శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నేనున్నాను అని మనకు ఆభయమిస్తూ నిన్న టి పారాయణ సమయములో స్వామి కల్పించిన లీల

>> Wednesday, May 12, 2021


కరోనా కాలనాగుకు భయపడి అందరం ఒకచోట కలిసి కూర్చొన వీలుగాక   జూమ్ యాప్ ద్వారా  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటున్నాము. ఇది నాకు కొత్త. ఎప్పుడూ పదిమందితో కలసి కార్యక్రమాలు చేయటమే గాని ఇలా తలా ఓ చోట ఉండి ఫోన్ల లో చేయటం  పద్ధతేనా ?అసలు స్వామికి ఈ పారాయణ ప్రీతి కలిగిస్తుందా????? అని మనసు లోతులలో  ఒక శంక  పొటమరించే ఉంది. ఆయన భక్తజనులకు గురువు కూడా కదా!  అందుకే సందేహం తీర్చాలనుకున్నాడులా ఉంది.

నిన్న రాత్రి నాలుగవరోజు. మూడుసార్లు పూర్తయి నాలుగవసారి  పారాయణము జరుగుతూ ఉంది.హఠాత్తుగా తెల్లగా మంచుతెరలా పైకిలేస్తూ నాముందున్న కెమేరా లో కనపడుతున్నది. నాక అర్థం కాలేదు .ఒకవేళ అగరొత్తుల పొగా అని చూస్తే అవి లేవు. దీపారాధన కొండెక్కినా  వత్తులు కాలిపోయి పొగ లేచినదా అని చూస్తే దేదీప్యమానంగా వెలుగు తున్నది. నిదానంగా స్వామి రూపంలోకి వస్తున్నట్లుగ అనిపించింది కెమేరాకు వెనుక కూర్చుని పారాయణం చేస్తున్న మాపిల్లలకు  పారాయణ మధ్యలో ఆపకూడదు కనుక చూడమని సైగల ద్వారా  తెలిపాను .వాల్లు ముందుకొచ్చి  చూస్తుండగనే అంతా రెండు నిమిషాలలోనే కరిగి అదృశ్యం అయినది. పారాయణం అయిపోయాక హైదరాబాద్ నుండి మనోహర్  చెప్పాడు.మస్టారూ ! ముందు మీరు తల ఎత్తి చూడ లేదు. నాకిక్కడ స్క్రీన్ పై  దృశ్యం మొదులవ్వగనే   ఏదో జరుగుతోందనిపించి  ఆనందంతో కన్నీళ్లు ...నోరుమూతబడిపోయి  చూస్తూ ఉండిపోయా.... మీరు తల పైకెత్తి అటూ ఇటూ చూస్తూ పాడుతున్నారు. అదృశ్యమవుతున్నదనిపించి స్క్రీన్ షాట్ తీసాను.ఆనందం చెప్పలేకున్నాను   మీకు పంపుతాను చూడండి  అని అన్నాడు.
ఇంకొంతమంది  మీరం సాంబ్రాణి ధూపం వేశారనుకున్నాము.అన్నారు.

మీరు ఏస్థితిలో ఉన్నా    నన్నునమ్మిపిలిచిన వారిని నేను వెన్నంటే ఉంటాను  అని స్వామి మనకు నమ్మకం కలిగేలా నిదర్శనాలు చూపిస్తుంటారు. 

1 వ్యాఖ్యలు:

satya May 12, 2021 at 5:27 AM  

🙏🙏🙏

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP