మాస్టర్ ఇ.కె. మధుర వాక్కులు
>> Thursday, April 15, 2010
రోజులు బాగుండలేదు అంటారు. కాలం మారిపోయింది అంటారు. ఇవి ఇదివరకటి రోజులు కావు అంటారు. కొంచెం నిదానించి చూడండి. మారింది ఎవరు ? రోజులా , మనమా ? .రోజులన్నీ అలానే అన్ని గంటలే గడుస్తున్నాయి. మన మనస్తత్వాల్లోనే మార్పు వస్తున్నది. కాలాన్ని నిందించటం బాగున్నదా ? . మార్పులు వస్తున్నాయి ,ఆహ్వానించు. ఆమార్పులలో మంచివాటిని స్వీకరించు . గతమన్నది గౌరవించు .ఆ గతమందించిన మంచి విషయాలను జారవిడుచుకోకు.లోకం పోకడబట్టి మనమూ పోవాలిగదా ! అని నీవనవచ్చు. మన పోకడే సరైదని ఋజువైతే లోకమే మనవెంట వస్తుంది.
ఎవరికైనా మంత్ర ముపదేశిస్తే " ఎన్ని రోజులు చేయాలండీ "[అంటే ఎప్పుడు మానేయాలండీ] అని అడుగుతారు .ప్రేయరు చేసుకోరా నాయనా అంటే "ఎన్నో సంవత్సరాలనుండి చేస్తున్నాను [ఇకనేనుచేయకపోయినా పరవాలేదు]అని అంటారు.................................................................................
1 వ్యాఖ్యలు:
మాస్టర్ ఈ.కే ఏది చెప్పినా మొహం పగలగొట్టినట్లు చెప్పేస్తారు. ఆత్మ ,పరమాత్మ, సత్తు చిత్తు అంటూ సామాన్య జనాన్ని తికమక పెట్టే పడికట్టు మాటలు వాడకుండా ఏదైనా సరే విషయం సూటిగా మనసుకు అందేలా చెప్తారు.
మీరు కోట్ చేసిన ఈ వాక్యాలు "ఇష్టా గోష్టి" పుస్తకంలోవి అనుకుంటున్నాను. అందులో చాలా అద్బుతమైన వ్యాసాలున్నాయి.
Post a Comment