రమణులతో స్మరణీయలు!
>> Tuesday, July 10, 2012
భగవాన్ శ్రీరమణ మహర్షిని దర్శించిన తొలి పాశ్చాత్యుడు హంఫ్రీస్.
వృత్తిపరంగా పోలీసుశాఖలో ఉద్యోగమైనా ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మిక
చింతనాసక్తుడు. ప్రణవానందులు, గణపతిముని వంటి వారితో సిద్ధుల గురించి
తీవ్రంగా విచారించే అలవాటున్న హంఫ్రీస్ నిజానికి అప్పటికే కొన్ని సిద్ధులను
కైవసం చేసుకున్నవాడే. దూరదర్శనం, దూరశ్రవణం, అతీంద్రియభావనల వంటి కొన్ని
సిద్ధులున్నందు వలన రమణులను కలవటానికి ముందే అరుణాచలాన్ని, అందున్న ఒక
గుహను, ఆ గుహముందున్న ఒక కౌపీనధారిని తాను ఆంతరంగికంగా దర్శించి,
బొమ్మగీసిన సిద్ధుడు హంఫ్రీస్.
తదనంతర కాలంలో గణపతిముని వంటి వారితో కలిసి రమణులను దర్శించుకున్నప్పుడు, భగవాన్ కళ్ళలో తన చూపును నిలిపి దివ్యానందాన్ని అనుభవించిన భాగ్యశాలి అతడు. రమణదేహం ఒక దివ్యప్రాంగణంగా, కరుణాలయంగా, రమణులు సాక్షాత్ పరమేశ్వరులే అనే నిశ్చితభావనలో తొలినాడే నిలిచిన నైష్ఠికుడు. రమణుల దివ్యత్వాన్ని పశ్చిమదేశాలలో ప్రకటించిన హంఫ్రీస్, రమణానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాడు. అలాగే తనకున్న అనేక ఆధ్యాత్మికపరమైన సందేహాలకు సమాధానం దొరికించుకోవాలనీ, దానికి సరైన దేశం భారతదేశమేనని భావించి, మనదేశంలో ఉన్న సిద్ధులను, యోగులను, ఆసేతుశీతాచలం దర్శించి, చివరకు కంచి మహాస్వామి సూచనతో రమణులను దర్శించుకున్న మరొక మరపురాని వ్యక్తి పాల్‌బ్రంటన్!
తొలిదర్శనం-దివ్యానుభవం... ప్రథమదర్శనమే ఆయనకొక దివ్యానుభూతిని, పరమశాంతిని, అవ్యాజ ఆనందాన్ని కలిగించింది. ఒకవైపు బ్రంటన్ మనస్సు నిండా సంశయాలు, వేల వేల ప్రశ్నలు, ఆతృతలు, ఎడతెగని ఆలోచనలు...ఎదురుగా మూర్తీభవించిన ప్రశాంతత, నిర్లిప్తత, ఘనీభవించిన మౌనం,కదలిక మెదలిక లెరుగని శిలాసదృశ మూర్తీమంత రమణస్వరూపం, రెండు గంటల సుదీర్ఘదృశ్యమిది. రెండు గంటల తరువాత బ్రంటన్ మీద భగవాన్ ప్రసరించిన కరుణాదృక్కులతో ప్రశ్నలు మటుమాయమై, సందేహాలన్నీ సమసిపోయి, అనిర్వచనీయ అమదానందం. పరవశం బ్రంటన్ మనసును లోబరుచుకున్నాయి.
"ఆధ్యాత్మిక పురోగతి అంచనాలకు అతీతమైనదనీ, ఆధ్యాత్మ సాధనలో గురువుండాలనీ శుద్ధమనసు, తీవ్ర ఆసక్తి, కఠిన సాధన ఉన్నట్లయితే గురువనుగ్రహం లభిస్తుందనీ, ఒకసారి గురువు ఒకరిని శిష్యుడిగా స్వీకరిస్తే, చివరి వరకు జాడ మరువకుండా గమ్యస్థానం వరకు గురువే నడిపిస్తాడనీ, ధ్యానం, యోగం వంటి వాటి ద్వారా మనసును శుద్ధము, శక్తివంతము చేసుకోవాలనీ, చేస్తున్న అన్ని పనులను స్పష్టతతోనే చేయాలనీ, "నేనెవరు?'' అన్న ప్రశ్నే ఆత్మవిచారణ అనీ, అదే పరమము, చరమము అనీ, ఆ విచారణ ద్వారానే ఆత్మ సాక్షాత్కారం తథ్యమనీ, ఈ విచారణ అంతరంగికమని, అందరూ చేయదగినదనీ, విచారణ చివరలో పూర్ణ చైతన్యం విలసనం చెంది, శుద్ధజ్ఞానం సిద్ధించి, అనుభవ రససిద్ధమౌతుందనీ అదే సాధకుడు అందుకోవలసిన స్థితి అనీ'' బ్రంటన్‌కు భగవాన్ స్వయంగా బోధించారు.
"నిన్ను నీవు ఎరుగకుండా సమస్తాన్ని తెలుసుకొని ఏం లాభం? నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే అంతా తేటతెల్లమవుతుంది. ఏమని? ఉన్నదంతా ఆత్మేనని! ఈ స్థితిలో మనసు శమిస్తుంది. ఆనందం పల్లవిస్తుంది. శాంతి పరిఢవిల్లుతుంది. సర్వానందమయ భూమికలో, ప్రత్యణువు పరమాత్మగా అనుభవమౌతుంది.'' ఇంతటి దివ్యబోధను సాలోక్య, సామీప్య, సాన్నిధ్య స్థితులలో అందుకున్న అదృష్టశాలి పాల్ బ్రంటన్.
ఆయన మహాపరిసత్యం... రమణుల బోధించిన జ్ఞానమార్గాన్ని, కర్మనిష్ఠగా సాగే కర్మయోగాన్ని, దయ, జాలి, సానుభూతి, కరుణ, ప్రేమ, సమత, మమత, నవత, దివ్యత, మానవతల కలబోతగా సాగే భక్తియోగాన్ని సరైన దృక్పథంతో సమన్వయం చేసుకొని ఆథ్యాత్మ సాధనను సాగించిన మరొక మహోన్నత వ్యక్తి ఆర్థర్ ఆస్‌బరన్. సమస్త మతాలకు మార్గాలకు మూలమైన మహాపరిసత్యమే రమణ బోధగా విశ్వవ్యాప్తం చేసిన ఆస్‌బరన్ ధన్యుడు. అరుణాచలానికి భగవాన్ రమణులకు తేడా ఏమీలేదని, సాధు ప్రవృత్తితో భారతీయ సంస్కృతిని, సదాచారాన్ని, సాంప్రదాయాన్ని, త్రికరణ శుద్ధిగా నమ్మి, ఆచరించిన మరొక విశిష్ఠ వ్యక్తి చాడ్విక్. "వారు ఇక్కడి వారే. ఒక జన్మలో పాశ్చాత్య దేశాల పట్ల కలిగిన తీవ్రకాంక్షే, వారు ఇంగ్లండు దేశంలో జన్మ ఎత్తటానికి కారణమైంది.
మళ్లీ వారు ఇప్పుడు తమ స్వస్థానం చేరుకున్నారు'' అని భగవాన్ చాడ్విక్ గురించి చేసిన ఒక వ్యాఖ్య ఒక అద్భుతం. స్వీయసాధనతో భగవాన్ పట్ల ఉన్న భక్తితో శరణాగతితో 'సాధు అరుణాచల'గా సుప్రసిద్ధయైన చాడ్విక్ మరొక స్మరణీయ వరణీయుడు. ఇరాక్ దేశస్థుడైన కోహెన్, జర్మన్ రచయిత్రి లూసీ కార్నెల్సన్ వంటి వారెందరో పాశ్చాత్యులు, తత్వవేత్తలు, జిజ్ఞాసువులు, భగవాన్ ఆవర ణంలో ప్రవేశించి, భగవాన్ మౌనాన్ని, బోధను, ఆత్మనిష్ఠను, ప్రాపంచిక కార్యకలాపాలను, కరుణను, జీవకారుణ్యాన్ని సమతా దృష్టిని, నిర్మోహ నిశ్చలత్వాన్ని మానవతా పరిమళాన్ని స్వయంగా అనుభవించి తామెత్తిన జన్మలను ధన్యం చేసుకున్న నిత్యస్మరణీయులు. ఆకాశం వర్షిస్తున్నప్పుడు మామిడి చెట్టు మీద, వేప చెట్టు మీద భేదభావం లేకుండా ఏ విధంగా వర్షిస్తుందో, రమణుల అనుగ్రహమూ అంతే. పరమాత్మ సాకార స్వరూపమే రమణులు!
- వి.యస్.ఆర్.మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

0 వ్యాఖ్యలు:
Post a Comment