శ్రీ విష్ణుసహస్రనామ వైభవం
>> Sunday, August 31, 2008

భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు. శ్రీ వాల్మీకి మహర్షి ప్రణీతమయిన రామాయణం ,శ్రీ వేద వ్యాస భగవానులు అనుగ్రహించిన మహా భారతం. శ్రీ మద్భారతానికి రెంటివల్లే గౌరవమని పెద్దలు అంటారు. అందు మొదటిది,శ్రీకృష్ణ భగక్వానుడు అనుగ్రహించిన గీత, రెండవది భీష్మ పితామహుడు లోకానికి అందించిన శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం.
ఈ రెంటిలో మొదటిదానిని శ్రీ కృష్ణుడు అర్జునునకు ఉపదేశం చేసి సంజయునిద్వారా లోకానికి అందించారు. రెండవదానిని భారత సంగ్రామానంతరం అంపశయ్యపై పడివున్న భీష్మ పితామహుని ద్వారా పాండవులకు ఉపదేశం చేస్తూ లోకాన్ని తరింపజేశాడు. ఈ రెంటిలో భగవద్గీత కంటే సహస్రనామ స్తోత్రం ద్వారానే సులభంగా తరింపవచ్చునని శ్రీ కృష్ణుని అభిమతం. ఈ భావాన్ని ఆయనే స్వయంగా వ్యక్తం చేశాడు. శ్రీ కృష్ణులవారు పాండ్వులను తీసుకుని భారత సంగ్రామానంతరం అంపశయ్య పైనున్న భీష్ముని వద్దకు వస్తాడు.
ధర్మరాజుకు కలిగిన ధర్మ సంశయమ్లు తీర్చమని భీష్ముని కోరగా ,తనకు అవేవీ చెప్పే శక్తిలేదని, జ్ఞాపకం లేదనీ అంటాడాయన. అయితే ఇవిచెప్పడానికి పూర్వం తెలిసినవన్నీ జ్ఞప్తికి వచ్చేలా,పూర్వపు శక్తికలిగేలా వరమిస్తాడు ఆ లీలామానుష విగ్రహుడు. నోటనీరూరునట్లు, దేహబాధ తెలియకుండునట్లు ,చేస్తాడు. ఆశ్చర్యం ,ఆనందాలతో భీష్ముడు ,అన్నివరాలునాకిచ్చి చెప్పమనడమెందుకు కృష్ణా ! నీవే చెప్పవచ్చుకదా! అని ప్రశ్నిస్తాడు. భారత సంగ్రామమ్లో ఇరుసేనలను ఆపి మరీ చెప్పాను, భగవ్ద్గీతనంతా ,విన్న అర్జునునకు అది ఏమాత్రం పట్టలేదు. అప్పుడు నాకు ఆచార్య లక్షణాలులేవు,అతనికి శిష్యలక్షణాలు పూర్తిగా లేకపోవడ మే కారణం పైగా పరమాత్మను నేణే కనుక తనను గూర్చి తానే చెప్పుకోవడం అందరికీ అసూయ కలిగిస్తోంది. .ఒక తత్వాన్నిగురించి తత్వదర్శనం చేసినవారు చెప్పాలే తప్ప తనను గురించితాను చెప్పుకోరాదు.కదా! భగవద్గీతలో నాగురించి నేనే చెప్పుకోవడం వలన అర్జునునుకి ఏ మాత్రం ఎక్కలేదు.
పితామహానీవుతత్వదర్శనంచేసినఆచార్యుడవుగనుకపాండవులనీనుంచితెలుసుకోవాలని కోరుతున్నారు. వారికి తత్వము,హితము ఉపదేశం చేయమంటాడు కృష్ణుడు. దాహము కల్గిన వానికి సముద్రం తనలో నీరువున్నా ఇవ్వటానికి లేదు. ఇచ్చినా అది తాగటానికి పనికిరాదు ,ఆనీట్నే మేఘం గ్రహించి వర్షంగా కురిపించినప్పుడే అవిత్రాగటానికి పనికివస్తాయి. నేనుసముద్రమ్లాంటివాడిని ,నీవుమేఘములాంటివాడవు, కనుక పితామహా! నీవే వీరికి ఉపదేశించి ఆర్తిని తీర్చు అని ఆదేశిస్తాడాయన. భీష్ముడు
పాండవులకు ఉపదే శిస్తుంటే ,తానుకూడా చేతులుకట్టుకుని విని అది అట్లే అని ఆమోదిస్తాడుకూడా! అందుచేత దీనికి ప్రభావమధికము.
ముందుగా సామాన్యధర్మాలనుసమాధానాలను తెలుసుకున్న ధర్మరాజు, తాతా! ఆపైన జన్మ మెత్తిన జీవి ఈ సంసార చక్రమునుండి బయటపడాలంటే తెలియవలసిన తత్వమేది? ఈ జీవులపుడు ఎక్కడకు చేరతారు? ఆ చేరటానికి ఏమిచేయాలి? ఎవరిని స్తితిస్తే ,అర్చిస్తే మనవులు కోరిన సుఖాలన్నీ పొందుతారు? తాతా దానిని అనుగ్రహించు అని వేడుకుంటాడు. సర్వ జగత్కారణమైన సర్వ లోకేస్వరుడయిన శ్రీమన్నారాయణుని స్తువన్= స్తోత్రము చేయుచు, తమేవచ అర్చయన్= అతనినే ప్రేమతో పూజిస్తే సర్వ దు:ఖాతిగోభవేత్ = అన్ని దు:ఖములను దాటిపోవచ్చునయ్యా! ఆపుండరీకాక్షుని అర్చించడమేధర్మ: అధికతమోమత: =అన్నిధర్మములలో శ్రేష్టమయినది అని నా అభిప్రాయం. ఇంతేకాదు, అతని నామాలను కీర్తిస్తే సకలపాపాలూ పోతాయి.పవిత్రులవుతారు మీరుకోరినవన్నీ లభిస్తాయి దీనిని మించిన గొప్పమంత్రమింకొకటిలేదు. వేయినామాల మూలమంత్రమీస్తోత్రం.
ఈ వేయినామాలు ఎక్కడివో తెలుసా ? నేను కల్పించలేదు. " గూఒణాని విఖ్యాతాని ఋషిభి: పరిగీతాని,శ్రీమన్నారాయణుని గుణములననుభవించిన ఋషులు ఆ అనుభవ సారంగా ఒక్కొక్కనామాన్ని దర్శించి ఆనందించగా ,ఆక్కడక్కడ ఆఋషుల వాగామృతం కలిపి పరీవాహమయి లోకములో పొందగలిగేట్లు శ్రీవ్యాసభగవానులవారుసేకరించి కృపచేయగా నేనుదర్శించాను.
నీవు అడిగావుకనుక సర్వజీవులు ఉజ్జీవించడానికయిచెబుతున్నాను విను.అని భీష్ముడు ఉపదేసిస్తాడు. అట్టి మహాభారతసారము, ఋషులచేదర్శింపబడి,శ్రీభీష్మ పితామహుల అభిమతము,వేదవ్యాస వుపలబ్దము భగవ్ద్గీతకంటే శ్రేష్టతరము అయి ,ఆధునికిలచేత కూడా సకల శ్రేయోదాయకము గా కొనియాడబడుతున్న ఈ విష్ణుసహస్రనామాన్ని మనంగూడా నిత్యం పాడి పరమపదవిని పొందుదాం.
విష్ణుసహస్రనామం ఇక్కడ చదవండి, వినండి..




1 వ్యాఖ్యలు:
ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః
యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృరి కీర్తిభిః
భక్తిశ్రద్ధలతో విష్ణుసహస్రనామాలను పారాయణ చేసేవాడు,అత్మసుఖం,శాంతి, భాగ్యం, ధైర్యం, జ్ఞాపకశక్తి, కీర్తి మొదలైనవాటితో శోభిల్లుతాడు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మా ఊరిలో సాయంత్రం ఖచ్చితంగా 5.30 గంటలకు పారాయణ చేస్తున్నాము. ఆ పలితాన్ని మాలో చాలా మంది అనుభవిస్తున్నాము ముఖ్యంగా కావలసింది నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ,భక్తి.
Post a Comment