రామాయణ కథ జరగటానికి కారకులెవరో మీఅభిప్రాయం తెలపండి
>> Saturday, November 1, 2008
రామాయణం మొత్తము ఇద్దరి వలన జరిగినది అంటారు. రామాయణ మహా గ్రంథాన్ని పరిశీలించినవారికి వారి ఆలోచనలను మధించి చూస్తే పలు విలువలు గోచరిస్తాయి. అలాగే రామాయణ కథ జరగటానికి కారణం పలువురు పెద్దలు పలుకారణాలు చెబుతారు. ఒక్కొక్కరు ఒకొకరు కారణమని చెబుతారు.మీరభిప్రాయములో రామాయన గాధకు కారకులెవరనుకుంటున్నారో వివరించవలసినదిగా మనవి.
7 వ్యాఖ్యలు:
నాకు మటుకు రామావతారానికి రెండు ముఖ్య వుద్దేశ్యాలు కనపడతాయి. ఒకటి ఆదర్శ మానవుడి వుదాహరణ - రెండు దుష్ట శిక్షణ. ఆదర్శ మానవుడి గొప్పతనాలన్ని కొన్ని కష్టాల వల్లే బయటపడతాయి (భార్యా వియోగంలోనే ఏకపత్నీ వ్రతం గొప్పతనం తెలుస్తుంది). అలాంటి రామ కష్టాలకు కారణమైన కైకేయి ఒక ముఖ్య పాత్ర కాగా, అంతటి ఆదర్శ పురుషుడికి (దుష్ట శిక్షణ కోసం) శత్రువుని ఏర్పరచిన శూర్పణక రెండొవ ముఖ్య పాత్ర అని అనిపిస్తోంది నాకు. మిగిలిన పాత్రలన్నీ కధా గమనానికి తోడ్పడితే ఈ రెండు పాత్రలు కధా గమనాన్నే నిర్దేశించిన మలుపులకు కారణాలు.
మంచి విషయాన్ని కదిలించి ఆలోచింపజేసారు. వీలైతే ఈ విషయంపై ఒక టపా రాయాలి..
అరిపిరాల
జయవిజయులు :-)
రామాయణం జరగడాని కి కారణం వాల్మికి,
ఎందుకు అనగా,
ఇది ఒక్క కల్పిత గాధ కాబటి.
రామయణం రాముడు ,సిత, అంతా కల్పితం.
chaalaa bagundi . manchiga vrasaru
inkevaru... ramude
రామాయణపాత్రలపైన నాబ్లాగులో జరుగుతున్న చర్చలలో నాఅభిప్రాయమిది. నా కైతే రామాయణము జరగటానికి ఇద్దరు కారణమనిపిస్తున్నది. వాల్లు కనపడేది. రామాయణములో స్వల్పసమయమైనా చేసినది మాత్రం కొంపలు కూల్చే పెద్దపని. వాళ్ళు .1. మంధర, 2. శూర్పణఖ.
మంధర దాసి. తన పని తన యజమానైన కైకేయి క్షేమం చూడటము. పుట్టినింటినుంచివచ్చినది కనుక అమెపైన కైకేయికి చాలా ప్రేమ .కనుకనే ఇతరులకు ఇవ్వనంత ప్రాధాన్యతనిచ్చేది. ఆమె సలహాలను తీసుకునేది. కానీ అసూయా గ్రస్తమయిన హృదయాలు గలవాళ్ళు తాము మనశ్శాంతిగా వుండలేరు. ఇతరులు ప్రశాఁతముగా వుంటే తట్టుకోలేరు. వాళ్ల దుర్బుద్దిని ఇతరులకు కూడా అంటించి కొంపలు కూలి వాళ్ళేడుస్తుంటే ఆనందిస్తారు. వేరుపురుగు చేరి వృక్షంబుచెరచు అన్నట్లు... మంధర తానాశ్రయించిన కైకేయికి రాముని మీదున్న ప్రేమను విరచి ,ఆమె మనసులో స్వార్ధాన్ని రేకెత్తించింది. యుక్తాయుక్తాలు మరచిపోయేంతటి స్తాయిలో . దాని పరిణామముగా కైకేయి తన సౌభాగ్యాన్ని కోల్పోయి, అందరిచేత చీత్కరించబడి, చరిత్రలో మాయన మచ్చని తెచ్చుకున్నది. చివరకు కొడుకుచేతకూడా ఛీ కొట్టించుకోవలసి వచ్చినది. మంధర అసూయ రాముని అడవులకు పంపి రామాయణానికి ఒక కారణమయినది. ఇటువంటి స్త్రీలు మనచుట్టూవుంటారు. అత్తా కోడల్లు అన్యోన్యంగా వున్నా తట్టుకోలేరు, వాళ్ళుచాలు విబేధాలు సృష్టించి కాపురాలలో చిచ్చుపెట్టడానికి
ఇక రెండవ పాత్ర శూర్పణఖ. తాను విపరీత కామాంధురాలు. తనకు నచ్చినది తనకు దక్కాలనుకునే మనస్తత్వం. అందుకోసం ధర్మాధర్మాలను లెక్కచేయదు. రాముడు భార్యతోవున్నవాడు,అయినా తనకు దక్కాలి. రాముడు లౌక్యంగా లక్ష్మణుని చూపిస్తే ,అప్పుడన్నా గ్రహించక అతడయినా అందంగా వున్నాడుకనుక తన కామార్తిని తీర్చుకోవాలని అతనిని చేరటానికైనా సిద్ధపడుతుంది. వారిచేత అవమానించబడి. ప్రతీకారేచ్చతో తన అన్నవద్దకు పోయి పగరగిలిస్తుంది అదీ ఎలా? నిజాన్ని కప్పిపెట్టి. అన్నా! రాముని భార్య చలా అందగత్తె .దానిని నీకోసం తీసుకు రావాలని ప్రయత్నిస్తే నన్నిలా అవమానించారని అబద్దంతో అతన్ని రెచ్చగొడుతుంది. మనచుట్టూవున్న వాళ్ల్లో ఇటువంటివాళ్ళనుంచి జాగ్రత్తగా వుండకపోతే సర్వనాశనానికి సిద్దపడ్డట్ళే . తనసుఖంకోసం ,అసూయా గ్రస్తమయిన మనసుతో ఇటువంటివాళ్ళు ఎన్ని కాపురాలను కూలుస్తున్నారో ప్రతివారికి ఉదాహరణలు కనిపిస్తూనేవుంటాయి గమనిస్తే. ఇటువంటివారు దేనికైనా తెగిస్తారు.
ఈ ఇద్దరి పాత్రలు చాలా చిన్నవయినా వారి మనస్తత్వాలు ఎంతప్రమాదకరమో తెలుసుకోక కైకేయి రావణాసురులవలె, చెప్పుడుమాటలు వినే అలవాటువుంటే రామాయణ యుద్ధాలు మనయిల్లలోకూడా ప్రారంభమవుతాయి తస్మాత్ జాగ్రత్... అంటున్నారు వాల్మీకి మహర్షి.
Post a Comment