శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎలా ఉంది మన పండుగ

>> Wednesday, March 29, 2017

అర్థరాత్రి వేడుకలు లేవు, మద్యం, మాంసం వాసనలు లేవు,
నడివీధులలో హారన్ హోరులు లేవు, చెవులు హోరెట్టించే సంగీతపు DJలు లేవు,
గ్లాసుల గలగల లేదు, కృత్రిమ దీపాల కళకళ లేదు, బార్ ల ముందు బారులు లేవు,
HAPPY NEW YEAR హగ్గులు లేవు, పెగ్గులు లేవు, కెమికల్‌ ముగ్గులు లేవు,
ఏం చూసినాము ఈవాళ ??? ?
అర్ధరాత్రి అస్తమిస్తున్న అమావాస్య చీకట్లు,
వేపపువ్వూ వాసనలు ఉన్నాయి,
నడి వీధుల్లో నూతన వస్త్రాల తళతళలు
దివ్యాశిస్సుల కోసం దేవాలయ దర్శనాలు
కోకిల కుహు, కుహులు
గడపడగపనా టి.వి. పంచాంగ శ్రవణాలు
ఇంటింటికి షడ్రుచుల పచ్చడి పంపకాలు
పులిహోర, పిండివంటల ఘుమఘుమలు
కనిపించాయి.

హమ్మయ్య! తెలుగుదనం ఇంకా బతికే ఉంది.....

 శుభ సాయంత్రం....

1 వ్యాఖ్యలు:

anyagaami March 29, 2017 at 10:02 AM  

ఇది శుభపరిణామం. మీరు కొన్ని ఫోటోలు పెట్టెదరు గాక.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP