శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మతం మార్చుకోవటాన్ని మహాత్ములు అంగీకరించరు

>> Wednesday, March 14, 2012

సాయిబాబా మార్పును అంగీకరించడు. మతా న్నైనా, పారాయణ గ్రంధాన్నైనా, దైవాన్నైనా మార్చు కోవటాన్ని సాయి అంగీకరించడు.
సాయిబాబా వద్దకు ఇతర గురువులకు చెందిన శిష్యులు రావటం కూడా జరిగేది. సాయిబాబాను గురువు నమ్మిన వ్యక్తులు, ఇతర గురువుల వద్దకు పోవటం కూడా సహజంగానే జరిగేది.
సాయి వద్దకు ఇతర గురువులకు లకు చెందిన పంత్‌ అనే పేరుగల శిష్యుడు వచ్చాడు. సాయి అతనికి ''ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడు స్థిరంగా ఉంటూ, అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు అన్నారు.
ఒకసారి గురువుగా ఒకరిని నిర్ణయించుకున్న తరు వాత వేరొక గురువుయొక్క మహత్తు, ప్రజ్ఞలను చూసి మనసు చలించకూడదు. జీవితాంతం ఒకే గురువును అంటిపెట్టుకొని ఉండాలి గాని, మన గురువు తక్కువ, వేరో గురువు ఎక్కువ అనే ఆలోచనను తీసివేయాలి.
శ్యామా ఒకసారి నాగపూర్‌ పరిసర ప్రాంతాలకు పోయి తిరిగి షిరిడి వచ్చాడు. సాయి ''శ్యామా! ఎక్క డెక్కడకు పోయావు ? అని అడిగారు. ''నాగపూర్‌, ఇంకా చుట్టుప్రక్కలకు అన్నాడు శ్యామా. ''నాగపూర్‌ లోని బంగారు మామిడి చెట్టును చూశావా? అడిగాడు సాయి. శ్యామా ''బంగారు మామిడి చెట్టే తాజుద్దీన్‌ బాబా అని అర్థం చేసుకుని వెళ్లాను అన్నాడు. ''ఇంకా? ప్రశ్నించాడు సాయి.
''అమరావతి వెళ్లాను. అక్కడ ఖేడ్‌గాం బేట్‌ నారా యణ మహారాజు వచ్చారు. నేను దర్శించాను. అబ్బా ఎంతమంది వచ్చారో బాబా! అన్నాడు శ్యామా. ఇంకా ''నారాయణ మహారాజును గూర్చి మీ ఉద్దేశం ఏమిటి? ప్రశ్నించాడు శ్యామా.
సాయిబాబా అతని ప్రశ్నను పట్టించుకోలేదు. సమా ధానం కోసం నిరీక్షించాడు శ్యామా. నారాయణ మహారాజ్‌ చాలా ఆడంబరంగా ఉండేవారు. ఖరీదైన వస్త్రాలు, సింహాసనాలు ఇలా ఒకటా, రెండా కళ్లు చెదిరేటట్లు ఆయనా ఉంటారు. ఆయన దర్బారూ ఉంటుంది. దీనికి భిన్నంగా సాయి దర్బారు ఉంటుంది. నిరాడంబరాల మధ్య ఊగిసలాడే శ్యామా మనస్సును సాయి గుర్తించారు. శ్యామా మరోసారి ప్రశ్నించాడు. సాయి కొద్దిసేపు ఆగి ''శ్యామా! ఎంతైనా నీ తండ్రి నీ తండ్రే గదా. కొట్టనీ, తిట్టనీ నీవంటే ఆపేక్షగానే ఉంటాడు కదా. నీ తండ్రిలాగా నిన్ను ఎవరు చూస్తారు? ఎవరు నీ తండ్రి వంటి ప్రేమను చూపు తారు? ఇంకొకరి వెంట పడటమెందుకు? అన్నారు.
మన గురువే మన తండ్రి. ఇతరులకోసం ఆరాటం ఎందుకు?

- యం.పి. సాయినాథ్‌

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP