చిరంజీవి గౌతమ్ కు ఆరోగ్యం చేకూరాలని ప్రార్ధించండి .
>> Saturday, May 8, 2010
ఇక్కడ అంతర్జాలంలో ఓ వార్త చదివాక మనసు దు:ఖపూరితమవుతున్నది. ఒకపాత్రికేయుని కుమారుడు తీవ్రమైన రుగ్మతతతో వేధించబడుతూ వేదన చెందుతున్నాడు . పందొమ్మిది సంవత్సరాల ఆ పిల్లవాని పేరు గౌతమ్ . వాని బాధచూడలేక ఆతల్లిదండ్రులు గుండెలవిశేలా రోధిస్తున్నారు. లక్షలరూపాయలను ఖర్చుపెట్టారు. అనేకమంది డాక్టర్లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆపిల్లవాన్ని చికిత్సకోసం త్రివేండ్రం తీసుకెళ్ళారు. లోకేశ్వరరావుగారనే అపాత్రికేయుడు బిడ్డకోసం బిడ్డ ఆరోగ్యం కోసం తన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. దురదృష్ట వశాత్తూ ఆయన ఆర్ధికపరిస్థితి దీనంగా ఉంది. రాత్రి వారితో మాట్లాడాను . బిడ్డకోసం పరితపిస్తున్న ఆతండ్రి హృదయవేదన మనసును కలచివేస్తున్నది.
ఈ అంతర్జాలం లో వారి శ్రేయోభిలాషులు ఆర్ధికంగా వారికి చేయూతనిమ్మని విజ్ఞప్తులు చేస్తున్నారు. సాటిమానవునికి ఆపదలో అన్నిరకాలుగా సహాయపడవలసిన అవసరం ఉంది. మానవప్రయత్నం తోపాటు ఈసమయంలో దైవానుగ్రహం కూడా ఆచిన్నారికి అవసరం . మంచి మనసుకలవారైన మీరంతా ఆబిడ్డ ఆరోగ్యం కోసం మీమీ పూజ,ధ్యాన సమయములలో సంకల్పం చెప్పి ప్రార్ధించమని మనవి.
హనుమత్ రక్షాయాగం జరుగుతున్నందున ,ఈరోజు ఇక్కడ దీక్షతీసుకున్న చిన్నపిల్లలంతా విషయం చెప్పగనే ఆబిడ్డకు స్వస్థత చేకూరాలని 108 సార్లు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం తో ప్రార్ధనలు చేశారు. ఉదయం ఏడుగంటలనుండి మధ్యాహ్నం పన్నెండు దాకా ప్రతి ఆవృత్తికి ఒక హారతిస్తూ ఈ పారాయణం జరిపారు. సంజీవ రాయడై, ఆరోగ్యప్రదాతగా కీర్తించబడుతున్న స్వామి అనుగ్రహం ఆబాలునిపై ప్రసరించి ఔషధములు సంజీవనులై వైద్యులయత్నాలు సఫలీకృతమవ్వాలని కోరుకుంటున్నాము. ఆచిన్నారి మోముపై చిరునవ్వులు విరబూసేలాచేయాలని స్వామిని వేడుకుంటున్నాము. ఆరోగ్యదాతా ...అభయప్రదాతా ...జయజయ హనుమా..పావననామా.
[సామూహిక సంకల్పానికి,ప్రార్ధనకు అనంతమైన శక్తి ఉంటుందనేది సత్యం కనుక ఆ బిడ్డకోసం మనం కూడా ప్రార్ధిధ్ధాము]
6 వ్యాఖ్యలు:
ఈ చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆ భగవంతున్ని మనసారా ప్రార్ధిస్తున్నాను.
When I go to the temple this afternoon, I will do the same.
ఆ బాబుకి ఆరోగ్యం కలగాలని మనసారా దేముణ్ణి కోరుకుంటున్నాను.
ధన్యవాదములు స్పందిస్తున్న భగవద్బంధువులందరికీ
nenu repu naa meditation tarvata aa abbayi gurinchi prarthistaanu..
-Karthik
మీ హనుమాన్ చాలీసా పారాయణం చాలా సంతోష దాయకం.
హనుమంతుని ప్రస్థావన వచ్చింది కనుక ఓ విషయం.
నిన్న సాయంత్రం హనుమంతుని పూజించిన వారు, దర్శించిన వారు ధన్యలు. ఎందుకంటే నిన్న ( అధిక ) వైశాఖ మాసం,అందునా బహుళ దశమి,అందునా శనివారం, అందునా నిన్న రాత్రి పూర్వాభాద్ర నక్షత్రం ఉంది. నాకు అనుకోకుండా అటువంటి భాగ్యం కలిగింది.
ఇక చిరంజీవి గురించి నేనూ మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను.
శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష
Post a Comment