అందరికీ అమ్మ
>> Sunday, April 28, 2013
అందరికీ అమ్మ
"శ్రీరామచంద్రా! నీవు సాక్షాత్ నారాయణుడివి. పైక్లబ్యం తగదు. దుష్టసంహార కార్యక్రమం నీ లక్ష్యం. ధర్మ పరిరక్షణ నీ కర్తవ్యం. నీ గమ్యం''అని విశిష్ఠుల వారు అన్నపుడు, రాముడు "నేను దశరధ కుమారుణ్ణి. విధి నడిపించినట్లు నడవటం నా విధి.'' అంటాడు. "నేను తప్ప వేరు వస్తువు లేదు. వేదాల్లో నేను సామవేదాన్ని. పక్షులలో గరుడ పక్షిని. మాసములలో ముర్గశర్షాన్ని. నేను దైవాన్ని'' అంటాడు కృష్ణపరమాత్మ. "మీరు స్కందులు. కుమారస్వామి రమణ రూపంలో దర్శనమివ్వటం మా భాగ్యం'' అని మహా తపస్వి కావ్యవ వందనాశిష్ఠగణపతి ముని, భగవాన్ రమణ మహర్షిత అన్నపుడు "మిమ్మల్ని మీరు తెలుసుకోండి.
ఆ ఎరుక కలిగితే ద్వైతం సమసిపోతుంది.'' అని మహర్షి సమాధానం. "త్రేతాయుగం నాటి రాముడు ద్వాపర నాటి కృష్ణుడు కలబోస్తే ఈ రామకృష్ణుడు'' అన్న పరమహంస ప్రకటన స్మరణీయం. ఈ సంఘటనల వెనుక, మాటల మాటున దాగిన మర్మం, మర్మం వెనుక దాగిన మహితత్వం జాతికి వరణీయం. ఆయ అవతారమూర్తుల ఆవిష్కరణలు. అన్వేషణ ప్రారంభం కావటానికి ఆలోచనా స్ఫోరకాలు. అన్వేషణ ముగించడానికి సాఫల్యాలు. అవతారప్రణాళిక, జాతి సంసిద్ధత, తమస్సాఫల్యం, జీవన పరిపక్వతలకు అనుగుణంగా, ప్రసంగవశాత్తు వెలువడె? ఈ మార్మిక శబ్దాలు, వాక్యాలు, ఆయా మహాత్ముల అంతరంగ అభివ్యక్తి.
ఈ భూమిక అందరూ అందుకోదగినది కాదు. ఎవరు నిత్య జీవితాన్ని సత్యాను సంధాన స్ఫూర్తితో సాగిస్తారో వారు ఈ మాటలను ఆలకించి, ఆచరించి, అనుభవించి, ఆనందతారక స్థితిని అందుకుంటారు. జీవన్ముక్తులుగా, ముక్తజీవనులుగా జన్మను పండించుకుంటారు. సాధకుడికి పరిపక్వత లేనపుడు, అజాగ్రత్తగా ఉన్నపుడు మహాత్ముల నోట వెలువడే మాటలను సామాన్యార్థంలో గ్రహించుకొని పెడచెవిన పెడతాడు. నష్టపోతాడు. యదార్థాన్ని అందుకోలేక కాలగతిలో వెనుకబడి పోతాడు. జీవితాన్ని వృథా చేసుకుంటాడు.
"నేను అందరికీ అమ్మను'' అన్నది అమ్మ ప్రకటన. ప్రకటించడం బహు సులువు. . అమ్మగా ఉండగలగటం సామాన్య విషయం కాదు. ఇంతకీ అమ్మంటే? ప్రతి జీవి జన్మకు కారణం, అమ్మ! అమ్మలేని ప్రాణి లేదు. అమ్మ ఒడి మొదటి బడి. అమ్మతోనే గురువు. అమ్మ, అయ్యను చూపిస్తుంది. అమ్మ, అయ్య కలిసి లోక గురువును చూపిస్తారు. ఈ ముగ్గురి దయ వలన జీవుడు, తనలో ఉన్న దైవాన్ని దర్శించగలుగుతాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం...ఇది క్రమం. సక్రమం. కనుక అమ్మ దైవం. దేవ అంటే ఆట. అమ్మకు గెలుపు,ఓటమిల్లేవు. ఆడటం ఒక వేడుక.
జీవిని గెలిపించడం ఆమెకు ఆనందం. అపుడపుడూ జోడించినట్లు జోడించి గెలిపించటం పరమానందం. పాకుతున్న వాడిని నడిపించడం, నడుస్తున్న వాడిని పరుగెత్తించటం, పరుగెత్తుతున్న వాడిని నిగ్రహించటం ఆటలో భాగమే. అమ్మ, కారణాలు అవసరం లేని ప్రేమకు చిరునామా. వహించటం, భరించటం, క్షమించటం, సహజ సల్లక్షణాలై సహనం రూపు గడితే అమ్మ. మమకారంతో మనసును మార్దవం చేయగల మహితశక్తి, మాతృమూర్తి.
సమస్త జీవరాశుల పట్ల సహజ ప్రేమతో సంచరిస్తూ, సర్వానందమయస్థితిలో అన్ని వేళలా ఉండగలిగిన మాతృశ్రీ, తల్లి పదానికి సోదాహరణం. నిదర్శనమయం, పిపీరి కాది బ్రహ్మ పర్యంతాన్ని ఆత్మగా దర్శించ గలగటం అమ్మ నిరూపించిన మహాపరిసత్యం. ఈ అనుభవాన్ని పొంది, ఆత్మానుభూతిని పొందిన వారెందరో! ఎక్కడి అంబా సముద్రం? ఎక్కడి అర్కపురి ? అదే జిల్లెళ్లమూడి? నాలుగు దశాబ్ధాల క్రితం, రూపుకట్టిన శివమై బ్రహ్మతేజోమూర్తి అయిన పూర్థానంద స్వామి అమ్మను జిల్లెళ్లమూడిలో దర్శించుకోవటం, ఒక అపురూప సన్నివేశం. తన జన్మకు హేతువైన తల్లితో పునఃదర్శించుకోవటం అదనపు అనుభవం.
ఆపై జరిగిన అధ్యాత్మిసాధన తీవ్రమై, కర్మ, భక్తి, జ్ఞాన యోగాతో త్రివేణీ రూపమై, పూర్ణానందులను పరవశులను కావించింది. కామేశ్వరుడి శక్తి అంతా కామేశ్వరిలో ఉంది. బిడ్డ శక్తి అంతా అమ్మలోనే ఉంది. కర్త శక్తి అంతా కర్రితిలో ఉంది. దైవంలో అమ్మను చూడటం ఒక స్థాయి. అమ్మను దైవతంగా దర్శించటం ఒక అనుభవం. పూర్ణానందం శిఖర స్థాయిలో శ్రీశైలమైనది, అమ్మ కడుపు చలువే! తల్లి ప్రేమ మహానందసాగరం! దర్శించగలిగితే శైశవమంతా శివమే! తడమగరిగిన తల్లి దొరికినపుడు, బిడ్డకు లోటుంటుందా?
వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
0 వ్యాఖ్యలు:
Post a Comment