శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

24 కోట్ల శ్రీరామనామలేఖన సహిత హనుమద్రక్షాయాగమునకై, రామనామలేఖనప్రతులను,రామాయణ[వచన]ప్రతులను అందించే సేవలో పాల్గొనమని మనవి..

>> Monday, March 25, 2013

                                                          జైశ్రీరాం



భక్తజనబంధువులకు విజ్ఞప్తి

     ఆథ్యాత్మికప్రయోగంగా శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠం కేంద్రముగా  హనుమద్భక్తులు సాగిస్తున్న హనుమద్రక్షాయాగం ఐదు ఆవృతులు పూర్తిచేసుకుని ఆరవ ఆవృతిగా మొదలుకానున్నది. . ఈసారి హనుమత్ స్వామి ప్రసాదించిన ఆజ్ఞగా భావించి  హనుమద్రక్షాయాగములో భాగంగా  ఉగాది నుండి  24 సాధనాక్షేత్రములలో   24 కోట్ల రామనామజపము మరియు హనుమాన్ చాలీసా పారాయణములు జరుపబడతాయి.   ఒక్కో సాధనాక్షేత్రపరిధిలో భక్తులు ఒక్కోకోటి నామలేఖనమును పూర్తిచేస్తారు. దీనివలన  ఆ భక్తులకుటుంబంలో చికాకులు కలతలు అరిష్టములు తొలగిపోయి సర్వసౌభాగ్యములు ప్రాప్తిస్తాయి. సర్వత్రా విజయము సుఖసంతోషములు కలుగుతాయి.  ఈ సామూహికనామ జపము ,లేఖనములవలన ఆసాధనాక్షేత్రమునకు, ఆగ్రామమునకు శుభం కలుగుతుంది.
ఈసమయంలో సాధ్యమైనమేరకు రామాయణ[వచనం] ప్రతులను పంపిణీ  చేయటం, ాఅచార్యులుఉషశ్రీగారు, చాగంటికోటేశ్వరరావుగార్లవంటి పౌరాణికులద్వారా చేయబడ్డ రామాయణప్రవచనముల ఆలయాలలో మైకులద్వారా రోజూప్రసారం చేయటం. అలాగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణములు నిర్వహించటం జరుపవలసి ఉంది.హరినామసంకీర్తనలు జరుగుతాయి.
అలాగే  కోటిరామనామ లేఖనం పూర్తయిన ప్రతి సాధనాక్షేత్రంలో శ్రీసీతారామకళ్యాణం. సామూహిక హనుమదభిషేకములు నిర్వహించబడాలన్నిది సంకల్పం .  విజయనామ సంవత్సరం హనుమజ్జయంతి మరునాడు   మే.24  వతేదీ న హనుమద్రాక్షాయాగం [ఆరవ ఆవృతి] పూర్ణాహుతి . ఆతదుపరి  24సాధనాక్షేత్రాలనుండి రామనామ లేఖనప్రతులను తీసుకువెళ్ళి భద్రాద్రి లో శ్రీరామచంద్రప్రభువుల పాదపద్మములకు సమర్పించటంజరుగుతుంది.
 ఇదీ ప్రణాళిక.

ఇక ఇప్పుడు అన్ని సాధనాక్షేత్రాలకు  శ్రీరామ నామలేఖనమునకు పుస్తకాలుగా ప్రతులను అందజేయవలసిఉంది.
ఒక్కో పుస్తకం లో ఏభైవేలసార్లు శ్రీరామనామాన్ని లిఖించటానికి వీలుగా తయారుచేపించి అందజేయాలి.హనుమాన్ చాలీసా ప్రతులను అందజేయాలి . అలాగే మానవీయ విలువలను,ధర్మాన్ని ప్రబోధించే రామాయణమహాకావ్యాన్ని వచనరూపంలో సామాన్యజనులకు అందించాల్సిఉంది . అలాగే యాగనిర్వహణలోనూ భక్తులభాగస్వామ్యం అవసరం.
  హనుమంతులవారిని గురుస్థానంలో ను,రక్షకులుగానూ .యాగఫలప్రదాతగానూ నిశ్చయించుకుని సంకల్పించిన ఈ యాగములో భక్తులందరూ భాగస్వాములవ్వాలని మనవి.

 ఇప్పుడు మొదటిదశలో  ఎవరైనామీవంతుగా శ్రీరామనామలేఖన ప్రతులను, వచన రామాయణప్రతులను అందజేసినా , లేక వాటి తయారీలో సహకరించదలచుకున్నా వారందరికీ మా హనుమత్స్మరణపూర్వక ఆహ్వానము . అలాగే మీప్రాంతంలో శ్రీరామనామలేఖనము,చాలీసా పారాయణములను సంఘటితముగా నిర్వహించదలచుకున్నవారు ,సాధనాక్షేత్ర బాధ్యతలు స్వీకరించేవారు ఈ యాగమునకు కార్యకర్తలుగా తమసమ్మతిని తెలియపరచాలని మనవి. ఇకవ్యక్తిగతంగా రామనామలేఖనమును చేయదలచుకున్నవారు మీకు సమీపంలో పుస్తకాలషాపులలో లేఖనప్రతులుదొరుకుతాయి కనుక తెచ్చుకుని ప్రారంభించగలరు. మీమీ ఇచ్చానుసారంగా మీరుకూడా ఈ లోకకళ్యాణకారకమగు  శ్రీ రామకార్యంలోను,హనుమద్రక్షాయాగం లోనూ పాల్గొని మీసేవలను అందించవలసినదిగా మనవి

                                                                                                                     ఇట్లు  
                                                                                                       భక్తజనపాదదాసుడు
                                                                                                            దుర్గేశ్వర
   మీరు సంప్రదించవలసిన చిరునామా  durgeswara@gmail.com      9948235641

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP