శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గంగా, గీత, గాయత్రి లను గౌరవించడం ముఖ్యం,

>> Wednesday, January 12, 2022

ఓసారి అక్బర్ బీర్బల్ ఇద్దరూ వ్యాహ్యాళికి వెళ్లారు 

దారిలో తులసి చెట్టు కనిపించేసరికి బీర్బల్ వంగి సంస్కారంతో ప్రణామం చేసాడు.

ఎవరది ఏంటది అనడిగాడు అక్బర్!

బీర్బల్ - మాతల్లి తులసీమాత

అక్బర్ వెంటనే అది పీకి పారేసి ఎంతమంది తల్లులు ఉంటారు మీ హిందువులకు అన్నాడు.

దానికి సరైన జవాబు ఇచ్చే అవకాశం కోసం చూస్తూ బీర్బల్ ఓపిగ్గా అక్బర్ వెంట నడుస్తున్నాడు 

ఓ చోట దురదగుంటాకు చెట్టు కనపడింది, వెంబడే బీర్బల్ పితృ దేవేభ్యోన్నమః అంటూ నమస్కారం చేసాడు 

అక్బర్ కి కోపం వచ్చి రెండు చేతులతో దాన్ని పీకే ప్రయత్నం మొదలు పెట్టాడు. అంతలోనే అతనికి దురద మొదలవడంతో, బీర్బల్ ఏమిటిది అనడిగాడు.

మీరు మా తల్లిని అకారణంగా దండించినందుకు పితృదేవులకు కోపం వచ్చింది అని చెప్పాడు.

అక్బర్ చేతులు శరీరం లో ఎక్కడ పెట్టినా అక్కడ దురద మొదలైంది.

దాంతో, ఏదైనా ఉపాయం చెప్పు బీర్బల్ త్వరగా  అన్నాడు 

బీర్బల్ - ఉపాయం ఉంది, ఉపశమనం లభిస్తుంది, కానీ అదీ మా ఇంకో తల్లి దగ్గర వేడుకోవాలి చూద్దాము అన్నాడు.

అక్బర్ - ఏదో ఒకటి తొందరగా చెయ్యి అన్నాడు

బీర్బల్ - అదిగో అక్కడ ఉన్న గోమాతని అడగండి, మాతా, తగిన మందుని ప్రసాదించు అని అడగండి అన్నాడు.
అక్బర్ ఆ విధంగా అడగడంతో ఆవు పేడ వేసింది, ఆ లేపనాన్ని పూయాడంతో అక్బర్ కి దురద నుండి ఉపశమనం లభించింది!

కానీ అవతారం చూసుకుని, బీర్బల్ ని అక్బర్ అడిగాడు రాజమహల్ కి ఇలా ఎలా వెళ్ళగలము అని.

బీర్బల్ -
లేదులెండి బాద్షా, మా ఇంకొక తల్లి ఉంది మార్గం చూపిస్తుంది అని చెప్పాడు.

ఎదురుగా గంగానది ప్రవహిస్తోంది.

బీర్బల్ చెప్పాడు - ఇప్పుడు మీరు హర్ హర్ గంగే, జై గంగా మాత అని నదిలోకి దూకండి అని!

ఆవిధంగా స్నానం చేసి హాయిగా ఫీల్ అవుతు గంగకి నమస్కారం చేసుకున్నాడు అక్బర్.

అప్పుడు బీర్బల్ చెప్పాడు, మహారాజా, తులసీమాత, గోమాత, గంగామాత జగత్ జగత్ జననీలు, బేధ భావాలు లేకుండా అందరి  శుభానికి మేలు చేస్తుంటారు అని.

ఇది నమ్మేవారిని హిందువులు అంటాము
హిందూ అనేది ఒక సభ్యత, సంస్కృతీ విధానమేగాని మతం కాదు, అంతటి గొప్ప జీవన విధానం అని
.

*గో,గంగా, గీత, గాయత్రి లను గౌరవించడం ముఖ్యం, అవి మన సంస్కృతికి మూలస్థంభాలు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP