ఆహా ! ఏమి హనుమ మహిమ !!! ఈరోజు ముగ్గురు వైష్ణవాచార్యుల ఆశీశ్శులందించారు" హనుమత్ రక్షాయాగానికి"
>> Thursday, January 12, 2012

ఈరోజు  హనుమంతులవారి అనుగ్రహానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం . మనం సంకల్పించుకున్న  "హనుమత్ రక్షాయాగము"నకు  ముగ్గురు  వైష్ణవాచార్యులు మంగళాశాసనములందించారు.  అనుకోకుండా ఇలా  గురుపరంపర ఆశీర్వచనాలివ్వడం వెనుక స్వామి కరుణ అంతర్లీనంగా ప్రకటితమవుతున్నది
ఈరోజు వినుకొండలో  జరిగిన గోదారంగనాథుల కళ్యాణోత్సవానికి హాజరయిన  శ్రీశ్రీశ్రీ  త్రిదండి చిన జీయర్  స్వామి వారివద్దకు  మనకార్యకర్తలు గురుబ్రహ్మాచారి గారు వెళ్ళి యాగనిర్వహణకు  వారి ఆశీర్వచనములడిగారు  .స్వామివారు ప్రతులను తీసుకుని కళ్యాణమూర్తులైన గోదారంగనాథుల పాదములచెంత ఉంచి అందజేశారు.
ఇక   నల్గొండలో    రామగిరి శ్రీరామాలయంలో    ఉన్న శ్రీశ్రీశ్రీ  త్రిదండి  శ్రీరంగ రామానుజ జియర్ స్వామి వారివద్దకు మనకార్యకర్తలువెళ్ళి యాగమునకు  వారి మంగళాశాసనములు కోరారు . ఆయన వివరములడిగి '' సకలభక్తులకు శుభములను  ప్రసాదించు ఈయాగము నకు శ్రీరామచంద్రప్రభువుల అనుగ్రహం సిధ్ధిస్తుందని  .శుభకరమవుతుందని ఆశీర్వదించారు.
అటు తాడిపత్రి  లో  మిత్రులు  పారాయణపర్యవేక్షకులగు  విజయమోహన్ గారు
శ్రీ శ్రీ శ్రీ అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జియ్యర్ స్వామి వారి వద్దకు వెళ్లి యాగవివరాలను అందజేశారు .స్వామి వారు సంతోషించి యాగం శుభకరంగా జరుగుతుందని ఆశీర్వదించారు.
పీఠాధిపతులు ,గురుపరంపర  ఆశీశ్శులనందుకోవాలని ప్రయత్నిస్తున్న మనకు అనుకోకుండా ముందుగాఏప్రణాళిక లేకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాలనుండి కార్యకర్తలు వారి వద్దకు వెళ్లిరావటం ఆశీశ్శులనందుకోవటం .........మన స్వామి  హనుమ అనుగ్రహం కాక మరేమిటి ?    రండి ,హనుమత్ రక్షాయాగంలోపాల్గొనటం ద్వారా   స్వామిమనరక్షకుడయ్యేలా ప్రార్థనచేద్దాం .   జైశ్రీరాం

1 వ్యాఖ్యలు:
నా పరిశుద్ద, పరిపూర్ణ హృదయంతో నిను కొలిచే భాగ్యం ఇంకో ఎప్పుడో ప్రభు ఈ జన్మకు.
స్వామి నిజముగా నీ లీలలు అజరామరం.
Post a Comment