ఏరువాక మరచాడో... రన్నో.... రైతన్నా .....
>> Saturday, June 26, 2010
ఈరోజు ఏరువాక పౌర్ణమి . ఇది రైతుల పండుగ . దురదృష్టమేమిటంటే ఈ పండుగను రైతులే మరచిపోతున్నారు.
నాచిన్నతనం లో ఈ రోజు అరకలనుపూజించుకుని ,ఎద్దులు, దున్నపోతులను అలంకరించుకుని పొలాలకు సాగే వారు . పెద్దలవెంట మేముకూడా ముల్లుగర్రలను పట్టుకుని వెల్ళేవాల్లం . కుడుములు వండి ఆడవాల్లు మూటలు కట్టి ఇచ్చేవారు .ఊరు ఊరంతా ఉత్సాహంగా ముందు వినాయకుని గుడికి వెళ్ళి పూజజరిపి దణ్నం పెట్టుకుని అరకలు ,గుద్దేలు , నాగలి , దంతె ఇలా ఎవరికి నచ్చినవి వాల్లు తీసుకునిపాటలు పాడుతూ పొలం వెల్లేవాల్లు. అక్కడ దేవునికి దణ్నం పెట్తుకుని ఉండ్రాల్లు పొలం లో అన్నివైపులకు విసిరేవారు. ఆతరువాత పొలం పనులు మొదలు పెట్టామన్నందుకు గుర్తుగా కొందరు సాల్లు వేసే వాళ్ళు . మరికొందరు గుద్దేళ్ళతో రేగుమండలు , కంప చెట్లు కొట్టేవాళ్లు .
చిన్నపిల్లలము మాకప్పుడొక గొప్ప సరదా అందులో పాల్గొనటం . ఊరికొక కొత్తకళ. అరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే రైతు తన సన్నద్ధతను చాటే గొప్ప పండుగ . ఈ పండుగ గూర్చే మనకు తెలుగు పాటలలో ప్రసిద్దమైన ఏరువాకా సాగారో ... రన్నో రైతన్నా ..... అనే పాట తెలియనివారు వినని వారుండరనుకుంటాను .
పల్లె కన్నీరు పెడుతుందో ...కనిపించని కుట్రల .....అని మన ప్రజాకవి చెప్పింది అక్షర సత్యం . మారిపోయారు రైతులు ఈ మాయలో పడి . తమ కాధారమైన పశుసంపదను దూరం చేసుకుని యంత్రాలతో వ్యవసాయానికి అలవాటు పడిపోయారు. వాటికిమల్లే నే యంత్రాలుగా మారి పోతూ ఆత్మీయతల అనుబంధాలతో కూడిన సంస్కృతులను ఈ పండుగలను క్రమేపీ మరచి పోతున్నారు. ఈ రోజు మాఊర్లో ఈ పండుగ ఆనవాల్లే కనిపించలేదు. ముప్పై సంవత్సరాలక్రితం నేను చూసిన పండుగ ఈ రోజు నాపిల్లలు చూసేఅవకాశం లేకుండాపోయింది . మరో ముప్పై సంవత్సరాలతరువాత ఈ తల్లీదండ్రీ బంధాలనన్నా చూస్తామా లేదా ? అనుమానం వేస్తుంది .
4 వ్యాఖ్యలు:
మీ పోస్ట్ నేను ఉదయాన్నే చూసుంటే మా తోటకి వెళ్ళి ఆ పండగ చేసుకునే వాళ్ళం.
వచ్చే యేడు చేయాల్సిందే.
ఇంకా మరుగవుతున్న ఇలాంటి పండగల గురించి వివరంగా రాయండి.
థాంక్యు.
Thanks for remind me
You took me 40 years back in the memory lane.
At least some body should have recorded the importance for future generations.
మా అనంతపురం ప్రాంతంలో ఈ రోజు ఇలా చేయంగానీ ఉగాది పండుగ రోజున చేస్తాం.పిండివంటలు విసరడం లేదు గానీ ఉదయాన్నే ఎడ్లను బాగా అలంకరించి పొలంలో కొబ్బరికాయ కొట్టి ఆ రోజు సేద్యం ప్రారంభించేవాళ్ళం పొలంలో ఉన్న చెట్లను కొట్టేస్తాము.ఇప్పుడు ఎద్దులన్నీ కనుమరుగై పోయాయి కొబ్బరికాయ కొట్టి చెట్లు కొట్టి నామమాత్రంగా చేస్తున్నాము.ట్రాక్టరు ఉన్నవాళ్ళు ట్రాక్టరుతో సేద్యం ప్రారంభిస్తారు.
మా గోదావరి ప్రాంతంలోను ఇలాంటివి చేయడం లేదు. క్రమేణా ప్రజలు అన్నీ మరిచిపోతున్నారు.
Post a Comment