ఆయుర్వేద అద్భుతం..ఒకరోగి అనుభవం
>> Monday, December 20, 2021
చాలామందికి ఆయుర్వేదం వైద్యం అంటె చులకన భావం. నాక్కూడా ఒకలాంటి అనుమానపు భావం ఉండేది ఆయుర్వేదం పైన. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్న చందానా. ఇప్పుడు నేను చెప్ప బోయేది ఆయుర్వేదం తో నా ప్రత్యేక అనుభవము.
2015 సెప్టెంబరు ఇద్దరు అమ్మయిల తరువాత నాకు అబ్బాయి పుట్టాడు, ఒకరకమైన ఆనందము లో ఉన్నాను. ఇద్దరు రత్నాల్లాంటి అమ్మాయిలు, వజ్రం లాంటి అబ్బాయి, ఒక కంప్లీట్ ఫామిలీ అయిన ఫీలింగు. నేను అనందాన్ని అనుభవిస్తున్న వేళ నా అందం కొంచం తగ్గిపోయే రోగం తగులుకుంది. అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో, ఇప్పటికి అర్థం కాలేదు. తరువాత తెలుసుకున్న దేమిటంటే అది ఒక చర్మ రోగం అని పేరు పేనుకోరుకుడని, వైద్య భాష లో Alopecia అంటారని. ఈ రోగం వస్తే వచ్చింది గాని, నా గడ్డాన్ని ఎటాక్ జేసింది, నా గడ్డపు వెంట్రుకలు అక్కడ అక్కడ రాలి పోయి వికారంగా కనిపించటం మొద్దులెట్టింది. అసలే అట్టఅట్ట ఉన్న అందమాయే మనది, అక్కడక్కడా గడ్డపు వెంట్రుకలు రాలిపోయి కాస్త వికారంగా కనిపించటం మొదలెట్టా.
అవి నేను బెంగళూరు లో ఉండే రోజులు, సెయింట్ జాన్స్ హాస్పిటల్ కు వెళ్ల్లా , ఈ హాస్పిటల్ చాలా చవుకగా, మంచి సూపర్ స్పెసైలిస్టులతో అలరారుతున్న కూడా మన జేబుకు చిల్లు పడకుండా కాపాడుతుంది. డెర్మాటోలాజి OP కు అప్పోయింట్మెంట్ తీసుకొని వెళ్ళా, వెళుతూనే వాళ్ళు రోగాన్ని పసిగట్టి, ఒక రకమైన మెడిసిన్ రాసి, ఒక ఇంజక్షన్ వేశారు. ఈ ఇంజక్షన్ వేసే ప్రక్రియ చాలా బాధతో కూడుకున్నది, ఈ ఇంజక్షన్ పేరు tricort. నాకు ఎక్కడ ఎక్కడ గడ్డం లో వెంట్రుకలు రాలిపోయాయో అక్కడ ఈ ఇంజక్షన్ ని గుచ్చారు. నొప్పిని పంటి బిగువున భరించాను. ఇంజక్షన్ ఆయిన తరువాత అడ్డం లో చూసుకుందును, ఎక్కడ ఎక్కడ గుచ్చారో అక్కడ గుర్తు గా ఒక రక్తపు బిందువు, అలాంటి బిందువు ఏడు నుంచి ఎనిమిది నిలబడి ఉన్నాయి నా మొహం పైన. బ్రతుకు జీవుడా నాయి బయటకు వస్తున్నప్పుడు డాక్టరమ్మ, నెలాగి రండి ఇంకొక డోస్ ఇంజక్షన్ తీసుకోవాలి, మధ్యలో షేవింగ్ జెయద్దండి, మాకు స్పాట్స్ గుర్తు పట్టటం కష్టం అవుతుంది అంది. సరే అని తలాడించి, ఇంకా చచ్చిన రాను ఇన్ని సార్లు ఇంజక్షన్ గుచ్చిపించు కోలేను అనుకుంటూ ఇంటి దారి పట్టాను.
నెల గడిచింది, ఇంకా ఎక్కువగా రాలి పోవటం మొదలు పెట్టింది. దాదాపు సగం గడ్డం రాలి పోయింది. ఇంకా ఆగలేక మల్లి సెయింట్ జాన్స్ కు వెళ్ళా. మల్లి ఇంజక్షన్ లు, అయిదు వందల రూపాయలు ఖర్చు, ఇంజక్షన్ బిల్లు. మూడు వందల రూపాయలు ఆటోకు. మా ఇంటి నుంచి ఆ హాస్పిటల్ పద్నాలుగు KMలు. అంత దూరం బైకు నడపడం నాకు వళ్ళు బరువు. మల్లి నెలకు రమ్మన్నారు. అందం పైన ఆశ. సరే వస్తానని చెప్పి ఇంటికి వచ్ఛేసా.
నెల గడిచింది రాలిపోయిన ఒక్క చోట కూడా ఒక్క వెంట్రుక కూడా మొలవలేదు. నెల తరువాత ఇక ఆ హాస్పిటల్ కు వెళ్ళ కూడదని డిసైడ్ అయ్యా. నాకు బాగా రఫ్ గా గడ్డం తో ఉండడం ఇష్టం, కానీ ఈ రోగం మూలాన రోజు నున్నగా షేవింగ్ జేసుకోవటం అలవాటు జేసుకున్నా. అలా మూడు నెలలు దీని గురుంచి పట్టించి కోవటం మానేసా. నేను పట్టించుకోవటం మానేశానని రోగం మాత్రం తన ప్రతాపం తగ్గించలేదు. బ్లేడ్ లేకుండానే నాకు షేవింగ్ జేస్తుంది. జుట్టు రాలి పోవటం, రాలిన చోట వెంట్రుకలు మొలవకుండా పోవటం. నాకు ఒక రకమైన దిగులు పట్టుకుంది, గడ్డం రాలితే రాలింది, తలకు అంటుకుంటే? గడ్డానికి వచ్చింది కాబట్టి షేవింగ్ తో మేనేజ్ జేస్తున్నాను, అదే తల వెంట్రుకులకు వస్తే? రోజు గుండు జేసుకోవాలా? ఆ ఊహనే నాకు వెన్నులో చలి పుట్టించింది.
ఇలా కాదని డాక్టర్ని మార్చా, వేరే డెర్మటాలజీ డాక్టర్ దెగ్గరికి వెళ్ళా, అతను మహానుభావుడు ఇంజక్షన్ వెయ్యకుండా, మందులు ఫీజు ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నాడు. నాలుగు రకాల మాత్రలు రాసిచ్చాడు. అందులో ఒకటి స్టెరాయిడ్, స్టెరాయిడ్ దుష్పరిణామాలు నాకు తెలిసి ఉన్నా కూడా, రోగం తగ్గుతుందన్న ఆశాతో రెండు నెలల కోర్స్ తీసుకున్నా. ఏమి లాభం లేదు, గడ్డం వెంట్రుకలు, చేతి ఛుమురు వదలటం తప్ప. ఈ రోగం నన్ను మానసికంగా కూడా వేధించటం మొదలుపెట్టింది. ఇతనితో లాభం లేదని మల్లి కొత్త డెర్మటాలజి డాక్టర్ ని వెతికి పట్టుకున్నా, అతను షరా మాములే, ఏవో మందులు వాడమని చెప్పటం, మూడు నెలలు నెల నెలా రామ్మన్నాడు, మూడు నెలల ట్రేట్న్మెంట్ తరువువాత కూడా ఏమి లాభం లేదు. మొత్తం ఒక సంవత్సరం రోజులు గడిచి పోయింది. కనీసం ఈ రోగం ఎందుకు వచ్చిందని అడిగితే సరిఅయిన సామాధానం లేదు వాళ్ళా దగ్గిర. గట్టిగా అడిగితే విటమిన్ డెఫిసియన్సీ అంటారు. ఈ ప్రహసనంలో మా ఊరు కడపకు వచ్చాను మధ్యలొ, కొందరు మిత్రులు కడపలో పేరు మోసిన డెర్మాటోలాజిస్ట్ గారి దగ్గరికి వెళ్లామన్నారు. ఆశా చావక ఆయన్ని కలిశా, ఆయన ఒక అయిదు రకాల మందులు, పూసుకోవటానికి రెండు రకాల ఆయింట్మెంట్లు ఇచ్చాడు. నేను తూచా తప్పకుండా ఆ ఆయింట్మెంట్లు పోసుకునే వాడిని. వెంట్రుకలలు మొలవటం దేవుడు ఎరుగు, పూసుకున్న ఆయింట్మెంట్లు మెల్లగా కరిగి నా బనియన్లు, నా లుంగీలకు అంటుకొని మరకలై ఇంకోసారి వేసుకోవాటినికి వీలు కాకుండా పోయేటివి. ఇలా ఈయన ట్రీట్మెంట్ మూడు నెలలు తీసుకున్నా, ఒక పిసరంత లాభం కూడా లేకుండా పోయింది. ఒక అరడజను బనియన్లు, ఒక అరడజన్లు లుంగీలు నాశనం అయ్యాయి.
కొన్ని నెలల విరామం తరువాత కడపలో పేరు మోసిన హోమియోపతి డాక్టర్ గారిని కలిసాను. ఇతను మొత్తానికి నా ఆశలు పైన నీళ్లు జల్లాడు. ఈ రోగానికి మందు లేదని, అల్లోపతే లో అస్సలు లేదని, ఇది తల వెంట్రుకలుకు ప్రాకాకుండా ప్రార్థన జేసుకోమ్మని, ఒక వేల ప్రాకితే తూర్పుకు తిరిగి దండం పెట్టుకొమ్మన్నాడు . ఇతని సలహాకు శిరస్సు వంచి నమస్కరించి నిరాశ నిస్పృహలతో ఇంటి దారి పట్టా. బెంగళూరు లో ఒక రోజు మంగలి షాప్ లో కట్టింగ్ జేస్కుంటుంటె, బార్బర్ అన్నాడు, సర్ మీ పేనుకొరుకుడుకు నా దగ్గిర వైద్యం ఉందని. అతను నాకు ఆపద్భాంధువుడు లా కనిపించాడు. ఒక అయిదు వందలు రూపాయలు దీసుకొని ఒక లేహ్యము పూశాడు. ఇంటికి వస్తూనే ఒకరకమైన మంట, చూస్తూ చూస్తూనే అతను పూసిన చోటంతా బొబ్బలు కట్టింది. అతనికి కంగారుగా ఫోన్ జేసా, అతను తాఫీగా ఏమ్ గాదు సర్, బొబ్బలు తగ్గిం తరువాత వెంట్రుకలు మొలుస్తాయి అన్నాడు. మూడు రోజులు బయటికి ఎక్కడికి వెళ్లలేక పోయా. విపరీతమైన మంట. మూడు రోజులకు అతను చెప్పినటలే బొబ్బలు తగ్గాయి కానీ రెండు నెలలైనా వెంట్రుకలు రాలేదు. అలా ఇంకొక ఆరు నెలలు గడిచి పోయాయి. పూర్తిగా రెండున్నర్ర సంవత్సారాలు అయినా కూడా ఒక్క వెంట్రుక మొలవలేదు, షేవింగ్ జేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది.
గడ్డం నుంచి మెల్లగా అది తలకు పాకటం కూడా మొదలు పెట్టింది, ఇంకొక రెండునెలలు ఉంది ఉంటె నా నెత్తికి కూడా పాకుండేది. నాకు అదృష్టం ఒక ముసలావిడ రూపంలో వచ్చింది.
ఒక రోజు మా ఇంటి దగ్గిర నిలుచొని ఉన్నాను, ఒక ముఖ పరిచయం ఉన్నపెద్దావిడ పలకరించి నా మొహం వైపు జూసి, నీకు పేనుకొరుకుడు ఉందే, వైద్యం జేసుకోలేదా అంది. జేసుకున్ననుఁ, ఏది పని జెయ్యలేదు అన్నాను. ఆవిడ నా చెయ్యి పట్టుకొని మా పెరట్లోకి తీసుకువెళ్లి పిచ్చి మొక్కల్లో ఒక గడ్డి మొక్కను జూపించి ఇది వెల్లుల్లి తో పాటు నూరి దినం మార్చి దినం పూసుకో, అయిదు నుంచి ఆరు సార్లు పూసుకున్న తరువాత వెంట్రుకలు మొలిస్తాయి అంది. ఆవిడ మాటలకు నాకు నవ్వు వచ్చింది. స్పెసిలిస్ట్ డాక్టర్లు నయం జెయ్యలేంది ఈ మొక్క నయం జేస్తుందా అని. ఆ మొక్క పిచ్చిదే, ఈ ముసలావిడ పిచ్చిదే అనుకున్నా. సరే అని పట్టించుకోలేదు.
ఒక వారం రోజుల తరువాతా, పెరట్లో తిరుగుతుంటె ఆ మొక్క పై నిలిచాయి నా కళ్ళు. ఏ పుట్టలో ఏ పాముందో నని ఆ గడ్డి మొక్కలను పెరికి, వాటిని వెల్లుల్లితో పాటు దంచే పనిని మా ఆవిడకు పురమాయించా. మా ఆవిడ దంచి ఇస్తే చక్కగా పోసుకున్నాను. అలా రెండు తూర్లు పూసుకున్నానో లేదో వెంట్రుకలు మొలవటం మొదలు పెట్టాయి. రెట్టించిన ఉత్సాహం తో మల్లి దినం మార్చి దినం ఆరు సార్లు పోసుకున్నాను. చక్కగా గుబురు గుబురుగా వెంట్రుకలు వచ్చాయి. ఇప్పుడు చక్కగా రఫ్ గా గడ్డం పెంచుకుంటున్నాను. మొత్తం పదిహేను రోజుల వైద్యం, పైసా ఖర్చు లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చక్కగా రోగాన్ని దూరం జేసిన ఆ పిచ్చి మొక్క ఇప్పుడు నాకు సంజీవిని తో సమానం.
ఈ మొక్కను గడ్డి చామంతి, గాయాపాకు అని ఒక్కో ప్రాతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం trydax ప్రోకబైన్స్.
ఈ మొక్కను కింద ఫోటో లో చూడవచ్చు. మూడు సంవత్సరాలు, ఇరభై వేల ఖర్చు, ఒక అయిదు డాక్టర్లు నయం చెయ్యలేని జబ్బుని ఒక మొక్క మొదటి రోజు నుంచి నయం చెయ్యటం మొదులు పెట్టింది.
నా జబ్బుకు పేనుకొరుకుడు అన్నారు, విటమిన్ లోపం అన్నారు కానీ పాపం ఆ పిచ్చి మొక్క ఇవి ఏవి పట్టించుకోకుండా నాకు శీఘ్రంగా నయం జేసింది. మరి ఇది కొరుకుతున్న పేనును చంపిందా? లేక విటమిన్స్ ని ఇచ్చిందా? శరీరపు లోతుల్లో ఉన్న వెంట్రుకలను బయటికి లాగిందా ? ఈ మొక్క యొక్క గుణం ఏంటి ? ఎవరు రీసెరచ్ జేస్తారు?
మన ఆయుర్వేద మహత్యం. మన ఆయుర్వేదం లో అన్ని జబ్బులకు ట్రాట్మెంట్ లేక పోవచ్చు గాని, చాలా మొండి రోగాలను కూడా నయం జేసే మందులు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం దాదాపు నశించిపోయింది మన భారత దేశం లో. ఒక జనరేషన్నుంచి ఒక జనరేషన్ కు ఈ విద్య ట్రాన్స్ఫర్ కూడా కాలేదు. కొందరు అసూయ తో ఈ విద్యను వేరే వాళ్లకి నేర్పించలేదు. నాకు తెలిసి ఎన్నో ప్రయోజకరమైన విషయాలు ఎవరితోను పంచుకోక అలాగే వారితో కాల గర్భం లో కలిసి పోయాయని.
మన వాళ్లకు ఆయుర్వేదం పైన నమ్మకం లేక పోవటానికి కారణం చెట్టుకు పుట్టకు ఒక నకిలీ ఆయుర్వేదిక్ వైద్యులు ఉండటం కూడా ఒక కారణం ఏమో ? ఈ నకిలను ఎవరు నియంత్రించాలి?
ఆయుర్వేదమే గొప్ప అనట్లేదు, అల్లోపతి వైద్యం లేకుండా ఉండి ఉంటె ఇప్పటికి మానవాళి మనుగడ ప్రశ్నార్థకం . కానీ ఆయుర్వేదం లో ఎన్నో రకాల మొండి రోగాలకు చికిత్స ఉంటుందని నా నమ్మకం. నాకు తెలిసి సరిగ్గా రీసెర్చ్ జేస్తే, మధుమేహానికి, న్యూరో లాజికల్ డిసార్డర్స్ కు అట్ఠే నయమయ్యే మందులు కనుగొనటం పెద్ద కష్టం ఏమి కాదు అనుకుంటున్నాను . కాన్సర్ ని కూడా నియంత్రించే మందులు ఉండే ఉంటాయి, కొద్దిగా నాది అత్యాశ ఏమో!!!!!!!
కొందరు తమకు రోగం ఉందని పబ్లిగ్గా చెప్పుకోరు. కొందరు తనకు తెలిసిన వైద్యాన్ని పబ్లిగ్గా చెప్పరు, కానీ నేను రెండిటిని దాపిరకము లేకుండా పోస్ట్ జేస్తున్నాను, ఒకటి మనకు ఆయుర్వేదం గురుంచి స్పృహ రావటానికి, మరియు ఎవరికైనా ఈ జబ్బు ఉంటె వైద్యం జేసుకుంటారని.
ఈ పిచ్చి మొక్క అనబడే నా పాలిట సంజీవని మొక్కను సజీవంగా
ఇట్లు
మీ
అవధానుల శ్రీనివాస శాస్త్రి
2 వ్యాఖ్యలు:
Informative
శాస్త్రిగారు..ఇప్పుడు కరోనాకి కుూడా మందు తయారు చేసారు కాబట్టి..ఆ విధానం కూడా వీలైతే ఇక్కడ పంచుకోండి
Post a Comment