హనుమత్ రక్షాయాగం [రెండవ ఆవృతి] మొదలవనుంది .మీగోత్రనామాలుపంపి పాల్గొనండి
>> Wednesday, April 14, 2010
హనుమత్ రక్షాయాగం 2010 {ఆథ్యాత్మిక ప్రయోగం}
ది .28-4-2010 నుండి 7-6-2010 వరకు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో నిర్వహించబడుతున్నది.
ఎలా పాల్గొనాలి. ?
----------------
*ముందుగా మీగోత్రనామాలను పీఠానికి పంపించాలి .
*మీరు 7-6-2010 [హనుమజ్జయంతి] నాటికి 40 [వీలుకుదరనివారు] 21 రోజులు సాధన జరిగేలా చూసుకోవాలి.
స్త్రీలు {తమకు ఇబ్బందైన} ఐదు రోజులు వదలి కూడా నలభైరోజులు సాధనచేయాలి.
*మీరుగోత్రనామాలు తెలుపగనే మీ పేరున ఒక కొబ్బరికాయను పీఠంలో ముడుపుకట్టటం జరుగుతుంది
దానిని పూర్ణాహుతి సమయంలో సమర్పించటం జరుగుతుంది{ ఇందుకయ్యే సుమారు ఇరవైరూపాయలుఖర్చు మీస్వంతంగానే వెచ్చించాలి]
*ఇక మీరు మంచి రోజు చూసుకుని మీరు ఎందుకు ఈపారాయణం చేయాలనుకుంటున్నారో స్వామిచిత్రపటం ముందుకూర్చుని సంకల్పంగా చెప్పుకోవాలి.
*ఉదయాన్నే స్వామికి స్వల్పంగానైనా పూజ ,ఒక పండు నివేదించాలి.
*ఆలయం లోకాని ,వీలుగానివాళ్ళు,ఇంట్లో నే తులసికోటలోనో లేక శుద్ధిపరచిన ఆసనం మీదనో స్వామి వారి చిత్రాన్నుంచి మీసంకల్పానుసారంగా 21,54,108 ఇలా ప్రదక్షినలుచేయాలి. అయితే మొదలుపెట్టిన రోజు నుండి చివరవరకు ఒకే సంఖ్యలో చేయాలి.
*హనుమాన్ చాలీసా రోజుకు 11 సార్లు పారాయణం చేయాలి. ఉదయం అల్పాహారానికి ముందుగానే.
*మీ ఇష్ట కార్యం సిద్దించుటకుగాను క్రింద ఇస్తున్న సంపుటీకరణ మంత్రాలలో మీకు సంకల్పానికి సంబంధించిన మంత్రాన్ని ఎన్నుకుని దానిని అన్ని వేళలా అంటే ప్రయాణం లోను ,మీస్వంత పనులు చూసుకుంటూ కూడా ఎక్కువసార్లు జపిస్తుండాలి.
*ఇక మద్యం మాంసం ఈసాధనాకాలంలో నిషేధం .అధర్మప్రవర్తన మీ సాధనకు ఆటంకం.
[బ్రహ్మచర్యం ,నేలపడక,ఆహారనియమం సమస్యతీవ్రతను బట్టి మీరు నిర్ణయించు కోవలసినది]. మన నియమాలు మనసాధనను తీవ్రం చేసి ఫలితాలు శీఘ్రంగావచ్చేట్లు సహాయపడతాయి.
*ప్రతిశనివారం దగ్గరలోగల ఆంజనేయస్వామి మూర్తిని దర్శించి నమస్కరించుకోండి.
*వీలైనవారు స్వామి కి ఆకుపూజ జరపండి.
*ఈకాలంలో అనవసరంగా వివాదాలు ఆవేశాలు తగవు.ఆవేశపడి మీరు ఇతరులని నిందించటం వలన మీ సాధనాశక్తి తరగిపోతుందికనుక సంయమనం వహించి మౌనంగా అక్కడ నుండి వైదొలగండి .
సంపుటీకరణ మంత్రములు .
------------------------
శ్రీరామ
శ్రీమహాగణపతయేనమ: శ్రీ సరస్వత్యై నమ: శ్రీ గురుభ్యోన్నమ:
భక్తితో 41 రోజులపాటు చాలీసా రోజుకు 11సార్లు పఠిస్తూ మీ కార్యసిద్దికవసరమైన ఈక్రింది దోహాను పదేపదే స్మరించుట ద్వారా మీ అభీష్టం శీఘ్రంగా సాధించుకోగలుగుతారు .ఇది సిద్ధయోగం.
గుర్వనుగ్రహప్రాప్తికి // జైజైజై హనుమాన గోసాయి / కృపాకరో గురుదేవకినాయి //
విద్యా,బుద్ధిశక్తికి // బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవనకుమార్//
// బలబుద్ధి విద్యాదేహు మొహి హరహుకలేశవికార్//
రామ దర్శనమునకు // రామ దుఆరే తుమ రఖవారే /హో తవ ఆజ్ఞ బినుపైఠారే //
ఉద్యోగము,[పదవి] ప్రాప్తికి : // తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా / రామమిలాయ రాజ పదదీన్హా /
/ //తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వరభయె సబజగజానా //
వ్యాధి నివారణకు : // నాసైరోగ హరై సబపీరా // జపత నిరంతర హనుమత వీరా //
[ సంజీవ పర్వతోద్దారక _మనోదు:ఖనివారయ ,ప్రసీదమహాబాహో త్రాయస్వ హరిసత్తమ]
విష దోషనివారణకు : // లాయ సంజీవన లఖన జియాయే /శ్రీ రఘువీర హరఖి ఉరలాయే//
కష్ట సాధ్యమైన కార్యసాధనకు // దుర్గమ కాజ జగతకేజేతే /సుగమ అనుగ్రహ తుమహరె తేతే //
[ అసాధ్య సాధక స్వామిన్ .అసాధ్యం తవకింవద .రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో]
సంకటముల నివారణకు // సంకట హటై మిటై సబపీరా / జపత నిరంతర హనుమత వీరా //
లక్ష్మీఅనుగ్రహమునకు // అష్ట సిద్ధి నవనిధికేదాత / అసవర దీన్హజానకిమాతా //
సంతానప్రాప్తికి //రామదూత అతులిత బలధామా అంజనిపుత్ర పవనసుతనామా//
[ అంజనాసుత దేవేశ కేసరీ ప్రియనందన ,దేహి మే తనయం శీఘ్రం సర్వభాగ్య నిధిం ప్రభో ]
శతృబాధానివారణకు
: [మర్కటేశ మహోత్సాహ సర్వ శోక నివారణ ,శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో .]
దుష్ట గ్రహ బాధానివారణకు // భూతపిశాచ నికటనహి ఆవై ,మహావీర జబనామ సునావై //
మోక్షసాధనకు : //తుమ్హరె భజన రామ కోభావై ,జన్మ జన్మకే దు:ఖబిసరావై .//
సర్వానుగ్రహ ధ్యానం :
//బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్.//
[ఆయు: ప్రజ్ఞా యశోలక్ష్మీ: శ్రద్ధాపుత్రా: సుశీలతా .,ఆరోగ్యం దేహిసౌఖ్యం చ కపినాథ నమోస్తుతే ]
[ఒకే ఆసనంలో కూర్చుని 108 సార్లు చాలీసా పారాయణం చేయటం విశేష ఫలప్రదం]
------------------------------------------------------------------------------------
ఇలాచేసిన సాధనతో క్రితం సంవత్సరం అనేకమంది సాధకులు తమ సమస్యలను తాము పరిష్కరించుకుని స్వామి అనుగ్రహశక్తిని చవిచూశారు. ఈసాధనకు గురువు,దైవము హనుమంతులవారే.మేము కూడా మీలాగే ఆయన. పరివారం మాత్రమే . స్వామి పై నమ్మకముంచి ఆయననాశ్రయించి సాధమచేస్తే మీరు తప్పనిసరిగా మీసంకల్పాన్ని నెరవేర్చుకుంటారు .అది ఆయన శక్తి , మీభక్తి.
ఈకార్యక్రమాన్ని సామూహికంగా ఆలయా లలో గాని సాధకుల గృహాలలోగాని జరుపుకోవచ్చు. 27 మంది ఒక్కచోట కూర్చుని చేసే సాధన అద్భుతఫలితాలనిస్తుందని పెద్దలు చెబుతారు. ఆవిధంగా చేసిన ప్రదేశం లో శక్తిపాతం మహాప్రవాహంగా ఉంటుందని సిద్ధసాధకుల అనుభవం.
సంప్రదించవలసిన చోటు
durgeswara@gmail.com
cell 9948235641
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం . రవ్వవరం
3 వ్యాఖ్యలు:
మంచి మాట
నేనూ పాల్గొంటా.
చాలా సంతోషం గురువు గారూ. నేనూ పాల్గొంటా.
జై శ్రీరాం. జై హనుమాన్.
అద్భుతమండీ. నేను నిన్నటినుంచీ హనుమాన్ చాలీసా మండల దీక్ష మొదలుపెట్టాను. పాటించవలసిన నియమాలు అవీ నిర్ధారించుకోవడానికి మీకు ఒక మెయిలు పంపుదామని అనుకుంటున్నంతలోనే ఈటపా, ఆంజనేయుడే మీకు సంకల్పం కలిగింపజేసి వ్రాయించాడా అన్నట్లు. జై హనుమాన్.
Post a Comment