శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీ నివాసం నుండేహనుమాన్ చాలీసా సామూహిక పారాయణం లో పాల్గొనమని ఆహ్వానము

>> Saturday, May 8, 2021

భగవద్బంధూ, 

ప్రస్తుతం  లోకములో సంభవిస్తున్న ఉపద్రవములుభీతికొలుపుతున్నాయి. మానవ జీవితం కకావికలమవుతున్నది. ప్రకృతితో మమేకమైనమన ఆహార విహారాదులను నిర్లక్ష్యముచేయటము ,గోవధ, అధర్మ ప్రవర్తనలు సామూహికంగా సమాజానికి కర్మఫలితాలుగాచుట్టుకొంటున్నాయి.

వీటినుండి మన బలం, బలగం, సంపదలు ఇవేవీ రక్షించలేవని మెలమెల్లగా అర్థమవుతున్నది మానవాళికి.

కానీ ఎటువంటి ప్రళయాలలోనైనా భగవంతుని పాదములనాశ్రయించినవానికి కీడు ఉండదని మన పురాణాదులు నిరూపిస్తూ ఉన్నాయి.

అందుకే భక్తజన సంరక్షకుడైన హనుమంతులవారిపాదములను ఆశ్రయిస్తూ మనందరము సామూహికముగా అతి శక్తివంతమైన   హనుమాన్ చాలీసా పారాయణమును జరుపుకొనుటకు సంకల్పముచేయటం జరిగినది. పీఠము లో  ఇప్పుడు నిర్వహించబడుతున్న హనుమద్రక్షాయాగం లో భాగంగా ఈరోజు  8-5-21  శనివారం నుండి  5-6-21 శనివారం  జరిగే పూర్ణాహుతి వరకు  ప్రతిరోజూ సాయంత్రం   7. 30 pm to 8.00 pm(IST) వరకు zoom   ద్వారా సామూహికంగా పారాయణం జరుగుతున్నది. మీరందరూ ఇందులో పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నాము. ఆంజనేయుడు ఉన్నచోట భయమునకు తావులేదు . రోగోపద్రవములు, అపజయములను పారద్రోలు శ్రీహనుమంతుల వారి  పాదపద్మములనుఆశ్రయిద్దాం. ధర్మవర్తనులమై స్వామి పరివారంగా నిర్భీతులమై జీవిద్దాం.

జైశ్రీరాం

 మీరు  ఆచమనం చేయటానికి నీరు కూర్చొనటానికి ఆసనము సిద్దముచేసుకుని మధ్యలో  ఆటంకములు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుని సిద్దమవ్వవలసినదిగా మనవి ఏదైనా సందేహము ఉంటే నాకు పారాయణానంతరం కాల్ చేయగలరు.       +91 9948235641

Zoom Link: 
Durgeswara Rao Ballepalli is inviting you to a scheduled Zoom meeting.

Topic: Hanuman Chaalisa Paarayanam
Time: May 8, 2021 07:30 PM Mumbai, Kolkata, New Delhi

Join Zoom Meeting
https://us05web.zoom.us/j/5252556901?pwd=T0EzbkFHVEdZVDNOakhQWnNtaDI0dz09

Meeting ID: 525 255 6901
Passcode: sYP1Lz  

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP