అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే !
>> Saturday, October 4, 2008
అమ్మ అనుగ్రహం ఉంటే వానికి లేనిదేమిలేదు. సర్వశక్తులు తానేఅయిన ఆతల్లి విభవములు ,ఈ నవరాత్రులలో అనేక రూపాలలో పూజలందుకుంటున్నాయి. సిద్ధ క్షేత్రమయిన ఈ పీఠములో వెలసిన తల్లి కనకదుర్గగా కరుణతో భక్తుల సేవలందుకుంటున్నది . ఆతల్లి వైభవాన్ని వర్ణించను విలుగాక వేదమే , నేతి నేతి అని ఇంకా వున్నదని సూచిస్తున్నది. నాలాంటి అల్పులకు సాధ్యమా ?
ప్రత్యక్షముగా పాల్గొంటున్న భక్తులకొరకే కాక ,ఇక్కడకు రాలేకపోతున్న వారికోసము కూడా పూజలు జరుగుతున్నాయి. ఇప్పటికే గోత్రనామాలు పంపిన వారి తరపున కూడా పూజలు జరుగుతున్నాయి. ఇంకా పంపదలచుకున్నవారు కూడా పంపండి. అలాగే దసరావరకూ లలితా సహస్ర నామాల పారాయణము కూడా చేయండి.సమయము చాలనందున అమ్మగురించి వివరముగా వ్రాయలేకున్నాను, పూజలలో నిమగ్నమయినందున సమయము దొరకటము లేదు. మీ అందరికీ ఆజగన్మాత అనుగ్రహం సిద్ధించాలని ప్రార్ధిస్తున్నాను.
1 వ్యాఖ్యలు:
శరన్నవరాత్రులలో అమ్మవారిసేవలో పూర్తిగా నిమగ్నమయినట్లున్నారు. హరేకృష్ణ !
Post a Comment