పండుగ వస్తే ఎంత బాగుంటుందో
>> Tuesday, September 2, 2008
మనం పొద్దున్నే ఇల్లు శుభ్రంగా ఊడ్చుకుంటాం కదా. మళ్ళీ సాయంత్రం ఒకసారి ఊడుస్తాం. సామాన్లన్నీ సర్దుకొని అన్నీ గదులూ శూభ్రంగా పెట్టుకుంటాం. పండుగో , పబ్బమో వచ్చిందంటే ఇల్లంతా బూజులు దులుపుకుని , ఇల్లు కడుక్కొని మశ్శీ ఒకసారి పాత సామాన్లన్ని సర్దుకొని పాతవి, పనికిరానివి పక్కన పెడతాం. ఇల్లంతా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుంటాం. ఇంటిలాగే మన బడి కూడా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా. సంవత్సరమంతా మనకి చదువు నేర్చుకోడానికి ఆటలాడుకోడానికి, స్నేహితులతో కలసి ఉండడానికి మంచి అవకాశాన్నిచ్చే మన బడిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలికదా.
ఉపాధ్యాయ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం నాడు మన తరగతి గదుల్ని, బడిని శుభ్రంగా తయారుచేసుకుని, రంగురంగుల కాగితాలు అతికించుకుని, బ్లాక్ బోర్డ్ ని బొగ్గుతో మళ్ళీ ఒకసారి అలికి అన్నీ శుభ్రంగా తయారు చేసుకుంటాం కదా. అట్లాగే రోజూ ఎవరి తరగతి గది వాళ్ళు శుభ్రంగా పెట్టుకుని అక్కడ చెత్తబుట్టలు పెట్టుకోవాలి. ఇది చూసిన వాళ్ళెవరైనా మన స్కూలు చాలా బాగుంది అంటారు. మనకి పుట్టిన రోజు, పండుగ రోజుల్లానే మన చుట్టూ ఉండే నీళ్ళు, గాలి, నేల, వన్య ప్రాణుల్ని కాపాడుకోడానికీ, ఇట్లా ప్రతీ విషయాన్ని మళ్ళీమళ్ళీ గుర్తుచేసుకోడానికీ, నలుగురికీ చెప్పడానికీ ప్రత్యేకమైన రోజుల్ని పెట్టారు అవే మన పర్యావరణ పండుగలు. ఇవి కేవలం మాటలు చెప్పుకునే పండుగలు కాదు. ఏదో ఒక పనిచేసే పండుగలు. అందుకే నిజమైన పర్యావరణ పండుగలు జరుపుకుందాం.




2 వ్యాఖ్యలు:
వినాయక చతుర్ధి శుభాకాంక్షలు
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు
Post a Comment