శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దంపతులిద్దరూ ఉద్యోగస్తులా? ఫెంగ్షుయ్ చిట్కా చిట్కా

>> Wednesday, November 19, 2008

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దంపతులిద్దరూ ఉద్యోగం చేయడం ప్రస్తుతం పరిపాటైంది. కుటుంబాన్ని సక్రమంగా నడిపేందుకు భార్యభర్తలిద్దరూ ఉద్యోగంలో స్థిరపడ్డారా? అలాంటి వారు మీరైతే... ఫెంగ్‌షుయ్ పేర్కొన్న కొన్ని చిట్కాలు మీ కోసం... దంపతులిద్దరూ ఉద్యోగస్తులైన పక్షంలో... ఉన్నట్టుండి ఒకరికి అనారోగ్యం, మరొకరికి ఆదాయంలో ఇబ్బందులు తలెత్తినట్లైతే మీకు కలిసి వచ్చే నాలుగు దిక్కులను ఎంచుకోండి.

అలాగే ఎలాంటి సమస్య వచ్చిందో దానికి సంబంధించిన దిశ ఏదో చూసుకోండి. సమస్య వచ్చిన దిశలో... ఇద్దరికీ కలిసి వచ్చే దిశ కనీసం ఒక్కటైనా.. అందులో తప్పకుండా ఉంటుంది. ఆ దిశవైపు మంచాన్ని జరుపుకుంటే ఆదాయంలో ఏర్పడిన ఇబ్బందులు తలెత్తవు. ఇలా చేస్తే ఉద్యోగం చేసే దంపతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే.. సాధారణంగా దంపతులిద్దరిలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు... అనారోగ్యంతో బాధపడుతున్న భాగస్వామికి అనుకూలమైన దిశలో మీ మంచాన్ని మార్చండి. దీనివలన మీరు వాడుతున్న మందులు మరింత ప్రభావంతో పనిచేసి తొందరగా కోలుకునేందుకు ఉపకరిస్తుంది.

అదే విధంగా... వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా అనుకూల దిశవైపు మంచాన్ని జరుపుకుంటే మెరుగైన ఫలితాలు అనుకూలిస్తాయి.

2 వ్యాఖ్యలు:

లక్ష్మి November 19, 2008 at 8:05 PM  

Please give more details Sir. It's not very clear. Thank you

durgeswara November 20, 2008 at 4:59 AM  

అమ్మా!

ఇది చైనా వారి పద్దతి. నాకు పూర్తిగా ప్రవేశము లేదిందులో నా స్నేహితుడొకాయన ఇది పొస్ట్చేశాడు. మీకేదన్నా సమస్య ఉంటే చెప్పమ్డి మనపద్దతులలో శాస్త్రీయంగా చేయదగ్గదుంటే చూద్దాము.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP