శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641
Showing posts with label దత్తాం భజే. Show all posts
Showing posts with label దత్తాం భజే. Show all posts

చందోలు శాస్త్రిగారి గూర్చి వారి ప్రత్యక్షశిష్యులు

>> Friday, September 5, 2014

ిశేషాలు కొన్ని మీతో పంచు కుందాము అని అనుకుంటున్నాను .వారి స్వగ్రామము చందోలు ,పొన్నూరు దగ్గర రేపల్ల దారిలో ఉన్నది . వారి గృహం లోనే వేద స్మార్త పాఠశాల స్థాపించి ఎంతో మంది విద్యార్థులను తయారుచేసి వేదాన్ని ,స్మార్త మును రక్షించారు .శ్రీ కంచి కామ కోటి చంద్రశేకరేంద్ర సరస్వతి స్వామి పరిపాలిత,శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్ర్తి స్మార్త వేద పాఠశాల . నిత్యం గోసేవ చేసే వారు ,బాల త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసన చేసేవారు . రోజు రావి చెట్టుకు ప్రదక్షిణం చేసేవారు ,దేవి శరనవరాత్రిలో అద్భుతంగా బాల పూజ చేసేవారు ,సాక్షాత్తు అమ్మవారు అక్కడ తెరిగేది అని , రాత్రి వేళలో గజ్జల చప్పుడు ,అమ్మవారి రాకపోకలు తెలిసేవి అని స్వయానా మామ్మ గారు ( లక్ష్మి ధర సోమయాజులు గారి అమ్మ ) చెప్పేవాళ్ళు మాకు . వారికీ సంతానం లేదు తమ్ముడి కొడుకు ను దత్తత తేసుకున్నారు ఆయనే లక్ష్మి ధర సోమయాజులు గారు ప్రస్తుతం పాఠశాల వారె నడుపు తున్నారు . మేము చదువుకునే రోజుల్లో (1999 ) చాలామంది i.a.s , i.p.s . లు తాత గారి మందిరానికి వచ్చి దరిశనం చేసుకొనే వారు ,వాళ్ళు తాత గారి గొప్పతనం వారి అనుగ్రహం ,ఆగ్రహాలను ,వారి శిష్యరికం లో ఎన్నో విషయాలను విద్యార్ధులం ఆయన మాతో పంచుకునేవారు . దసరాలలో తాత గారు భోజనం చేస్తూ పక్కనే ఇంకో విస్తరి వేయించి వద్దిన్చమనేవారు ,ఎందుకు అని మామ్మ గారు అడిగితె " బాల నా విస్తరిలో పదార్ధాలు లాగేస్తోంది అమ్మ అనేవాల్లుట " అంటే అమ్మవారు చిన్న పిల్ల లాగా వారితో ఆదుకొనేది ఎప్పుడు అయన లోనే అయన తోనే వుండేది . వారి చేతి తీర్ధం తో ఎన్నో రోగాలు ,దాదాపు మృత్యువుతో పోరాదేవాళ్ళు కూడా మళ్లి బతికి చక్కగా వున్నారు అని చెప్పేవాళ్ళు అంటే కాదు అలాంటి వాళ్ళను మేము చూసాం కూడా . ఒక సారి పొలం లో దొంగలు పడి ధాన్యం ఎత్తుక పోతుంటే , ఇంటి దెగ్గర నుండి దిక్భంధనం చేసారు , అంటే వీరు పొలానికి వెళ్ళు వరకు వాళ్ళు అల తిరుగుతూనే వుండిపోయారు అని చెప్పారు .చందోలు గ్రామం లో 90 % ప్రజలు మహమ్మ దీయులు కానీ అయన ఊరిలోకి వస్తే ప్రతి ఒక్కరు నిలబడి జాతి మత భేదం లేకుండా నమస్కరించే వారు ,అంటే కాదు వారు కాలం చేసినప్పుడు వారంతా కూడా వచ్చి కంటతడి పెట్టి కన్నీరు మున్నిరుగా ఎడిచారట .ఈ రోజుకు ఆ ఊరిలో మేము ( అనగా పాఠశాల విద్యార్ధులం ) వెళితే వారి శిష్యులు అని అందరు గౌరవిస్తారు .అంతటి గొప్పవారు తాత గారు . తాత గారు ఆ రోజులలో పొలం లో చాల పెద్ద పడగలు కలిగిన కాల సర్పాన్ని తన మంత్ర బలం చేత అదుపు చేసారు అందుకని అది చాల పాప మని కానీ తప్పక చేసారని చెప్పి పాఠశాల లో మందిరం వెనకాల రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పతిష్ట చేసారు అది ఇప్పటికి అక్కడ చూడ వచ్చు .ఇంకా చాల విశేషాలు వున్నాయ్ ,ఎప్పుడయన అటుగా తెనాలి ,రేపల్ల ,పొన్నూరు వెళితే తప్పక చూసిరండి .అలాంటి వారి పాఠశాల లో చదువు కొనటం ,వారు తపస్సు చేసిన ,నివసించిన ,ప్రదేశంలో ఉండటం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తూ సెలవు . మంగళం మహాత్ .

ఫ్రమ్  ఫేస్ బుక్

Read more...

జన్మరహస్యం

>> Tuesday, August 6, 2013


ధృతరాష్ట్రుని మనసు మార్చి పాండవులకివ్వవలసిన రాజ్యభాగమిప్పించి యుద్ధాన్ని నివారించటానికి విదురుడు ఎన్నెన్నో మంచి విషయాలు ధృతరాష్ట్రునకు చెప్పాడు. ఇంకా ఇంకా వినాలనుంది అన్నాడు ధృతరాష్ట్రుడు. నేను చెప్పగలిగినదంతా చెప్పాను, అంతకంటే మిన్నయైనవి సనత్సుజాతుడైతే నీకు చెప్పగలడు అన్నాడు విదురుడు. ఆయన్ను కలిసికోవటం కష్టం కదా అన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు నిశ్చల మనస్కుడై క్షణమాత్రము ధ్యానించాడు. వెంటనే వారి ముందు ప్రత్యక్షమయ్యాడు సనత్సుజాతుడు. ధృతరాష్ట్రుడు, విదురుడు వినయంగా లేచి ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించారు. సనత్సుజాతుడు వారికి మృత్యువును గూర్చి, కర్మను గూర్చి, జన్మలను గూర్చి, యజ్ఞముల గూర్చి, పుణ్యలోకాలను గూర్చి, ఆత్మపరమాత్మల గూర్చి, పుణ్యపాపాలను గూర్చి, మౌనాన్ని గూర్చి, పరమాత్మ తత్వాన్ని గూర్చి వివరిస్తాడు. వేదములను గూర్చి చెబుతూ అవి పాపకర్మాచరణుని పాపంబులు తొలగించి రక్షించవు. అంతేకాక రెక్కలు వచ్చిన పక్షులు గూళ్లను విడచి ఎగిరిపోవునట్లు వేదాలు పాపకర్మాచరణుని విడచి తొలగిపోతాయని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ''మహానుభావా! వేదములు వేదవిదుని రక్షింపకున్నచో వేదాధ్య యనమును, వేదార్థ విచారంబును, వేదార్థానుష్ఠానంబును కర్తవ్యంబులను వాక్యంబుల సత్ప్రలాపంబులేయగును కదా?"యని అడుగుతాడు. (పేజి 275, ఉద్యోగపర్వము) దానికి సమాధానమిస్తూ సనత్సుజాతుడు ఇలా అంటాడు ''వేదంబులకు స్వర్గాది సాధనంబయిన యాగాది కర్మములనాచరించుటయే పరమార్ధంబు కాదు. కర్మోపాసనాదుల కంటెనతిరిక్తంబయిన బ్రహ్మ ప్రాప్త్యుపాయంబు నెఱింగించుటయే వేదంబులకు పరమార్థంబు. ఆయర్థంబు చక్కనెఱింగినవారలను" వేదంబుల రక్షించును. ''వేదతత్వంబు నెఱుంగక బుగ్యజురాది వేదములను, పురాణేతి హాసములను చదువువాడు బహువాక్యుడగును కానీ ముఖ్య బ్రాహ్మణుడు కాడు. సత్యాది లక్షణంబయిన పరమాత్మ స్వరూపంబు తెలిసినవాడే ముఖ్య బ్రాహ్మణుడగును. ''సర్వసంగ పరిత్యాగియూ ఆత్మను పరమాత్మతో అనుసంధింపవలయును. ఇదియే మౌనము. ఈవిధంబు నెఱిగినవాడే (మౌని)ముని అనదగును గాని అడవుల నిడుమలంబడి నివసించినంత మాత్రాన ముని కానేరడు. తనకును పరమాత్మకును భేదము తలంపకు కైవల్యము నొందిన యతండు మునిశ్రేష్ఠుడనబడును.  ''తల్లిదండ్రుల వలన కలిగిన జన్మంబు జన్మంబు కాదు. ఆచార్యుని వలన కలిగి విద్యావశంబున కలిగిన జన్మమే జన్మము. అట్టి జన్మమే జన్మాంతర నిరాకరణ కారణంబగు, కావున శ్రేష్ఠంబగును. అట్టి జన్మకు కారణభూతుడు ఆచార్యుడు కాబట్టి ఆయన ఎడల ఎప్పుడూ భక్తిగౌరవాలుండాలి అని బోధిస్తాడు సనత్సుజాతుడు. మహాభారతంలోని ఉద్యోగపర్వంలోనున్న సనత్సుజాతీయము ధృతరాష్ట్రునికున్నట్టే మనకూ ఉన్న ఎన్నెన్నో అపోహలను తొలగిస్తుందనడటంలో సందేహము లేదు. అన్నీ వినినా మనలో రావలసిన మార్పు రాకపోతే ఇక ధృతరాష్ట్రునకు మనకు భేదమేమి? కళ్లు లేక ధృతరాష్ట్రుడు అంధుడైతే కళ్లుండీ అంధులమే అవుతాము మనమంతా. చెవులుండీ చెవుడివాడయ్యాడు ధృతరాష్ట్రుడు. మరి మనమూ అలాగే బ్రతకాలా? అంతకన్నా ఘోరమైన అంగవైకల్యము ఏముంటుంది?
                         - రాచమడుగు శ్రీనివాసులు

Read more...

గురుపౌర్ణమి శుభాకాంక్షలు

>> Sunday, July 21, 2013

లోకంలోని అజ్ఞానాన్ని తొలగించి వెలుగుదారి చూపే దివ్యతేజం గురువు. భగవానుడు లోకానుగ్రహకాంక్షతో గురువుగా రూపుదాల్చి భూమిపై అవతరిస్తున్నారు యుగయుగాలుగా. అలా అవతరించిన సంపూర్ణ గురుసత్తాయే వ్యాసభగవానులు . నాటినుండి నేటీదాకా వ్యాసులవారు మానవలోకానికి మార్గదర్శనం చే స్తూ అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఆది గురువును స్మరించుకుంటూ జరుపుతున్న ఉత్సవం గురుపౌర్ణమి. మీకు మీకుటుంబానికి వ్యాసభగవానుల సంపూర్ణానుగ్రహం ప్రాప్తించాలని వేడుకుంటూ శుభాంకాక్షలు తెలుపుతున్నాము .

Read more...

శ్రీ పరమాచార్య వాణి - భగవంతుడిని ఎందుకు పూజించాలి?

>> Friday, June 14, 2013

శ్రీ పరమాచార్య వాణి # భగవంతుడిని ఎందుకు పూజించాలి?
(తమిళంలోని దైవదిన్ కురళ్ - Voice of God అనే పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల పుస్తకము నుంచి సంగ్రహించినది).


Inline image 2

మనకి కనబడుతున్న ఈ విశ్వం అంతా ఒక నియతితో నడుస్తూ ఉంది అంటే, ప్రకృతి శక్తులన్నీ ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్నాయి అంటే, వీటన్నిటికీ వెనుక, వీటిని సృష్టించి నడిపిస్తున్న శక్తి ఒకటి ఉన్నది .. ఆ శక్తిని ఆస్తికులు 'భగవంతుడు' అని అంటారు. మనం చేసే ప్రతీ పనికీ, మనం ఆశించినా/ఆశించక పోయినా ఒక ఫలితం ఉంటుంది. భగవంతుడు మనం చేసే పనులను అనుక్షణం వీక్షిస్తూ, వాటికి తగ్గ ఫలితములను మనకి ఇస్తూ ఉంటాడు.

"సరే భగవంతుడు ఉన్నాడు, ఉంటే మనం ఆయనని ఎందుకు భక్తితో పూజించాలి? మనల్ని అడిగి ఆయన ఈ సృష్టి చేశాడా? అసలు భగవంతుడు మనల్ని సృష్టించబట్టే కదా మనకి ఈ కష్టాలన్నీ. అటువంటప్పుడు, ఆయన పట్ల మనం ఎందుకు భక్తి కలిగి ఉండాలి? ఎందుకు ఆయనని పూజించాలి??" అనేలాంటి ప్రశ్నలు కొందరికి ఉండవచ్చు.


పై ప్రశ్నకి సమాధానంగా, ఆస్తికులు/భగవద్భక్తులు అయిన వారు.."భగవంతుడు మన కష్టాలను/సమస్యలను తీర్చగల సమర్ధుడు" అని చెప్పారనుకోండి, దానికి కూడా ప్రతిగా ..."సరే! భగవంతుడిని పూజిస్తేనే మన కష్టాలు తీరుతాయి అంటే, మీరు చెప్తున్నట్లుగా ఆయన కరుణామూర్తి కాడన్నమాట, కేవలం ఎవరైతే పూజిస్తారో వారి కష్టాలను మాత్రమే తొలగిస్తాడా?" అని కొందరు అడగవచ్చు. అంతేకాదు, "మనం చేసిన పనులకు ఆయన ఫలితములనిస్తాడు అన్నారు కదా, అంటే మనకి ఒక కష్టం వచ్చింది అంటే, మనం ఇంతకు పూర్వం చేసిన పాపములకు ఇప్పుడు ఫలితం ఇస్తున్నాడు, ఇప్పుడు ఆ పాపఫలితం నేను అనుభవించను అని అంటే అది సబబా??" అని కూడా అడగవచ్చు.


శ్రీనీలకంఠ దీక్షితార్ వ్రాసిన 'ఆనందసాగర స్తవం'లో మనపై ప్రశ్నలకి చక్కని సమాధానం ఇచ్చారు. నీలకంఠ దీక్షితార్ ఆ స్తవంలో, మీనాక్షీ అమ్మవారిని ఉద్దేశించి అంటారు, "అమ్మా మీనాక్షీ!! నీకు నేను ఏమీ నోరు విడిచి చెప్పనక్కర్లేదు, నీకు అన్నీ తెలుసు. అయినా నా సమస్యలను నీకు చెప్పకపోతే, నాకు చాలా బాధగా ఉంటుంది, నోరు విడిచి నీకు చెప్పుకున్నంత మాత్రాన, నాకు చాలా తృప్తిగా, ధైర్యంగా ఉంటుందమ్మా. ఈ కారణం వల్లనే, నీకు నా గురించి సర్వమూ తెలిసినా, నా అంతట నేను నా సమస్యలను నీకు విన్నవిస్తున్నాను" అని.


భగవంతుడిని పూజించడం వలన, ఆయన మన సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాడా, లేదా మనం చేసిన కర్మలకి మనకి ఏ ఫలితం రావాలో ఆ ఫలితాన్ని అలాగే ఇస్తాడా లేక మనం ఏదైతే పాపఫలితాన్ని అనుభవించాలో, దానిని తట్టుకునే స్థైర్యాన్ని ఇస్తాడా... అనేది వేరే విషయం, మొదటగా మనం భగవంతుడికి మన సమస్యలని విన్నవించుకోవడం వలన, మనకి ముందు కొంత ప్రశాంతతనిస్తుంది.


కానీ, నిజానికి ఈశ్వరుని యందు మనకి ఉండవలసిన భక్తి అనే విషయమై మాట్లాడితే, మన సమస్యలకు పరిష్కారం కోసం మాత్రమే ఈశ్వరుడిని పూజించాలి అనేది సరికాదు. అలాకాకుండా, ప్రస్తుతం మనకి సుఖమయ జీవితాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు అనే కృతజ్ఞతని ఆవిష్కరించడానికి కూడా కాదు ... ఈశ్వరుడిని పూజచేయవలసినది. ఎందుకంటే, నారు వేసిన వాడే నీరు పోస్తడు అని చెప్పినట్లుగా, నన్ను సృష్టించినవాడికి నాకు ఎప్పుడు ఏమి అవసరమో తెలుసు, అలా అవన్నీ ఇవ్వడం ఆయన యొక్క కర్తవ్యం, ఇందులో ఆయనకి నేను కృతజ్ఞత చెప్పేది ఏముంది? అనే భావన ఉన్నవారు కూడా కొందరు ఉండవచ్చు. కాబట్టి, మనకేదో ఈశ్వరుడు ఇచ్చాడు, మనం సుఖంగా ఉన్నాం కాబట్టి, కృతజ్ఞతా భావంతో పూజచేయాలి అనేది కూడా సరికాదు, అలాగే మన సమస్యలను తీర్చేందుకే భగవంతుడిని పూజించాలి అనేది సరికాదు.


సుఖము, కష్టము అనేవి రెండూ మనసుని ఎప్పుడూ కదిలిస్తూ ఉంటాయి. అందుకే పైన చెప్పిన సుఖములలో లేక కష్టములలో భగవంతుడి పట్ల భక్తి అనే ఉద్దేశ్యంలో నేను మాట్లాడడం లేదు. ఎక్కడైతే మనసు స్థిరముగా, ప్రశాంతముగా ఉంటుందో అదే నిజమైన శాశ్వతమైన ఆనందం. మిగతా సంతోషాలన్నీ శాశ్వతము కావు. మనం బాగా గాఢమైన నిద్ర(సుషుప్తి)లో ఉన్నప్పుడు లేక మానసిక ఉన్మాదం వంటివి ఉన్నప్పుడు కూడా ఎటువంటి సుఖము లేక కష్టము రెండిటినీ మనం అనుభవించము. సంపూర్ణ ఆనంద స్థితిలోనే ఉంటాము, కానీ అలా సుషుప్తిలో, మనం పొందే ఆనందం మనకి ఎరుకలో (being aware) ఉండదు. మనం మెళకువగా ఉన్నప్పుడు, మనసులో ఏ ఇతర ఆలోచనలూ లేక, సంపూర్ణమైన ఎఱుకతో, మనం ఆ ప్రశాంతతని అనుభవించాలి. కానీ అలా మనం గమనిస్తూ ఉండగ, ఆ శాశ్వతమైన ప్రశాంతత పొందాలి అంటే, మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. కానీ మన మనసులో ఒకదాని వెంట మరొక ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. ఈ ఆలోచనలు మనలో పుడుతున్నంత సేపూ, 'జీవుడిగా' నేను వేరు, పరమాత్మ వేరు అనే భావన మాత్రమే మనకి ఎరుకలో ఉంటుంది. మనస్సు నిశ్చల స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే జీవాత్మ/పరమాత్మల భేదాలు తొలగిపోతాయి. అటువంటి నిశ్చల స్థితిలో పరమాత్మ తప్ప వేరుగా ఏదీ లేదు అనే అద్వైత స్థితిని అనుభవిస్తాము. ఆ స్థితిని చేరుకోవాలంటే, ఏదైతే/ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో, దానిని తదేక దీక్షగా ధ్యానం చేయాలి. మనం దేనినైతే ధ్యానం చేస్తూ ఉంటామో, కొన్నాళ్ళకు దానిగానే మారిపోతాము. ఈ విషయాన్ని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా అంగీకరించినది. ఈ విధముగా, ప్రశాంతమైన, ధ్యాన యోగ్యమైన అద్వైత స్థితిలో ఉన్నది సాక్షాత్తు భగవంతుడే.


సృష్టి, స్థితి, లయములు చేస్తూ, కర్మ ఫలితాలనిచ్చే భగవంతుడు ఎప్పుడూ డస్సిపోడు, బ్రహ్మానంద స్థితిలోనే ఎప్పుడూ ఉంటాడు. భగవంతుడి నామాలలో స్థాణుః అనే నామం ఉన్నది. స్థాణువు అనగా ఇక కదలడానికి వీలులేనంతలా అంతటా వ్యాపించిపోయిన వాడు అని ఒక అర్ధం, అలాగే, ఒక చెక్క దుంగ అనే ఒక అర్ధం కూడా ఉన్నది.  లోపల జీవం ఉన్న దుంగ పైకి జీవం లేనట్టుగా కనబడుతుంది. అటువంటి స్థాణువైన చెక్కదుంగని ఒక లత అల్లుకుంటుంది, ఆ లతయే అమ్మవారు. స్థాణువుగా ఉన్న ఈశ్వరుడిని, ఆకులు లేని లత అయిన అపర్ణగా అల్లుకుని ఉంటుంది. భగవంతుడిని గురించి మనం ఎప్పుడు ఆలోచించినా జ్ఞానము + శాంతి అనే విషయాలు మన ఆలోచనకి వస్తాయి. అందువల్లనే భగవంతుడిని మనం ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే, మనకి జ్ఞానము+శాంతి కలుగుతాయి.


ఒక వ్యక్తి ప్రారంభ దశలో, తన కష్టాలను భగవంతుడికి విన్నవించుకుని ఆ కష్టాల నుండి బయటపడినా, లేక భగవత్కృపతో సుఖమయ జీవనాన్ని గడపుతున్నందుకు భగవంతుడికి ప్రతీ రోజూ పూజ చేస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా, అటు కష్టములోనూ, ఇటు సుఖములోనూ, భగవంతుడికి విన్నవించుకోవడం అనేది ప్రాథమిక దశ. ఇలా భగవత్ చింతన అలవాటైన కొద్దీ, మన మనసు నెమ్మది నెమ్మదిగా ఈ కష్టముల వల్ల కలిగే బాధ నుండీ, మరియు సుఖముల వల్ల కలిగే ఆనందము నుంచీ, రెండిటి నుండీ విడివడడం మొదలవుతుంది. భగవంతుని యందు మనసు పెట్టి, సాధన పెరుగుతున్న కొద్దీ, పోను పోను అన్నీ ఈశ్వరేచ్ఛగా జరుగుతున్నాయి, అన్నీ ఈశ్వరుడే చూసుకుంటాడు అని, తనకి కష్టం వచ్చినా, సుఖమే వచ్చినా రెండిటినీ పట్టించుకోని స్థితిలోకి వెడతాడు. ఒకవిధమైన ఆనందము, శాంతి కలగడం ప్రారంభం అవుతుంది. ఒక కష్టానికీ కృంగి పోడు, సుఖానికి పొంగిపోడు, అన్నిటినీ ఈశ్వరుడే ఇస్తున్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే శరణాగతి బుద్ధి అలవడుతుంది. ఇదే, మనల్ని ఆత్మోన్నతివైపుకి నడిపిస్తుంది. ఈ విధంగా ఆలోచించడం వల్ల, మనకి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది.


కేవలం ఆత్మ విచారణ, ధ్యానము, యోగము ద్వారానే మన మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు ఉన్నప్పుడే, పూర్ణమైన ఆత్మానందస్థితిని ఎఱుకతో అనుభవించగలుగుతాము. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడుగవచ్చు, "ఈ ఆత్మ విచారణ, ధ్యానము, యోగము అనే ప్రక్రియలు ఎలా చెయ్యాలో చెప్పకుండా, మీరు భగవద్భక్తి గురించి, భగవంతుడిని ఎందుకు పూజించాలి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?". ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పారు, ఏ స్థితిలో అయితే ఏ చలనము, ఏ ఆలోచనా, కనీసం భక్తి అనే ఆలోచనా కూడా ఉండవో ఆ స్థితియే 'మోక్షస్థితి'. అప్పుడు "మరి భగవంతుడిని పూజించమని ఎందుకు చెబుతున్నారు?" అని మీరు నన్ను అడుగవచ్చు. దీనికి సమాధానం శంకరులే మనకి చెప్పి ఉన్నారు. మోక్షం పొందే సాధనా మార్గాలలో భక్తి మార్గం సర్వోత్కృష్టమైనది అని. అయితే ఈ భక్తి అంటే ఏమిటి? దేనిని భక్తి అంటారు? దీనికి కూడా సమాధానం శంకరులే మరుసటి వాక్యంలో చెప్పి ఉన్నారు, 'నిజమైన నేను (enquiring into the real nature of self) ఎవరో విచారణ చేయడంలో నిమగ్నమై ఉండడమే భక్తి' అని శంకరులు చెప్పారు. శంకరుల నిర్వచనం ప్రకారం, భక్తి అనేది కేవలం ఆత్మవిచారణ, ధ్యానము, యోగము ద్వారానే సాధ్యము తప్ప మనం సాధారణంగా ఇప్పటి వరకూ అనుకునే భక్తి... అనగా భగవంతుడు అనేవాడు బయట ఎక్కడో ఉన్నాడు, ఆయన పట్ల మనం చూపే ప్రేమనే భక్తి.... అని మనం అనుకునేది అసలు భక్తి కాదు.


సరే, భక్తి అంటే ఏమిటో పైన చెప్పిన నిర్వచనం స్వయంగా శంకరులే ఇచ్చి ఉన్నా కూడా, మా పీఠములలో (కంచికామకోటి పీఠం, మరియు ఇతర శంకరాచార్య ప్రతిష్టిత పీఠములు) చేయవలసిన చంద్రమౌళీశ్వర ఆరాధనా పద్ధతిని వారే ప్రారంభించారు. నిర్గుణమైన పరబ్రహ్మమే మన అంతిమ లక్ష్యము అని శంకరులే ప్రకటించినా కూడా, వారే ఆరు భగవదారాధనా పద్ధతులను స్థాపించడం వల్ల వారికి షణ్మత స్థాపనాచార్య అనే నామం కూడా వచ్చింది. వారు మన దేశంలో కాలుమోపని పుణ్యక్షేత్రం లేదు. ఆసేతు హిమాచలం పాదచారియై పర్యటించారు. అనేక దేవతా స్వరూపాలను స్తుతిస్తూ ఎన్నెన్నో స్తోత్రాలను ఇచ్చారు. దీనిని బట్టీ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మనం ఏదైతే భగవదారాధానా/పూజా పద్ధతులు ఉన్నాయో (వేటిని మనం భగవద్భక్తి అనుకున్నామని చెప్పానో..), ఈ పూజా విధానాలకు శంకరుల అనుమతి ఉన్నది. కాబట్టే కదా వారే స్వయంగా అన్ని స్తోత్రాలు ఇవ్వడం, అనేక క్షేత్రాలలో వారు పర్యటించడము, ఆఖరికి వారు ప్రతిష్టించిన పీఠాలలో కూడా నిత్య చంద్రమౌళీశ్వరారాధనా క్రమాన్ని ప్రారంభించి, పరంపరాగతంగా కొనసాగుతూ ఉండడం వస్తున్నది.


జ్ఞానమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన ఆధ్యాత్మిక సాధనా ఫలితముగా చాలా మందికి ఒక భావన ఉన్నది. అలాగే జ్ఞానము కన్నా ఓ స్థాయి తక్కువగా ఆత్మ విచారణ, ధ్యానము, యోగము, దానికన్నా క్రింద స్థాయిలో పూజలు చేయడము, పుణ్యక్షేత్రములను దర్శించటము అనీ, అన్నిటికన్నా క్రింద స్థాయిలో వైదిక క్రతువులు, కర్మకాండ చూడబడుతూ ఉన్నది. చాలా మంది చదువుకున్న వారిలో కూడా, వైదిక క్రతువులంటే కేవలం మూఢనమ్మకాలు అనే స్థిరమైన అభిప్రాయము, పూజాధికములు నిర్వహించడం ఒక మానసిక భావము (sentiment) గానూ, ధ్యాన/యోగములు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత అనీ ఒక ప్రగాఢ విశ్వాసం ఉన్నది.


ఆదిశంకర భగవత్పాదులంతటి వారు, సాక్షాత్ కైలాస శంకరుడే ఆదిశంకరుడిగా వచ్చినా, వారు స్వయంగా ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉండే మహాపురుషుడే అయినా, కర్మకాండతో పాటు జ్ఞాన మార్గము కూడా అవసరం అని చెప్పినా..... శంకరులే మనసు+క్రియ కలిపి చేయవలసిన భగవంతుడి పూజ, వైదిక కర్మలను కూడా సమ్మతించారు. దీనికి కారణం ఉన్నది. సంసారంలో మమేకమై ఉన్న మనందరికీ, మనసు ఎప్పుడూ నిరంతర ఆలోచనలతో అలజడికి గురై ఉంటుంది. అటువంటి మనసును ఒక్క క్షణమైనా నిశ్చలంగా ఉంచడం చాలా కష్టం. అలాగని, మన ప్రయత్నంతో మనసులో వచ్చే ఆలోచనలను అరికట్టి, నిశ్చల పరుద్దాం అని అనుకున్నా, అది అత్యంత కష్టమైన విషయం. ఆలోచనలు అదేపనిగా మన మనసుని అన్ని దిశల నుండీ తాకుతూనే ఉంటాయి. మనకి సంసారంలో ఉన్న బంధాలు, వ్యక్తులతో ఉన్న విరోధాలు, బాధలు, భయాలు, సంతోషాలు అన్నీ ఒకదాని వెనుక ఒకటి మనల్ని అలల్లా తాకుతూ, మనల్ని ఒక సందిగ్ధావస్థలో ఉంచుతాయి. దీని కారణంగానే, "మనసుని నిశ్చలముగా ఉంచుకొనుము, తద్వారా ఆత్మనందము పొందగలవు" అని చెప్పడం తేలిక, ఆచరణలో దానిని సాధించడం అంత తేలిక కాదు.


మన మనస్సును నిశ్చలముగా, ఎటువంటి ఆలోచలు లేకుండా నిలపలేక పోవడానికి కారణం ఏమిటి?


మనం పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితమే దీనికి కారణం. జన్మ తర్వాత జన్మ, ప్రతీ జన్మలోనూ మనం ఏవో కొన్ని పాపములు చేస్తూ వచ్చాము. జన్మజన్మాంతర ఆ పాపరాశి ధ్వంశం అయితే తప్ప, మనం ఆత్మ దర్శనం పొందలేము. అటువంటి స్థితిని చేరుకోవాలంటే, మన కర్మలన్నిటికీ ఫలితాలనిచ్చే ఈశ్వరుడు, మన పాపములన్నిటికీ మన చేత శిక్ష అనుభవింప చేసిన తర్వాత మాత్రమే సాధ్యము. పాపము ఇచ్చే ఫలితము ఎలా తుడిచిపెట్టుకుపోతుంది? పుణ్యములు చేయడం ద్వారా. పుణ్య కార్యములు చేయడం వలన, ఈ జన్మలో అన్ని పాపములు అనుభవించలేక పోతే, మళ్ళీ ఇంకొక జన్మలో, ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపతో ఇంకో శరీరాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ కొత్త శరీరంతో ఇతఃపూర్వం ఉన్న పాపరాశి మళ్ళీ కొంత అనుభవించగలుగుతాడు. కానీ మనం ఏమి చేస్తున్నాము? గత జన్మలలో ఉన్న పాపములను అనుభవించడమే కాకుండా, ఈ జన్మలో మళ్ళీ కొత్తగా పాపములను చేస్తూ, మన పాపముల చిట్టా రోజు రోజుకీ పెంచుకుంటున్నాము. ఇలా మనం అజ్ఞానంతో పాపములను తగ్గించుకోవడం మానేసి, గుణాత్మకంగా పాపములను పెంచుకుంటున్నాము అనే, జగద్గురువులైన శ్రీఆదిశంకర భగవత్పాదులు, జ్ఞాన మార్గముతో పాటు, వైదిక కర్మలను చేయడం, భగవంతుడిని పూజ చేయడం వంటి కూడా తప్పనిసరి అని సూచించారు.

పాపములు రెండు రకములు. ఒకటి కాయకముగా చేసిన పాపములు, రెండు మానసికముగా చేసిన పాపములు. కాయకముగా చేసిన పాపములు పరిహారం అవ్వాలి అంటే, కాయకముగా పుణ్య కార్యములు చెయ్యాలి. అలాగే మానసికముగా చేసిన పాపములు పరిహారం అవ్వాలి అంటే, పుణ్యప్రదమైన ఆలోచనలు/సత్సంకల్పాలు చేస్తూ ఉండాలి.


పుణ్య కార్యం అంటే ఏమిటి? - వేదం వేటిని చేయమని చెప్పినదో అవి అన్నీ పుణ్యకర్మలు. సమాజంలో అందరికీ ఒక్కో కర్తవ్యాన్ని వేదం నిర్దేశించినది. వేదశాస్త్రములు చెప్పినట్లుగా, ఈ వేదవిహిత కర్మాచరణలో వైక్లవ్యం కలుగకుండా, ఎవరి స్వకర్మలు వారు పాటించడం చేస్తే, అన్నిటికన్నా అదే పెద్ద పుణ్య కార్యం.


పాపకార్యం అంటే ఏమిటి? ఏ క్రియ అయితే కేవలం స్వార్ధం/అసూయల కారణంగా చేస్తామో, దానిని శాస్త్రం పాపంగా పరిగణిస్తుంది. ఒక్క స్వార్ధం వల్లనే, ఒక వ్యక్తికి కలిగే కోరికలను నెరవేర్చుకోవడానికి, సకల విధములైన అధర్మ మార్గములలో పయనించడం మొదలు పెడతాడు. ఇలా చేయడంలో భయము, విరోధము, బాధ మొదలైన దుర్గుణములతో మనసు కలుషితమైపోతుంది.

స్వార్ధం ప్రాతిపదికగా కాకుండా,
 వేదము చెప్పిన కార్యములను, విివిధానములను మనం ఆచరించడం మొదలు పెడితే, అత్యాశ, అనారోగ్యకరమైన పోటీ తత్త్వము, స్వార్ధం, అసూయ తగ్గిపోతాయి.

వేదవిహిత కర్మాచరణ ఎవరికి నిర్దేశింపబడినవి వారు, చేస్తూ ఉంటే, అది మొత్తం సమాజానికి క్షేమాన్ని చేకూరుస్తుంది. అంతే కాక, అటువంటి వేదవిహిత కర్మాచరణ వ్యక్తుల యొక్క పాపములను కూడా పరిహరించి, పునీతులను చేస్తుంది. ఇలా పుణ్యకార్యములు చేస్తూ ఉండడం వల్ల, పాపవిముక్తులమై, మన మనసు 
పవిత్రమవుతుంది.

ఏ పనీ చేయకుండా కూర్చుని ఉంటే, అనేక విధములైన చెడు ఆలోచనలు మనసులో పుడుతూ ఉంటాయి. అందువలననే మన మననుని నిశ్చల స్థితిలోకి (ఎటువంటి ఆలోచనలు లేకుండా) తీసుకువెళ్ళి, ఆపైన అద్వైత దర్శనం చేయాలి అంటే, ముందు మన మనసులో కలిగే చెడు ఆలోచనలు ఆగి, మనసు పునీతం కావాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధన ప్రాథమిక స్థాయిలో ఉండగా, మనసుని పవిత్రం చేయడం అనేది కేవలం వైదిక కర్మలు, పుణ్య కార్యముల చేత మాత్రమే సాధ్యము. ఈ కారణంగానే, శంకరులు వైదిక కర్మలను చేయమని ప్రతిపాదించి, వివిధ దేవతాస్వరూపాలను కీర్తించే స్తోత్రాదులు ఇచ్చారు.


ఇతరులకు సహాయం చేయడము, సమాజ సేవ చేయడం, మనకున్న విభూతిని సమాజం కోసం వెచ్చించి త్యాగం చేయడం వంటి పుణ్య కర్మలు మనలోని పాపపు ఆలోచనలను తగ్గిస్తుంది. దీనినే మనం ప్రేమ అనవచ్చు. ఇదే ప్రేమని పరమాత్మ వైపుకు త్రిప్పగలిగితే, పరమాత్మపై మనకి ఉండే ఆ ప్రేమనే 'భక్తి' అంటారు. భగవంతుడి యందు ఉండే భక్తి, భగవత్ చింతన అనేవి, అనేక జన్మల పరంపరగా మనం చేసిన పాపాలను సమూలంగా నాశనం చేయగలదు. భగవద్భక్తి ఒక స్థాయి చేరిన తర్వాత, మన మనసు కేవల పరమాత్మపైనే దృష్టి పెట్టే స్థితి వస్తుంది. మనసులో అసలు ఏ ఆలోచనలూ లేకుండా నిశ్చల స్థితిలో ఉండగలడం అనే నిశ్చల సమాధి స్థితికి ఒక మెట్టు ముందు కేవల భగవత్ చింతన ఉండే స్థితి అబ్బుతుంది. మరే ఇతర ఆలోచనలు లేక కేవలం పరమాత్మ చింతనయే మనసులో మిగిలిన వాడికి, అనతి కాలంలోనే, ఇక ఏ ఆలోచనాలేని, పరమాత్మ స్థితిలో నిలబడే స్థితి వస్తుంది. అంత్యమున పరమాత్మ తప్ప మరేది ఉండదు.

పైన చెప్పిన విధంగా, మన మనసు ఒకే ఒక్క విషయంపై (భగవత్ చింతన) ఏకాగ్రత పొంది, ధ్యాన యోగ స్థితిని చేరడం కోసమే, శంకర భగవత్పాదుల వారు మనకి వైదిక కర్మలను (నిత్య నైమిత్తిక కర్మలు, భగవంతుడి పూజ) తప్పనిసరిగా చేయాలనీ, భగవంతుడి యందు భక్తి కలిగి ఉండాలనీ బోధించారు.

మొదట స్తోత్రాదులను పఠించడమూ, పూజ చేయడమూ, పుణ్యక్షేత్రములను సందర్శించడమూ మొదలైన వాటితో భగవద్భక్తి ప్రారంభం అవుతుంది. భక్తితో, వైదిక కర్మలు చేస్తూ ఉంటే, పరమాత్మ అనుగ్రహంతో శాంతి పొందుతాము. నిద్రలో సుషుప్తిలో ఉన్నప్పుడులా కాకుండా, మనం మెళకువగా ఉన్నప్పుడే, మన మనసు జాగురూకతతో ఉన్నప్పుడే (fully concious state), భగవద్భక్తి మనల్ని పరమాత్మకి దగ్గర చేస్తుంది. అందువలననే, ప్రతీ ఒక్కరూ భక్తిని అలవరచుకుని, శాస్త్రం విహించిన వైదిక కర్మాచరణ చేయడం అభ్యసించాలి.

కేవలం 'అద్వైతం' అనే స్థితిని గూర్చి మాట్లాడుతూ ఉండడం వలన ఏమీ ప్రయోజనం లేదు. అద్వైత స్థితికి సాకారరూపం ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుని గురించి ధ్యానిస్తూ ఉండడం వలన, అప్పుడప్పుడైనా తాత్కాలిక ప్రశాంతని పొందగలము. మనకి అర్ధం కానీ, మనం ప్రేమతో అనుబంధం పెట్టుకోలేని ఆ స్థితిని, మనం ఊహకూడ చేయలేని మరియు ఏ గుణములూ లేని నిర్గుణ పరబ్రహ్మ అద్వైత స్థితిని గురించి మాట్లాడే కన్నా, సగుణరూపములో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని పూజ చేయడం చాలా చాలా అవసరం, సగుణ  పరబ్రహ్మము నందు మన మనను త్వరగా లయం అయి, మనకి ఈశ్వరుని యందు భక్తి బాగా కుదురుకుంటుంది. అటువంటి సగుణరూప పరబ్రహ్మమును పరమభక్తితో పూజించడం చాలా అవసరం.

చివరగా చెప్పేది ఏమిటంటే, "భక్తి అనేది కేవలం లౌకికమైన ఈతి బాధలు తీరడానికి కాదు. మనం ఎవరో, మన స్వస్వరూపమేమిటో తెలుసుకొని, నిజమైన 'నేను'లో రమించి శాంతిని పొందుట కొరకు మాత్రమే భక్తి".

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

Read more...

పరమాచార్య వాణి - అమృత సూక్తులు

>> Wednesday, May 8, 2013

Inline image 1
పరమాచార్య వాణి # 2

"ప్రతీ రోజూ మనం నిద్రించబోయే ముందు, ఈ రోజు నేను ఎవరికైనా సహాయ పడ్డానా అని మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. 63 మంది నాయనార్లలో ఒకరైన తిరునావుక్కరసర్ అనే నాయనార్ పాడిన తేవరంలో ఈ విధంగా చెప్పబడినది....'ఏ రోజైతే మనం భగవంతుడి నామాన్ని స్మరించమో ఆ రోజు మనం మరణించిన వాళ్ళతో సమానం, అసలు పుట్టనట్లే లెక్క'. అదే విధంగా ఏ రోజైతే మనం ఏ కొంచెమైనా కూడా మానవ/సమాజ సేవ చేయమో... ఆ రోజు మనం మరణించినట్లే/లేదా పుట్టనట్లే. ఇది ఎలా అంటే, ఎవరికైనా బంధు వర్గంలో ఎవరైనా శరీరం వదిలిపెడితే, వారికి మృతాశౌచం ఉంటుంది. వారికి కలిగిన మృతాశౌచం వల్ల పవిత్రమైన పుణ్య కార్యాలలో పాల్గొనే అధికారం లేదు. అలాగే మనం ఏ రోజైనా ఎవరికీ సహాయపడకుండా, కొంచెం కూడా పుణ్యానికి దగ్గరగా వెళ్లకపోతే, ఆ రోజు, మనమే స్వయంగా మరణించిన వాళ్లతో సమానము, ఆ అశౌచము వల్లనే మనం ఏ కొద్దిగా కూడా ఎవరికీ సహాయపడలేక పోయాము అని గుర్తు"

---------------------------------------------------------------------
 
పరమాచార్య వాణి # 3
Inline image 1

"స్త్రీలు ప్రతీ రోజూ తలస్నానం చేయనవసరం లేకుండా, పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుందని, మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదే మగవాడు అయితే, ప్రతీ రోజూ తప్పని సరిగా తలస్నానం చేయవలసినదే. స్త్రీలకి మాత్రం మన శాస్త్రం ఈ మినహాయింపు ఇచ్చినది. అలాగే ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత, ఆ గర్భంలో ఉన్న జీవి పూర్తి స్థాయిలో పెరిగిన తరువాత, ఆ గర్భిణీ స్త్రీ ఏ వ్రతములు, ఉపవాసములు చేసినా ఫలించవు అని శాస్త్ర వాక్యం. అంటే అలా నెలలు నిండిఉన్న తల్లిని కష్టపెట్టకుండా ఉండాలని శాస్త్రమే ఇచ్చిన మినహాయింపు.

అలాగే ఒక బ్రహ్మచారి తనకు ఎంత ఆహారం కావలన్నా తినవచ్చు, కానీ అది సాత్త్విక ఆహారం మాత్రమే అయి ఉండాలి. వ్రతములు, ఉపవాసములు బ్రహ్మచారులకు శాస్త్రం నిర్దేశించలేదు. ఇలా ఎందుకంటే, చిన్నతనములోనూ మరియు వృద్ధాప్యంలోనూ శరీరానికి సరిపడ పోషణ అవసరం. చిన్నతనంలో ఎదుగుదల కొరకు, వృద్ధాప్యంలో శరీరం నిలబడే ఓపిక కొరకు. అలాగే ఆరోగ్యం బాగుగా లేని వారి కొరకు కూడా శాస్త్రం అనేక మినహాయింపులను శాస్త్రం ఇచ్చినది.

ఈ విధంగా మినహాయింపులు శాస్త్రం అంగీకరించడం పక్షపాతంతో కాదు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, మనకి ఆచార అనుష్టానాల పట్ల ఎంత భక్తి విశ్వాసాలున్నా, వాటిని ఆచరించలేని దౌర్బల్య స్థితిలో ఒక్కోసారి ఉండవచ్చు, అప్పుడు ఈశ్వరుడు, ఆయన యొక్క అవ్యాజమైన కారుణ్యంతో, ఆచార అనుష్టానంలో కలిగే ఆ లోపాలని క్షమిస్తాడు. అందుకోసమే, శాస్త్రం మనకి కొందరికి, కొన్ని సందర్భాలలో/పరిస్థితులలో ఆ మినహాయింపులను సమ్మతించినది.

ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ పరిస్థితులలో శాస్త్రం ఆయా మినహాయింపులను ఇచ్చినదో, ఆ కష్టం తీరిపోయిన తర్వాత, మళ్ళీ మన ఆచారము అనుష్టానము యథావిధిగా కొనసాగాలి తప్ప.

కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కోసమో, కొందరు వ్యక్తుల కోసమో (ఉదాహరణ స్త్రీలకు పైన చెప్పిన స్నానం ఉదాహరణ..) శాస్త్రం సమ్మతించిన మినహాయింపులను, సార్వజనీకముగా స్వీకరించి, ఆచార అనుష్టానములను వదలరాదు".

------------------------------------------------------------------------------------------

పరమాచార్య వాణి # 3
Inline image 1
పంచభూత స్నానం
"స్నానం ఐదు రకాలుగా మన శాస్త్రంలో చెప్పబడినది. దీనినే పంచ భూతస్నానం అంటారు.  మనం సాధారణంగా స్నానం అంటే చెంబుతో నీళ్ళు తీసి తలమీద పోసుకోవడం అనుకుంటాము, కానీ అది స్నానమే కాదు. నదిలో మన తల పూర్తిగా మునిగేలా చేస్తే అది స్నానం అని శాస్త్రవాక్యం. దీనినే అవకహం అంటారు. ఇది మొదటి రకం స్నానం, ఇది వరుణ సంబంధమైనది.
రెండవరకం స్నానం విభూతి స్నానం, దీనిని ఆగ్నేయం అంటారు. ఇది అగ్ని సంబంధమైనది.
మూడవరకం స్నానం గోధూళి స్నానం, దీనిని వాయవ్యం అంటారు, ఇది వాయు సంబంధమైనది. అందుకే ఎప్పుడైనా గోవులు వెళ్ళేటప్పుడు వాటి వెనుకగా నడిస్తే, ఆ ధూళి గాలికి ఎగిరి మన మీద పడితే, అప్పుడు మనం వాయు స్నానం / గోధూళి స్నానం చేసినట్లు.
నాలుగవ రకం స్నానం దివ్యస్నానం, ఇది ఆకాశ సంబంధమైనది. అనగా ఎప్పుడైనా ఎండగా ఉండగానే వర్షం కూడా పడుతూ ఉంటే, ఆ వస్తున్న జలాలు దేవలోకం నుంచి వచ్చినట్లుగా శాస్త్రం చెప్పినది. ఆ సమయంలో మనం ప్రయత్న పూర్వకముగా వెళ్ళి, ఆ వర్షంలో నిలబడితే అప్పుడు మనం దివ్య స్నానం చేసినట్లు.
ఇక ఐదవ రకం స్నానం బ్రహ్మస్నానం. ఇది పృథ్వి సంబంధమైనది. మనం సాధారణంగా పూజలు, హోమాలు, అభిషేకాలు చేసే ముందు, ఒక కలశ స్థాపన చేసి, అందులోని జలాలలోకి గంగాది పుణ్య నదులను ఆవాహన చేసి, ఆ తర్వాత మంత్ర జపం పూర్తి చేసిన (ఉదకశాంతి మొ..) తర్వాత, మంత్రపూరితమైన ఆ జలాలను, దర్భలతో పూజ చేస్తున్న బ్రాహ్మణులు మన మీద జల్లుతారు. అలా దర్భల నుంచి మన మీద చిలకబడిన ఆ మంత్రపూరిత జలములచే మనం బ్రహ్మస్నానం చేసినట్లు".

పరమాచార్య స్వామి వారు పైన చెప్పిన శాస్త్ర వాక్కులతో పాటు, మరొక విషయం కూడా మన పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పారు, మనం సంవత్సరంలో ఒక్కసారైనా మనం ఈ పంచభూత స్నానం తప్పనిసరిగా చేయాలి అని.
 

Read more...

మాతృ యాగం!

>> Monday, May 6, 2013



మానవ జన్మలన్నీ ఆగాలు. అధ్యాత్మ సాధనలో అవన్నీ యోగాలు అవుతయ్. మధ్యలోవన్నీ యాగాలు. సామాన్యుడు, అసామాన్యుడు, అసాధారణ వ్యక్తిత్వ సంపన్నుల జీవన విధానమంతా ఈ ఆగ, యాగ, యోగాల పరిధిలో నడుస్తుంది. అవిద్య, అస్పష్టత, అనాచారం, ఆందోళన, ఆతృత వంటి ప్రతికూల భావాలన్నీ ఆగమౌతయ్. అటువంటి జీవితం వ్యక్తికి గాని, సమాజానికి గాని ప్రయోజనకరం కాదు.

మానవ శక్తులన్నీ నిర్వర్యమై వేదనాభరితమైన జీవితాలుగా బండబారి ముగిసిపోతయ్. దానం, ధర్మం, సత్కర్మలు, సమాజసేవ, సద్భావన, తృప్తి, సంతోషం వంటి విషయం వ్యక్తికీ, సమాజానికీ శ్రేయోదాయకమౌతయ్. అవి యాగ రూపంగా మానవ శక్తులను సంఘటితం చేస్తయ్.

పరస్పర ప్రేమ, ఆధార ఆధేయ సంబంధం, సమాజ స్పృహ, సహజానందం వంటివన్నీ మానవ శక్తులన్నీ ఏకీకృతం చేస్తయ్. ఇదంతా నల్లేరు మీద బండి నడక వంటిది. ధ్యానం, యోగం, తపస్సు, స్వాధ్యాయం, సద్గోష్ఠి, సంప్రదాయం, నియమం, నిష్ఠ, నియతి వంటివన్నీ యోగానికి సంబంధించిన సంగతులై మానవ శక్తులన్నీ అంతరంగంలో శక్తివంతమై, నిస్తంద్రమంద్రమై, అంతర్ముఖత్వానికి దారి తీస్తయ్. అంతర్ముఖుడైన జ్ఞానికి ద్వంద్వాలు లేవు. అంతా ఒక్కటే, ఒక్కటే అన్నీయై తనకంటే భిన్న వస్తువు మరొకటి లేదన్న స్థితి శాశ్వతము, స్థిరము, సంస్థితము అవుతుంది.

జ్ఞానికి కర్మలుంటాయా?
ఆగంలో వున్నవాడికి అలసట తప్పదు. ఆసరా కావాలి. యాగంలో వున్న వాడికి పై స్థితి ఇంకా అందవలసి వుంది. అన్నీ దాటిన వాడికి ఆనందం తప్ప అన్యం తెలియదు. జ్ఞానికి కర్మలుంటాయా? ఉంటయ్. కర్మలన్నిటినీ ఏ విధమైన బంధనా లేకుండా చేస్తాడు. ప్రారబ్దాలుంటాయా? పాంచభౌతిక దేహం ధరించినందున ప్రారబ్దాలు అనివార్యం. కాకపోతే ప్రారబ్దాన్ని అనుభవిస్తున్నానన్న స్పృహ వుండదు. కనుక అనుభూతులుండవు. చూస్తున్న వారికి "ఇంతటి వారికీ ప్రారబ్దమా'' అనిపిస్తుంది.

అరవై సంవత్సరాలు అమ్మ సాగించినదంతా యాగమే! స్వరూపం స్త్రీరూపం కనుక, దృష్టి సమదృష్టి కనుక, కుల, గుణ, మతాతీత భావనాబలం సహజ మాతృస్థితి కనుక, అమ్మ ప్రతి కదలిక, ప్రతి మెదలిక, ప్రతి చేత, యాగ-యోగాల మేలుకలయికగా సాగినయ్. తల్లికి బిడ్డలందరూ సమానమే. బిడ్డల సుఖం, సంతోషం, ఆనందం, భవిత..ఒకటేమిటి సమస్తమూ అమ్మ కరుణాదృష్టి సోకి భద్రతమం కావలసిందే. ఆకలిగొన్న వాడికి అన్నం, బతుకే భయమైనవాడికి అభయం, అహంకరించిన వాడికి అతిశయశమనం, అమ్మ అలుపెరుగని రీతిలో అనుగ్రహించింది. బాగా చదువుకున్నాననుకున్న వాడికి, మరిని కోణాలను ఆవిష్కరించింది.

మాటలే మహామంత్రాలు
మెడికల్ సెంటర్, సంస్కృత కళాశాల, అన్నపూర్ణాలయం, వాత్యల్యాలయం, ధ్యానమందిరం, ఆలయ సముదాయం, ఆదరణాలయం, అధ్యయన పరిషత్ వంటి సంస్థలన్నీ అమ్మ సంకల్పంలోంచి పుట్టినవే. 'విశ్వజనని' పత్రిక అమ్మ బిడ్డల ఆ్రర్దవాణి. ఇవన్నీ అమ్మ సాగించిన యాగ ప్రవాహంలోవే. దేనికదే సమాజంలో అనుసంధానమై సేవా యాగంలో పూర్ణత్వాన్ని సంతరించుకున్నవే. ఇవన్నీ ఒక ఎత్తు. పైకి కనిపించేవి. వ్యక్తిత్వ పరిణామం మీద అమ్మ చూపిన ప్రభావం అమితం. అనేక సందర్భాలను సమన్వయం చేస్తే అమ్మ సాగించిన యాగంలో ఎన్నో మాటలు మహామంత్రాలయినయ్.

*జగన్మాత అంటే జగత్తే తల్లి.
*అన్నిటినీ చేయిస్తున్న వాడొకడున్నాడనుకో. దానివలన "నేను చేస్తున్నానన్న'' అహం నశిస్తుంది.
*కష్టమంటే ఇష్టంలేనిది.
*నిగ్రహం కోసమే విగ్రహారాధన.
*సహన పూజకు కావలసింది బాధలనే పూలు.
*అవసరమే విలువైనది.
*అనుకున్నది జరుగదు. తనకున్నది తప్పదు.
*నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో.
*ఉన్నదంతా బ్రహ్మమైనపుడు భగవంతుణ్ణి ప్రత్యేకంగా చూడాలనుకోవడమెందుకు?
కోకొల్లలై వెల్లివిరిసిన ఈ మాటన్నీ జీవన సత్యాలు. ఎవరి స్థాయిని బట్టి వారు ఆలోచించుకుని సాధనను ప్రారంభించటానికో, ముగించుకోవటానికో అక్కరకొచ్చే సాధనా సూత్రాలు. అలుపెరుగక, అలసట తెలియక, అవిశ్రాంత విశ్రాంతంగా లక్షలాది జనావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా చల్లగా పలుకరించి, కరుణ చిలుకరించి, ప్రేమను ముద్దలుగా పంచిన నిండు, పండు ముత్తైదువ అమ్మ. సహజ త్యాగం, సహజప్రేమ, సహజ కారుణ్యము ఆనందరాగమై వినిపించిన అమ్మది చల్లని మాటల యాగం. కన్నీరు తుడవటం, కడుపు నింపటం, ఆదరించటం, అక్కున చేర్చుకోవటం...అమ్మ చేయవలసిన యాగమైతే అమ్మ సాగించినదంతా మాతృయాగమే!

వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Read more...

అందరికీ అమ్మ

>> Sunday, April 28, 2013

అందరికీ అమ్మ


"శ్రీరామచంద్రా! నీవు సాక్షాత్ నారాయణుడివి. పైక్లబ్యం తగదు. దుష్టసంహార కార్యక్రమం నీ లక్ష్యం. ధర్మ పరిరక్షణ నీ కర్తవ్యం. నీ గమ్యం''అని విశిష్ఠుల వారు అన్నపుడు, రాముడు "నేను దశరధ కుమారుణ్ణి. విధి నడిపించినట్లు నడవటం నా విధి.'' అంటాడు. "నేను తప్ప వేరు వస్తువు లేదు. వేదాల్లో నేను సామవేదాన్ని. పక్షులలో గరుడ పక్షిని. మాసములలో ముర్గశర్షాన్ని. నేను దైవాన్ని'' అంటాడు కృష్ణపరమాత్మ. "మీరు స్కందులు. కుమారస్వామి రమణ రూపంలో దర్శనమివ్వటం మా భాగ్యం'' అని మహా తపస్వి కావ్యవ వందనాశిష్ఠగణపతి ముని, భగవాన్ రమణ మహర్షిత అన్నపుడు "మిమ్మల్ని మీరు తెలుసుకోండి.

ఆ ఎరుక కలిగితే ద్వైతం సమసిపోతుంది.'' అని మహర్షి సమాధానం. "త్రేతాయుగం నాటి రాముడు ద్వాపర నాటి కృష్ణుడు కలబోస్తే ఈ రామకృష్ణుడు'' అన్న పరమహంస ప్రకటన స్మరణీయం. ఈ సంఘటనల వెనుక, మాటల మాటున దాగిన మర్మం, మర్మం వెనుక దాగిన మహితత్వం జాతికి వరణీయం. ఆయ అవతారమూర్తుల ఆవిష్కరణలు. అన్వేషణ ప్రారంభం కావటానికి ఆలోచనా స్ఫోరకాలు. అన్వేషణ ముగించడానికి సాఫల్యాలు. అవతారప్రణాళిక, జాతి సంసిద్ధత, తమస్సాఫల్యం, జీవన పరిపక్వతలకు అనుగుణంగా, ప్రసంగవశాత్తు వెలువడె? ఈ మార్మిక శబ్దాలు, వాక్యాలు, ఆయా మహాత్ముల అంతరంగ అభివ్యక్తి.

ఈ భూమిక అందరూ అందుకోదగినది కాదు. ఎవరు నిత్య జీవితాన్ని సత్యాను సంధాన స్ఫూర్తితో సాగిస్తారో వారు ఈ మాటలను ఆలకించి, ఆచరించి, అనుభవించి, ఆనందతారక స్థితిని అందుకుంటారు. జీవన్ముక్తులుగా, ముక్తజీవనులుగా జన్మను పండించుకుంటారు. సాధకుడికి పరిపక్వత లేనపుడు, అజాగ్రత్తగా ఉన్నపుడు మహాత్ముల నోట వెలువడే మాటలను సామాన్యార్థంలో గ్రహించుకొని పెడచెవిన పెడతాడు. నష్టపోతాడు. యదార్థాన్ని అందుకోలేక కాలగతిలో వెనుకబడి పోతాడు. జీవితాన్ని వృథా చేసుకుంటాడు.

"నేను అందరికీ అమ్మను'' అన్నది అమ్మ ప్రకటన. ప్రకటించడం బహు సులువు. . అమ్మగా ఉండగలగటం సామాన్య విషయం కాదు. ఇంతకీ అమ్మంటే? ప్రతి జీవి జన్మకు కారణం, అమ్మ! అమ్మలేని ప్రాణి లేదు. అమ్మ ఒడి మొదటి బడి. అమ్మతోనే గురువు. అమ్మ, అయ్యను చూపిస్తుంది. అమ్మ, అయ్య కలిసి లోక గురువును చూపిస్తారు. ఈ ముగ్గురి దయ వలన జీవుడు, తనలో ఉన్న దైవాన్ని దర్శించగలుగుతాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం...ఇది క్రమం. సక్రమం. కనుక అమ్మ దైవం. దేవ అంటే ఆట. అమ్మకు గెలుపు,ఓటమిల్లేవు. ఆడటం ఒక వేడుక.

జీవిని గెలిపించడం ఆమెకు ఆనందం. అపుడపుడూ జోడించినట్లు జోడించి గెలిపించటం పరమానందం. పాకుతున్న వాడిని నడిపించడం, నడుస్తున్న వాడిని పరుగెత్తించటం, పరుగెత్తుతున్న వాడిని నిగ్రహించటం ఆటలో భాగమే. అమ్మ, కారణాలు అవసరం లేని ప్రేమకు చిరునామా. వహించటం, భరించటం, క్షమించటం, సహజ సల్లక్షణాలై సహనం రూపు గడితే అమ్మ. మమకారంతో మనసును మార్దవం చేయగల మహితశక్తి, మాతృమూర్తి.

సమస్త జీవరాశుల పట్ల సహజ ప్రేమతో సంచరిస్తూ, సర్వానందమయస్థితిలో అన్ని వేళలా ఉండగలిగిన మాతృశ్రీ, తల్లి పదానికి సోదాహరణం. నిదర్శనమయం, పిపీరి కాది బ్రహ్మ పర్యంతాన్ని ఆత్మగా దర్శించ గలగటం అమ్మ నిరూపించిన మహాపరిసత్యం. ఈ అనుభవాన్ని పొంది, ఆత్మానుభూతిని పొందిన వారెందరో! ఎక్కడి అంబా సముద్రం? ఎక్కడి అర్కపురి ? అదే జిల్లెళ్లమూడి? నాలుగు దశాబ్ధాల క్రితం, రూపుకట్టిన శివమై బ్రహ్మతేజోమూర్తి అయిన పూర్థానంద స్వామి అమ్మను జిల్లెళ్లమూడిలో దర్శించుకోవటం, ఒక అపురూప సన్నివేశం. తన జన్మకు హేతువైన తల్లితో పునఃదర్శించుకోవటం అదనపు అనుభవం.

ఆపై జరిగిన అధ్యాత్మిసాధన తీవ్రమై, కర్మ, భక్తి, జ్ఞాన యోగాతో త్రివేణీ రూపమై, పూర్ణానందులను పరవశులను కావించింది. కామేశ్వరుడి శక్తి అంతా కామేశ్వరిలో ఉంది. బిడ్డ శక్తి అంతా అమ్మలోనే ఉంది. కర్త శక్తి అంతా కర్రితిలో ఉంది. దైవంలో అమ్మను చూడటం ఒక స్థాయి. అమ్మను దైవతంగా దర్శించటం ఒక అనుభవం. పూర్ణానందం శిఖర స్థాయిలో శ్రీశైలమైనది, అమ్మ కడుపు చలువే! తల్లి ప్రేమ మహానందసాగరం! దర్శించగలిగితే శైశవమంతా శివమే! తడమగరిగిన తల్లి దొరికినపుడు, బిడ్డకు లోటుంటుందా?

వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Read more...

మానవతా మణిదీపం

>> Monday, April 22, 2013


తొంభై ఏళ్ల క్రితం జగజ్జననీ చైతన్యం మానవదేహం ధరించి, స్త్రీ రూపం దాల్చి, మాతృభావాన్ని, భారానిన వహించి నేలపై నిలవటం ఒక ఆధ్యాత్మిక వసంతం. ఆది నిత్య చైతన్యహేల. వింధ్య పర్వతాలకివతల, దక్షిణాపథంలో, త్రిలింగ దేశంలో ఒక అవతారమూర్తి ఆగమించటం ఒక మహాద్భుత చారిత్రక సత్యం.శాంభవీ ముద్రలో సహజంగా సంస్థితమైనా, కుర్తాళ పీఠకర్త మౌనస్వామి వారికి సంభ్రమాశ్చర్యాలు కలిగించే రీతిలో దివ్యత్వ స్పర్శను రేఖామాత్రంగా అనుభవమయం చేసినా, దయను, కరుణను, కాలాతీత ప్రజ్ఞను దివ్యపరిమళంగా వెదజల్లినా, భారతీయ చింతనను, వేదాంతాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతినీ సమాజపరం చేసినా, వేదాంతాన్ని అచ్చ తెలుగులో అన్నా...యిదంతా బాల్యదశ! శైశవం మాటున మసలిన మహితత్వం. కాలగమనంలో, తరుణోదయంలో కులమతాలకు, వర్గవర్ణాలకు అతీతంగా సమాజసమస్తాన్నీ ఒడినిలిపి, అక్కున చేర్చుకున్న అమరానందమయి, జిల్లెళ్ళమూడి అమ్మ! సామ్యవాద స్ఫూర్తిని ఆచరణీయం చేసిన ఆనందశాల అమ్మ జీవన గమనం. ఆరు దశాబ్దాలు దేహంలోనూ, మూడు దశాబ్దాలు దేహాతీతంగాను, సర్వవ్యాపిగాను, అమ్మ సంచారమంతా ఒక అనుష్ఠాన వేదాంత భూమిక.

అరవై సంవత్సరాల ప్రయాణంలో అమ్మ చేసిన అంకురార్పణలన్నీ విద్య, వైద్యం, సమాజసేవ, సంప్రదాయ పునరుద్ధరణ, మానవతా వికాసం, వ్యక్తి పరిణామం, అధఙవాస్తవిక జీవన విధానం, జీవన్ముక్త స్థితులు, జీవకారుణ్యం, సమత్వం, సర్వత్రా ఆత్మదర్శనం వంటి మహోదాత్త భావనల చుట్టూ అల్లుకున్న పందిరి. అక్కడ అందరికీ అందరూ. అందరికీ అమ్మ ఆలంబన, ఆశ్వాసన! అమ్మ సంకల్పాలన్నీ రూపుదాల్చి, అవన్నీ మానవతా స్ఫూరిని రగిలించేదాకా ఆరని జ్వాలల వలె వెలుగులీనటం ఈనాటి వాస్తవం. విద్యాలయంలో ప్రజ్ఞాన కీలలు ప్రతిభామంతంగా ఎగుస్తూ, జ్ఞానదీపాలను వెలిగిస్తుండటం నేటికీ అధివాస్తవం. వైద్యాలయంలో అమ్మ అనుగ్రహం ఎందరికో ఆయువునివ్వటం నిత్యసత్యం. తానున్న ప్రదేశానికి అందరిల్లు అని పేరు పెట్టినందుకు వేలాది జనులకది స్వాంతనాలయం. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరికీ పుట్టిల్లు.

బాల్యంలో అమ్మ ప్రేమను అనుభవించి, కాలగమనంలో ప్రసిద్ధులైన వారందరికీ జ్ఞాపకాల పొదరిల్లు, ఎదలుప్పొంగే భావసామ్రాజ్యం. సోదరభావం, సౌమనస్యం వెల్లివిరిసే మహానందభూమిక. అహంకార, మమకారాలను వదులుకోగలిగిన వారికి అమ్మ అనుగ్రహస్తన్యం లభించే అనురాగారామం. "అన్ని బాధల కంటే ఆకలి బాధ భయంకరమైనది. దుర్భరమైనది. అన్నం దొరకక మరణించకూడద''ని అమ్మ వెలిగించిన పొయ్యి అరవై ఏళ్ళుగా ఆరకుండా వెలగటం, అమ్మ భావనాకీల! అదే భావం, అదే స్ఫూర్తి, అదే ఆదరణ, అదే ఆప్యాయత నేటికీ జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయంగా, తల్లి గుండె చప్పుడుగా, సంతృప్తి గీతంగా, మానవజాతి చరిత్ర మీద అక్షరాక్షర అక్షయ చిరముద్ర.

మరణానంతర సుఖం కానిది...
"విన్నవాడు విమర్శిస్తాడు. కన్నవాడు వివరిస్తాడు'' అన్న అమ్మమాట విశ్వజనీనమైనది. ఒక్కసారి ఆశ్రయ దర్శనం చేసుకున్న వాడికి జీవిత మాధుర్యము, సహజీవన సౌందర్యము, సమతాభావనలో దాగిన శక్తి, భగవద్విశ్వాసము, మానవ సంబంధాల స్ఫూర్తి, పంచటంలో వున్న ఆనందం, యివ్వటంలో వున్న తృప్తీ, సంప్రదాయాల బలము, సంస్కృతీ వికాసం, జీవితాన్ని, అధివాస్తవిక దృష్టిలో అనుభవించ గల నేర్పు, ఏ కష్టాన్నైనా ఎదుర్కొనగల ఓర్పు, అవాంఛనీయ మూఢ విశ్వాసాలను దరిచేరనీయని వాస్తవిక దృష్టీ...ఏర్పడి అధ్యాత్మ మరణానంతర సుఖం కాదని స్పష్టత ఏర్పడుతుంది.

ఇవన్నీ ఎవరూ ఎవరికీ చెప్పకుండానే జరిగిపోతయ్. ప్రవచన ప్రవాహం ఎవరినీ ముంచెత్తదు. ప్రబోధ పెనుగాలులు ఎవరినీ తాకవు. ఆచరణకు నోచుకోని సూక్తులు ఎవరినీ గాయపరచవు. భయపెట్టవు. పాశ్చాత్య నాగరకతా ప్రభావం ప్రసరించని పుణ్యభూమిగా స్వస్థితిలో నిలిచిన గంభీర అధ్యాత్మమూర్తి, అందరిల్లు! ఎవరి పనిలో వారు, ఎవరి సాధనలో వారు, కానీ అందరూ ఒకరుగా సాగించే అధ్యాత్మ సాధన, ఒక అనుపమాన దృశ్యం.

"సృష్టిని మించిన మహాత్మన మేమున్నది?
నీకున్నది తృప్తిగా తిని, యితరులకు ఆదరంగా పెట్టుకో!
అంతా భగవంతుడే చేయిస్తున్నాడనుకో!
తమ బ్రతుక బ్రతకలేని బలహీనులున్నారు. వారికి తోడ్పడండి, సమస్త మానవ సమాజము, ఈ సృష్టి భగవంతుడే. సమాజసేవ ఈశ్వరసేవే. ఆ సేవ కలిగించే తృప్తే ఆనందం. అదే ఐశ్వర్యం. తృప్తే ముక్తి'' అంటూ అనాహతనాదంగా సాగిపోతున్న అమ్మ బోధ మహాచైతన్యవిలసితం. నాడు ప్రత్యక్షంగా ఎందరెందరినో ఆదుకున్న ఆదరహస్తం, యిప్పటికీ చందన శీతల స్పర్శగా అమ్మ చేతలుగా అనుగ్రహిస్తూనే వుంది. కన్నీళ్లను తుడుస్తూనే వున్నది. కడుపు నిండా అన్నం పెడుతూనే వుంది. ఇంకా అవిద్యలో కూరుకున్న వారిని, ప్రేమపూర్వకంగా తడుముతూనే వున్నది. మానవతా పరిమళాన్ని వెదచల్లుతూనే వున్నది.

శ్రీరామజననంతో అయోధ్య, శ్రీకృష్ణ సంచారంతో మధుర, రమణాగమనంతో అరుణాచలం, సాయి వలన షిర్దీ, సత్యసాయి వలన పుట్టపర్తి పుణ్యక్షేత్రాలైనట్లే, అమ్మ రావటంతో జిల్లెళ్ళమూడి మహా పుణ్యతీర్థమైంది. వేదాంతాన్ని బోధించటం కన్నా, జీవించటం మిన్న. అన్ని విధాలా అస్తవ్యస్తమౌతున్న సమకాలీన సమాజానికి అమ్మ స్మృతి, ఒక వెలుగురేక, వెన్నెల దారి, పలువన్నెల స్ఫూర్తి తోరణం, జ్ఞానరేఖ, మానవతా స్పృహ! నిరతాన్నదాన మహాయజ్ఞ ప్రకర్తగా, అమ్మ ఒక మానవతా మణిదీపం. నమ్మకమే గాని, అమ్మకాలు తెలియని అమ్మ కాలం యింకా మిగిలే వుంది. చేజారిదంతా గతం. మిగిలినదంతా అంతటినీ వెలిగించగల సంకల్ప సౌందర్యం. అ్మ. అందమంతా అందులోనే వుంది.

వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Read more...

త్రైలింగస్వామి చరిత్ర 62-67

>> Thursday, July 12, 2012

పూర్వజన్మలో మనము ఏమేమి కర్మలు చేశామో, ఎలాంటి స్వభావంగల వ్యక్తులమై ఉన్నామో, ఆ కర్మలఫలాన్ని అనుసరించి, వాటి ప్రమాణాలను బట్టి, తరువాతి జన్మలో వర్తమాన శరీరం నిర్మించబడింది. వర్తమాన జన్మలో మనం చేస్తున్న మంచి చెడు కర్మలు మనకు చక్కగా తెలుసు. మంచి పని చేస్తే మంచి ఫలము, చెడు పనులు చేస్తే దుష్ఫలము అనుభవించవలసి వస్తుంది. దీనిని అందరూ అంగీకరించాలి. వర్తమాన జన్మలో మనము ఎలాంటి మనుష్యులంగా తయారవుతున్నామో, ఈ పనుల వలన భవిష్యజ్జన్మలో ఎలాంటి స్వభావంకల వ్యక్తులము అవుతామో తెలుస్తుంది. చక్కగా ప్రయత్నం చేస్తే మనంతట మనమే అదంతా తెలుసుకోగలము. ఇతరుల సహాయం అక్కరలేదు.
వర్తమన జన్మ యొక్క ఇహలోకమే పూర్వజన్మ యొక్క పరలోకము. అలాగే వర్తమాన జన్మ యొక్క పరలోకము భవిష్యత్ జన్మ యొక్క ఇహలోకము. ఈ స్థూల శరీరంలోపల మరొక శరీరం కూడా వున్నది. దాని పేరే సూక్ష్మశరీరము. దానిలోపల మరొక శరీరం ఉన్నది. అ కారణ శరీరము. అరటి చెట్టులోని పొరలలాగా ఒకదానిలో ఒకటిగా ఉన్న ఈ త్రివిధశరీరమే సంసార ప్రవాహంలో ప్రకాశిస్తున్నది. మానవశరీర నిర్మాణము- ఆకృతి, వర్ణము, స్వభావము, పండితుడు లేదా మూర్ఖుడు, కఠోర స్వభావుడు లేదా నమ్రస్వభావము, పండితుడు లేదా అధర్మవర్తి, సాధువు లేదా అసాధువు, సరళస్వభావుడులేదా కుటిలుడు, రాజులేదా జమిందారు, మధ్య తరగతివాడు లేదా పేదవాడు, ఉన్నత వంశస్థుడు లేదా నిమ్న వంశస్థుడు వంటివి అన్నీ పూర్వజన్మ కర్మానుభవంవలన వర్తమాన శరీరంగా ఏర్పడినవి. అదేవిధంగా తిరిగి ఈ జన్మ యొక్క ఫలాన్ని అనుసరించి, భవిష్యత్ జన్మ యొక్క శరీరము తయారవుతుంది.
జన్మనుంచి మృత్యువువరకూ ఉన్న కాలమును ఆయువు అంటారు. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే జీవుని ఆయువు అనంతమైనది. జీవుడు అక్షరుడు, అపరుడు. జీవుడు నశించిన తరువాతనే ఆయన ఉపకరణములు నశిస్తాయి. జీవుడు ఎంత పుణ్యాత్ముడైతే అతని ఆయువు కూడా అంత ఎక్కువగా ఉంటుందని, అతడు అంత ఎక్కువ కాలం జీవిస్తాడని సాధారణంగా నమ్ముతారు. కాని అది పొరపాటు. జీవుడు ప్రపంచానికి ఎంతోదూరంగా ఉంటాడు. ఆయనను పాపము స్పృశించదు. జీవుడు కర్మఫలాన్ని అనుభవించటానికి ఈలోకానికి వస్తాడు. ఎందుకంటే ప్రపంచము కర్మఫలమును అనుభవించే స్థానము. పుణ్యాత్ములైనవారు ఎప్పుడు కర్మఫలమును అనుభవించలేరు.
అందువల్లనే జీవుడు కర్మఫలమును పూర్తిగా అనుభవించిన తరువాతనే పాపములనుండి విముక్తుడవుతాడు. అంతవరకూ అతడు ప్రపంచంలోనే ఉండవలసి వస్తుంది. పుణ్యాత్ములైనవారు చాలారోజుల వరకు ప్రపంచంలో ఉండవలసి వస్తుంది. పుణ్యాత్ములైనవారు చాలా రోజులవరకు ప్రపంచంలో ఉండాలి. అలాగే పాపాత్ములైన వారు కూడా ఈ ప్రపంచంలోనే ఉండి తమ కర్మఫలాన్ని అనుభవించాలి. కర్మఫలము సమాప్తమైన వారు ఈ ప్రపంచం నుండి విముక్తులవుతారు. జీవితము ఎంత తొందరగా లయించిపోతే అతడు అంత పుణ్యాత్ముడు. పాపంనుండి విముక్తుడయ్యాకనే ఈశ్వరునిలో లయమవుతాడు. అప్పుడు అతని ఆయువు అనంతమై, భగవంతుని సంకల్పం ఉన్నంతవరకూ అతని శక్తి ఉంటుంది. మనిషి ఈ విధంగా పాపపుణ్యాల ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువల్లనే కర్మఫలము పరిసమాప్తము కాకపోతే మళ్లీ మళ్లీ ఈ ప్రపంచంలో పుట్టవలసి వస్తుంది. పంచ భూతముల ప్రతిమ అయిన ఈ మానవుడు మృతి చెందిన తరువాత ఎక్కడికి వెళతాడు. లేక మృత్యువే చివరిదా? అని అడిగితే మనుష్యులు తమ కర్మఫలమును ఈ జన్మలోనే అనుభవిస్తారని, మృత్యువే చివరిదని ఇంగ్లీషు వారంటారు. ఆ విధంగా అనటం అన్ని విధాలా పొరపాటని చెప్పనవసరం లేదు. ఈశ్వరుడు ఉన్నాడంటే పరజన్మకూడా ఉన్నదని తప్పకుండా స్వీకరించాలి.

ఒకవేళ ఈశ్వరుడు ఉన్నాడంటే మనుష్యుని ఆత్మకూడా ఉన్నదని ఒప్పుకోవాలి. ఈశ్వరుని నశింపజేయలేనప్పుడు, ఈశ్వరుని శక్తిని, మనిషిని, ఆత్మను నశింపజేయలేము. ఒకవేళ పరజన్మ లేదంటే ఈశ్వరుని దయామయుడని ఎప్పుడూ అనలేము. అందుకు కారణము ఈ జీవితంలో ఒకడు రాజుగా, ఒకడు ప్రజగా ఒకడు ధనవంతుడుగా, ఒకడు దరిద్రుడుగా, ఒకడు పెద్ద ఇంట్లోను మరొకడు చిన్న ఇంట్లోను ఎందుకు పుడతారు? పూర్మజన్మలో చేసిన కర్మప్రకారము దాని ఫలము పూర్తికాకపోతే మిగిలిన కర్మఫలము ననుసరించి మరొక శరీరము ధరిస్తారు.
అందుకు స్పష్టమైన ప్రమాణము పుట్టకతో గ్రుడ్డివారైనను ఈ జన్మలో ఏమీ చూడలేరు. కాని మిగిలినవారందరూ చక్కగా చూడగలుగుతున్నారు గదా! దానికి కారణం ఏదైనప్పటికీ పూర్వజన్మ పాపఫలాన్ని అనుభవిస్తున్నామని మాత్రం ఒప్పుకోరు. ఈ జన్మలో లభించిన శరీరము, ఆకారము, స్వభావము, జ్ఞానము మొదలైనవన్నీ పూర్వజన్మ కర్మఫలము వలననే సంభవించినాయని నమ్మాలి. ఈ జన్మలో దొంగతనం వృత్తిగా స్వీకరించి జీవనము గడుపుతున్నవాడు పూర్వజన్మలో కూడా వాని ఆకారము, స్వభావము, రాక్షసునివలె కఠినమై ఉండి ఉంటుంది. అలాగే ఈ జన్మలో ధర్మాచరణముతో జీవితము గడుపుతున్నవాని ఆకార స్వభావములు పూర్వజన్మలో కోమలంగా ఉండి ఉంటాయి.
ఒకడు తన జీవితాన్ని సంపూర్ణంగా ధర్మాచరణతో గడుపుతూ ఉన్నప్పటికీ సుఖంగా లేడు ప్రపంచంలో నానా రకాలైన కష్టాలనూ పొందుతున్నాడు. మరొకడు అతి గర్హితములైన పనులు చేస్తూ లంపటుడై రాక్షస ప్రవృత్తిలో తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. ఇదంతా పూర్వజన్మకు ప్రమాణము మాత్రమే. కాని ఒకడు జీవితంలో ధర్మాచరణ చేసినా సుఖమును పొందటంలేదు. అయినప్పటికీ అతడు ఎప్పుడో ఒకప్పుడు సుఖమును పొందవచ్చును. కాని ఈ జన్మలో కష్టపడుతున్నాడంటే అదంతా పూర్వజన్మ కర్మఫలమనే చెప్పవచ్చును. వాటిని అనుభవించే సమయం ఆసన్నమైనా, అతడు కష్టాలను పొందుతున్నాడు. రెండో వ్యక్తి పూర్వజన్మలో చేసిన సుకృతమునకు అనుభవించటానికి సమయం ఆసన్నమైనది కనుక అతడు సుఖ జీవనం గడుపుతున్నాడు. కాని దాని తరువాత అతడు ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. పాప కర్మలు అనుభవించటం ఈశ్వరునివల్లనే అని, అట్లాగే పుణ్యకర్మలు అనుభవించటమూ ఈశ్వరుని దయే అని కొందరు అనుకొంటారు. ఇదంతా అజ్ఞానంతో కూడిన అభిప్రాయము.
మన ప్రవృత్తులు, ఇంద్రియములు మంచి చెడులను చేయిస్తాయి. కోపపడితే అనిష్టం జరుగుతుంది. కామం ఉంటే కావాలనే కోరిక నెరవేరవచ్చును. లోభం ఉంటే ఇతరుల ద్రవ్యాలను అపహరించే చేష్టలు జనిస్తాయి. అహంకారంవలన ఇతరులకు అనిష్టం చేసే ఆలోచన కలుగుతుంది. ఇట్లా ఏది దేని ధర్మమో, అది ఆ పని చేయిస్తుంది. అందువల్లనే భగవంతుడు మనిషికి హితాహిత విచక్షణా శక్తినిచ్చి, జీవరాశిలో శ్రేష్టునిగా చేశాడు. మృత్యువుతో ఆత్మ నశించదు. అట్లా కాకపోతే ఈశ్వరునకు ప్రతిరోజూ అనేక ఆత్మలను సృష్టించవలసి వచ్చేది. దానివలన భగవంతుని పని ఎంతో పెరిగిపోయేది. అది సర్వశక్తిమంతమైనది.
శరీరం నశించిపోయినా ఆత్మకు ఎలాంటి హానీ కలుగదు. ఇల్లు నాశనమైపోయినా ఇంటిలోని ఆకాశానికి ఎలాంటి క్షితీ కలుగదు కదా! ఆత్మ దేనినీ చంపదు. దేని చేతనూ చంపబడదు. ద్వేషము సంతాపనమునకు, సంసార బంధమునకు కారణము.
ద్వేషమునకు మృత్యువునకు సంబంధము. అందువలన బలవంతంగానైనా ద్వేషమును త్యజించాలి. సుఖ దుఃఖములు మనస్సుకు ఉంటాయి. కాని ఆత్మకు ఉండవు. ఆత్మ వాయువులాగా నిర్మలము, నిర్లేపము. అయినా ఈశ్వరమాయచే మోహితులమై మనము సుఖముదుఃఖములను అనుభవిస్తూ ఉంటాము. విశ్వమోహిని- అనాది- అవిద్యా అనే వాటి పేరే మాయ. కేవలం పుట్టక చేతనే ఆ అవిద్య లేదా మాయతో జీవునకు సంబంధం ఏర్పడుతుంది.
అప్పుడది సంసార బంధమవుతుంది. మనస్సు, బుద్ధి, అహంకారములు జీవునకు సహకరిస్తాయి. ఎవరు చేసిన కర్మఫలాన్ని వారే అనుభవించాలి. అంటే ఎవరి కర్మఫలం ఎట్లా ఉంటుందో, వారు అలాంటి ఫలానే్న అనుభవిస్తారు. తిరిగి జన్మించినప్పుడు జీవుడు మనస్సు మొదలైన వాటన్నింటితో సంబంధంకలిగి శరీర ధారణ చేసే బాధ్యత వహిస్తుంది. జీవుడు ముక్తుడు కానంతవరకూ అదే ప్రకారం పరిభ్రమించవలసి ఉంటుంది.
శరీరమే మనస్తాపమునకు మూలము. శరీరమే సంసార కారణము. కర్మఫలము వల్లనే ఈ శరీరము పుట్టినది. కర్మ రెండురకాలు: పాపము, పుణ్యము అనేవి. పాపపుణ్యముల ననుసరించియే శరీరధారికి సుఖదుఃఖాలు కలుగుతాయి. ఎంత పాపంచేస్తే అంత దుఃఖము, ఎంత పుణ్యం చేస్తే అంత సుఖము లభిస్తాయి. రాత్రి పగళ్లుగా అవి ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. ఈ అనుభవములు పూర్తి కానంతవరకూ ముక్తి లభించదు.
జీవుని శరీరమునకు కర్త ఆత్మ. ఆత్మహీనమైన శరీరానికి సుఖదుఃఖములు కలుగవు. శబ్ద స్పర్శ రూప రస గంధములలో దేనికీ జ్ఞానం ఉండదు. ఆత్మ శరీరమునకు కర్త అని నిశ్చయమైంది. సుఖ దుఃఖముల అనుభవము శరీరమునకు ఆత్మ లేకుండా కలుగవు. ఆత్మ ఏకాకిగా వెళ్లిపోతుంది. శరీరము దాని వెంట పోదు. అందువలన కేవలము ఆత్మను శిక్షించటం అసంభవము. ప్రతి ఒక్క శరీరంలోను భగవంతుడు ఆత్మ రూపంలో ఉన్నాడు. జీవాత్మ పరమాత్మ యొక్క అంశ మాత్రమే! పాపము అనేక రకాలు అయినట్లు, వాని శిక్ష కూడా అనేక రకాలుగా ఉంటుంది. అట్లాగే పుణ్యముకూడా అనేక రకాలు. దానివలన కలిగే ఆనందం కూడా అనేక రకాలుగా ఉంటుంది. చేసినపాపానికి శిక్ష పరితాపమే. అట్లాగే చేసిన పుణ్యానికి పురస్కారము ఆనందము. పాప పుణ్యములను నిర్ణయించటానికి మానవ హృదయమే ఒక త్రాసు పుణ్యంవలన సంతోషము, పాపంవలన పరితాపము అనేవి మానవ హృదయంలోనే జన్మించి, అతను చేసిన కర్మకు తగిన ఫలాన్ని ఇస్తాయి. ఈ పరిణామాలను గ్రహించినవారు బుద్ధిమంతులై, పాపము నుంచి తమను తాము మరల్చుకొంటారు. ఆ విధంగా పాప పుణ్యములను గురించి ఆలోచన, వాటి ఫలభోగము ఈ జగత్తులోనే అవుతాయి. పంచ భూతములు కేవలం పరమాణువుల సమాహారమే. పరమాణువు అవినాశకము. అందువలన పంచభూతములు కూడా అవినాశకములే. మృత శరీరము పంచభూతములు కూడా అవినాశకములే. మృత శరీరము పంచభూతాలలో కలిసిపోతుంది. ఈనాడు నీ ముందున్న శరీరము పూర్వజన్మలోని ఏదో జీవి యొక్క శరీర పరమాణువుల చేత నిర్మితమైనది. అందువలన ఒకప్పుడు ఉండిన జీవి యొక్క పూర్వజన్మ ఫలమే నీ ముందున్న మానవుడు.
ఏ ఆత్మ ఎంత పరిమాణంలో పాపం నుంచి విముక్తి పొందుతుందో, ఏ ఆత్మ విషయభావనా శూన్యమైనదో, ఆ ఆత్మ అంత గొప్పది. ధార్మికుని ఆత్మ పాపి యొక్క ఆత్మ కంటెగొప్పది. ఆ ఉన్నత ఆత్మ శరీరాన్ని త్యజించినప్పటికీ అది ఉన్నతమైన ఆత్మగానే ఉంటుంది. ఆత్మ పురుషుడు; శరీరము ప్రకృతి. ఆత్మ- ప్రకృతికి సమీపం కానంతవరకూ అది వాసనాత్మకమై ఉంటుంది. అది శరీరమును త్యజించగానే పూర్వస్థితిని పొందుతుంది. ఆత్మ ప్రారంభ దశలో నిర్గుణమైనప్పటికీ, శరీరస్థమైనప్పుడు సగుణ సంపన్నమవుతుంది. అది పాపం నుంచి విముక్తిని పొందనంతవరకూ పాపఫలమును అనుభవిస్తూనే ఉంటుంది.
పశు శరీరము నుంచి మనుష్య శరీరాన్ని ధరించటానికి, దాని స్వభావంలో మార్పు తీసుకొని రావటానికి ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పశువు నుంచి మనుష్యుడు కావటం ఎంత కష్టమో, మనిషి నుంచి పూర్ణ మనుష్యత్వం పొందటం అంత కష్టము. మనిషి నుంచి దేవత్వం పొందటం ఎంత కష్టమో, మనిషి నుంచి ఉత్తమ మనుష్యత్వం పొందటం అంతకన్నా కష్టము. శుభకార్యములను అనుష్ఠించచి మనుష్యుడు దేవుడు కావచ్చు కాని అనాయాసంగా నిజమైన మనుష్యుడు మాత్రం కాలేడు.

సమస్త భోగాలమీది ఆశలను త్యజిస్తే కాని ముక్తి మందిరంలో చేరలేడు. సకామమైన శుభకార్యముల వల్లముక్తి మార్గం మరీ దుర్లభమైపోతుంది. స్వర్గలోక భోగములను అనుభవించటం పూర్తి అయిన తరువాత జీవుడు తిరిగి మర్త్యలోకంలో ప్రవేశించటానికి యోగ్యమైనది అవుతుంది. అందువలన మహాపురుషులు ఎప్పుడూ స్వర్గలోకమును కోరుకోరు.
ఎందుకంటే - కర్మఫల భోగము తప్ప, స్వర్గముకూడా చిరస్థాయియైనది కాదు. అసలైన మనుష్యత్వాన్ని పొందటానికి ఇంద్రియాల విజృంభణను అరికట్టాలి. అరిషడ్వర్గ వశీకరము, అంతఃకరణ విశుద్ధీకరణ, అన్నింటియందును సమదృష్టి, అభిమాన త్యాగముమొదలైనవి మనుష్యత్వసిద్ధికి ప్రధాన మార్గములు. అవేకాక- శవము, దమము, తితిక్ష, సమాధానము శ్రద్ధ, ఉపరతి వంటి గుణాలు కూడా మానవునిలో ఉండాలి.
మనుష్యత్వం పొందినప్పటికీ మానవునికి సహజంగా ముక్తిమీద కోరికుండదు. విషయ భోగాలలో ఎంతవరకూ కష్టం అనుభవించడో, అంతవరకూ జీవుడు మహా జితేంద్రియుడు- యోగీంద్రుడు అయినప్పటికీ మోక్షమును సాధించలేడు. మోక్షమును సాధించటానికి ప్రధానోపాయము వాసనలను త్యజించటమే. ముక్తి కావాలనుకొన్నా ముక్తి కూడా లభించదు. మహాత్ముల సత్సాంగత్యంవలన తొందరగా ముక్తి లభిస్తుంది. జీవునికి తన సుకృతంవలననే ఆ సత్సాంగత్యం లభిస్తుంది. సాధువులు సాధారణంగా నిర్జన ప్రదేశాలలో ఉంటారు. వారు సహజంగా కనిపించినా వారిని మనము గుర్తించలేము.
ఒకవేళ మనం వారిని గుర్తిస్తే, వారు మనను తమ సమీపంలో ఉండనివ్వరు. ఒకవేళ వారికి సమీపంలో ఉండగలిగే అధికారం సంపాదించుకొన్నా వారి నిర్మల హృదయ సహాయమును సాధించలేము. ఒక సాగరమును తరించటనికి నావ సహాయం అవసరమైనట్లుగానే, ఈ సంసార సాగరాన్ని తరించటానికి మహాత్ముల నిర్మల హృదయ సహాయం అవసరము. సత్సాంగత్యమువలన అంతా సులభం అవుతుంది. ధార్మికుని ఆత్మ ధర్మబలంచేత క్రమంగా ఉన్నతిని పొంది, ఆ తరువాత మోక్షమును పొందుతుంది. అలాంటి ఉన్నతి ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో సాధ్యం అయ్యేది కాదు. ఎంతోకాలం ప్రయత్నం చేస్తే కాని మోక్షం లభించదు. దానికి వ్యతిరేకంగా పాపాత్ముని ఆత్మ అధోగతిని పొందుతుంది. స్వర్గనరకములు ఏవీ లేక, ఆత్మకు ఉన్నతి- అవనతి మాత్రమే ఉంటాయి. ఆత్మౌన్నత్యము. ఆత్మ అవనతుల ననుసరించి వివిధ అవస్థలను పొంది మానవుడు జన్మిస్తాడు.
ఈ విశాల ప్రపంచంలో ఎవరు ఎక్కడ జన్మిస్తారో పరిశోధించి తెలుసుకోలేము. అందువలననే మానవులు పునర్జన్మను విశ్వసించరు. పునర్జన్మను కాని, పూర్వజన్మను కాని మనము చూడలేము. పునఃజన్మించిన వారెవ్వరూ వచ్చి చెప్పలేదు. కేవలము అనుమానము- యుక్తుల చేత మాత్రమే నమ్మవలసి ఉంటుంది. లేకపోతే- ధర్మాధర్మములకు, పాపపుణ్యములకు ఎలాంటి తేడా ఉండదు. మనుష్యుడు పాపం చెయ్యటానికి ఎందుకు భయపడతాడు? అందుకు కారణము పరజన్మ మీది విశ్వాసమే! పరజన్మలో ఘోరమైన నరకయాతనలు అనుభవించవలసి వస్తుందనే భయమే అందుకు కారణము.
ఈ జీవితంలో ఒకరు విద్వాంసుడు, ఒకరు మూర్ఖుడు, ఒకరు పండితుడు, ఒకరు జ్యోతిష్యుడు, ఒకరు గొప్ప గాయకుడు, ఒకరు గొప్ప వాద్య నిపుణులు కావటానికి కారణము వారు పూర్వజన్మలో అందులో సంపాదించిన నైపుణ్యమే. ఈ శరీరములోని ఆత్మ అదే కాని శరీరము మాత్రం భిన్నమైనది.
అందువలన వారికి ఆ విషయాలు సహజంగా లభిస్తాయి. అంతేకాని నేర్చుకోటానికి ప్రత్యేకంగా కృషి చేయనక్కరలేదు. కర్మఫలం లేకపోతే అలాంటి భేదాలు ఉండవు. మంచి కర్మలకో, చెడు కర్మలకో అతడు ఇంత కష్టపడవలసిన అవసరం ఉండదు. మంచి పనులు చేస్తే ఉచ్చదశ లభిస్తుంది. చెడ్డ పనులు చేస్తే నీచ దశ లభిస్తుంది
.ఆత్మబోధకు అర్థము- మనను మనం తెలిసికొనటం. మనను మనం తెలుసుకోగలిగితే భగవంతుని కూడా తెలుసుకోగలము. మనను మనం తెలుసుకోలేనంత వరకూ భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నించినా తెలుసుకోలేము. మనమేమిటో తెలుసుకోవాలంటే ఆత్మ- మనస్సు - బుద్ధి అన్న మూడింటి తత్త్వాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది.
సూర్యుడు భూమికి ఎట్లా కర్తో, అట్లాగే ఆత్మ శరీరానికి ప్రధాన వస్తువు, యజమాని, కర్త. సూర్యుని కిరణాల ప్రసరణవల్లనే, అన్ని జీవులు తమ తమ కార్యాలను చేసుకోగలుగుతున్నాయి. వాస్తవానికి సూర్యుడు ఏమీ చెయ్యడు. అలాగే మనుష్య శరీరంలో ఆత్మయే సూర్యునిలాగా కర్తయై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశంవల్లనే ఇంద్రియాలు పనిచేస్తాయి. అంతేకాని ఆత్మ నిజంగా ఏమీ చెయ్యదు. ఇప్పుడు ఆత్మ సాకారమా నిరాకారమా అని తెలుసుకోవాలి. అంతేకాక శరీరంలో ఏ స్థానంలో, ఎట్లా అది ఉన్నదో తెలుసుకోవాలి. ఆత్మ అని చెప్పబడే దానికి హద్దులున్నాయి. కాని దానికి దేనితోనూ పోల్చగల ఆకారం లేదు. మన ఆత్మ- ఇతరుల ఆత్మ రెండూ ఒకే రకమైనవి. ఒక కాగితం మీద నానా రకాల చిత్రాలు చిత్రింబడినప్పటికీ వాటన్నింటికీ ఆ కాగితమే ఆధారమైనట్లు, జగత్తులోని అన్నింటి ఆత్మ ఒక్కటే! ఆత్మను గురించి మనం కొన్ని రోజులు మననం చేసినప్పుడు, ఆ ఆత్మ అగ్నికణంలాగా ప్రకాశిస్తున్నదని నిశ్చయంగా తెలుసుకొంటాము. ఆత్మ ఉన్నది కనుక పరమాత్మకూడా ఉన్నట్లే. అదే ఈశ్వరుడు. ఆత్మయొక్క విశిష్ట రూపమే ఈశ్వరుడు. అందువలన ప్రయత్నం చేస్తే అది తప్పక కన్పిస్తుంది. ఎందరో మహాపురుషులు దానిని చూశారు. ఇంకా ఎందరో చూస్తారు. కనుక ఆత్మ సాకారమైనదనటంలో సందేహం లేదు. ఆత్మను తెలుసుకొంటే పరమాత్మను తెలుసుకోవచ్చు. అట్లాగే పరమాత్మను తెలుసుకొంటే భగవంతుని లేదా ఈశ్వరుని తెలుసుకోవచ్చు. ఆత్మ పరమాత్మ యొక్క అంశమే అనేది నిశ్చయమైన విషయము. అందువలన, ఆత్మను తెలుసుకొంటే పరమాత్మను తెలుసుకోవచ్చు.
మనస్సు- బుద్ధి సకారములా, నిరాకారములా అని తెలుసుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. మనస్సు విశ్వవ్యాప్తి కాదు. అది కొన్నిపరిధులు వరకే పరిమితమై ఉంటుంది. కనుక మనస్సు ఒక వస్తు విశేషమే అని నిశ్చయమవుతుంది. కొంతమంది ఇది మా మనస్సు, ఇది నీ మనస్సు అని అంటారు. ప్రతి మనిషీ చేసే పనులు వేరు వేరుగా ఉంటాయి. అట్లాగే మనస్సు చేసే పనులు కూడా వేరు వేరుగా ఉంటాయి. ఇదికూడా ఆలోచిస్తే తెలుస్తుంది. అందువలననే మనస్సు కూడా సాకారమైనది. ఒకవేళ మనస్సు స్థానవ్యాపకతా రూపమైన ధర్మమును స్వీకరించకపోతే, దానిని వస్తువు అనరాదు. అప్పుడు మనస్సును ఏదో ఒక ప్రకారమైన స్థానవ్యాపకతా ధర్మ విశిష్ట వస్తువు యొక్క గుణమని అనాలి. సామాన్యంగా స్థూల ఇంద్రియాల సహాయం లేకుండా, ఏ ద్రవ్యమూ ఆకారమును పొందదు. కనుక మనస్సు యొక్క ఆకారము ఏ రూపంలో ఉన్నదో అర్థం కాదు. ఆకార శబ్దపు యదార్థ అర్థం తెలిస్తే ఎవరికీ ఏ రకమైన ఇబ్బందీ ఉండదు. ఒక్కసారి ఆలోచించి చూడు- నీ మనస్సు నీ శరీరం కన్న సంపూర్ణమైన భిన్న వస్తువుగా ఉండి కూడా, నీ శరీరంలోని ఏ భాగంలోను లేదు. అట్లా ఉండటం కూడా ఎప్పుడూ జరుగదు. కనుక మనస్సు సాకారమైనదని నిశ్చయమవుతుంది. అంతేకాక దానిని బట్టి మనస్సు యొక్క కార్యములు కూడా విభిన్నములని తెలుస్తుంది.
బుద్ధి జగద్య్వాపి కాదు. కాని దానికి ఏదో ఒక హద్దు ఉన్నదనేది నిశ్చయమైన విషయము. కనుక బుద్ధికూడా ఒక వస్తు విశేషమే. అందరికీ బుద్ధిసమానంగా ఉండదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరికి బుద్ధి తక్కువగా ఉంటుందో వారిని బుద్ధిహీనులని అంటారు. బుద్ధి ఒక స్థానాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు అది సాకారమైనదనటంలో సందేహం లేదు. బుద్ధి మంచి చెడులను విచారిస్తుంది అనేది తెలిసిన విషయమే.
 మనస్సు - బుద్ధి రెండూ తలలో ఉంటాయిని సహజంగా తెలుసుకోవచ్చును. జీవశరీరంలో బుద్ధి అద్దంలాగా ఉంటుంది.
ఒక్క ప్రణవ మంత్రంవల్లనే ఈ జగత్తులో సృష్టి స్థితి లయ కార్యములు జరుగుతున్నాయి. ఆ ప్రణవ మంత్రాధి దేవత అగ్ని. ఈ అగ్నిలోని శక్తివల్లనే జగత్ చక్రం తిరుగుతున్నదని హిందువులు అనుకొంటారు. కాని అగ్నిగత శక్తి చైతన్యవంతమైనదని వారు భావించరు. హిందువులకు ప్రణవమంత్ర లక్ష్యం అగ్నిగతశక్తి. అది బ్రహ్మ. దాని గుణము చైతన్యము.
మన వ్రేలు మన చేతితో కలిసి ఉన్నంతవరకూ అది చైతన్యవంతమై ఉంటుంది. ఆ వ్రేలిని కోసి దానిని మన నుంచి వేరు చేస్తే దానిలో చైతన్యం ఉండదు. అది అచేతనమైన జడపదార్థం అయిపోతుంది. ఈ సమస్త జగత్తు చేతనామయుడైన ఒక పురుషుని శరీరము మాత్రమే. అది భిన్న భిన్న శక్తులకు ఆధారము. అగ్ని, వాయువు, నదులు, పర్వతములు, మట్టి మొదలైనవన్నీ ఆ శరీరముయొక్క అంగములు. అగ్ని అచేతనామయ పురుషునికన్న భిన్నము కాదని తెలిస్తే అందులో చైతన్యం ఉన్నట్లు తెలుస్తుంది. అచేతనామయ పురుషునితో అగ్నికి సంబంధం లేదనుకొనేవాడు అగ్ని జడపదార్థం అనుకొంటాడు.
ఆత్మ ఎల్లప్పుడు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అది అన్నిచోట్లా ప్రకాశించదు. అది నిర్మల బుద్ధియందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఇంద్రియాలు తమ తమ పనులో నిమగ్నమై ఉండటంవల్ల ఆత్మయే అన్ని పనులలోనూ నిమగ్నమై ఉన్నట్లు అవివేకులు అనుకొంటూ ఉంటారు. ఉదాహరణకు మేఘములు పరిగిడుతూ ఉండటం వలన చంద్రుడు పరిగిడుతూ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. సూర్య కిరణముల ఆధారంగా మనుష్యులు తమ తమ పనులు చేసుకొంటూ ఉన్నట్లు, శరీరము- ఇంద్రియాలు- మనస్సు - బుద్ధి అనేవి చైతన్య స్వరూపమైన ఆత్మను ఆశ్రయించి తమ తమ పనులు చేస్తూ ఉంటాయి.
అనురాగము, కోరిక, సుఖము, దుఃఖము మొదలైన వృత్తులు బుద్ధిలోనే కలుగుతాయి. ఆత్మలో కాదు. కారణమేమిటంటే- సుషుప్తి అవస్థలో ఆత్మ ఉంటుంది, కాని బుద్ధి ఉండదు. కనుక, ఆ సమయంలో రాగము- కోరిక వంటివి ఉండవు. ఏ విధంగా సూర్యుని లక్షణము ప్రకాశము, జల లక్షణము శీతలత్వము, అగ్ని లక్షణము ఉష్ణత అయి ఉన్నాయో, అట్లాగే సత్యము, చైతన్యము, ఆనందము, నిత్యత, నిర్మలతలు ఆత్మస్వభావములు. ఆత్మ యొక్క అస్తిత్వము, చైతన్యపు అంశ, బుద్ధివృత్తుల సంయోగంవల్లనే అవివేకులైన వారిలో ‘మాకు తెలుసు, మేము చేస్తున్నాము’ వంటి ప్రవృత్తులు కలుగుతున్నాయి.
ఆత్మకు ఎలాంటి వికారమూ లేదు. ఏ పరిస్థితులలోను బుద్ధి ఆత్మను ప్రబోధించలేదు. అందువలన జీవుడు ఆ సంయోగ వస్తువును తెలుసుకొని, ‘మేము జ్ఞానులము, మేము ద్రష్టలము’ అన్న జ్ఞానంతో ముగ్ధులవుతున్నారు. ఎట్లాగంటే-త్రాడులో సర్పభ్రాంతి కలిగినప్పుడు, సర్పభయం కలుగుతుంది. కాని అది త్రాడు అని తెలిసిన తరువాత ఆ భయం ఉండదు. అట్లాగే జీవునిలో ఆత్మకు జీవజ్ఞానమున్నట్లు భావిస్తే భయం కలుగుతుంది. మనము జీవులము కాము, మనము పరమాత్మయే అనుకొన్నపుడు ఇక భయం ఉండదు.
మనస్సు, బుద్ధి, మొదలైన ఇంద్రియాలను ఆత్మ ప్రకాశింపచేస్తుంది. అచేతనమైన బుద్ధి మొదలైన ఇంద్రియాలను ఆత్మను ప్రకాశింపజేయలేవు. ఎట్లాగంటే- దీపం అన్ని వస్తువులనూ ప్రకాశింపజేస్తుంది. కాని దీపాన్ని ఏ వస్తువూ ప్రకాశింపజేయలేదు. దీపానికి దాని స్వరూపమైన ప్రకాశం ఉండగా మరొక దీపం యొక్క అవసరం లేనట్లు, ఆత్మకు కూడా తన స్వరూపము తెలిసిన తరువాత మరొక జ్ఞానము యొక్క అవసరం ఉండదు.
అవిద్యవలన ఉత్పన్నములైన దృశ్య వస్తువులన్ని నీటి బుడగలలాగా నశించిపోయేవే! ఈ సమస్త వస్తువులకూ పైన ఏ నిర్మల బ్రహ్మమున్నదో అదే మనమని తెలుసుకోవాలి. ఇది మన శరీరము కాదు.
- ఇంకాఉంది
[ తెలుగు అనువాదం: ఆచార్య హరిశివకుమార్ ఆచార్య రేగులపాటి మాధవరావు]



Read more...

త్రైలింగ స్వామిచరితం -౩

>> Sunday, May 13, 2012

తన ఎదుట ఉన్న దైవస్వరూపులైన స్వామివారి పాదాలను పట్టుకొని నమస్కరించి, తనకు సంక్రమించిన భయంకర వ్యాధి నుంచి విముక్తిని ప్రసాదించమని ప్రార్థించాడు. కరుణామయులైన స్వామీజీ గంగానదిలోని మట్టిని తెచ్చి తినమని చెప్పి, తాము స్నానానికి వెళ్లిపోయారు.
ఆ బ్రాహ్మణుడు భక్తిప్రపత్తులతో స్వామి చెప్పినట్లు చేసి, కొద్ది రోజులలోనే రాజయక్ష్మం రోగం నుంచి పూర్తిగా విముక్తుడై దివ్య తేజస్సును పొందాడు. అప్పటినుంచీ అతడు స్వామివారిని సాక్షాత్తు భగవంతునిగానే భావించి సేవ చేయసాగాడు. స్వామివారి పాదధూళిని పరిగ్రహించి, పాదసేవ చేసి, కృతార్థుడయినయితినని భావించేవాడు.
కొన్ని దినాలకు గణపతిస్వామి వేదవ్యాసాశాశ్రం వదిలి, హనుమాన్ ఘాట్‌లో నివసింపసాగారు. ఒక మహారాష్ట్ర మహిళ ప్రతిరోజు విశ్వనాథుని సేవించటానికి వస్తూ ఉండేది. దిగంబరులైన స్వామిని చూసి తిరస్కార భావంతో తొలగిపోతూ ఉండేది. గణపతిస్వామి వారు మాత్రం ఆమెను పట్టించుకొనేవారు కారు. ఒక రోజు ఆమె విశే్వశ్వరుని పూజ పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వచ్చింది.
ఆ రాత్రి విశ్వనాథుడు ఆమెకు కలలో కనిపించి ‘‘నీవు ఏ కోరికను పొందవలెనని పూజ చేస్తున్నావో అది నాతో నెరవేరదు. ఏ స్వామివారిని నీవు తిరస్కరిస్తున్నావో ఆయనవల్లనే నెరవేరుతుంది’’ అని చెప్పాడు. అది విని ఆమె ఎంతో పశ్చాత్తాపపడి, తన మనస్సులో పరితపించసాగింది. స్వామివారిని అకారణంగా తిరస్కార భావంతో చూసినందుకు ఎంతో తప్పు చేసిట్లు భావించింది. కాని, స్వామివారు ఏమీ అనకపోవటంవలన తనపట్ల ఆయన దయచూపుతారని ఆశించింది.
మరునాడు ప్రొద్దున ఆమె హనుమాన్ ఘాట్‌కు వెళ్లి, స్వామివారి పాదాలమీదపడి క్షమించమని వేడుకొని- ‘‘నా భర్తకు కడుపులో ఒక పెద్ద పుండు ఉన్నది, దానిని నయము చెయ్యమని ప్రతిరోజు విశ్వనాథుని పూజిస్తున్నాను’’ అని విన్నవించుకొన్నది. ఆమె ప్రార్థనను విన్న స్వామివారు ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి, దానిని అతని వక్షస్థలం మీద వ్రాయమని చెప్పారు. గణపతి స్వామివారికి ఆమె భక్తిప్రపత్తులతో నమస్కరించి, ఇంటికి వెళ్లి, వారు చెప్పినట్లు చేసింది. కొద్ది రోజులలోనే ఆమె భర్త పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు.
ఆ తరువాత గణపతిస్వామి హనుమాన్‌ఘాట్‌ను వదిలి, దశాశ్వమేధఘాట్‌వద్ద నివసింపసాగారు. రాంపూర్ నివాసి అయిన శివప్రసాద్ మిశ్రా అనే బ్రాహ్మణుని కుమారుడు పక్షవాతంతో బాధపడుతూ ఉండేవాడు. ఎన్నిమందులు వాడినా అది తగ్గలేదు. ఒకరోజున శివప్రసాద్ మిశ్రా తన కుమారుని తీసుకొని గణపతిస్వామివారిని దర్శించి, ఆ పిల్లవానిని స్వామిపాదాల చెంత ఉంచి, నయం చెయ్యమని ప్రార్థించాడు.
కరుణామయులైన స్వామీజీ ఆ బ్రాహ్మణుని మాటలు విని, ఆ పిల్లవానిని శిరస్సు నుంచి కాళ్లవరకూ చూశారు. ఆ తరువాత అతనిని స్పృశించి ఇంటికి తీసుకొని వెళ్లమని ఆదేశించారు. ఆ బ్రాహ్మణుడు స్వామివారి పాదధూళిని గ్రహించి, ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్లాడు. కొద్దిరోజులకే ఆ బాలుడు పక్షవాతం నుంచి విముక్తుడై ఆరోగ్యవంతుడైనాడు. ఈ విధంగా గణపతి స్వామివారి అసాధారణమైన ప్రతిభ ప్రచారమై నాలుగుదిక్కులా వ్యాపించింది. ఎందరో స్వామివారి వద్దకు వచ్చి, తమ కోర్కెలను తీర్చమని ఎన్నోవిధాల కోరుకునేవారు. అందువలన స్వామివారి పారిమార్థిక జీవనానికి విఘ్నం కలుగసాగింది. అందుకు స్వామీజీ వౌనవ్రతం పాటించడం ప్రారంభించారు. ఎవరితోనూ మాట్లాడేవారుకారు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఒకటిరెండు మాటలు మాత్రం మ్లాడేవారు. ఎవరు ఏది ఇచ్చినా కులగోత్రాలు లెక్కపెట్టక తినేవారు.
కాశీవాసులే కాక, ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారు కూడా, విశ్వనాథుని అన్నపూర్ణను మణికర్ణికను దర్శించినపుడు ఎలాంటి తృప్తిని పొందేవారో, అట్లాగే ఈ మహాత్ముని దర్శించి కూడా ధన్యులమైనామని భావించేవారు.

-స్వామివారి అసలు పేర్లయిన త్రైలింగధరుడు- గణపతిస్వామి వంటివి వారికి తెలియకపోవడంవలన, త్రిలింగ దేశానికి చెందినవాడని తెలుసుకొని, ఆయనను త్రైలింగస్వామి అని పిలువసాగారు.

అన్నపానీయాల విషయం గురించి ఆయన ఏమీ పట్టించుకోకపోవటం వలన ఒకరోజున ఒక దుర్మార్గుడు సున్నం కలిపిన నీటిని ఆయన చేత త్రాగించేడు. స్వామి నిర్వికార చిత్తంతో దానిని త్రాగి, అతని ఎదుటనే మూత్రవిసర్జన చేసి, నీటిని సున్నాన్ని వేరుచేసి చూపించారు.
ఒక రోజున ఒక ధనవంతుడు ఇరవై తులాల బంగారు కంకణాలను చేయించి స్వామివారి చేతులకు తొడిగాడు. ఆ కంకణాలను దొంగిలించదల్చిన కొందరు దుష్టులు స్వామివారికి తెలియకుండా ఆయన చేత మద్యపానం చేయించారు. అయినా స్వామీజీ మూర్ఛితులుకాని, క్రుద్ధులు కానీ కాలేదు. పైగా వారి ఉద్దేశ్యాన్ని గ్రహించి, తన చేతికి ఉన్న కంకణాలను తీసి వారికి ఇచ్చివేశారు.
సాధారణంగా కాశీపట్టణానికి ధనవంతులు వచ్చేవారు. వారిలో చాలామంది త్రైలింగస్వామివారికి బహుమూల్యములైన వస్తువులను భూషణములను తెచ్చి సమర్పించుకొనేవారు. కాని ధనలోలురు, దుష్టులు అయినవారు వాటిని దొంగిలించేవారు. స్వామివారు మాత్రం దానిని గురించి పట్టించుకొనేవారు కాదు.
త్రైలింగస్వామి దిగంబరులై తిరుగుతూ ఉండేవారు. అందువలన కొందరు పోలీసులు ఆయనను పట్టుకొని పోయి జిల్లా న్యాయాధిపతిముందు నిలబెట్టారు. న్యాయాధిపతి అట్లా తిరగటానికి వీలులేదని శాసించాడు. ధోవతి కట్టుకోవాలని ఆదేశించాడు. స్వామీజీ దాన్ని పట్టించుకోలేదు. న్యాయాధిపతికి కోపం వచ్చి బేడీలు వేసి చెరసాలలో పెట్టమని ఆదేశించాడు. వెంటనే పోలీసులు ఆయనకు బేడీలు వేయటానికి దగ్గరకు వెళ్లగా, స్వామీజీ వారికి కనబడలేదు. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపడ్డారు. వారు ఆ ప్రదేశమంతా దాదాపు గంటసేపు వెదికినా కనబడలేదు. ఆ తరువాత స్వామీజీ న్యాయాధిపతి ముందు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. స్వామీజీ ఎట్లా మాయమయ్యారో, మళ్లీ ఎట్లా ప్రత్యక్షమయ్యారో వారికి అర్థం కాలేదు. అదిచూసి వారంతా ఆశ్చర్యచకితులైనారు. న్యాయాధిపతి కొంతసేపటికి తేరుకొని, స్వామివారు తమకు నచ్చినవిధంగా తిరుగవచ్చునని అనుమతినిచ్చాడు.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు మరొక అధికారి వచ్చాడు. ఆయన చాలా తీవ్రస్వభావం కలవాడు. ఒకరోజు ఆయన దృష్టి స్వామివారి మీద పడింది. స్వామీజీ దొంగ సాధువు అని తలంచి చెరసాలలో పెట్టి బంధించాడు. మరునాడు ప్రొద్దున ఆయనకు ఒక విచిత్ర సంఘటన కనిపించింది. అదేమిటంటే- స్వామీజీని బంధించిన చెరసాల అంతా బాగా నీళ్లతో తడిసి ఉండింది. చెరసాల తలుపుకు వేసిన తాళం అట్లాగే ఉండింది. కాని స్వామీజీ మాత్రం చెరసాల బయటివైపున అటూ ఇటూ పచార్లుచేస్తూ కనిపించారు. వెంటనే ఆ అధికారి- ‘‘నీవు చెరసాలనుంచి బయటకు ఎట్లా వచ్చావు? ఇంత నీరు చెరసాలలోకి ఎట్లా వచ్చింది?’’ అని అడిగాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వి ‘‘అర్థరాత్రి నాకు మూత్రవిసర్జన చేయవలసి వచ్చింది. గదికి తాళంవేసి ఉండటంవలన గదిలోనే మూత్రవిసర్జన చేశాను.
ఉదయం కాగానే బయటకు పోవాలనే కోరిక కలిగింది. చూసేసరికి గది తలుపులు తెరిచి ఉన్నాయి. నేను బయటకు వచ్చేశాను. మీరు ఎవరి జీవితాన్నీ తాళంవేసి బంధించలేరని నిశ్చయంగా తెలుసుకోండి. ఒకవేళ ఆ విధంగా బంధించగలిగినా, వారిని మరణ సమయంలో బంధించి మరణం రాకుండా కాపాడగలరా? అంతకుముందు కూడా ఎవరూ మరణించరు. ఎవ్వరికీ అలాంటి శక్తి లేదు. మరి మీరు ఎందుకు అంతగా కోపగిస్తున్నారు?’’ అని అన్నారు. ఆ విచిత్ర సంఘటనను తన కళ్లారా చూసిన ఆ అధికారి అవాక్కయిపోయాడు.

  • తెలుగు అనువాదం: ఆచార్య హరిశివకుమార్ ఆచార్య రేగులపాటి మాధవరావు
  • 13/05/2012

ఆ తరువాత స్వామీజీ యథేచ్చగా తిరుగవచ్చని అనుమతి ఇచ్చాడు. స్వామీజీకి అయిష్టమైన పని ఎవ్వరూ చేయరాదని ఆజ్ఞాపించాడు.
ఒకరోజున ఖాలీస్‌పురా నివాసి అయిన దేవనారాయణ వాచస్పతి అనే పండితుడు స్వామివారిని భోజనానికి ఇంటికి తీసుకొనివచ్చాడు. భోజనం అయిన తరువాత త్రాగటానికి నీరు కావాలన్నారు స్వామీజీ. నీరు తేవటానికి వాచస్పతి ప్రక్క గదిలోకి వెళ్లాడు. తిరిగి రావడంలో కొంచెం ఆలస్యం అయింది. వాచస్పతి తిరిగి వచ్చేసరికి స్వామీజీ నీళ్లు త్రాగుతూ కన్పించారు. ఆ నీళ్ళు ఆయనకు ఎట్లా వచ్చాయో అర్థం కాలేదు. కాని తాను చేసిన ఆలస్యానికి ఎంతో సిగ్గుపడ్డాడు పండితుడు.
వంగ సంవత్సరం 1195లో ఒక హిందూ స్వతంత్ర రాజు సపరివారంగా కాశీకి వచ్చాడు. గంగానది పట్ల ఆయనకు ప్రగాఢమైన భక్తివిశ్వాసాలు ఉండటంవలన, వారంతా సపరివారంగా నడిచివెళ్లి దశాశ్వమేథ ఘాట్‌లో స్నానం చేయాలని అనుకొన్నారు. కాని రాణి సామాన్యంగా మరొకరి ముందుకు రావటానికి కాని, అసలు బయటకు రావటానికి కాని ఇష్టపడదు. అందువలన వారున్న ప్రదేశం నుంచి స్నానం చేయదలచిన రేవు వరకూ తెరలు కట్టారు. లోపలికి ఎవ్వరూ రాకుండా తెరలు అమర్చబడినాయి.
నియమిత సమయంలో రాజు- రాణి దాసీలతో కలిసి స్నానానికి వెళ్లారు. స్నానం చేయటానికి ముందు వారికి అక్కడ ఎవ్వరూ కన్పించలేదు. కాని స్నానం చేసి బయటకు వచ్చేసరికి దీర్ఘకాయుడైన ఒక దిగంబర పురుషుడు వారి ఎదుట నిలబడి ఉండటం కన్పించింది. రాణి ఆ దిగంబర పురుషుని చూసి సిగ్గుపడి, దాసీ జనంతో తన నివాస స్థలానికి వెళ్లిపోయింది. అదంతా చూడగానే రాజుకు విపరీతమైన కోపం వచ్చింది.
స్వామీజీని దండించడానికి మహారాజు భటులను పంపించాడు. భటులు అక్కడికి రాగానే, రాజుకు ఒక దివ్యరూపంతో స్వామి కనిపించారు. రాజు స్వామీజీని దండించక ఏవో ప్రశ్నలు వేశాడు. స్వామీజీ సమాధానం చెప్పలేదు. ఆ తరువాత స్వామీజీని పైకి పంపించమని ఆదేశించాడు. రక్షకభటులు స్వామీజీని పైకి తీసుకొని వెళ్ళారు. ‘‘మీరు ఇక్కడికి ఎందుకువచ్చార’’ని రాజు స్వామిని ప్రశ్నించాడు. స్వామి దానికి సమాధానం చెప్పలేదు. ఇదంతావింతగా చూస్తూ ఎందరో అక్కడ చేరారు. అందులో స్వామీజీ మహిమలు తెలిసినవారు కొందరు, ఆ మహానుభావునికి ఏ శిక్షా పడకూడదని మనస్సులో భావిస్తూ ఉన్నారు.
వారి కళ్లవెంట కన్నీరు కారుతున్నా రాజుగారి ఎదుట ఏమీ చెప్పలేక, లోలోపల చాలా దిగులు పడసాగారు. వారు ఒకరితో ఒకరు మెల్లిగా మాట్లాడుకున్నదానినిబట్టి రాజుకు ఆ దిగంబర పురుషుని గొప్పతనం తెలిసింది. స్వామీజీ యథార్థ స్వరూపం తెలుసుకున్న రాజు వారిని వదిలిపెట్టమని ఆజ్ఞాపించారు. అయినా ఇద్దరు ముగ్గురు రాజుగారి అనుయాయులు స్వామివారిని అవమానపరిచిన తరువాతనే విడిచిపెట్టారు.
ఆ రోజు రాత్రి రాజుగారికి నిద్రలో ఒక భయంకర దృశ్యం కనిపించింది. జటాజూటము ధరించి, పులి చర్మం కట్టుకొని, త్రిశూలాన్ని ధరించిన ఒక వ్యక్తి భీషణాకారంతో, కళ్లు ఎఱ్ఱవి చేసి ఈ విధంగా అన్నారు. ‘‘ఓరి దురాచారీ! బుద్ధిహీనుడా! నీవు త్రైలింగస్వామి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి కూడా, ఆయనను అవమానపరిచి పంపించి, నా హృదయానికి చాలా బాధ కలిగించావు. దానికి తగిన శిక్షను నీవు అనుభవించవలసిందే. మూర్ఖుడా! నీవు ఇలాంటి పవిత్ర స్థలంలో ఉండదగిన వ్యక్తివికావు.
త్వరగా నీవు ఈ ప్రదేశాన్ని వదిలివెళ్లు. లేకపోతే నీకు క్షేమం లేదు’’ అని. ఆ భయంకర స్వప్నం కన్న రాజు నిద్రలో పెద్దగా అరిచాడు. ఆ అరుపు విని రాజపరివారమంతా అక్కడికి వచ్చి చూసేసరికి మహారాజు అచేతనంగా పడి ఉన్నాడు. ఆయన కనుగ్రుడ్లు పైపైకిపోతూ ఉండినాయి.అది చూసి గాభరా పడిన పరివారం, కారణం ఏమిటో తెలియక గొడవపడసాగారు. కొద్దిసేపటికి రాజుగారికి తెలివి వచ్చింది. అట్లా పెద్దగా అరవటానికి కారణమేమిటని పరిజనం రాజును ప్రశ్నించారు. కాని మహారాజు ఆ రాత్రి వారికేమీ చెప్పలేదు.

మరునాడు ప్రొద్దున సేవకులను పంపించి స్వామివారిని వెదకించాడు రాజు. స్వయంగా ఆయనవద్దకు వెళ్లి, పాదాలమీదపడి క్షమాపణ వేడుకొన్నాడు. చిదానంద నిర్వికారుడైన స్వామీజీ కోపం చూపకపోగా, ఆ రాజును క్షమించి విశ్రాంతిని ప్రసాదించాడు.
వంగ సంవత్సరం 1207లో స్వామీజీ దశాశ్వమేధఘాట్ వదిలి, పంచగంగా ఘాట్‌లోని బిందుమాధవుని వద్ద నివసింపసాగారు. అప్పుడు ఆయన ఎవరితోనూ మాట్లాడేవారు కారు. ఎక్కడికి వెళ్ళేవారూ కాదు. అప్పటినుంచీ అందరూ ఆయనను ‘‘వౌనీబాబా’’ అనేవారు. స్వామీజీ సంజ్ఞలతోనే అన్నిపనులూ నిర్వహించేవారు. చాలా అవసరమనిపిస్తే, ఒకరిద్దరు పుణ్యాత్ములతో ధార్మిక చర్చ చేసి, దాని అర్థతాత్పర్యములు వివరించేవారు. మనస్సులోని సందేహాలను తొలగించేవారు. అందరిపట్ల దయ చూపుతూ ఉండేవారు.
స్వామీజీతోపాటు అక్కడ మంగళదాస్ ఠాకూర్, ఆయన తమ్ముడు కృష్ణప్రసాద్ ఠాకూర్, వారి తల్లి అంబాదేవి కూడా ఉండేవారు. మంగళదాస్ స్వామీజీకి సేవలు చేస్తూ ఉండగా, అంబాదేవికి వారికి వంట చేసి పెట్టేది. వాళ్లకు ఉన్న ఒక ఆవుకు కృష్ణప్రసాద్ సేవ చేస్తూ ఉండేవాడు. స్వామీజీ వాళ్లందరినీ ఎంతో ప్రేమగా చూసేవారు.
మంగళదాస్‌తో స్వామీజీ సంజ్ఞలతోనే మాట్లాడేవారు. అందువలన మంగళదాస్‌కు కూడా సంజ్ఞలతోనే మాట్లాడటం అలవాటయింది. స్వామీజీ పడుకొనే గద్దెకు దగ్గరలో ఉన్న ఒక గోడమీద చాలా శ్లోకాలు వ్రాయబడి ఉండేవి. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా విషయాన్ని గురించి చర్చించటానికి వస్తే, స్వామీజీ మంగళదాసును పిలిచి, ఆ శ్లోకాలలో ఒకదానిమీద వ్రేలుపెట్టి వ్రాయమనేవారు. మంగళదాసు దానిని వ్రాసి ఇచ్చిన వ్యక్తికి దానిని చదివి వివరించమని చెప్పేవారు. ఒకసారి ఇద్దరు బ్రహ్మచారులు వచ్చి ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి వివరణ అడుగగా, స్వామివారు తాను స్వయంగా వ్రాసిన ఇరవై - ముప్ఫై పుస్తకాలనుంచి అవసరమున్న ఒక పుస్తకాన్ని తెప్పించి, అందులో ఉన్న ఆ విషయాన్ని గురించి వివరించమని అనేవారు. ఇంకా ఏదైనా అత్యవసరమైన పరిస్థితిలో రాత్రివేళలో దానిని అర్థమయ్యేటట్లు బోధించేవారు.
స్వామీజీ ఆహారానికి కూడా నియమాలు ఉండేవి కావు. ఒక్క శేరు నుంచి ఒక్క మణుగువరకూ తినేవారు. ఒక్కొక్కప్పుడు అసలు ఏమీ తినేవారు కాదు. ఒక్కొక్కసారి అన్నం తినేవారు. మరొకసారి పాలు త్రాగేవారు. ఒక్కొక్కసారి ఎవరు ఏది ఇస్తే అది తినేవారు.
వంగ సంవత్సరం 1217 ఒకసారి ఉజ్జయినీ మహారాజు కాశీకి వచ్చాడు. ఒక రోజున ఆయన కాశీరాజు భవనం ఉన్న రామ్‌నగర్ నుంచి మణికర్ణికకు నావలో బయల్దేరాడు. ఆయన వెంట ఉన్న బ్రాహ్మణులు వేద పఠనం చేస్తూ ఉన్నారు. ఇంతలో ఎదురుగా కొంచెందూరంలో త్రైలింగస్వామి నీళ్లపైన ప్రకాశిస్తూ కనిపించారు.
మహారాజు ఆశ్చర్యచకితుడై, ఆయన ఎవరని అడిగాడు. నౌకలో ఉన్న స్వామివారి భక్తుడొకడు ఈ విధంగా చెప్పాడు. ‘‘మహారాజా! ఆయన ఒక గొప్ప యోగీశ్వరుడు. నీటిమీదను, భూమిమీదను ఆయనకు సమానమైన అధికారం ఉన్నది. అసాధారణ గికశక్తిసంపద కల వహాపురుషుడు. ఇంత గొప్ప యోగిపుంగవులు వర్తమానకాలంలో మరెక్కడా కన్పించరు’’ అని అన్నాడు. అది విని మహారాజు ‘‘శరీరంలోని అంతశ్శత్రువులను అణచివేసినవారిని బయటి శక్తులు ఏమీ చేయగలుగుతాయి?’’ అని ప్రశంసించారు. ఆ మాటలు విన్న స్వామివారి భక్తుడు నావను స్వామివారి వద్దకు తీసుకొని వెళ్లమని చెప్పాడు. నావ దగ్గరకు వచ్చిందో లేదో, మహారాజు మనస్సులోని అభిప్రాయాన్ని గుర్తించిన స్వామివారు స్వయంగా నౌకలోకి ఎక్కారు.



Read more...

జైసద్గురు వీరబ్రహ్మేంద్ర

>> Tuesday, May 1, 2012



ఈ రోజు వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధనా ఉత్సవం . కాలజ్ఞానమును బోధించి భవిష్యత్ ను ముందుగా తెలిపి మానవజాతి ని మేల్కొమ్మని చెప్పిన మహానుభావుడు . కలి ప్రభావం వలన భూమిపై ఎన్ని అనర్ధాలు సంభవిస్తాయో ఆయన చెప్పిన ప్రతిమాటా సత్యమవుతూ ఉంది . సమాజంలో నెలకొన్న అసమానతలను ఖండించి మతమౌఢ్యాన్ని తెగనాడి సద్గురువై సాధకులకు దారిచూపిన దివ్యజ్యోతి తాతగారు.


వ్యాపారమను పేర తెల్లదొరలూ వచ్చి .....భారతదేశాన్ని ఎలాదోచుకోబోతున్నారో హెచ్చరించారు . ఉద్యోగములుచూపి ఉచ్చులెన్నో వేసి మ్న మతానికె ఎసరు పెడతారు ..అని ఆయన చేసిన హెచ్చరికలను గమనించి ధర్మాచార్య్లులు ప్రతిక్రియలపై దృష్టి పెట్టినట్లైతే ఇప్పటి అనర్ధాలకు కొంత అడ్డుకట్ట వేసినట్లయ్యేది . ఇంకా ఆ మహాయోగి సూచించిన భవిష్యత్
ప్రమాదాలనుండి తప్పుకొనటానికై అవసరమైన ధార్మికాచారములను పాటించవలసిన సమయం వచ్చింది.
రామ ...అననివారెల్ల రాలిపోయేరు అని వారుచేసిన హెచ్చరిక మరువరాదు ..మనం .
జైసద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామికీ

Read more...

శంకరజయంతి శుభాకాంక్షలు .

>> Wednesday, April 25, 2012


జయ జయ శంకర


ధర్మానికి గ్లాని కలగినప్పుడల్లా అవతారపురుషులుద్భవించి ధర్మ నిర్దేశం చేసి జాతిని కాపాడుతుంటారు. శంకరాంశమై
ఈ పుణ్యభూమి లో ఉదయించిన జ్ఞానస్వరూపులు శంకరాచార్యుల వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ
మీ అందరికీ శంకరజయంతి సందర్భంలో శుభాకాంక్షలు .

Read more...

ఆహా ! ఏమి హనుమ మహిమ !!! ఈరోజు ముగ్గురు వైష్ణవాచార్యుల ఆశీశ్శులందించారు" హనుమత్ రక్షాయాగానికి"

>> Thursday, January 12, 2012




ఈరోజు హనుమంతులవారి అనుగ్రహానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం . మనం సంకల్పించుకున్న "హనుమత్ రక్షాయాగము"నకు ముగ్గురు వైష్ణవాచార్యులు మంగళాశాసనములందించారు. అనుకోకుండా ఇలా గురుపరంపర ఆశీర్వచనాలివ్వడం వెనుక స్వామి కరుణ అంతర్లీనంగా ప్రకటితమవుతున్నది

ఈరోజు వినుకొండలో జరిగిన గోదారంగనాథుల కళ్యాణోత్సవానికి హాజరయిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారివద్దకు మనకార్యకర్తలు గురుబ్రహ్మాచారి గారు వెళ్ళి యాగనిర్వహణకు వారి ఆశీర్వచనములడిగారు .స్వామివారు ప్రతులను తీసుకుని కళ్యాణమూర్తులైన గోదారంగనాథుల పాదములచెంత ఉంచి అందజేశారు.

ఇక నల్గొండలో రామగిరి శ్రీరామాలయంలో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జియర్ స్వామి వారివద్దకు మనకార్యకర్తలువెళ్ళి యాగమునకు వారి మంగళాశాసనములు కోరారు . ఆయన వివరములడిగి '' సకలభక్తులకు శుభములను ప్రసాదించు ఈయాగము నకు శ్రీరామచంద్రప్రభువుల అనుగ్రహం సిధ్ధిస్తుందని .శుభకరమవుతుందని ఆశీర్వదించారు.

అటు తాడిపత్రి లో మిత్రులు పారాయణపర్యవేక్షకులగు విజయమోహన్ గారు

శ్రీ శ్రీ శ్రీ అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జియ్యర్ స్వామి వారి వద్దకు వెళ్లి యాగవివరాలను అందజేశారు .స్వామి వారు సంతోషించి యాగం శుభకరంగా జరుగుతుందని ఆశీర్వదించారు.


పీఠాధిపతులు ,గురుపరంపర ఆశీశ్శులనందుకోవాలని ప్రయత్నిస్తున్న మనకు అనుకోకుండా ముందుగాఏప్రణాళిక లేకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాలనుండి కార్యకర్తలు వారి వద్దకు వెళ్లిరావటం ఆశీశ్శులనందుకోవటం .........మన స్వామి హనుమ అనుగ్రహం కాక మరేమిటి ? రండి ,హనుమత్ రక్షాయాగంలోపాల్గొనటం ద్వారా స్వామిమనరక్షకుడయ్యేలా ప్రార్థనచేద్దాం . జైశ్రీరాం

Read more...

జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వాములు[శృంగేరీ మహాసంస్థానం] వారు ఈరోజు "హనుమద్రక్షాయాగానికి" ఆశీర్వచనం చేశారు

>> Saturday, January 7, 2012


జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వాములు[శృంగేరీ మహాసంస్థానం] వారు ఈరోజు హనుమద్రక్షాయాగానికి ఆశీర్వచనాలిచ్చారు. మన కార్యకర్త మనోహర్ ఈరోజు శృంగేరి వెళ్ళి అమ్మ శారదాంబకు పూజజరిపి అమ్మ అనుగ్రహం పొందారు.ఆతరువాత చంద్రమౌళీశ్వరుల అభిషేకాలను దర్శించుకుని ఆ తదనంతరం జగద్గురువుల సన్నిధానానికి వెళ్లాడు.
స్వామికి యాగవివరాలు తెలిపి యాగానికి అనుమతి కోరారు . మహాస్వాముల వారు చాలా సంతోషించి లోకకళ్యాణార్ధం జరుగుతున్న ఈ యాగానికి ... మేము ఆశీర్వదిస్తున్నాము చక్కగా జరుగుతుంది అని దీవించారు. అమ్మ అనుగ్రహానికి సంకేతం ఇది. జైశ్రీరాం..జైహనుమాన్

Read more...

కంటి ముందు జరుగుతున్న ఈ "సాయి" లీలను కాదనటమెలా ?

>> Wednesday, May 12, 2010

నువ్వు నమ్మకపోయినా సరే !నేనెప్పుడు నావారిని విడిచిపెట్టను అని తన ఉనికిని చూపుతున్న సాయి . విభూధి గావర్షిస్తున్న ఆయన అనుగ్రహం
ఈరోజు మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది . ఇక్కడ బ్లాగులోకంలో ని ఒక సొదరి, దుర్గేశ్వరగారు మీకో విషయం చెప్పాలి అన్నారు. చెప్పండమ్మా అని అడిగాను. మీకు సాయిబాబా మీద నమ్మకముందా అనడిగారావిడ . ఆయ్యో !ఎందుకడుగుతున్నారలా అన్నాను . ఏమీ లేదండి ,ఈరోజు నేను నమ్మలేని నిజాన్ని నాకళ్లతోనే చూసి ఆశ్చర్యపోతున్నాను మీకు వివరంగా చెబుతానంటూ ఆమె ఆనందం ఉద్వేగంతో ఒక దివ్యలీలను నాకు తెలియజేశారు .వారి మాటలలోనే చదవండి .

" ఒక చిన్న సాయిబాబా విగ్రహం తీసుకున్నాము మూడు సంవత్సరాల క్రితం .అదీ పూజకోసమని కాదు మామూలుగా కొన్నామంతే.
ఆ విగ్రహాన్ని నిలబెట్టటానికి వెనుకేదన్నా ఆధారం కావాలి అందుకని వెనుకగా ఆనిచి వుంచాము మందిరంలో. మొన్న ఒక విచిత్రం జరిగింది . మేము వెనుక ఉంచిన విగ్రహం ఎవరూ కదపకుండానే మేము వాడుకునే వీభూధి గడ్ద ముందుకు వచ్చి ఉన్నది. అంతేకాదు .ఆ విగ్రహాన్నుండి విభూధి ఉద్భవిస్తూ ఉంది . మొదట నమ్మలేకపోయాము . కానీ విగ్రహాన్నుండి అలా విభూధి వస్తూనే వున్నది. అక్కడక్కడా ఇలా జరుగుతున్నదని విన్నప్పుడు నేను అంతగా నమ్మేదాన్ని కాదు .నిజమేనంటావా ? అని సందేహించేదాన్ని. కానీ నాకళ్లముందే జరుగుతున్నదాన్ని ఎలా నమ్మకపోవటం. పైగా నాకు ఏదో అలా నమస్కరించుకునే అలవాటేగాని పెద్దగా పూజలు అవీ చేయను. మావారు మాత్రం చక్కగా పూజలు చేసుకుంటారు. మరి బాబా కరుణ మాపై ఎలాకలిగినదో నాకైతే తెలియదు. నేను ఈవిషయాన్ని మాబంధువులకు కొద్దిమందికి మాత్రమే చెప్పాను. బయటవాళ్లకు మీకు మాత్రమే చెబుతున్నాను . అని ఎంతో ఆనందంతో వివరించారావిడ .వారి అభిమనానికి కృతజ్ఞుడను.
అదేరోజు మావారి స్నేహితుడొకాయన మాయింటికొచ్చాడు .ఆయనయొక్క కొడుకూ కోడలు మధ్య నడుస్తున్న వివాదం లో మావారి సలహాకోసం. తన కోడలిని ఎలా వప్పించి ఇంటికి రప్పించాలా అని సతమవుతున్నారు ఆయన. మాఇంట్లో జరుగుతున్న సాయిలీల తెలిసి ఆయన ఆవిభూధిని ఎంతో భక్తిగా తనయింటికి తీసుకెళ్ళాడు. చిత్రంగా పొద్దుటకల్లా కోడలు కోపం వదలి తనంత తానుగా కాపురానికొచ్చిందని ఆయన చెప్పగా విని ఆశ్చర్యపోతున్నామని మరొక లీలను వివరించారావిడ.
ఇక్కడ ఆయన అనుగ్రహం మాకు కలిగింది దానిని పదిమందికీ చెప్పలనుకోవటం లేదు. అనవసర చర్చలు . అని కేవలం మీకు చెప్పాలనే ఉత్సుకతతో వివరిస్తున్నారన్నరావిడ. ఐతే నాకు తెలిసిన దైవలీలను నేను దాచిపెట్టి ఉంచలేను . నాపనే పరమాత్మ లీలలను ఎక్కడున్నా సేకరించి పదిమందితో పంచుకోవటం .కనుక ఆసద్గురువు లీలను, ఆవిడ మెయిల్ ద్వారా ఇందాక పంపిన ఫోటోలను సాయి ప్రసాదంగా భక్తజనులకోసం ఇక్కడుంచుతున్నాను.
ఇంత ప్రత్యక్షం గా కనపడుతున్న లీలలను అబద్దమనే సందేహ జీవుల లో ఎవరి కోసం ఈ తన ఉనికిని ఇలా బహిరంగ పరుస్తున్నాడో ! ఆ సద్గురువునకే ఎరుక .
జయ గురుదత్త .

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP