మనసాంప్రదాయకవిలువలను మనమేరక్షించుకునేందుకు చర్చించండి
>> Saturday, November 8, 2008
భారతీయుల జీవనమే మానవీయవిలువల సమాహారం. మానవుడు మహోన్నతునిగా ఎదిగిన చరిత్రల సమాహారం మనపురాణాదులు. ఇతిహాసం అంటె ఇది జరిగిన సత్యం అనిచెప్పబడ్ద మహోన్నత మానవుల,మాధవుని కలయిక అయిన భారత రామాయణాదులు మనజాతికి ఆధారభూతాలు. మనది తినడం కామసుఖాదులను అనుభవించడానికి మాత్రమే పరితమయినఅల్పమానవజీవితవిధానంకాదు.
పరిపూర్ణమానవుని జీవితం ఎలావుంటుందో ప్రపంచానికి జ్ఞానబిక్షగా ప్రసాదించిన పుణ్యభూమి. దీనిలో సంభవించిన ప్రతి పరినామము రికార్డ్ చేయబడ్దాయి. వాటినే మనం పురాణాలు ఇతిహాసాలు గా తరతారాలుగా కొత్త తరానికి అందిస్తున్నాము. , అతిస్వల్ప కాలాన్ని గురించి మాత్రమే తెలిసిన పాశ్చాత్యులు అనంతమైన మనకాలగణనాన్నిఅర్ధం చేసుకోలేక ఆఆ... అంతకాలమసలు జరిగుండదులే వట్టిదే ఇదంతా అబద్దం తూచ్...అనేశారు. బానిసలైన తమ పాలితులకు ఇంత గొప్ప చరిత్ర సంస్కృతీ వున్నదని తెలుస్తుండటం ఎప్పటికైనా తమకు ప్రమాదకరమయినదని ముందుజాగ్రత్తతో ప్రణాళికాబద్దంగా ప్రచారంచేశారు. వారి ఆలోచనావిధానాలకు అనుగుణంగా తయారయిన విద్యావిధానములో పెరిగిన తరాలు తమసంస్కృతీసాంప్రదాయాలకు క్రమేపీ దూరమయి వాటిని సందేహించేస్తితికి చేరుకున్నారు. మరికొందరు విషపూరితమయిన ఆవిజ్ఞానఫలితం పూర్తిగా తలకెక్కి ఆనాడు బ్రిటీష్వారు ప్రారంభించినపనిని తాము నిర్వహిస్తూ వారిమానసపుత్రులుగా తమజన్మలను ధన్యంచేసుకుంటున్నారు. ఎక్కడ తమజాతి మూలాలు తెలుసుకున్న జాతి శక్తివంతమై తమకు ఎదురుతిరుగుతారోనని ముందుగానే సిద్దపరచుకున్న ప్రచారవిధానాలద్వారా జాతిలో గందరగోళము సృష్టించే ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తున్నారు.
తమ మూలాలను గౌరవించేవారిని కించపరచటం, వారివాదనలను పదిమందికి చేరకుండా వారిపైదుష్ప్రచారాలను కొనసాగిస్తూ మానసికంగా వారిని పోరాటమునుండి పక్కకు తప్పించేప్రయత్నం నిరంతరాయమానంగా కొనసాగుతున్నది. పదిసార్లు అబద్దాన్ని పదేపదే చెబితే లోకందానినే నిజమని నమ్ముతుంది అనే గోబెల్ మహాశయుని వ్యూహం విజయవంతంగా అమలుచేస్తున్నారు.
దానికి పలు వుదాహరణలను మీకు చూపాల్సిన అవసరములేదు. వీళ్ళు ప్రపంచవిజ్ఞానాన్ని కాసి వడపోసిన వారిలా మాట్లాడుతుంటారు కాని ఒక్క భారతీయసంస్కృతిని విలువలను మాత్రమే విమర్షిస్తూ మాట్లాడుతూ తమజాతిని తామే కించపరచుకునే నికృష్టజీవులు ,.వీళ్ళెప్పుడూ ఇతరమతాలజోలికిగాని వారిసంస్కృతులనుగురించి మాట్లాడరరు. కారణం మనకుతెలుసు వాళ్లను ఏమాత్రం కదిలించినా ఇప్పటిదాకా తమకు జరగని సన్మానాలు జరుగుతాయని తమ కిక మాట్లాడేందుకు నోరుండదని వారికి పూర్తిగా అవగాహన వుంటుంది. అందుకే వాళ్ల వ్యాఖ్యానాలకు సమాధానాలు కూడా చాలా జాగ్రత్తగా మర్యాదాపూర్వకంగావుంటాయి.
సరే ఇప్పుడు మనమేమిచేయాలి. ఇతరులు చేస్తున్న మోసాలగురించి బాధపడటం కంటే మనవంతుగా దానిని కాపాడుకునే ప్రయత్నము చేయాలి. ఎవరికార్యక్షేత్రములో వారు పోరాడవలసిన సమయమిది. కనుకనే చదువూఅవగాహన వున్న మనం కలాన్ని ఆయుధంగా ప్రయోగించాలి. దీనికోసం మనపురాణాలు,ఇతిహాసాలగురించి మనం పదిసార్లు మనరచనలద్వారా అలుపెరగకుండా తెలియపరుస్తుండాలి. స్వాభిమానులై మనధర్మవీరులు వ్రాసే పురాణేతిహాసాలపై చర్చలు జరుపుతుండాలి. దానివలన మనకువున్న అనుమానాలు కూడా తొలగటమేకాక సందిగ్దములో వున్న మన సోదరుల అనుమానాలుకూడాతీరుతాయి. మరికొన్నితరాలు మనజీవనవిలువలను కోల్పోకుందా కాపాడబడతాయి.
ఎవరి జాతిగౌరవాలను కాపాడుకోవటం వారి నైతిక బాధ్యత. .ప్రపంచములో ఏజాతైనా వున్నతస్థాయికొచ్చినదీ అంటే
తమజాతిగౌరవాలను తాము తీవ్రముగా అభిమానిస్తున్నజాతిఅది అని. ఐతే భారతజాతి తమగురించి గర్వపడుతుందే కాని ఇతర జాతుల గౌరవ మర్యాదలను కించపరచేపని తమప్రాణంపోయినా చేయదు. అదే ఈజాతి ప్రత్యేకత .దానిని కోల్పోకుండా పరాయిమతాలకు , వారిసంస్కృతులకు ఏమాత్రం గౌరవ భంగం కలిగించకూడదు ఈవాదనలో . తద్వారా మనలను రెచ్చగొట్టి మనలను మతోన్మాదులుగా చిత్రించటానికి కాచుకుని కూర్చునే సంస్కృవిధ్వంసకులకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు. మనము మనధర్మాలను గూర్చి దాని వున్నతినిగూర్చి మాట్లాడె ఈమహాయజ్ఞములో భారత సాంస్కృతీ సంపదలకు వారసులయిన వారందరూ
పాలుపంచుకోవాలని విన్నపము . మొదలు పెట్టండి ..బ్లాగులుగాను,వ్యాఖ్యానాలుగాను. మీ ధర్మప్రచారాన్ని.
1 వ్యాఖ్యలు:
చక్కటి అలోచన.ఇప్పడు కూడా బ్లాగుల్లో కొంత మంది ఆ పని చేస్తున్నారు కానీ సంఖ్య ఇంకా పెరగాలి.
Post a Comment