చిన్నపిల్లల నోరెందుకు వాసనవేయదు.
>> Saturday, September 6, 2008
మీరు బాగా గమనించివుంటారు పసిపిల్లల నోరు వుదయాన్నే చూసినా వాసనరాదు. మనమేమో రోజుకు మూడుసార్లు బ్రష్ చేసినా తెల్లవారేసరికి కంపుకొడుతుంది. ఎందుకంటారూ! ఇంకా పశుపక్ష్యాదులు రోజూ పళ్ళుతోముకోకపోయినా వాటి నోరు దుర్వాసన వెదజల్లదు, ఎందుకని.
నాకైతే ఒకటనిపిస్తున్నది. దీనికి కారణం మన మనోభావాలని. పసిపిల్లల మనస్సు స్వచ్చంగావుండటం వలన వారి మనోభావాలు కల్మషం లేకుండా వుండటం వలన వారిశ్వాస అంత స్వచ్చంగా వుంటుంది. ఈర్ష్య,అసూయ, ద్వేషాది భావాలు వారిలో ప్రవేశించనందున వారి నోటినుండి దుర్వాసన రాదు. పశుపక్ష్యాదులు కూడా తమ ఆహారాది విహారాలలో ధర్మంతప్పకుండా ప్రవర్తిస్తాయికనుక వాటి యొక్క నోటినుండికూడా దుర్వాసనలు వెలువడవు. ఆహారాన్నికూడా ప్రకృతి ప్రసాదించిన విధంగా యధాతధంగా స్వీకరిస్తాయికూడా. అలాగే పసిపిల్లలుకూడా !
మరి మనమో తెల్లవారిలేస్తే మనమనోవికారాలవల్ల ఈర్ష్యాది గుణాలకు లోనై మంస్సును కలుషితం చేసుకుంటాము. తద్వారా మనప్రతిఅంగమునుంచి వెలువడే వ్యర్ధాలూ తీవ్రమయిన దుర్వాసనకలిగి యుంటాయి. పసిపిల్ల వాడు ఎవరయినా మనకు ముద్దుగొలుపుతాడు. ఎందుకని? వాని మనోస్వచ్చత వాని మోమునుంచి గోచరమై మన మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. స్వచ్ఛమయిన ప్రేమకు వున్న శక్తి అది. మనవి ప్రపంచం పట్ల ప్రదర్షించేవి కృత్రిమ ప్రేమలు. పలకరింపులు, పరవశాలు అన్నీ మనసులోతుల్లోనుంచిరావు అందువలనే వాటిని ప్రదర్శించేవారి పట్ల మనకు నిజమయిన ఆకర్షణ వుండదు.
ఎక్కడన్నా మహాత్ముల వద్ద జనసందోహం చేరుతున్న దంటే కారణం అది వారి హృదయలోయలనుండి పెల్లుబికుతున్న ప్రేమశక్తి ప్రభావం. వారి మనో స్వచ్చతకు గుర్తు.
అటువంటి మనస్సు కలిగిననాడు. మనము కూడా అటువంటి ఆకర్షణ శక్తిని కలిగియుంటాము. ఆశక్తి మనకు కలిగిందా లేదా అనితెలుసుకోవడానికి లిట్మస్ టెస్ట్ లా మన నోతివాసనను చూసితెలుసుకోవచ్చు.
0 వ్యాఖ్యలు:
Post a Comment