శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గ్రీన్ బ్లడ్

>> Tuesday, September 9, 2008

చూడడానికి పనికిరాని గడ్డిలా ఉంటుంది. కాని ఇందులో ఆరోగ్యాన్ని , అందాన్ని యవ్వనాన్ని పెంచే గుణాలు చాలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దీనిని ఔషధ మొక్కగా కూడా ఉవయోగిస్తున్నారు. దీని పేరు వీట్ గ్రాస్ (గోధుమ గడ్డి ) ఈ వీట్ గ్రాస్ జ్యూస్ ను ఇప్పుడు జిమ్,స్పా సెంటర్లలో హెల్త్ డ్రింక్ గా వాడుతున్నారు. ఎమ్రాల్డ్ గ్రీన్ రంగులో ఉండే ఈ జ్యూస్ ను పరగడపునే తీసుకోవాలి. వీట్ గ్రాస్ జ్యూస్ ప్రత్యేకంగా కొన్ని అనారోగ్యాలకు కూడా బాగా పని చేస్తుంది. కాన్సర్ నుండి సాధారణంగా వచ్చే జలుబు వరకు అన్నిరోగాలను నయం చేస్తుందని నాచురోపతి వైద్యులు ఉటంకిస్తున్నారు. ఆపరేషను, ప్రసవాల తరువాత వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకుంటే త్వరగా రక్తం పడుతుంది. టిష్యూలు ఏర్పడతాయి. కంటి సమస్యలున్నవారికికూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ కాన్సర్ , తలసేమియా వ్యాధిగ్రస్తులు వీట్ గ్రాస్ వాడితే వ్యాధివి ఎదుర్కునే శక్తి శరీరానికి లభిస్తుంది. దీనిలో ఉన్న ఆల్కలైన్ ధర్మాల వల్ల శరీరంలో ఉండే విషపదార్ధాలను ఇది బయటకు నెట్టి వేస్తుంది. మూత్రవిసర్జన సరిగా జరుగుతుంది.

వీట్ గ్రాస్ ను అర్దశతాబ్దకాలంగా వ్యాధుల నివారణలో ఉపయోగిస్తున్నారు. యు.ఎస్.లో సొంతగా సానటోరియం నడుపుతున్న డాక్టర్ ఆన్ విగ్మోర్ ఈ థెరపీలో నిష్ణాతురాలేకాదు ఈ థెరపీ గురించి ఒక పుస్తకం కూడా వ్రాసారు. ఆ పుస్తకం పేరు వైనఫర్? ది ఆన్సర్? వీట్ గ్రాస్ మన్నా
వీట్ గ్రాస్ లో ఉండే బేసిక్ కాంపొనెంట్ క్లోరోఫిల్ . క్లోరోఫిల్ ఆకుపచ్చని మొక్కలన్నింటిలోను ఉంటుంది. కాని వీట్ గ్రాస్ లో దీని మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీట్ గ్రాస్ ను గ్రీన్ బ్లడ్ అని పిలుస్తారు. ఇందుకు కారణం హీమోగ్లోబిన్ లో ఉండే హిమిన్ అణు నిర్మాణానికి వీట్ గ్రాస్ లో ఉండే క్లోరోఫిల్ అణు నిర్మాణానికి మధ్య ఎక్కువ పోలికలుండటమే. ఇందుకే కావచ్చు వీట్ గ్రాస్ ను రక్తం త్వరగా శోషించుకుంటుంది. క్లోరోఫిల్ శక్తివంతమైన జర్మిసైడ్. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గుండె , రక్తనాణాలు, పేగులు, ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తుంది. వీట్ గ్రాస్ లో విటమిన్ ఇ,ఎ, సి లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడమేకాకుండా మెదడు, గుండెలకు సమస్యలను తెచ్చే ఏజింగ్ కణాల చర్యల వేగాన్ని తగ్గిస్తాయి. క్లోరోఫిల్ లో ఉన్న లైవ్ ఎంజైమ్ లు కాన్సర్ కారక కణాలను నిరోధిస్తాయి. ఈ జ్యూస్ లో విటమిన్ బి12 ఉంటుంది. దీన్ని వివిధరకాల కాన్సర్ చికిత్స లో ఉపయోగిస్తారు.

ఈజ్యూస్ లో ఉండే మెగ్నీషియం ఆర్టిరియో స్కెలిరోసిస్ వ్యాధిని తగ్గిస్తుంది. వీట్ గ్రాస్ శక్తివంతమైన టానిక్ లా పనిచేస్తుంది. ఆర్ధరైటిస్ , చర్మవ్యాధులు , జుట్టుతెల్లబడుట , ఊడటం, కంటిచూపు సనస్య, దంతవ్యాధులకు , నీరసాలకు బాగా పనిచేస్తుంది. శరీరంపై తగిలే దెబ్బలకు యాంటిసెప్టిక్ ఆయింట్ మెంటుకంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. గుండెజబ్బులకు తీవ్రమైన కడుపు నొప్పులకు , జీర్ణవ్యవస్ధలో వచ్చే ఇన్ఫెక్షన్లకు , గ్యాస్ , పక్షవాతం , ఆస్తమా, మలబద్దకం , డయాబెటిస్, లుకోడెర్మా, లుకేమియా, వివిధ రకాల కాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఎన్ ఐ ఎస్ లో వీట్ గ్రాస్ పొడి, మాత్రల బదులుగా తాజా జ్యూస్ నే అమ్ముతారు. ఈజ్యూస్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ . గుప్పెడు గోధుమ గడ్డిని తీసుకుని గ్రైండర్లో వేసి దానిని సన్నపాటి గుడ్డలో వడకడ్డడమే. కేవలం ఆర్గానిక్ ఎరువులు మాత్రమే ఈ గడ్డిని పెంచుటకు ఉపయోగించాలి. రసాయనిక ఎరువులు వాడరాదు. పెద్దపెద్ద సిటీలలో ఈజ్యూస్ ను 50 ఎమ్ ఎల్ ధర 10 రూపాయలకు అమ్ముచున్నారు. ఈజ్యూస్ మొదటి సారి తాగుచున్నవారు మంచి ఫలితం కోసం పరగడుపున రోజుకు ఒక సారి 21 రోజులు తాగాలి. తదుపరి కొన్నివారాల పాటు మానేసి. ఇదే పద్దతిలో ఆరు వారాలు తాగాలి. నిల్వ ఉన్న వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే పోషక విలువలు తగ్గిపోతాయి. అందువలన తాజాగా తయారుచేసుకున్న జ్యూస్ ను మాత్రమే తాగాలి.

వీట్ గ్రాస్ పెంచే విధానం

త్వరగా మొలకెత్తాలంటే గోధుమలను ఓరాత్రి నానబెట్టి మొలకలు కట్టాలి.

మొలకలు కట్టిన గోధుమలను వంద గ్రాములను తీసుకుని కుండీలో వేయాలి

ఈ కుండీలు 6 సెంటీమీటర్ల లోతు 24 సెంటీమీటర్ల చదరంగా ఉండాలి.

ఎనిమిది తొమ్మిది రోజులలో వీట్ గ్రాస్ 14 నుండి 16 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది.

గడ్డిని కత్తెకతో కత్తరించి శుబ్రంగా కడిగి తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.

పలుచని గుడ్డలో గ్రైండ్ అయిన గడ్డినుండి రసాన్నివడకట్టాలి.

వడగట్టిన రసం అలానే తాగవచ్చు, తాగలేనివారు ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ ల తేనె మరియు ఇష్టం ఉన్నవారు కొంచెం నిమ్మరసం కలుపుకుని త్రాగవచ్చును.

ఈ గడ్డి బాగా పెరగాలంటే పూలకుండీలో మట్టి మరియు ఆర్గానిక్ ఎరువు 75 : 25 నిష్పత్తిలో నింపాలి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే గోధుమ గడ్డి పెంచుకుండీలలో ఆర్గానిక్ ఎరువు వాడకూడదు.

7 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ September 9, 2008 at 5:02 PM  

మంచి విషయాలు తెలియచేసారు

Saraswathi Kumar September 10, 2008 at 1:24 AM  

దుర్గేశ్వర గారూ!మన రాష్ట్రంలో గోధుమలు సాగు చెయ్యరు కదా! మనకు మార్కెట్లో మొలకెత్తలేని పొట్టుతీసిన గోధుమలే దొరుకుతాయి. మొలకెత్తగలిగే గోధుమలు ఎక్కడ దొరుకుతాయో తెలియజేయగలరు. నేనూ గోధుమ గడ్డి గురించి మంతెన వారు చెప్పగా విన్నాను.

సుజాత వేల్పూరి September 10, 2008 at 5:08 AM  

సరస్వతి కుమార్ గారు,
నేను పెంచుతానే గోధుమ గడ్డి మా ఇంట్లో! మామూలుగా మార్వాడీ (సూపర్ మార్కెట్లో కాదు) షాపులో తెచ్చిన గోధుమలనే ఒక రోజంతా నీటిలో (లేదా రాత్రంతా) నానబెట్టి, ఇసుక, నల్ల మట్టి కలిపిన మిశ్రమాన్ని ఒక ట్రేలో లోతు లేకుండా పోసి నానిన గోధుమలను పలచగా పరుచుకునేలా పరచాలి. దాని మీద మరికొంత మట్టి పోయాలి! నీరు పల్చగా చల్లాలి. ఉదయపు ఎండ తగిలేలా ఉంచితే మొలుస్తుందు గోధుమ గడ్డి! ఆరు ట్రేల్లో రోజుకొక ట్రే చొప్పున చల్లారంటే (సోమవారం ఒక ట్రే, మంగళ వారం ఒక ట్రే ఇలా రోజుకొక ట్రే లో చల్లాలి)తరవాత వారానికి ప్రతి రోజూ మీకు గోధుమ గడ్డి లభిస్తుంది.

Saraswathi Kumar September 10, 2008 at 7:20 PM  

సుజాత గారూ!ధన్యవాదాలు!పెంచేవిధానం చక్కగా తెలియజేశారు.మొలకెత్తే గోధుమల కోసం ప్రయత్నిస్తాను.

Anonymous March 31, 2009 at 3:36 AM  

durgeswararao garu manchi vishayalu chepparu

sampath November 5, 2013 at 2:23 AM  

nenu prayathninchanu one month lone maarpu vachindi thanks to goduma gaddi

Kanta Rao Vulli November 23, 2017 at 11:50 PM  

ఈ గడ్డి బాగా పెరగాలంటే పూలకుండీలో మట్టి మరియు ఆర్గానిక్ ఎరువు 75 : 25 నిష్పత్తిలో నింపాలి
అని అన్నారు.
క్రింది లైన్లో
గోధుమ గడ్డి పెంచుకుండీలలో ఆర్గానిక్ ఎరువు వాడకూడదు
అన్నారు.
ఈ వ్యాఖ్యానాలలో స్పష్టత కరువయింది. క్లియర్ చేయగలరు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP