది .తద్వారా చెడు జరుగుతుంది. కనుక [అలంకారాదులు]సాధారణం గా వుండేలాచూసుకోవటం సాధారణ జీవిత విధానాన్ని పాటింఛటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు..
౫. పిల్లలు తమ మాటవినలేదనేవారు ఈ చిన్నచిట్కాలు పాటించి చూడండి. ఆడపిల్లలకైతే ఐదుపోగుల ఎర్రదారం కుడిభుజమునకు కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి . అలాగే మగపిల్లలైతే ఆకుపచ్చదారం తొమ్మిది పోగులు వేసి కుడిభుజానికి కట్టి గంధమునుదుట ధరించటం అలవాటు చేసి చూడండి పిల్లలు మీ మాటను శిరసావహిస్తారు.

౬.ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే ,వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పనుకునేదిండు క్రింద తులసి వేరు వుంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగాచూసుకుంటారు విరోధాలు తగ్గి.
౭. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరం గాను వుంటాయి.
౮. పని మనిషిరానప్పుడు విసుగుచెంది కోపంతో బాధపడేకంటె ,పనిమనిషికంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను,వాల్లకంటె నేనైతే శుభ్రంగా వుంచుకోగలనని[ నిజాన్ని] మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీపనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి అసలు పనిమనిషిని మానిపించాలనే అని పిస్తుంది మీకు.
౯.భర్త తాగి వచ్చి హింసపెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒకచిన్నస్పూన్ [అంటె సుమారు అరగ్రాము] కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటి లో కలిపి త్రాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే వాల్లకు తాగుడు పై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది ,నల్లవెంట్రుకలను కూడా తెల్లబరుస్తుంది .మొదట దీనిని త్రాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటూ చేయండి ఈ ఔషధాన్ని.తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
౧౦.సుఖసంతోషాలు కరువైనవారు పసుపురంగుపూలు ధరించండి ,క్రమేపీ స్థితి మెరుగవుతుంది.
౧౧.అప్పుల బాధ ఎక్కువగావుంటె తెలుపు పూలు ధరించటం వలన రుణబాధలు తగ్గుతాయి.
౧౨.ఆరోగ్యం సరిగాలేనివారు ,శరీరం నొప్పులు వున్నవారు మరువం ,మందారాలు కలిపి ధరించండి ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
౧౩. పెల్లిచూపులప్పుడు ఎరుపు పూలు ,పసుపు పూలు కలిపి మాలకట్టి దరించండి వివాహం విషయం లో కన్యలకు ఎంతో శుభకరం గా ఫలితాలొస్తాయి .
౧౪.మంచి తీర్ధం లో రెండు తులసి దలాలు వేస్తే అవి మానససరోవర జలాలంత పవిత్రమవుతాయి.
౧౯.కూర్చునే పీఠమునకు శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగావాడితే కుంకుమ బొట్లను పెట్టండి .
౨౦.భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి . మీకుడు చేతితో తాకి వెళ్లమనండి.భర్తలకు ఆరోజు సంపాదనా ,విజయము సంతోషము వెంటనుంటాయి .

ఆ....... ఇవన్నీ మూఢనమ్మకాలు .అలాజరుగుతుందా ..ఇలాఎందుకు జరుగుతుందనే సోమరిపోతువాదనలు చేయకండి. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి . వీటిని పాటించటానికి మీకు ఖర్చేమీ కాదుకదా ? కొంచెం శ్రద్ద .కావాలి అంతే . ఇందులో మీరు నష్టపోయే విషయాలేవీ లేవుకనుక నిరభ్యరంతరంగా పాటించవచ్చు. చెప్పటం మావంతు .ఆచరించిఫలితాలు పొందటం మీ ఇష్టం . ఏదన్నా మీకు మేలుజరిగిందనుకుంటే మాకు చెప్పండి సంతోషిస్తాము . ఇదేమీ కార్పోరేట్ కౌన్సిలింగ్ కాదుకనుక మీరేమీ చెల్లించాల్సొస్తుందన్నభయం అక్కరలేదు. మొదలెట్టండి అమ్మలు


7 వ్యాఖ్యలు:

నీహారిక July 15, 2009 at 8:35 PM  

చాలా మంచి విషయాలు చెప్పారండి. ఎవరు ఇంత శ్రద్ధగా చెపుతారు చెప్పండి? మీరు తెలియచేసినందుకు ధన్యవాదాలు

పానీపూరి123 July 15, 2009 at 10:20 PM  

very nice info...

రాజ మల్లేశ్వర్ కొల్లి July 15, 2009 at 11:02 PM  

బావున్నాయండీ..!

అయితే..., "....., నల్లవెంట్రుకలను కూడా తెల్లబరుస్తుంది ." ??

Kathi Mahesh Kumar July 16, 2009 at 12:35 AM  

మీరేదో "ఆరోగ్య"సంబంధిత విషయాలు చెబుతున్నారనుకున్నా!

durgeswara July 16, 2009 at 2:03 AM  

నీహారికగారికి ,పానీ పూరీగారికి ధన్యవాదములు.

రాజమల్లేస్వర్ గారు .సృష్టి లో ఒక్కొక్కవస్తువుకు ఒక్కో శక్తి వుంటుంది . ఆయుర్వేదం లో కరక్కయను ఒకచోట అమృత అని కూడా వర్ణిస్తారు .చాలా ఆరోగ్యం కలగజేస్తుంది . నితయమూ సేవించతం తో అకాల వృద్ధాప్యాన్ని కూడా నిరోధిస్తుంది ,మలబద్దకం వుండదు .శిరోజాల సంరక్షణలో కూడా మేటి . ఇంతచేసి దీని వెల చాలా చౌక పచారీ కొట్టు కెళితే పదిరూపాయలిస్తే వందగ్రాములిస్తారు శ్రీశైలం వెళ్ళినప్పుడైతే దారివెంట రాలి పడతాయి ఏరుకోవచ్చు

ఇవి ఆ చెట్టుకుండే ఔషధ గుణాలు

ఇక కత్తిగారూ
పైన చెప్పినవన్నీ భౌతికంగా చూసినా ఆవస్తువుల గుణాలవలన ఔషధశక్తివలన మేలు చేసేవే. కనుక మీకు నిరాశ కలిగుండదనుకుంటా చదివినందుకు.

sirisha July 17, 2009 at 12:08 AM  

చల మంచి విసయలు చెపరు. నకు ఒక సన్దెహమ్ తిర్చంది.
నకు మంగలసుత్రం ఒకతి మధ్యలొ చిలికగ ఎర్పది చిన్న రన్ద్రమ్ పదింది. అది పెల్లి అయినకొత్తలొనె అయ్యింది. మా అమ్మతొ చెపితె శాపులొ అది పదెసి కొత్తది తిసుకుని వెసుకొ అంది. నకు మనసు ఒపక పదెల్లుగా అదె ధరించుతున్నను. పెల్లిలొ వెదమన్త్రలలొ కత్తింది తిసివెయలెక పొతున్న, కని ఇల విరిగిన మంగల సుత్రం అశుభమా? నెను దని ఎల మర్చుకొవలి? దయచెసి చెపంది.

మాలా కుమార్ July 17, 2009 at 10:04 PM  

చాలా మంచి విషయాలు చెప్పారండి .బాగున్నాయి
శిరీష గారు,
ఎవరైనా పెళ్ళి కూతురికి మంగళ సూత్రం చేయించేటప్పుడు దానితో పాటే మీదీ చేయించుకొండి .అలా చేస్తే దొషముండదు అని నేను విన్న విషయము. పసుపు కొమ్ము కట్టుకొని మీ మంగళసూత్రం ఇవ్వచ్చు.తీసేటప్పుడు, కట్టుకునేటప్పుడూ మంగళవారం,సుక్రవారం కాకూడదు, ఇంకనూ కట్టుకునేంతసేపూ మాట్లాడకూడదు. మాఇంట్లో ఇకరికి ఇలాయినప్పుడు మా అత్తగారు పాటించిన పద్దతి ఇది.
దుర్గేశ్వర రావు గారు మిమ్మలిని ప్రశ్న అడుగుతే నాకు తెలిసింది చెప్పాను. ఏమనుకొకండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP