31 న జరగనున్న శనిత్రయోదశికి జరిగే శాంతిపూజలకు గోత్రనామాలు పంపి పాల్గొనండి
>> Tuesday, October 27, 2009
శనిత్రయోదశి పర్వదినము ఈనెల 31 న వస్తున్నది. ఈరోజు శనిగ్రహ ప్రతికూల ప్రభావాలతో ఇబ్బంది పడేవారు ,శనీశ్వరునకు ప్రత్యేక పూజలు జరుపుతారు. నువ్వుల నూనెతో అభిషేకం జరపటం ,అర్చనలు చేయటం ద్వారా శనీశ్వరుని అనుగ్రహాన్ని పొంది .ఆయన అనుగ్రహంతో బాధలనుండి ,దోషాలనుండి విముక్తులవుతారు. ఈ పర్వదినాలలో శ్రీ పీఠం భక్తులకొరకు వారిగోత్రనామాలతో నవగ్రహమండపం లో నవగ్రహశాంతి పూజలు,ప్రత్యేకంగా శనీశ్వరునకు శాంతిపూజలు జరుపటం విదితమే .
ఇది కార్తీకమాసము .ఇంకా విశేషము ,అందులో కోటిపంచాక్షరీ జప యాగము కూడా జరుగుతున్నది .ఆరోజు పీఠములో ప్రతిష్టితులై వున్న రామలింగేశ్వర స్వామి వారికి రుద్రసూక్త ప్రకారం అభిషేకములు అర్చనలు జరుగుతాయి.
గోత్రనామాలతో పూజ జరిపించుకోదలచిన వారు మెయిల్ లేదా ఫోన్ ద్వారా తమ గోత్రనామాలను పంపవచ్చు.
ఆరోజు సూర్యోదయత్పూర్వమే లేచి తలారా స్నానం చేసి ,నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇష్టదేవతారాధన చేయాలి. ఓమ్ నమ:శివాయ నే మతాన్ని పూజానంతరం జపించాలి. దగ్గరలో నవగ్రహదేవాలయం వుంటే వెళ్ళి ప్రదక్షిణలు చేయవచ్చు. అవకాశం లేనివారు ఈక్రింది శ్లోకంతో శనీశ్వరునిధ్యానించాలి.
{నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం } అని ధ్యానించాలి
తదనంతరం కాళ్ళూచేతులు శుభ్రపరచుకుని మరలా దేవతాదర్శనం చేయాలి . ఆరోజు నువ్వు;లనూనె ,ఉప్పు ,ఇనుము వంటి పదార్ధాలను ఎవరినుంచి స్వీకరించవద్దు. కుంటివారికి వికలాంగులకు భోజనం పెట్టండి . ఆరొజు ఎక్కువగా పంచాక్షరీ జపం చేయండి .
గోత్రనామాలను పంపవలసిన చిరునామా
durgeswara@gmail.com
cell 9948235641
0 వ్యాఖ్యలు:
Post a Comment