>> Saturday, November 15, 2008
ఏవిషయములోనయినా కొందరికి మంచికనపడితే మరికొందరికి చెడుమాత్రమే గోచరిస్తుంది .కారణము వారివారి మనోభావాలస్తాయినిబట్టి
వారి ఆలోచనలు సాగుతుండటమేమో. అదివ్యక్తిగతమయిన విషయమయినా గాని,సామాజిక విషయమైనాగాని దానిపై వారుస్పందించిన పద్దతి మాత్రం ఎక్కడయినా ఒకేరకంగావుంటుంది. వారి వారి మనసులోపల పొరలలో దాగున్న భావాలు అలాగే బయటకు పొంగిపొర్లుతాయి. కారణమేమిటొ మహాభారతంపరముగా చెప్పబడుతున్న ఈచిన్నకథ తెలియజేస్తుంది.
ఒకసారి ద్రోణాచార్యులవారికి తమశిష్యుల మానసికస్థితిని పరీక్షించాలని అనిపించింది. అందుకని ఆయన ముందుగా ధన్మరాజును,దుర్యోధనుని పిలిచి వారికిలాచెప్పాడు.నాయనా మీరిరువురూ రేపు పొద్దుటనే లేచి హస్తినాపురమంతా తిరిగి వెయ్యిమందిని
పరిశీలించి వారిలో వున్న సుగుణాలను దుర్గుణాలను గమనించి మీరుపరిశీలించిన వారిలో ఏగుణాలు వున్నవాల్లు ఎక్కువమంది వున్నారో గణాంకవివరాలుగా ఇవ్వాలి అని ఆజ్ఞాపించారు.
శిష్యులిరువురూ పొద్దుటే బయలుదేరి పట్టణమంతా తిరుగుతూ పరిశీలనసాగించారు. సాయంత్రానికి అలసిసొలసి పని పూర్తిచేసుకుని వచ్చారు. రాగానే ఆయన ఏమిటి మీపరిశీలనలు. చెప్పండి అన్నరు.వెంటనే దుర్యోధనుడువిసుగ్గా ఏమిలోకం గురువుగారూ ఒక్కడంటే ఒక్కడుకూడా మంచిబుద్ధి వున్నవాడు కనపడ లేదు. ప్రతివాడూ దుర్మార్గపువెధవల్లావున్నారు. అని తనుపరిశీలించినవారిలో తను గమనించిన దుర్లక్షణాలన్నీ ఏకరువుపెట్టడం మొదలుపెట్టాడు.
దర్మరాజు మాత్రం గురుదేవా నేను పరిశీలించినవారిలో ఎవరూ ఎవరూ చెడ్ద గుణాలున్నవారు కనపడలేదు గురుదేవా . ప్రతివారు ఏదో ఒకసుగుణముతో శోభిస్తున్నారు. అంటూ తనపరిశీలనలో గమనించినవారిలోనున్న సుగుణాలను వెల్లడించటం మొదలుపెట్టాడు.
ఇక్కడ ఒకేగురువుదగ్గర ఒకేరకమయిన విద్యనభ్యసిస్తున్న ఇరువురిమధ్య మానసికంగా ఇంతతేడా ఎందుకున్నది. అది వారిసంస్కారబలాన్ని,మనసులో తిష్టవేసుకున్న అరిషడ్వర్గాలలోని బలమయిన గుణముయొక్క ప్రభావమువలన. అందువలననే మనం ఏవిశయాన్ని గురించయినా ఆలోచించేటప్పుడు ఆసత్యం యొక్క నిజస్వరూపము కన్నా,మనమనసుయొక్క భావనబలమే దానిగురించి తీర్పునిచ్చేస్తుంది.
రామాయణముగురించి వ్యాఖ్యానించమంటే రామునిలోని సుగుణాలు ,అన్నదమ్ముల మధ్యప్రేమలు, మర్యాదాపురుషోత్తముడయిన ఆయన గుణగణాలు గుర్తుకువస్తే ,మరికొందరికి రామాయణములో రావణాసురుని లోవున్న గుణాలన్ని సుగుణాలుగా రామునిలో ఏమి లోపాలు ఆపాదించి ఆనందిద్దామాఅని ఆలోచనలు సాగుతుంటాయి .
తమసోమా జ్యోతిర్గమయ .
కలిమాయ ఇది.తనయుగంలో తనప్రభావంతో మానవులను ,వారిభావాలను చేడువైపునకే మల్లిస్తానని ఆయనచేసిన ప్రతిజ్ఞ్జ కొనసాగుతున్నది. నాది ఆరోపణకాదు. ఆలోచనమాత్రమే. మధించిచూడండి మేధస్సులను. అందులో హాలాహలం తరువాత తప్పనిసరిగా అమృతం పుడుతుంది .
2 వ్యాఖ్యలు:
మీరు చెప్పింది నిజం.
Baagaa umdi.. Vasilisuresh teluguneastamaa..
Post a Comment