శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శనీశ్వరుని ప్రభావానికి లొంగని హనుమంతుడు

>> Saturday, May 8, 2010

దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి.

శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు.

ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు.

కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు.

అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు.

అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.

ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
[అంతర్జాలంలో ఉన్న ఓసమాచారం ఇది.]

3 వ్యాఖ్యలు:

రాజేశ్వరి నేదునూరి May 8, 2010 at 7:46 AM  

నమస్కారములు.
హనుమ శనీశ్వరుని తన పాదాలక్రింద అణచి వేసిన విధానం చక్కగా వివరించారు. అంతేకాదు శని ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుని పూజించిన వారికి శనీశ్వరుని వలన కలిగే ఈతి బాధలనుంచి విముక్తి కలుగు తుందని చక్కని సమాచారాన్ని అందించి నందుకు ధన్య వాదములు దుర్గేశ్వర్ గారు మీ హరిసేవ కి కృతజ్ఞతలు.

M Pavan Kumar May 8, 2010 at 8:37 AM  

నమస్కారం!.
నిజానికి "శని" మీద నమ్మకం నాకులెకపోయినప్పటికినీ (ఇది కేవలం వ్యక్తిగతం) మీరు చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈ విషయం గురించి నేను కూడా ఒక చోట చదివాను.

ఆంజనేయుడి పాదాలకింద బందీ అయిన శనీశ్వరుడు ఆంజనేయుడిని విముక్తుడిని చేయమని వేడుకొంటాడు. ప్రక్రుతి నియమం ప్రకారం శనీశ్వరుడు ఎవరినో ఒకరిని పట్టి పీడించాలి కదా!. అప్పుడు శనీశ్వరుడికి అంజనేయుడొక ఉపాయం చెబుతాడు. ఎవరయితే కేవలం నా పాదాలకు నమస్కారం చేస్తాడో వాళ్ళని లటుక్కున పట్టేయమని, ఆయన హృదయంలో కొలువయి ఉన్న శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసిన వాళ్లని మాత్రం పట్టేయ్యొద్దని.

అందుకే హనుమంతుడి గుడిలో వెళ్ళు ఎప్పుడు కూడా ఆయన పాదాలకి నమస్కారం చెయ్యరాదని, ఆయన హ్రుదయానికి (శ్రీరాముడి కొలువు కాబట్టి) మాత్రమే నమస్కారం చెయ్యాలని ఏదో గ్రంధంలో చదివాను. కాని చాలామంది హనుమంతుడికి సాష్టాంగ నమస్కారలు చేస్తారు. దీని గురించి కాస్తా వివరించగలరు.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ May 9, 2010 at 10:24 AM  

మరి విఘ్నేశ్వరుని కధ ఏమిటి?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP