అక్షయతృతీయ ఆచారంవెనుక అర్ధం తెలుసుకోవాలి
>> Saturday, April 22, 2023
అక్షయతృతీయ నాడు బంగారం కొనటం కాదు బంగారు మనస్సుతో శుభసంకల్పాలు చేయండి
మనప్రతి ఆచారం వెనుక మనక్షేమము కోరినట్లు కనపడుతూనే లోకక్షేమమునకు ఆవిషయం ముడిపెట్టబడి ఉంటుంది. మనహితము లోకహితముతో మాత్రమే సాధ్యమనే సత్యం మనం గ్రహించాలి. ఋషుల సంకల్పం మనంగ్రహించకుండా మనకు తోచినదే ఆచారంలో అంతరార్దంఅనుకుని ఆచారాలు పాటిస్తే ప్రయోజనం ఉండదు .
అక్షయ తృతీయరోజున బంగారం చేయమని చెప్పబడి ఉన్నది. దానం చేయాలంటే కొనాలి కదా అని కొనటం దాచిపెట్టుకోవటం మాత్రమే పరమార్ధంగా మారి తే వ్యాపారులకు తప్ప మీకు ప్రయోజనం శూన్యము '
ఈరోజు చేసే పనుపనులు అక్షయమవుతాయి. అయితే అవి పుణ్యకార్యక్రమములు అయిఉండాలి. కేవలం స్వార్ధచింతనతో కూడినవిగా కాకూడదు . పది జీవుల దాహం తీర్చటం ఆకలి తీర్చటం. గోవుల సంరక్షించటం ...ఇలా మనకు నిజమైన హితమునిచ్ఛే శుభసంకల్పాలు చేయండి. దానివలన మీ పుణ్యము అనంతంగా పెరిగి అక్షయమైన శుభములు మీకుటుంబాన జరుగుతాయి.
మీకందరకూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు
0 వ్యాఖ్యలు:
Post a Comment