ప్రకృతి నియమాలనే మార్చిన ఆ జగన్మాత కరుణ
>> Tuesday, July 6, 2010
పొన్నినది ప్రవహించే చోళ రాజ్యంలో తిరుక్కాడవూరు లో సుమారు 300వందల సంవత్సరాలక్రితమ్ ఒక సదాచార బ్రాహ్మణ కుటుంబం లో భక్తిజ్ఞానాలు మూర్తీభవించినట్లు అభిరామ భట్టు అనే భక్తుడు జన్మించారు. చిన్నతనం లోనే సంగీతం లో గొప్ప ప్రావీణ్యతను గడించి , జగన్మాతను తన సంగీతం తో ఆరాధిస్తుండేవారాయన. భౌతిక బంధాల పట్ల విరాగియై తిరుగుతుండే ఆయన్ను చూసి జనం పిచ్చివాడని గేళిచేసేవారు. కొందరు ఈతడేదో క్షుద్రదేవతో పాసకుడని ఈసడించుకుంటుండేవారు .
ఒక అమావాస్య పర్వదినాన సముద్రస్నాం చేయాలనే కోరికతో తంజావూరునేలే శరభోజి మహారాజు తిరుక్కడవూరుకు విజయం చేశారు. ఆయన అక్కడ దేవలం లోగల అమృతఘటేశుని . సేవించి జగన్మాత సన్నిధికి వచ్చిన ఆయనకు భక్తి తత్పరతతో బాహ్యవిషయాలు గ్రహించలేని స్థితిలో ఉన్మత్తునిలా అమ్మను స్తుతిస్తున్న అభిరామ భట్టు కనపడ్డారు . ఆస్థితిలో మహారాజువచ్చారనిగాని ,అసలు పక్కన ఇతర జీవులున్నారనే సృహలో కూడా లేని ఆయనను చూసిన మహారాజు ఆశ్చర్యపోయి ఎవరీయన ? అని అధికారులను అడిగాడు .
ఈతడొక పిచ్చివాడుమహారాజా ! ఏదో క్షుద్ర ఉపాసనతో ఇలా మతిభ్రమించినవాడు అని పక్కనున్నవారు వివరించారు . కానీ దివ్యతేజస్సుతో విరాజుల్లుతున్న అభిరామభట్టు ముఖకళలను చూసి మహారాజు ఈతనిలో ఏదో విశేషముందని భావించాడు. ఆయన ధ్యానం పూర్తయినదాకా ఉండి ,ఆయన బాహ్యస్మృతిలోకి రాగానే భట్టూ ! ఈరోజు తిథేమిటి ? అనడిగాడు మహారాజు .
అప్పటివరకు పున్నమి చంద్రునివంటి ఆ జగన్మాతను ధ్యానంలో దర్శిస్తూ ఉన్న భట్టు ఆ స్థితినుంచి ఇంకా బయటపడలేదు ,అందువల్ల ఈరోజు పౌర్ణమి అని బదులు పలికాడు
అప్పటి దాకా ఈయన పట్ల గౌరవభావం తో ఉన్న మహారాజుకు ఈ సమాధానంతో నిజంగా ఈతనికి పిచ్చేనేమో అనే నమ్మకం కలిగింది .
మహారాజు నిష్క్రమించాక యథాస్థితి కొచ్చిన భట్టుకు జనం పరిహాసాలు ,అవహేళన బాధ కలిగించాయి. చిన్నపిల్లవానిలా ఆతల్లి సన్నిధికెల్లి అమ్మా ! నువ్వే ఈ అపవాదునుంచి నన్ను తప్పించాలి . నానోట నువ్వుపలికించిన మాట నిజమయ్యేలా చేసే భారం నీదే ! అని ప్రార్ధించాడు . అంతేకాదు అమ్మవారి సన్నిధిలో లోతైన గోతిని తవ్వుకుని అందులో అగ్నిని ప్రజ్వరిల్లజేసి వంద నూలు పోగులతో ఒక పీఠాన్ని అగ్నికి పైభాగం లో వేలాడదీశాడు . అటుపై ఆపీఠం పై కెక్కి కూర్చుని జగన్మాతను తన దివ్యగానం తో స్తుతిస్థున్నాడు . అమ్మా మహారాజు సన్నిధిలో నాకు కలిగిన అపవాదాన్ని తొలగిమ్చకుంటేఈసరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను అంటూ [అందాది]పాడసాగాడు. ఒకపాట పూర్తవగానే ఒక నూలుపోగు కత్తిరిస్తూ వస్తున్నాడు. డెబ్బది తొమ్మిదవ పాట పాడుతుండగా సూర్యాస్తమయ సమయం లో అమ్మవారు ఆయనకు దర్శనమిచ్చింది. నాయనా నీమాటను నిజం చేస్తున్నాను చూడు అంటూ తన కుండలాన్నొకదాన్ని తీసి అంతరిక్షంలోకి విసిరింది . అది కోటిపున్నమిచంద్రుల ప్రకాశాన్నిస్తూ వెలుగులువిరజిమ్ముతున్నది . నువ్వు పాడుతున్న అందాది పాటను పూర్తిచేయి అని చిరునవ్వులు చిందించింది .
తల్లీ ! ఈదీనున్ని ఉద్దరించటానికి నీవే స్వయంగా వచ్చావా అని ఆనందోద్రేకాలతో భక్తుడు పరవశించి పాడుతున్నాడు. జగన్మాతా !ఈచరాచర జగత్తంతా నీ ఇఛ్చానుసారమే నడుస్తున్నది అంటూ స్థుతిస్తున్నాడు .
అటు అమావాస్య రోజున పూర్ణచంద్రుని కాంతులు జగత్తంతా వెలుగులువెదజల్లుతుంటే ఈచిత్రానికి జనం తెల్లబోయారు అభిరాముల భక్తికి ఆతల్లి ప్రేమను పొగడుతూ పరవశించిపోతున్నారు . మహా భక్తునికి జేజేలు కొడుతున్నారు . అక్కడ మహారాజు ఈచిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అభిరామ భట్టువంటి మహా భక్తుని దర్శించటం మహాభాగ్యమని తలచి ఆస్థాన సభ్యులతో కలసి పరుగునవచ్చారు .భట్టుగారి పాదాలపైబడి మహాత్మా ! తమవంటి పుణ్యాత్ములవలన ఆతల్లి దివ్యప్రేమకు అవధులు లేవని తెలుసుకునే భాగ్యం మాకు కలిగింది అని ఆయనను వేనోల్లకొనియాడారు.
ఆతల్లి దివ్యకరుణకు అవధులులేవని నిరూపించారు మహాభక్తుడైన భట్టు "అందాది " పాటలు పాడి .
3 వ్యాఖ్యలు:
Good post...Sir keep going...!!!
హరిహరబ్రహ్మాదులకైన వర్ణింప తరమా నీదు మహిమ
ముజ్జగముల కన్నతల్లి, ముగురమ్మల మూలపుటమ్మ
ఎల్లలోకములకు ఆరాధ్యవు నీవు,భక్తులపాలిట కొంగు
బంగారము నీవు, ఓ అమ్మా మము కరుణింపగ రావమ్మా!
తిధినే మార్చ గలిగిన మహా భక్తుడు భట్టు ఇంతటి మంచి విషయాలను తెలుసుకో గలిగిన మీరు పరిస్తితులను అవలీలగ అధిగమించ గలరు ఇంతకు ముందు ఈ కధ తెలియదు మీ హరి సేవలొ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకో గలుగు తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ధన్య వాదములు
Post a Comment