హనుమంతుని వేదవిజ్ఞానం
>> Thursday, March 30, 2023
హనుమంతుని వేదం విజ్ఞానం నేటి భాషలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్) ఏ స్థాయిదో శ్రీరాముడు చెప్పే మహిమాన్వితమైన ఘట్టం శ్రీమద్రామాయణం కిష్కిన్థాకాండము, 3వ సర్గలో వుంది.
సీతను వెదకుతూ ఋష్యమూక పర్వతం వద్దకు వస్తున్న రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడ్డపుడు, హనుమంతుడు మొదటిసారిగా రామలక్ష్మణులను కలిసి వారిని పొగుడుతూ, వారు అక్కడికి వచ్చిన పనేమిటని ప్రశ్నించే సన్నివేశంలో శ్రీరాముడు లక్ష్మణునితో యిలా అంటాడు.
*నానృగ్వేదవినీతస్య నాయజుర్వేదధారిణః*
*నాసామవేదవిదుషః*
*శక్యమేవం విభాషితుమ్.*
_“లక్ష్మణా! ఋగ్వేదములో పండితుడు కానివాడు, యజుర్వేదమును చదవని వాడు, సామ వేదాధ్యయనం లేనివాడు ఈ విధంగా మాట్లాడలేడు. వేదమాత్రములే గాక సర్వాంగములూ, సర్వోపాంగములూ వ్యాకరణాది తంత్రములు, సర్వ పాండిత్యములు ఇతని యందు గోచరిస్తున్నవి.”_
హనుమంతుణ్ణి భవిష్యత్ బ్రహ్మగా అభివర్ణిస్తారు మహర్షులు. మరి అటువంటి హనుమంతుని కరుణా కటాక్షవీక్షణాలు మనందరిపై వుండాలని ఆకాంక్షిస్తూ..
*ॐ బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతాl*
*అజాఢ్యం వాక్పటుత్వంచ*
*హనుమత్ స్మరణాద్భవేత్ll*
“హనుమంతుని యొక్క తలంపు మనకు సద్బుద్ధిని, మంచి బలమును, సత్కీర్తిని, ధైర్యమును, నిర్భయత్వమును, రోగ రాహిత్యమును, అజాఢ్యమును, మంచి వాగ్ధాటిని, సంప్రాప్తింప చేస్తుంది.”
🪔💐🪔💐🪔
0 వ్యాఖ్యలు:
Post a Comment