ఇది రామభక్తి ఫలం
>> Wednesday, May 1, 2013
[సిగపూర్ నుండి ఓ రామభక్తురాలిని ఆదుకున్న ఆంజనేయుని లీల చదివాము గత పోస్ట్ లలో. అవిడ భర్తకుకూడా మరలా ఉద్యోగం దొరకటం, సమస్యలనుండి ఒడ్డునపడటం స్వామి అనుగ్రహం అని వివరిస్తూ వారి సాధనారీతులను వివరిస్తూ మరలా పంపిన మెయిల్ ఇది.]
దుర్గేశ్వర గారూ,
మిగిలి ఉన్న ఇంకొక కార్యం కూడా ఆ స్వామి పూర్తి చేసేసారండీ.అసలు ఇంతకుముందు జరిగినదంతా కల లాఉంది. నేనేనా అలా కళ్ళవెంట వరదలుగా నీళ్ళు వర్షిస్తోంటే ఏడ్చింది అనిపిస్తోంది.ఆ సమయం లో మీరు చెప్పిన ధైర్యానికి ధన్యవాదాలు.రామ కోటి కూడా రాయడం మొదలెట్టాను.మీరు మొదటి సారి నా గురించి బ్లాగు లో రాసినప్పుడు కామెంటు ద్వారా ధైర్యానందించిన మనోహర్ చెనికల గారికి కూడా ధన్యవాదాలు.
నేను సంక్షిప్త రామాయణాన్ని జతపరుస్తున్నాను. బ్లాగు లో పెట్టండి. వీలయినన్ని సార్లు ఆపదలో ఉన్న వారు చదువుకుంటే మంచిది.అలాగే ప్రతీ మంగళవారం ఇంటి గుమ్మానికి మూడు పోగులేసిన ఎర్ర దారం తో తొమ్మిది తమలపాకులు కట్టి బుధవారం ఉదయం స్నానం చేసాకా తీసి మొక్కలో వేసేయ్యండి.ఇలా తొమ్మిది వారాలు చేయండి. హనుమ మీకు మార్పు చూపిస్తారు.
జై శ్రీరాం. భగవంతుడా ఎంత కష్టానిచ్చావు అంతలోనే అలా తీసేసావు.సదా నా వెన్నంటి ఉండి నా మనసు అటూ ఇటూ సంచరించకుండా చూడు స్వామీ.
పల్లవి:శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
1.అయోధ్యా నగరిలో వెలసెను రామ
అందరినీ అలరించెను రామ
యాగ రక్షణము చేసెను రామ
అహల్య సతిని బ్రోచెను రామా "శ్రీ రామ"
2.శివధనస్సును విరిచెను రామా
సీతను పరిణయమాడెను రామా
పిత్రువాక్యపరిపాలక రామా
కానలకేగెను దశరధరామా "శ్రీ రామ"
3.గుహుని కరుణతో బ్రోచెను రామా
చిత్రకూటమును చేరెను రామా
భరతుని కౌగిత చేర్చెను రామా
ప్రేమతో పాదుకలొసగెను రామా "'శ్రీ రామ"
4.పంచవటిని నివసించెను రామా
కాకాసురుని కరుణించెను రామా
మాయలేడికై వెడలెను రామా
సీతాపహరణము జరిగెను రామా "శ్రీ రామ"
5.సీతను వెదకుచు శ్రీరామా
సీతను చూచితిరా అని రామా
చెట్లను పక్షులనడిగెను రామా
పూవుల తీగల నడిగెను రామా "శ్రీ రామ"
6.జటాయుపక్షి శ్రీరామా
సీతజాడను తెలిపెను రామా
అసువులు విడిచెను శ్రీరామా
అగ్ని సంస్కరణ చేసెను రామా "శ్రీ రామ"
7.కబంద మోక్షము చేసెనురామా
శబరికి దర్శనమిచ్చెనురామా
ఫలముల నొసగిన శబరిని రామా
పావన చరితను చేసెను రామా "శ్రీ రామ"
8.వనముల సీతను వెదకుచు రామా
కిష్కింధకు చేరెను శ్రీరామా
హనుమకు దర్శనమిచ్చెను రామా
ఆనందము చేకూర్చెను రామా "శ్రీ రామ"
9.అగ్ని సాక్షిగా శ్రీరామా
సుగ్రీవునితొ శ్రీరామా
చెలిమి చేసెను శ్రీరామా
వాలి సంహారము చేసెను రామా "శ్రీ రామ"
10.హనుమకు కరుణతో శ్రీరామా
ముద్రిక నిచ్చెను శ్రీరామా
అనుఙ ఇచ్చీ శ్రీరామా
ఆశీర్వదించెను శ్రీరామా "శ్రీ రామ"
11.రామ రామ శ్రీరామ రామ
రామ నామము చేయుచు రామా
కార్యసిద్ధి గావించెనురామ
తిరిగి వచ్చెను మారుతి రామ "శ్రీ రామ"
12.ఆనందముతో మారుతి రామా
ఆనందోత్సాహిగా శ్రీరామా
లంకా విజయము శ్రీరామా
అభివర్ణించెను శ్రీరామా "శ్రీ రామ"
13.అమ్మను చూచితి శ్రీరామా
ఆననందించితి శ్రీరామా
అమ్మక్షేమమే శ్రీరామా
నీకుశల మడిగెను శ్రీరామా "శ్రీ రామ"
14.నీ రాకకోసమై శ్రీరామా
ఎదురుతెన్నులు చూస్తూ రామా
రామా రామా రామా రామా
అని విలపించెను శ్రీరామా "శ్రీ రామ"
15.అంగుళీయకముగని శ్రీరామా
తల్లికనుల తడి బెట్టెను రామా
చూడామణిని ఇచ్చెను రామా
మీ స్మ్రుతులను మరి మరి చెప్పెను రామా "శ్రీ రామ"
16. పరి పరి విధముల శ్రీరామా
నీ క్షేమమడిగెను శ్రీరామా
దనుజునిద్రుంచగ శ్రీరామా
వేగమే రమ్మని చెప్పెను రామా "శ్రీ రామ"
17. సేతుబంధనము చేసెను రామ
లంకను చేరెను శ్రీరామా
విభీషణుడు శరణురామయన
శరణమునిచ్చి బ్రోచెను రామా "శ్రీ రామ"
18. కపివీరుల సాయముతో రామా
దనుజ సంహారము చేసెను రామా
జానకి మదినుప్పొంగెను రామా
పుష్పవర్షము కురిసెను రామా "శ్రీ రామ"
19.లోకవాదుకై శ్రీరామా
సీతాదేవిని శ్రీరామా
అగ్ని పరీక్షకు నిలిపెను రామా
అగ్నివంటిదా సతి శ్రీరామా "శ్రీ రామ"
20.అగ్ని నుండి వెడలెను సతి రామా
రామునిపదములనంటెను శ్రీరామ
పరమానందము నందెను రామా
సీతనయనములు మెరసెను రామా "శ్రీ రామ"
21.విభీషణునికి శ్రీరామా
పట్టముగట్టెను శ్రీరామా
పయన మయ్యిరి శ్రీరామా
అయోధ్యపురికి శ్రీరామ "శ్రీ రామ"
22.లక్ష్మణస్వామితో శ్రీరామ
సీతాదేవితో శ్రీరామ
అయోధ్య చేరెను శ్రీరామా
పులకరించె పురి శ్రీరామ "శ్రీ రామ"
24.హనుమంతుడు కొలువగ శ్రీరామా
మునులు సన్నుతులు చేయగ రామా
దేవదుందుభులు మ్రోగెను రామా
అచ్చెరలాడిరి శ్రీరామా "శ్రీ రామ"
25.పుడమి తల్లి పులకించెను రామా
సస్యములిచ్చెను శ్రీరామా
రామరాజ్యమే ఆదర్శముగా
భువిలో నిలచెను శ్రీరామా "శ్రీ రామ"
26.రామచరితము చదివిన రామా
సకల భాగ్యములు కలుగును రామా
ఆపదలు దరిచేరవు రామా
అఖిల సంపదలు చేకూరును రామా "శ్రీ రామ"
27.శ్రీవర్ధనిచే శ్రీరామా
శ్రీరామ చరితము శ్రీరామా
సులభశైలిలో శ్రీరామా
వ్రాయించెను శ్రీ సీతారామా "శ్రీ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
దుర్గేశ్వర గారూ,
మిగిలి ఉన్న ఇంకొక కార్యం కూడా ఆ స్వామి పూర్తి చేసేసారండీ.అసలు ఇంతకుముందు జరిగినదంతా కల లాఉంది. నేనేనా అలా కళ్ళవెంట వరదలుగా నీళ్ళు వర్షిస్తోంటే ఏడ్చింది అనిపిస్తోంది.ఆ సమయం లో మీరు చెప్పిన ధైర్యానికి ధన్యవాదాలు.రామ కోటి కూడా రాయడం మొదలెట్టాను.మీరు మొదటి సారి నా గురించి బ్లాగు లో రాసినప్పుడు కామెంటు ద్వారా ధైర్యానందించిన మనోహర్ చెనికల గారికి కూడా ధన్యవాదాలు.
నేను సంక్షిప్త రామాయణాన్ని జతపరుస్తున్నాను. బ్లాగు లో పెట్టండి. వీలయినన్ని సార్లు ఆపదలో ఉన్న వారు చదువుకుంటే మంచిది.అలాగే ప్రతీ మంగళవారం ఇంటి గుమ్మానికి మూడు పోగులేసిన ఎర్ర దారం తో తొమ్మిది తమలపాకులు కట్టి బుధవారం ఉదయం స్నానం చేసాకా తీసి మొక్కలో వేసేయ్యండి.ఇలా తొమ్మిది వారాలు చేయండి. హనుమ మీకు మార్పు చూపిస్తారు.
జై శ్రీరాం. భగవంతుడా ఎంత కష్టానిచ్చావు అంతలోనే అలా తీసేసావు.సదా నా వెన్నంటి ఉండి నా మనసు అటూ ఇటూ సంచరించకుండా చూడు స్వామీ.
పల్లవి:శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
1.అయోధ్యా నగరిలో వెలసెను రామ
అందరినీ అలరించెను రామ
యాగ రక్షణము చేసెను రామ
అహల్య సతిని బ్రోచెను రామా "శ్రీ రామ"
2.శివధనస్సును విరిచెను రామా
సీతను పరిణయమాడెను రామా
పిత్రువాక్యపరిపాలక రామా
కానలకేగెను దశరధరామా "శ్రీ రామ"
3.గుహుని కరుణతో బ్రోచెను రామా
చిత్రకూటమును చేరెను రామా
భరతుని కౌగిత చేర్చెను రామా
ప్రేమతో పాదుకలొసగెను రామా "'శ్రీ రామ"
4.పంచవటిని నివసించెను రామా
కాకాసురుని కరుణించెను రామా
మాయలేడికై వెడలెను రామా
సీతాపహరణము జరిగెను రామా "శ్రీ రామ"
5.సీతను వెదకుచు శ్రీరామా
సీతను చూచితిరా అని రామా
చెట్లను పక్షులనడిగెను రామా
పూవుల తీగల నడిగెను రామా "శ్రీ రామ"
6.జటాయుపక్షి శ్రీరామా
సీతజాడను తెలిపెను రామా
అసువులు విడిచెను శ్రీరామా
అగ్ని సంస్కరణ చేసెను రామా "శ్రీ రామ"
7.కబంద మోక్షము చేసెనురామా
శబరికి దర్శనమిచ్చెనురామా
ఫలముల నొసగిన శబరిని రామా
పావన చరితను చేసెను రామా "శ్రీ రామ"
8.వనముల సీతను వెదకుచు రామా
కిష్కింధకు చేరెను శ్రీరామా
హనుమకు దర్శనమిచ్చెను రామా
ఆనందము చేకూర్చెను రామా "శ్రీ రామ"
9.అగ్ని సాక్షిగా శ్రీరామా
సుగ్రీవునితొ శ్రీరామా
చెలిమి చేసెను శ్రీరామా
వాలి సంహారము చేసెను రామా "శ్రీ రామ"
10.హనుమకు కరుణతో శ్రీరామా
ముద్రిక నిచ్చెను శ్రీరామా
అనుఙ ఇచ్చీ శ్రీరామా
ఆశీర్వదించెను శ్రీరామా "శ్రీ రామ"
11.రామ రామ శ్రీరామ రామ
రామ నామము చేయుచు రామా
కార్యసిద్ధి గావించెనురామ
తిరిగి వచ్చెను మారుతి రామ "శ్రీ రామ"
12.ఆనందముతో మారుతి రామా
ఆనందోత్సాహిగా శ్రీరామా
లంకా విజయము శ్రీరామా
అభివర్ణించెను శ్రీరామా
13.అమ్మను చూచితి శ్రీరామా
ఆననందించితి శ్రీరామా
అమ్మక్షేమమే శ్రీరామా
నీకుశల మడిగెను శ్రీరామా "శ్రీ రామ"
14.నీ రాకకోసమై శ్రీరామా
ఎదురుతెన్నులు చూస్తూ రామా
రామా రామా రామా రామా
అని విలపించెను శ్రీరామా "శ్రీ రామ"
15.అంగుళీయకముగని శ్రీరామా
తల్లికనుల తడి బెట్టెను రామా
చూడామణిని ఇచ్చెను రామా
మీ స్మ్రుతులను మరి మరి చెప్పెను రామా "శ్రీ రామ"
16. పరి పరి విధముల శ్రీరామా
నీ క్షేమమడిగెను శ్రీరామా
దనుజునిద్రుంచగ శ్రీరామా
వేగమే రమ్మని చెప్పెను రామా "శ్రీ రామ"
17. సేతుబంధనము చేసెను రామ
లంకను చేరెను శ్రీరామా
విభీషణుడు శరణురామయన
శరణమునిచ్చి బ్రోచెను రామా "శ్రీ రామ"
18. కపివీరుల సాయముతో రామా
దనుజ సంహారము చేసెను రామా
జానకి మదినుప్పొంగెను రామా
పుష్పవర్షము కురిసెను రామా "శ్రీ రామ"
19.లోకవాదుకై శ్రీరామా
సీతాదేవిని శ్రీరామా
అగ్ని పరీక్షకు నిలిపెను రామా
అగ్నివంటిదా సతి శ్రీరామా "శ్రీ రామ"
20.అగ్ని నుండి వెడలెను సతి రామా
రామునిపదములనంటెను శ్రీరామ
పరమానందము నందెను రామా
సీతనయనములు మెరసెను రామా "శ్రీ రామ"
21.విభీషణునికి శ్రీరామా
పట్టముగట్టెను శ్రీరామా
పయన మయ్యిరి శ్రీరామా
అయోధ్యపురికి శ్రీరామ "శ్రీ రామ"
22.లక్ష్మణస్వామితో శ్రీరామ
సీతాదేవితో శ్రీరామ
అయోధ్య చేరెను శ్రీరామా
పులకరించె పురి శ్రీరామ "శ్రీ రామ"
23.పట్టాభిషిక్తునిగా శ్రీరామును
చూచిన వారిదె భాగ్యము రామా
తమ్ములతో సీతమ్మతో రామా
హనుమతో కొలువు తీర్చెను రామా "శ్రీ రామ"
చూచిన వారిదె భాగ్యము రామా
తమ్ములతో సీతమ్మతో రామా
హనుమతో కొలువు తీర్చెను రామా "శ్రీ రామ"
24.హనుమంతుడు కొలువగ శ్రీరామా
మునులు సన్నుతులు చేయగ రామా
దేవదుందుభులు మ్రోగెను రామా
అచ్చెరలాడిరి శ్రీరామా "శ్రీ రామ"
25.పుడమి తల్లి పులకించెను రామా
సస్యములిచ్చెను శ్రీరామా
రామరాజ్యమే ఆదర్శముగా
భువిలో నిలచెను శ్రీరామా "శ్రీ రామ"
సకల భాగ్యములు కలుగును రామా
ఆపదలు దరిచేరవు రామా
అఖిల సంపదలు చేకూరును రామా "శ్రీ రామ"
27.శ్రీవర్ధనిచే శ్రీరామా
శ్రీరామ చరితము శ్రీరామా
సులభశైలిలో శ్రీరామా
వ్రాయించెను శ్రీ సీతారామా "శ్రీ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
5 వ్యాఖ్యలు:
NAMASKARALU DURGESWARA GARU,
SANKSHIPTHA RAMAYANA LINK OPEN KAVATAMU LEDANDI.
మాస్టరు గారు,
మీరు ఇచ్చిన లింక్ పని చెయ్యడం లేదు, డైరెక్ట్ గా మెయిల్ లో ఉన్న్ లింక్ కాపీ పేస్ట్ చేసినట్టున్నారు. మీరు ఆ ఫైల్ డౌన్ లోడ్ చేసుకుని లింక్ ఇవ్వండి.
మనస్ఫూర్తిగా నమ్మిన వారిని స్వామి అభయహస్తంతో కాస్తూనే ఉంటారు. పట్టివిడువరాదు నా చెయ్యి అని పెద్దలు అన్నది అందుకేనేమో.
ఈ లింక్ ఎందుకో పనిచేయటం లేదు.
నేను డౌన్లోడ్ చెసుకున్నాను గానీ నా కంప్యూటర్ లో పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ కావటం లేదు.
మెయిల్ పంపినావిడనే మరలాపంపిమ్చమని అడుగుతాను
జైశ్రీరాం
https://docs.google.com/file/d/0B10tx8O_svdVb2x3WlZkemZQOU0/edit?usp=sharing
పై లింక్ నుండి డౌన్‍లోడ్ చేసుకోగలరు.
https://youtube.com/@srimathaadhyatmikam4176
Post a Comment