మా కుమారుని వివాహమునకు రావలసినదిగా మీకందరకూ హృదయపూర్వక ఆహ్వానం
>> Thursday, April 19, 2018
ఆర్యా
నమస్కారములు
మాజ్యేష్ట పుత్రుడు చి. యశోరామ వివాహము చి .ల.సౌ. రాధాకళ్యాణి తో తిరుమల శ్రీవారి పాదసన్నిధియందు 28-04-2018 వైశాఖ శుధ్ధ త్రయోదశి ..శనివారం రాత్రి 3.27 ని లకు [తెల్లవారితే ఆదివారం} జరుపుటకు పెద్దలచే ముహూర్తము నిర్ణయింపబడినది. ఆ తదనంతరం మే ఒకటవ తేదీ ..మంగళ వారము రోజు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నందు. సత్యన్నారాయణస్వామి వారి వ్రతము ..శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవారి కళ్యాణము ,భవానీసమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణములు జరుప నిశ్చయించినాము . తామందరు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి మా చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి మమ్ములను ధన్యులను చేయవలసినదిగా మనవి
మీరాకకొరకై వేయికన్నులతో ఎదురు చూస్తుంటాము .
1 వ్యాఖ్యలు:
వంశాభివృద్ధితో కూడిన పూర్ణ వైవాహికజీవితానికై వధూవరులిద్దరికి శుభాకాంక్షలు, ఆశీస్సులు ✋ 💐💐.
Post a Comment