హనుమద్రక్షాయాగం శుభఫలితాలనిస్తుంది.నిర్విఘ్నంగా కొనసాగుతుందిః శ్రీశ్రీగణపతి సచ్చిదానంద స్వామి
>> Friday, January 13, 2012

హనుమద్రాక్షాయాగం నిర్విఘ్నంగా కొనసాగుతుందని ,అందరికీ శుభఫలితాలనిస్తుందని  పూజ్యశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి  వారు ఆశీర్వదించారు .  ఈరోజు విజయవాడలో వారిని  మన కార్యకర్త ప్రభాకర్ రెడ్డి దర్శించుకుని యాగవివరాలను ప్రతులను సమర్పించారు. స్వామివారు  వివరాలడగటమే కాక  ప్రతులను కూడా తీసుకున్నారు. చాలాగొప్పసేవ స్వామివారికి జరుగుతుంది . నిర్విఘ్నంగా సాగి శుభఫలితాలనిస్తుంది ఈ యాగం అని అనుగ్రహభాషణం చేశారు
అంతేకాక మైసూరులో ప్రతిష్టించ బోయే హనుమంతులవారి ప్రతిష్టకోసం కూడా పారాయణంచేయమని చెప్పారు. ఈ తెలుగుప్రతి లాగే అక్కడ కార్యక్రమానికి కూడా  తయారుచేపించమని వారి శిష్యులను ఆదేశించారు .
పొద్దున్నే అక్కడకెళ్లాక  మన ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేశాడు. స్వామీ !ఇక్కడ వేలాదిజనం ఉన్నారు స్వామి దర్శనానికని. ఈ జనంలో మనకార్యక్రమాన్ని పట్టించుకుని మాట్లాడతారా ? అని సందేహం వ్యక్తం చేశాడు . నువ్వు  స్వామి హనుమ పనిమీద వెళ్లావు. నమ్మకం నీ ప్రయత్నంమీదకాదు స్వామి అనుగ్రహం మీదవుంచు . ఏమి జరుపుతాడో గమనించటం వరకే మనపని అని చెప్పాను .  ఆయన అనుగ్రహం ఇలా మహాత్ముల నోటిమాటరూపంలో మనపై వర్షించింది.
ఇప్పుడు  పోస్ట్ వ్రాస్తుండగా గుర్గావ్ నుంచి మోహన్ కిషోర్ గారు చెప్పారు . అక్కడ ఒక తల్లి [హిందీ వారు] మోహన్ గారి భార్యద్వారా వినిఇంగ్లీశ్ ప్రతిని చూసి   తానే హిందీ ప్రతిని డిజైన్ చేసి తానుకూడా పారాయణం చేస్తానని చెప్పారట. మొదటిసారిగా ఈకార్యక్రమంలో మాతృస్వరూపురాలగు ఆతల్లి  ఉత్తరాదినుంచికూడా పారాయణం చేయటం మొదలెట్టారని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

0 వ్యాఖ్యలు:
Post a Comment