శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ముంబాయి మహాలక్ష్మి ఆలయం

>> Sunday, August 31, 2008




పురాతన దేవాలయాల్లో ముంబైలోని మహాలక్ష్మి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీలోని బి.దేశాయ్ రోడ్‌లో నెలకొని ఉంది. అరేబియా సముద్రపు ఒడ్డున కొలువైవున్న మహాలక్ష్మి మాతను సందర్శించి ఆమె దీవెనలు పొందేందుకు లక్షలమంది భక్తులు వస్తుంటారు.

అష్టైశ్వర్యాలను ఒసగే మహాతల్లిగా హిందువులు మహాలక్ష్మిని కొలుస్తారు. ఈ దేవాలయాన్ని ఒకసారి పరికించి చూస్తే... ఆలయ ప్రధాన ద్వారం అద్భుతంగా తాపడం చేయబడి వుంటుంది. లక్ష్మీమాతకు పూజలు చేసేందుకు పూలు, ఇతర పూజ సామగ్రి ఆలయ ప్రాంగణంలోని షాపులలో లభ్యమవుతాయి.

స్వర్ణాభరణాలతో సంపదల తల్లిగా గోచరించే ఇక్కడి మహాలక్ష్మి రూపు హిందూ గృహాల్లో కనబడుతుంటుంది. సిరిసంపదలనొసగే ముంబై మహాలక్ష్మికి భక్తకోటి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. దేవాలయం చరిత్ర గురించి చూసినప్పుడు... ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర వుంది.

ఆలయ చరిత్ర ఆసక్తిని రేకిత్తించేదిగా వుంటుంది. బ్రిటిషువారి కాలంలో మహాలక్ష్మి ప్రాంతాన్ని వర్లికి కలిపేందుకు యత్నించటం జరిగింది. అయితే పెద్ద పెద్ద అలలు బీభత్సాన్ని సృష్టించటంతో వారు ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట. అదే సమయంలో మాతా మహలక్ష్మి రామ్జీ అనే కాంట్రాక్టరు కలలో ప్రత్యక్షమైంది. సముద్ర గర్భంలో వున్న మూడు విగ్రహాలను వెలికి తీసి ఆలయంలో స్థాపించాల్సిందిగా ఆజ్ఞాపించింది. దేవి ఆన మేరకు రామ్జీ విగ్రహ ప్రతిష్టాపన చేశాడు.
WD


ఆలయంలో మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి విగ్రహాలున్నాయి. మూడు విగ్రహాలకు ముక్కు పుడకలతోపాటు, బంగారు గాజులు వజ్ర వైఢూర్యాలతో తయారుచేసిన నగలు వున్నాయి. ముగ్గురమ్మలను చూసిన భక్తులు భక్తి సాగరంలో మునిగిపోవాల్సిందే. ఎవరైతే త్రికరణశుద్ధితో అమ్మవార్లను పూజిస్తారో వారి కోర్కెలు తప్పక నెరవేరతాయని చెప్పబడింది. అమ్మవారిని వీక్షించేందుకు భక్తులు బారులు తీరి వుంటారు. సమయం ఎంతైనా... లక్ష్మీమాతను దర్శించి పూజలొనర్చిన తర్వాతే భక్తులు తిరుగుముఖం పడతారు.

ఎలా వెళ్లాలి: వాణిజ్య కేంద్రమైన ముంబైకు అన్ని ప్రధాన పట్టణాల నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ముంబై చేరుకున్నవారు స్థానిక బస్సులలో ప్రయాణించి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో వుంటాయి. ఈ టాక్సీలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయాలనుంచి కూడా వుంటాయి.

2 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ August 31, 2008 at 4:03 PM  

మీ template లో భగవద్గీత చిత్రం చాలా బాగుంది.ఈ బొమ్మను నా template లో వుంచుదామని నా బ్లాగు మొదట్లో ప్రయత్నించాను.పెద్దదవుతుందేమోనని వదలివేశాను.శ్రీకృష్ణుడు అర్జునునికి సారధ్యం వహించి గీతోపదేశం చేసినట్లు మీరు మాకు మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలియచేస్తూనే వుండండి.ధన్యవాదములు. హరేకృష్ణ.

జ్యోతి September 1, 2008 at 6:40 AM  

విజయమోహన్‍గారు,

మీరు ఏ చిత్రం ఐనా పెద్దగా ఉంటే దాన్ని windows picture managerలో కావలసినంత crop(cut)చేసి, లేదా రీసైజ్ చేసి హెడర్‍లో పెట్టుకోవచ్చు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP