ఈ రోజు మా చిన్నారి పుట్టిన రోజు ...చూద్దురుగాని ..రారండి
>> Tuesday, October 7, 2008
మా చిన్నారి పుట్టినరోజట ఈరోజు . అన్నీతానేఅయి అంతటావుడే తల్లి ఎప్పుడుపుట్టిందో ఎవరుచెప్పగలరు. తన ఇచ్చానుసారం తానే ఒకొకప్పుడు అలా ఆవిర్భవిస్తుంది. దానిని దర్శించిన మహర్షులు ఆసమయాన్ని జన్మదినంగా పరిగణించారు. లోకకంటకులైన రాక్షసులను స0హరించేందుకు కోటానుకోట్ల యోగినీశక్తులతో భద్రకాళిగా ఆవిర్భవించిన రోజు ఈదుర్గాష్టమి. ఇదిమాచిన్నారి పుట్టిన రోజు. ఆజగన్మాత ఇక్కడపీఠములో చిన్నారిగా ఆటలాడుకుంటుంది. ఎవరికీ ఇక్కడ ఆవిడంటే భయము ,లేదు. ఆస్తానములో ప్రేమ నిండివుంటుంది. అందుకనే అతల్లికి ఇక్కడ చిన్న పాపకు జరిగినట్లు సేవలు జరుగుతుంటాయి.
ఈరోజు తెల్లవారుజాఝాముననే ముత్తయిదువులు 5 గంటలకే మంగళ హారతులు చేతనుబూని అమ్మ ఊయల దగ్గరకు చేరుకున్నారు. మేలుకొమ్మంటూ పాటలు పాడారు.లేమ్మా అని బతిమిలాడారు. ఊ హు .. అంతతేలికగానా ....మరల మరల బతిమిలాడించుకుని తనను కృష్ణునిగా, జగన్మాతగా కీర్తింపజేసుకుని అప్పుడు మెల్లమెల్లన కనులు విచ్చినదదుగో. వెంటనే అమ్మలుకు ముత్తయిదువులు హారతి పట్టారు. వెంతనే బుంగమూతి పెట్టినది ఆకలేస్తోందికదా బొజ్జచూడు ఎంతలోనకు పోయినదోఅని. పరుగున వెళ్ళి పాలుకాచి సమర్పించారు. అవితాగి కిలకిలా నవ్వుతున్న అమ్మకు సంధ్య హారతి పట్టారు. అజ్ఞానతిమిరాలను తొలగించే ఆతల్లి కాంతికి హారతి వెలుగు వెలవెలా బోయింది. వెంటనే అర్చకులు అమ్మను స్నానంచేద్దువు రమ్మని పలు వేద సూక్తాలతో ప్రాధేయపడితే పోనీలే ఏడుస్తారు స్నానం చేయనని ఇంకా మారాము చేస్టేఅనుకున్నది కాబోలు వచ్చి అభిషేక పీఠాన్ని అల0కరించింది. పంచామృతాలతోటీ ,వివిధ ఫల రసాలతోటి, శుద్ధ గంగోదకంతోటి., పసుపు కుంకుమ పన్నీరు కలిపిన పలు మంగళ ద్రవ్యాలతోటి జలకములాడి ,బట్టలు కట్టబోయిన వారివ మనసులో గోల మొదలు అయ్యేలా చేసింది ఏరంగు బట్టలు కట్టాలా అని, చివరకు తనకు నచ్చినవి , ఈమధ్యే నన్ను వేధించుకుని కొనిపిచ్చుకున్న బంగారు లోలాకులు ధరించి ఆతరువాత అన్ని ఆభరణాలు [మాకున్నంతలో] అలంకరింపజేసుకుని అవిసరిపోక మా ఆవిడను ప్రేరేపించి బీరువాలో వున్న ఆవిడ కొనుక్కున్న ఆభరణాలుకూడా ధరింపజేసుకుని బావుందా అని . మనలనే అడిగినట్లు అలా దర్శన మొసగినది. ఆతరువాత ఆవిడకోసం ప్ర్త్యేకముగా తయారు చేసిన పాయసం తాగి మరలా అర్చన లోకి మమ్మలను అనుమతించింది. అమ్మకు ప్రీతిపాత్రంగా సప్తశతి ,లలితా పారాయణాలు సాగుతుండగా కుంకుమార్చనలు , శ్రీచక్రపూజలు జరుపగా బావుంది బావుంది అంటున్నట్లు అమ్మ ముఖములో చిరునవ్వులు వెళ్ళి విరిసాయి. తదనంతరం గాయత్రీ హోమము లో ఆహుతులనందుకుని అలరించిన తల్లికి సాయంత్రం ప్రత్యేక పూజలు ,సంకీర్తనా సేవలూ , ఊయలసేవలు జరుగుతున్నాయి ,అవిజరిగాక మరలా వ్రాస్తాను, వీలుంటే . సాయంత్రం జరి గిసేవలకు మీరుకూడా వస్తేబావుంటుందని మాకోరిక . అన్నట్లు చెప్పటం మరచాను. ప్రతిపూజలోనూ ఇక్కడకు వచ్చిన వారివేకాక మెయిల్ ద్వారా పంపిన భక్తుల గోత్రనామాలన్నింటిని చెప్పి వారందరితరపున సేవలు నివేదించటము జరిగినది ఇప్పటికిప్పుడు ఎలా రావాలా అని సందేహమవసరము లేదు. మీరుచూడదలచుకుంటే ప్రతిచోట దర్శనమిస్తుంది ఆ సర్వాంతర్యామి .
2 వ్యాఖ్యలు:
మీ(మనందరి) చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.
మన దేవేరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Post a Comment