ఇదీ స్వామి శక్తి !ఆశ్రయించి అనుగ్రహాన్ని పొందిన వారి భక్తి.[మహావైభవంగాముగిసిన హనుమత్ రక్షాయాగము]
>> Wednesday, May 20, 2009
భక్తజనపోషకుడైన హనుమంతు ని అనుగ్రహముచే ప్రారంభమయి ఏబది నాలుగురోజులు పాటు సాగిన హనుమత్ రక్షాయాగము వై్భవవోపేతముగా జరిగినది. మొదటిరోజు జరిగిన గణపతి హోమము నకే సంతోషించి న తొలిదైవము విఘ్నాధిపతి హోమ జ్వాలలో దర్శనమిచ్చి భక్తజన క్షేమమము కొరకు సాగే ఈ యాగానికి తమ అనుగ్రహమున్నదని సంకేతము అందజేసారు.
ఇక యాగము వివరాలను తెలుపగనే ఆస్తికలోకము అపూర్వ స్పందన చూపినది. ఈ కార్యక్రమము తమదిగా భావించి హైదరాబాద్ నుండి తిలక్ గారిలాంటివారు కరపత్రాలద్వారా ప్రచారము చేయగా తెలుగుబ్లాగర్లు తమ బ్లాగులలో ఈ వివరాలను ప్రచురిస్తూ పదిమందికి తెలియజేసేపని ప్రారంభించారు. వివిధదేశాలనుంచి తాము ఈకార్యక్రమములో హనుమాన్ చాలీసా పారాయణముచేస్తూ పాల్గోవటానికి ముందుకు వచ్చారు.స్వామి ప్రీత్యర్ధం ప్రత్యేకముగా బ్రహ్మచారులచే స్వామి ఉపాసన చెపించాలి ఇది జనక్షేమము కోసమని చెప్పగానే ఇరవై ఒక్కమంది పిల్లల తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ పిల్లలకు దీక్షనిప్పించారు. యాగానికి కావలసిన సరంజామా సమకూర్చటానికి ఇక్కడ స్థానిక భక్తులతో పాటు అమెరికానుండి కుమార్ గారు,చెరుకూరి దుర్గాప్రసాద్ గారు,రామరాజు భాస్కర్ ఉమాశంకర్ సోదరులు ,ఉప్పుటూరి శ్రీనివాస్ గారు,వెంకటసూర్యనారాయణ గారు లాంటివారు ఆర్దిక సహాయము చేయటానికి మరికొందరు వస్తురూపేణా సహాయమందించటానికి ముందు కొచ్చారు.ప్రతిరోజూ మన్యు సూక్త ,రుద్రసూక్త ములతో అభిషేకాలతో హోమాలతో సాధన సాగినది. పూర్ణాహుతి రోజున ప్రధాన హోమకుండముతో పాటు ,ఇక్కడకు రాలేక తమపేరన ప్రత్యేక హోమము చేయాలని కోరిన భక్తులకొరకు స్వామి ద్వాదశ నామాలతో హోమకుండాలను ఏర్పాటు చేసిన యాగము జరిపి పూర్ణాహుతి ఇచ్చాము.
స్వామి అనుగ్రహ ప్రవాహము మొదలయినది. వివిధ సంకల్పాలతో సాధకులు తమ సాధనలను కొనసాగిస్తుండగా స్వామి వారి జీవితాలలో చూపిన అనుగ్రహ లీలలు తెలియజేస్తుంటే వళ్లు పులకరిస్తున్నది. తమ ఉద్యోగ ,జీవితసమస్యలను ఈ సాధన ప్రారంభమయ్యాక స్వామి ఎలా తొలగిచారో చెబుతుంటే వారి భక్తికి స్వామి శక్తికి పదేపదే వమ్దనాలు సమర్పించుకుంటున్నాము. ఆహా ! ఏమి స్వామీ మీ భక్తానుగ్రహ దీక్షాతత్పరత అని స్వామిని సాష్టాంగ పడ్డాము.
ఏమి సాధించాము ఈ యాగముతో?
.........................................................................
భక్తితో దైవము నాశ్రయించి ఎలా మన సమస్యలను పరిష్కరించుకోవచ్చో ప్రయోగాత్మకంగా నిరూపించారు భక్తులు . ఇందరి జీవితాలలో స్వామి చూపిన లీలలకు నేనూ ఒక పరికరాన్నయ్యే భాగ్యం కల్పించినందుకు స్వామికి ఏమివ్వగలను. ఇంతమంది భక్తుల పరిచయ భాగ్యమ్ కలిగించాడాయన. ఇంతకన్నా సమ్పదేమి కావాలి లోకంలో.
స్వామి ప్రసాదాలు అందరికీ అందజేసే పని మిగిలినది.
స్వామి వారి రక్షలు ,యాగకుండము లో మిగిలిన యజ్ఞశేషము [భస్మం] అడిగిన వారికి పంపేందుకు సిద్ధముగా నుంచాము. స్వామిరఖ్శలు ధరించి ఎల్లవేళలా ఆయన రక్షణలో నుండండి. యాగ ప్రసాదమై ఈ విభూతి మహిమాన్వితమైనది. వ్యాధులు ,బాధలు లోనున్నవారు ఈ విభూతిని ధరించటంద్వారా వాటినుండి విముక్తి పొందవచ్చు. ఇంకెందు కాలస్యం స్వామిని ఆశ్రయించండి .ప్రసాదాలను అందుకోండి.
4 వ్యాఖ్యలు:
జై హనుమాన్
జై హనుమాన్
ప్రజా సంక్షేమానికి మీరు చేసిన యాగం పరిపూర్ణమైన సందర్భంగా అభినందనలు .ఈ సందర్భంగా మీరు , మీ కుటుంబం చేసిన సేవను లీలా మోహనం ద్వారా తెలుసుకున్నాం .మీ కుటుంబ సభ్యులను అభినందించకుండా ఉండలేం .ధన్యవాదాలు.
దుర్గేశ్వర గారూ,
లోక కల్యాణం కోసం మీరింత కష్టపడి, భక్తి శ్రద్దలతో యాగం జరిపించడం ఎంతో గొప్ప విషయం.
మీకు అభినందనలు అని ఒక మాటలో చెప్పలేకపోతున్నాను. మీకూ, మీ కుటుంబానికీ ఆ పవనసుతుది రక్షా ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
సర్వేజనా సుఖినోభవంతు.!
Post a Comment