శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎంత నీచానికి దిగజారుతున్నారీ మత వ్యాపారులు చదువులనడ్డం పెట్టుకుని ?????!!!!!!

>> Friday, March 16, 2012

రెండు సంవత్సరాలక్రితం వరకు మేము పీఠానికి అనుబంధంగా హిందూ పబ్లిక్ స్కూల్ అనే పాఠశాలను నడిపేవారం. ఇప్పుడు పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపు నివ్వటానికి పెట్టిన నిబంధనలను, కొత్త బిల్డింగులను కట్టే ఆర్థిక స్థోమత లేక ఆపివేశాము. నామమాత్ర ఫీజులతో నడిపే పాఠశలకు పిల్లలు నిండుగా ఉన్నా నిధులు దండిగా లేక వెనుకకు తగ్గవలసి వచ్చినది. ఇక మూడు సంవత్సరాలక్రితం కేరళనుంచి ఓ బృందం దిగింది మామండలం లో పాఠశాల పెట్టాలని. అనుకున్నదే తడవు వాళ్లు స్థలం కొన్నారు. ఓచర్చి నిర్మించారు . ఇంగ్లీష్ మీడియం పాఠశాల పెట్టారు . ఇక పోలో మని పిల్లలతల్లిదండ్రులు భారమైనా చేర్చటం మొదలెట్టారు. మన పాఠశాల మూసివేయటం తో వాళ్లకు ఇంకా మేలైంది.
సరే ! ఇక వాళ్లు డబ్బుతెచ్చుకుని పాఠ శాల పెడితే మీ ఏడుపేంటని ? మీరడగవచ్చు. ఇక్కడ మా బాధ అదికాదు.చదవండి ఇంకా .

మొన్నామధ్య గాంధీనగర్ కు చెందిన నాగిరెడ్డి అనే కుర్రవాడొచ్చాడు ఆలయానికి . సార్ ! మీరు మరలా పాఠశాల ఓపెన్ చేయాలండి అన్నాడు. ఏంటి సంగతని అడిగితే....... మా చిన్నపాపను సెయింట్ జూడ్స్ లో వేశాను కదండి. అది నిండా ఎనిమిదేళ్లు లేవు . మీ దేవుడికంటే మా ఏసుప్రభువే గొప్పవాడు నాన్నా అని చెబుతుంది . నేను బిత్తరపోయాను. ఇక్కడున్నప్పుడు మా పెద్దపాప గాని పిల్లలు గానీ ఎంతచక్కగా పద్దతిగా ఉండేవారు. పసిపిల్లలకు కూడా ఇలా చెబుతున్నారు. మొన్న ఫీజు కట్టతానికెళ్లినప్పుడు వాళ్ల ప్రిన్సిపాల్ నడిగాను . వాళ్లు అలాంటిదేం లేదని సమర్ధించుకుంటున్నారు . అన్నాడు.
వాళ్లు !పాఠశాలలు స్థాపించే ఉద్దేశ్యాలలో ఇదొకటి. నిధులు రాబట్టుకుని మతవ్యాపారాలు చేసుకుంటారు . తల్లిదండ్రులే అడగాలి ఇదేంటని .అని చెప్పాను. ఎవరండి అలా అడిగేది ? అందరూ ఇప్పుడు పట్టించుకోరు విషం తలకెక్కినట్లు ఈ మతపిచ్చి ఎక్కాక పిల్లలు మనచేతికి రారు అంటు బాధపడ్దాడు.

ఇక నిన్న బెంగళూర్ నుంచి మన మనోహర్ ఫోన్ చేశాడు . మాటల సందర్భంలో వళ్ల చుట్టాలపిల్లవాడు నిత్యం వాళ్లపాఠశాలలో ఇచ్చిన మతగ్రంథం చదవటమే కాదు అమ్దులో పరీక్షలున్నాయని చెబుతున్నాడట. ఏదన్నా మన దేవీ దేవతల ప్రసంగం వస్తే చెవులు మూసుకుంటాడట. అదే విట్రా అంటే ? మేము ఇలాంటివి వినకూడదట మా మిస్ లు చెప్పారంటున్నాడట. తల్లిదండ్రులు మాత్రం వెఱినవ్వు నవ్వుకుని వదిలెస్తునారట. మనమెదన్నా అంటే అక్కడసీటురావటమే కష్టం ఇప్పుడు బయటకు పంపిస్తారేమోనని అంటున్నారట. ఇలాఉంది మాస్టారూ ! మన స్థితి అని చెప్పుకొచ్చాడు.
చిత్రమేమిటంటే సమర్ధులైన ఉపాధ్యాయులతో నడపబడుతున్నఅనేక పాఠశాలలున్నాయి కానీ ఇంగ్లీశుమీది వెర్రిమోహంతో మనం ఈ మిషనరీ పాఠశాలలకు పిల్లలను పంపాల్సిన అవసరం ఉందా ? అని తల్లిదడ్రులు ఆలోచించటం లేదు. కనీసం వెళ్లి ఇలా మాపిల్లల మనసులకు విషం ఎక్కించొద్దు అనైనా అనటం లేదు. మన సాంప్రదాయం సంస్క్రుతులను ధ్వంసం చేసే విధంగా మన పిల్లలను మనమే గొర్రెలమందలను కసాయి కొట్లకు తోలినట్లు తోలుతున్నాం . చదువుతో పాటు అక్కడ ఏరకమైన విద్వేషపూరిత భావాలను పిల్లలకు నేర్పుతున్నారో గమనించుకోలేని గుడ్డితనం మనలనావహించింది . చదువుకున్నవాళ్లు కూడా ఇలాంటి విషప్రచారాలనడ్డుకోకుంటే ...ఇక పల్లెలనుంచి ఈపాఠశాలలకు పిల్లలను పంపుతున్నవారికేం తెలుస్తుంది ?

5 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni March 16, 2012 at 10:52 AM  

mata prachaaram,mata maarpidilo..bhaagaalu ivi.

yemitO! yemannaa annaamante..Hindu matam lo andaru cheradam laa.. antaaru.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు March 16, 2012 at 11:17 AM  

ఇంత దాఋణం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వి హెచ్ పీ, భజరంగ దళ్ కోసం చూడకుండా ఎవరింట్లో వారయినా తమ పిల్లలని ఈ దాడి నుంచి కాపాడుకోవాలి.

Saahitya Abhimaani March 16, 2012 at 3:28 PM  

ఏ ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు పెట్టిన స్కూల్లొనో మన హిందూ మతం గురించి, పురాణాల గురించి బొధిస్తే మన దిక్కుమాలిన కమ్యూనిస్ట్ మీడియా ఎంత అల్లరి చేస్తుంది,,,,, ఇదే మీడియా ఇలాంటివి జరుగుతుంటే ఇతర మత సంస్థలు స్కూళ్ళ ముసుగులో మత ప్రచారం ముక్కుపచ్చలారని పిల్లలకు చేస్తుంటే చెవులు కళ్ళూ లేనట్తు ప్రవర్తించటం సెక్యూలరిజంట! మనకు ఇటువంటి పక్ష(వా)పాత మీడియా ఉండటం మన దురదృష్టం

telugutvjournalist March 17, 2012 at 3:28 AM  

sir, can you please send the area details

telugutvjournalist March 17, 2012 at 3:29 AM  

can you please send the details

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP