కంటి ముందు జరుగుతున్న ఈ "సాయి" లీలను కాదనటమెలా ?
>> Wednesday, May 12, 2010
నువ్వు నమ్మకపోయినా సరే !నేనెప్పుడు నావారిని విడిచిపెట్టను అని తన ఉనికిని చూపుతున్న సాయి . విభూధి గావర్షిస్తున్న ఆయన అనుగ్రహం
ఈరోజు మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది . ఇక్కడ బ్లాగులోకంలో ని ఒక సొదరి, దుర్గేశ్వరగారు మీకో విషయం చెప్పాలి అన్నారు. చెప్పండమ్మా అని అడిగాను. మీకు సాయిబాబా మీద నమ్మకముందా అనడిగారావిడ . ఆయ్యో !ఎందుకడుగుతున్నారలా అన్నాను . ఏమీ లేదండి ,ఈరోజు నేను నమ్మలేని నిజాన్ని నాకళ్లతోనే చూసి ఆశ్చర్యపోతున్నాను మీకు వివరంగా చెబుతానంటూ ఆమె ఆనందం ఉద్వేగంతో ఒక దివ్యలీలను నాకు తెలియజేశారు .వారి మాటలలోనే చదవండి .
" ఒక చిన్న సాయిబాబా విగ్రహం తీసుకున్నాము మూడు సంవత్సరాల క్రితం .అదీ పూజకోసమని కాదు మామూలుగా కొన్నామంతే.
ఆ విగ్రహాన్ని నిలబెట్టటానికి వెనుకేదన్నా ఆధారం కావాలి అందుకని వెనుకగా ఆనిచి వుంచాము మందిరంలో. మొన్న ఒక విచిత్రం జరిగింది . మేము వెనుక ఉంచిన విగ్రహం ఎవరూ కదపకుండానే మేము వాడుకునే వీభూధి గడ్ద ముందుకు వచ్చి ఉన్నది. అంతేకాదు .ఆ విగ్రహాన్నుండి విభూధి ఉద్భవిస్తూ ఉంది . మొదట నమ్మలేకపోయాము . కానీ విగ్రహాన్నుండి అలా విభూధి వస్తూనే వున్నది. అక్కడక్కడా ఇలా జరుగుతున్నదని విన్నప్పుడు నేను అంతగా నమ్మేదాన్ని కాదు .నిజమేనంటావా ? అని సందేహించేదాన్ని. కానీ నాకళ్లముందే జరుగుతున్నదాన్ని ఎలా నమ్మకపోవటం. పైగా నాకు ఏదో అలా నమస్కరించుకునే అలవాటేగాని పెద్దగా పూజలు అవీ చేయను. మావారు మాత్రం చక్కగా పూజలు చేసుకుంటారు. మరి బాబా కరుణ మాపై ఎలాకలిగినదో నాకైతే తెలియదు. నేను ఈవిషయాన్ని మాబంధువులకు కొద్దిమందికి మాత్రమే చెప్పాను. బయటవాళ్లకు మీకు మాత్రమే చెబుతున్నాను . అని ఎంతో ఆనందంతో వివరించారావిడ .వారి అభిమనానికి కృతజ్ఞుడను.
అదేరోజు మావారి స్నేహితుడొకాయన మాయింటికొచ్చాడు .ఆయనయొక్క కొడుకూ కోడలు మధ్య నడుస్తున్న వివాదం లో మావారి సలహాకోసం. తన కోడలిని ఎలా వప్పించి ఇంటికి రప్పించాలా అని సతమవుతున్నారు ఆయన. మాఇంట్లో జరుగుతున్న సాయిలీల తెలిసి ఆయన ఆవిభూధిని ఎంతో భక్తిగా తనయింటికి తీసుకెళ్ళాడు. చిత్రంగా పొద్దుటకల్లా కోడలు కోపం వదలి తనంత తానుగా కాపురానికొచ్చిందని ఆయన చెప్పగా విని ఆశ్చర్యపోతున్నామని మరొక లీలను వివరించారావిడ.
ఇక్కడ ఆయన అనుగ్రహం మాకు కలిగింది దానిని పదిమందికీ చెప్పలనుకోవటం లేదు. అనవసర చర్చలు . అని కేవలం మీకు చెప్పాలనే ఉత్సుకతతో వివరిస్తున్నారన్నరావిడ. ఐతే నాకు తెలిసిన దైవలీలను నేను దాచిపెట్టి ఉంచలేను . నాపనే పరమాత్మ లీలలను ఎక్కడున్నా సేకరించి పదిమందితో పంచుకోవటం .కనుక ఆసద్గురువు లీలను, ఆవిడ మెయిల్ ద్వారా ఇందాక పంపిన ఫోటోలను సాయి ప్రసాదంగా భక్తజనులకోసం ఇక్కడుంచుతున్నాను.
ఇంత ప్రత్యక్షం గా కనపడుతున్న లీలలను అబద్దమనే సందేహ జీవుల లో ఎవరి కోసం ఈ తన ఉనికిని ఇలా బహిరంగ పరుస్తున్నాడో ! ఆ సద్గురువునకే ఎరుక .
జయ గురుదత్త .
5 వ్యాఖ్యలు:
చదువుతుంటే చాలా అనందం గాను ఆశ్చర్యం గాను ఉంది వీభూది రావడంతెలుసు అందరికి జరుగుతునె ఉంటుంది కోడలు రావడం ఈ రోజుల్లొ ఇంత తొందరగా ఆనందం గానె ఉంది. ఇన్నాళ్ళూ మంచి అల్లుడు రావాలనుకునే వారు కానీ ఇప్పుడు మంచి కోడలు రావాలనుకుంటున్నారు. కలి " వింతలు " బాగుంది మంచి విషయాలను అందించారు.
Inform this incident to CB Rao/ Innayya. If they confirm people will believe whatever ypu said.
@ పై అజ్ఞాత గారు మీరు చెబుతున్న ఇద్దరు ఎక్కడ నుండి అయినా దిగి వచ్చారా?
అయ్యా ! అజ్ఞాతగారూ
ఇన్నయ్యగారికి నాకంటే మంచి జోతిషవేత్త అయిన వారి అబ్బాయి గారైతే వివరంగా చెప్పగలుగుతారనుకుంటాను. [వారబ్బాయిగారితో నాకు పరిచయంలేదు. కానీ ఆయన మంచి జ్యోతిషశాస్త్రవేత్త అని ఇక్కడె ఈ అంతర్జాలంలోనే చదివాను]
అజ్ఞాతా.. నేనయితే మన ప్రవీణ్ చేత చెక్ చేయించమంటా .. మీరేమంటారు :-)))
Post a Comment