శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జంబూ ద్వీప స్వరూపం

>> Sunday, May 26, 2019

🍁జంబూ ద్వీప స్వరూపం

ద్వీపాలూ, అందులోని దేశాలు అని ఏమేరకు విస్తరించాయో తెలియజెపుతాను. విను!...లక్షయోజనాల విస్తీర్ణంలో - ఒక్కొక్కటే తొమ్మివేల పైచిలుకు యోజనాలమేర ఆక్రమించే 9 దేశాలు (ఆకాలంలో 'వర్షాలు' అనేవారు) ఉన్నాయి. సుదీర్ఘ పర్వత పంక్తులు ఎనిమిది. దీనిలో మేరు పర్వతమనేది నాభికేంద్రం. ఇందులోని మొత్తం వర్షాలన్నిటికి ఇలావృత వర్షం మధ్య భాగాన ఉన్నది. ఈ ఇలావృతానికి దక్షిణాన హిమాలయ - హేమకూట - నిషధ పర్వతాల వరసలున్నాయి. ఈ సరిహద్దులలోనే హరివర్ష, కింపురుషవర్ష, భారతవర్షాలున్నాయి. జంబూద్వీపంలోని ఇతర వర్షాలు ఇవీ - కేతుమాల, భద్రాశ్వ, రమ్యక, కురు, నీల, నిషధములు. (వీటిని వర్ణించడం అంటే - ప్రత్యేకంగా 'జంబూద్వీపం' అనే గ్రంధమే అవుతుంది).

ఈ జంబూద్వీపంలోనిదే మన దేశం. భరతవర్షం. జంబూద్వీపం అనే పేరు రావడానికి కారణం - ఈ ద్వీపంలో గల మేరు పర్వతం / మందరగిరి మీద గల నేరేడు చెట్టు నుంచి ఏనుగు తలల్లాంటి జంబూ ఫలాలు రాలిపడి పగిలి, వాటి ఫలరసం నదిగా ప్రవహించింది. ఈ ప్రాంతంలో మట్టి జంబూ ఫలరసంలో నాని, దేవతల హస్తవాసితో బంగారం అవుతోంది. ఈ జంబూ నది ఒడ్డున వెలసిన దేవత - జంబ్వాదిని.

‎ప్రపంచం అంతా ఒకనాడు భరతవంశానికి చెందినదే
 (దయచేసి కొంచెం ఓపికగా చదవండి.)

వేదాన్ని మన జాతి తన సంపదగా పరిరక్షించుకుంటూ వస్తుంది. మరి వేదాన్ని ఆచరించని పాశ్చాత్యుల విషయం ఏమి. మనం ఈనాడు చూస్తున్న ఇన్ని మతాలు ఎక్కడివి.

రామాయణ, భారత కాలాల్లో మతాలు అంటూ ఏమి లేవు. మతం అంటూ చెప్పాలంటే వైధిక మతం అని చెప్పాలి. కొందరు దాన్ని అచరించేవాల్లు. మరికొందరు పాటించనివారుండే వారు.

 అయితే ఆ వేదాలని ఆచరించే వారిలో కూడా ఎన్నో శాఖలు ఉండేవి.

అయితే ఈ భూమిమీద ఉండే ప్రతి మానవుడూ భరత వంశంలోంచి వచ్చినవారే. ఈ విషయం శ్రీమద్భాగవతం అయిదవ స్కదంలో  ఉంది.

ఈ భూమి సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అంతా ఒకే భూ భాగం క్రింద ఉండేది ఒక నాడు. అందుకే సంధ్యా వందనాదుల్లో "చతుస్సాగర పర్యంతం" అని కనిపిస్తుంది మనకు.

సుమారు 100 కోట్ల సంవత్సరాల క్రితం నుండి విడిపోవడం ప్రారంభించినది.

సుమారు 50 లక్షల సంవత్సరాల కాలంగా మనం ఇప్పుడు చూస్తుండే ఖండంగా ఏర్పడ్డది.

 మన పురాణాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే మన పంచాంగల్లో సృష్టి ఆది 198 కోట్ల 58 లక్షల సంవత్సరాలు అని ఉంది.

అమేరికాలోని చికాగో లో న్యాచురల్ సైన్స్ మ్యుజియంలో ఈ భూమి ఆకృతి 200 కోట్ల సంవత్సరాల క్రింద ఇలా ఉంది, 100 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా అంటూ చూపిస్తూ 50 లక్ష్లల సంవత్సరాల క్రితంగా మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచ ఆకృతిని చూపించారు. వాటికి వారి వద్ద ఏ ఆధారాలు లేవు.

మనం కచ్చితంగా 198 కోట్ల సంవత్సరాలు అని చెప్పగల్గుతున్నాం. మన వద్ద గ్రహించిన విషయాన్నే వాళ్ళు తిరిగి ప్రపంచానికి తెలియజేస్తున్నారు మేం చెబుతున్నాం అన్నట్టుగా. వాళ్ళు ఇంతవరకే చెబుతున్నారు.

మన వద్ద ఇంతకు మించి ఆధారాలు కనిపిస్తున్నాయి.

ఈ భూమిని ఖండాలుగా విభజించిన " నాభి " అనే చక్రవర్తి ఉన్నాడు. భరత వంశానికి చెందిన వాడు. తన సంతానానికోసం ఇలా విభజించి మొత్తం తన వంశాలవారినే అన్ని ఖండాల్లో విస్తరించాడు. వారే ఒక రథాన్ని ఉపయోగించి భూభాగాన్ని జరిపారు అని తెలుస్తోంది.

మనం ఇప్పుడు చూస్తున్న ఆస్ట్రేలియా ఖండం ఒకనాడు భారతదేశపు ఆగ్నేయ భాగంలో ఉండేదని ఇప్పటి శాస్త్రవెత్తలూ అంగీకరిస్తారు.ఆస్ట్రేలియా లో ఉత్తర భాగంలో ఉన్న అడవులూ, పక్షులూ మన తమిళనాటి అడవులను, పక్షులను పోలి ఉంటాయి.

 ఈ భూమి అలా క్రమేపీ జరుగుతూ ఉండటంచే అక్కడి పక్షులూ తమిళనాటికి వలస వస్తూ ఉంటాయి ఈ కాలం వరకు.

అక్కడ ఉన్న ఒకప్పటి వాళ్ళు మన దేశ తమిళనాటి వారిలాగే ఉంటారు. వారి భాష కూడా అట్లానే ఉంటుంది. అక్కడ ఉండే బంగారు నిధుల కోసం బ్రిటీష్ వారు అక్కడ కాలు పెట్టి వారిని నామ రూపాలు లేకుండా చేసారు.

ఇప్పుడు మనం అనుకుంటున్న అమేరికా కూడా అంతే. అక్కడి వారిని అనిచివేసి మేం అమెరికా అని ఈనాడు చెప్పుకుంటున్నారు.

అమేరికాలోని మనం ఈ నాడు కాలిఫోర్నియా కూడా మనం మన పురాణాల్లో చూడవచ్చు. మనకు సగర చక్రవర్తి కుమారులు కపిల మహర్షిని వల్ల కాలి బూడిదైపోతే భగీరతుడు గంగను రప్పించాడు అని మనకు తెలుస్తుంది. అయితే ఆ కపిల మహర్షి ఉన్న అరణ్యమే మనం ఇప్పుడు చూస్తున్న కాలిఫోర్నియా.

 అదెలా అంటే, సంసృతంలో కొన్ని పదాలు వాటి స్వభావన్ని బట్టి అక్షరాలు మారుతాయి. హింస చేయునది సింహం అంటారు.

ఇక్కడ 'స' 'హ' అక్షరాలు మారాయి.అలాగే కపిలారణ్య లో 'ప''ల' అక్షరాలు తిరగరాస్తే క-లి-ప అరణ్య, అలా కాలిఫోర్నియా అయ్యింది.

ఆ నాడు భరత వంశానికి చెందిన వాళ్ళు ఈ భూమిని విభజించాక బర్డ్ ఐ వ్యూ ఎట్లా ఉందో మన పురాణాల్లో ఉంది. అదెలా అంటే ఒక కుందేలు తన కాల్లపై లేచి ఎదురుగా ఉండే గడ్డి పొదకై చూస్తున్నట్లుగా ఉందని మన పురాణాల్లో ఉంది.

 మన పురాణాల లోనికి వారు వెల్లలేదు కనక ఈ విషయం పాశ్చాత్యులకి దొరకలేదు. లేకుంటే ఈ విశయాన్ని కూడా వాల్లే చెప్పే వాళ్ళు . ఈ చిత్రం మనం ప్రపంచ పటాన్ని తిప్పి చూస్తే కనిపిస్తుంది.

 మొత్తం ఆసియా, యూరోప్ ఖండాలు గడ్డిగా, అమేరిక కుందేలుగా కనిపిస్తుంది. దక్షిణ అమేరికా కుందేటి తల, ఇక ఉత్తర అమేరికా ఆ కుందేటి పొట్ట భాగం. అందుకే కాబోలు ప్రపంచాన్నంతా దోచుకుతిన్నారు!! అమేరికాలో ఉన్న విలువైన బంగారం అంతా ఒక నాడు ఇక్కడి నుండి దోచుకున్నదే.

ఈ విషయం పక్కన పెడుదాం. ప్రపంచ పటాన్ని మేం తయారు చేసాం అని చెబుతున్న వాల్లకు ఇన్ని విషయాలు తెలియవు.

ఈ పాశ్చాత్యులు అలా చీలిన భూభాగాల్లో నివసించే వారిలో వేదాలని ఆచరించక బ్రతికేవాల్లలోకి చెంది ఉంటారు. భూమిని విభాగలుగా చీల్చిన వృషభుడి కుమారుడు భరతుడు. ఆయన తన నియంత్రణ కేవలం తన భూభాగానికే పరిమితం కాక పాలించేవాడు.

అందరూ ఆయన పేరు చెప్పుకొనే వారట, అందుకే భరతీయ అనే పేరు ఈ భూమి అంతటా ఉండేది. ఈ భరతుడు స్వాయంభువ మన్వంతరానికి చెందినవాడు. అయితే ఈ నాడు మనం శకుంతల కుమారుడు భరతుడు, అతని ద్వారా భారతదేశం అని చెప్పుకుంటున్నాం. ఈ భరతుడు వైవత్సువ మన్వంతరానికి చెందినవాడు.

దురదృష్ట కరం ఈనాడు మనం వాటి విలువను తెలియక మన పురాణలపై, ఇతిహాసాలపై ఏమాత్రం గౌరవంలేనివాల్లలా తయారయ్యాం. ఇవి వాస్తవం అని గుర్తించాలి.

మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత?

900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !

2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి .

5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి .

1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి .

మరీ భారత దేశం వయసు ఎంత ???

ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం .

ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....

ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే .

వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి .

విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు

ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు.

ఇలా ...
అస్తేరియా,
సుమేరియా,
బాబిలోనా,
 మెసపటోనియా .... ఇలా 27 దేశాలు నేడు లేవు .

ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"

ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.

మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.

చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"

ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది .

రోమ్ మీద కేవలం 7,8 సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది .

మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?

శకులు,
తుష్కరులు,
మొఘలులు,
సుల్తానులు,
నవాబులు,
షేక్ లు,
పఠాన్ లు,
పోర్చుగీస్ వారు,
ఫ్రెంచ్ వారు,
డచ్ వారు,
బ్రిటీష్ వారు...
ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం .....! ఏమి పీక లేక పోయారు .

ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...

"హైందవ దేశం-నా భారత దేశం" ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం .

మరీ దేశభక్తుల విషయం...

1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?

4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !

మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది .

ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి .

ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.

ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP