మహాశివరాత్రి పూజలకు గోత్రనామాలు పంపండి.
>> Wednesday, February 18, 2009

పరమశివుడు పరమదయాళువు.ఆయన నామముమృత్యుంజయము.ఆయనకు ఇష్టమైన మహాశివరాత్రి రోజున ఆయనను అర్చించడమే మహాపుణ్యమును ప్రసాదిస్తుంది.అనంత సుఖసంతోషాలను కలుగజేస్తుంది. మహాశివరాత్రి రోజు న పీఠములో రామలింగేశ్వరస్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకములు అర్చనలు జరుగుతాయి.పరమశివుని పావన నామము ఏకాహముగా జపించబడుతుంది. భక్తవరులు తమ గోత్రనామాలను పంపితె వారి తరపున,వారికుటుంబ సభ్యులకొరకు ప్రార్ధనలు జరుగుతాయి. వారితరపున అర్చన జరుపబడుతుంది. మీరు మీ గోత్రనామాలను పంపతము తో బాటు మీమిత్రులందరికి విషయాన్ని తెలియజేయండి. దొరికిన ప్రసాదాన్నైనా పదిమందితో కలసి పంచుకోవడము ఇక్కడ పీఠములో సేవావిధానము.

1 వ్యాఖ్యలు:
నమస్కారములు
ఈ రోజుల్లొ భక్తి తో భగవంతునికి ఒక నంస్కారము కుడా చెయ్యలేని వారు కోకొల్లలు అలాంటిది తమరు చేస్తున్న హరి సేవ శ్లాఘనీయము. తమరి కృషికి ధన్య వాదములు.
Post a Comment