శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

లీలామానుషధారి..

>> Wednesday, August 24, 2016


S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కృష్ణుడిని మనం లీలామానుష విగ్రహుడుగా చెబుతాము. ముఖ్యంగా బాల్యంలో ఆయన చర్యలు అన్నీ లీలలే! సాధారణ వ్యక్తులకు అసాధ్యమైన పనులు. ఇక్కడే శ్రీరామచంద్రునికి ఈయనకు తేడా కనబడుతుంది. ఇద్దరు అవతార పురుషులే. అయినా ఎవరి విశిష్టత వారికి ఉన్నది. రాజభవనాలలో పెరిగినందున రాములవారికి వేరే రక్షణ అవసరం లేకపోయింది. కృష్ణుడు అలాకాక చిన్నప్పటినుంచే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన బాల్య జీవితమంతా అనుకోకుండా వచ్చే ప్రమాదాలలోనే జరిగిపోయింది. శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్లినప్పటినుండే ఇబ్బందులను, శత్రువులను, అపాయాలను ఎదుర్కొనవలసి వచ్చింది. శ్రీకృష్ణుని విషయం అటువంటిది కాదు. శ్రీరాముడు అక్కడక్కడ దయ చూపించాడు. కృష్ణుడు పుట్టిననాటి నుంచి ఎన్నో మహిమలను చూపించాడు. ఆయన చిన్నతనం నుండే ఎన్నో మహిమలను చూపాడు. ఎందరో రాక్షసులను అంతం చేశాడు. ధర్మసంస్థాపన చేశాడు. చిన్నతనంనుండే అపాయాలు సరదాగా ఎదుర్కొనడానికి కాళియ సర్పం, పూతన, తృణావర్తుని ఉదంతాలు ఉదాహరణ. ఇంద్రుడు తనకు రావలసిన నైవేద్యాలు రాకపోవడంతో ఎడతెరిపి లేని వర్షం కురిపించాడు. ఆ సందర్భంలో గోవర్ధనం ఎత్తి తనవాళ్లను కాపాడాడు. ఇంద్రుని క్షమించాడేకానీ సంహరించే ప్రయత్నం చెయ్యలేదు. ఇది బాలకృష్ణుని అనుగ్రహానికి తార్కాణం.
శంఖ చక్రాలతో జన్మించడం ఒక అద్భుతం. అందుకే ఆయనది జననం కాదని అవతారం అని విజ్ఞులు చెబుతారు. యశోద ప్రక్కలో ఆమెను పడుకొనబెట్టినపుడు తన శిశువే అని భావింపజేయడం కూడా మరో అద్భుతమే! సాధారణ స్ర్తిల విషయంలో ఇలాంటి భావన కలగడం అసంభవం! బాలకృష్ణుడు తన కాలి బొటన వేలిని నోటితో పెట్టుకొని చప్పరించడం మన చిత్రాలలో చూస్తున్నాము. భగవంతుని పాదాలలోనుండి అమృతం ఉబుకుతుందని వేదాలు చెబుతున్నాయి. ఇది నిజమా కాదా అని పరిరక్షించడానికే స్వామి ఇలాచేశాడని ఒక ప్రవచనకర్త వ్యాఖ్యానించారు.
ప్రళయ కాలంలో స్వామి అన్నిటిని తనలోకి తీసుకొంటాడు. అప్పుడు ఆయన ఒక మర్రి ఆకుపై విలాసంగా విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు ఆయన తన కాలి బొటన వేలిని నోటిలో ఉంచుకొంటాడు. కొన్ని కొన్ని అరుదైన పనులను మనం ప్రక్కన మనుషులు ఉన్నప్పుడు చెయ్యడానికి వెనకాడతాము.
అదే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూడడం లేదుకదా అన్న ధైర్యంతో కొన్ని విచిత్రమైన, అసాధారణమైన చర్యలు చెయ్యడానికి సిద్ధపడతాము. ప్రళయ కాలంలో మరెవ్వరు ప్రక్కన లేనందుననే అటువంటి చర్యకు సిద్ధపడ్డాడని మరో వేదాంతి భాష్యం చెప్పారు. ప్రక్కన ఉన్నవాళ్లు ఇలాచేస్తే తప్పుపడతారని అందువలననే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే ఇలా చేశాడని ఆయన వివరణ!

from   andhrabhoomi daily

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP