శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏమిటయ్యా మీ రామనామం గోల ? మైకులు ఆపండి . టివీసీరియల్లో ఒక్కముక్కా వినపడిచావటం లేదు.

>> Monday, April 29, 2013

యుగయుగాలుగానూ  దైవీ,రాక్షసశక్తుల పోరు సాగుతూనే ఉంది. అందులోనూ ఇది కలికాలమాయె .కలిశక్తితోడై ఆసురీశక్తుల విజృంభణ మరీ ఎక్కువగాఉంటున్నది. ఎంత ఎక్కువ అంటే ఇక రాక్షసశక్తులదే విజయం అనుకుని సాధువులు భయపడేంతగా సాగుతున్నది.
ప్రస్తుతం పీఠం 24 కోట్ల శ్రీరామనామ లేఖన,జప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా గ్రామాలలో పనిచేస్తున్న కార్యకర్తలకు ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే ఇక జనం మారరేమో! ననే అనుమానం వస్తున్నది .
 కొత్తకొత్తపాలెం అనే గ్రామం లో ఈకార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న రమణారెడ్డి మొన్న శనివారం సాయంత్రం జరిగిన సత్సంగంలో తన బాధను వెల్లబోసుకున్నాడు. మాస్టర్ గారూ ! భగవన్నామం పలికించటం కూడా చాలాకష్టమైపోతున్నదండి. మావూర్లో చిన్నగా జనాన్నంతా ఒక గాటికి తెచ్చి గ్రామ క్షేమం కోసం మనం కూడా కోటి నామాన్ని లిఖిద్దాం అని మెల్లగా  మొదలుపెట్టాం . ఇప్పుడుడిప్పుడే కొద్ది,కొద్దిగా కదలిక వస్తున్నది .పిల్లలుమాత్రం చాలాబాగా వ్రాస్తున్నారు. పెద్దలతోనే తంటా.   ఒక్కొక్కరినే చిన్నగా ఈకార్యక్రమం ఆకర్షిస్తుంటే మరోవైపు మావూర్లో నాయకులుగా చలామని అయ్యే వాల్లు దీనికి తూట్లు పొడవాలని చూస్తున్నారు. ఒకాయనయితే ఇంకా పంచాయితీ ఎన్నికలు ముహూర్తంకూడా రాలేదు . అప్పుడే దాదాపు నలభైవేలు  "మందు" విందులకు ఖర్చుపెట్టాడు. రామనామం తరువాత రాయొచ్చు ముందు ఆవిందులకు వెల్లొద్దామనికునే బ్యాచ్ అటు వెళ్ళుతున్నది.  ఇలా నలుగురినీ వెంట తిప్పుకోకపోతే వీళ్ళను పట్టించుకునే దిక్కుండదు. అందుకని గ్రామ ఐక్యతకన్నా వ్యక్తిగత స్వార్ధం ముఖ్యంకనుక  జనం కలసిమెలసి ఉంటే వీళ్లపప్పులుడకవుకనుక ఇలా నికృష్టపు పనులకు పాల్పడుతున్నారు.
అన్నాడు.
ఇక లక్ష్మీపురం కార్యకర్తలది మరొకసమస్య . శ్రీరామనవమి నాడు పండుగ నిర్వహణబాధ్యతలకు ఒక్కడు ముందుకు రాలేదు . పనంతా  కాలేజీ పిల్లలను వెంటబెట్టుకుని మేమే భుజాలమీద మోశాము. సాయంత్ర  ఊరేగింపు వేళకు మాత్రం మందుబాబులు ముందువరుసలో కొచ్చారు. వద్దువద్దంటున్నా వినకుండా బ్యాండుమేళాలు తెప్పించి [ఊరుమ్మడి ఖర్చే] చిందులు డ్యాన్సులు కుంకాలు చల్లుకోవటం,.  మామాట లెక్కపెట్టేవారు లేరు. మిగతావారు ఎందుకులే గొడవలు అని మిన్నకుండి పోయారు . చూస్తూ నిలబడటం తప్ప ఏమీచేయలేకపోయాం. భగవంతుని కార్యక్రమాలలో ఇది అపచారం అని మీరుచెప్పినట్లుగా చెపుతున్నా మామాట అరణ్యరోదనే అయింది.
ఇంకో గ్రామ కార్యకర్తలది ఇంకోచిత్రమైన సమస్య. సార్!  మనం అనుకున్నట్లుగా  వారం రోజులు  ఉషశ్రీగారు, చాగంటి గారు చేసిన రామాయణ ప్రవచనాలను గుడి మైకులలో ఓవారం పాటు కంటిన్యూగా వినిపిద్దమనుకున్నాం. మొన్న మైక్ పెడితే ఒకావిడ  వచ్చి ఏమిటయ్యా మీ రామనామం గోల! మైక్ ఆపండి    టివీ సీరియల్ లో ఒక్కముక్క వినపడిచావటం లేదు . అని తగాదా పెట్టుకున్నది .ఏంచెప్పమంటారిక ? అన్నారు.

[చిత్రమేమిటంటే  గ్రామాల్లో మతమార్పిడి కూటములు పెడుతూ చెవులుబద్దల్లయ్యే సౌండ్లతో రాత్రిళ్ళు హోరెక్కిస్తుంటే ఒక్కరంటే ఒక్కరుకూడా వారిని వారించరు]
 ఒకాయనయితే  అసలు ఈ శ్రీరామ అనివ్రాయటం వలన నాకేమిటి లాభం ? అని అడిగాడట.. ఇదీ ..లోకంవరుస.
అయితే  పూర్తిగా నిరాశచెందాల్సిన పనిలేదు. కాకుంటే .చెడ్దవాడి బలం మంచివాడి మౌనం . ఈసూత్రం నడుస్తున్నది గ్రామాలలో. అని చెప్పుకొచ్చారు మాకార్యకర్తలు.

సరే ! మీకు ఇంతవరకే . నాకైతే జనాన్ని ఎదో ఉద్దరించాలని, ఏదో గొప్ప గురువుగా అనిపించుకోవాలనో తపన ఎక్కువై .ఇలా యజ్ఞాలు ,పారాయణాలు, నామజపాలంటూ  కార్యక్రమాలు చేస్తున్నారులాఉంది మీరు అని,ముఖమ్మీదే అడిగనవారూ ఉన్నారు అని చెప్పానునేను.

మనం ఎవరినో ఉద్దరించాలని ఈ కార్యక్రమాలలో పాల్గొనటం లేదు. మనలను మనం ఉద్దరించుకోవటానికే చేస్తున్నాం. మనం పలుకుతూ ఇలా భగవన్నామం పలికించటం, దీనిగూర్చి ఆలోచించటం, పదిమందితో చర్చించటం ....ఇలా  పదేపదే మనకు తెలియకుండానే భగవన్నామాన్ని స్మరిస్తుంటాము. భగవంతునిగూర్చి ఎక్కువసమయం చింతన చేస్తుంటాం. తద్వారా ముందు మన మనసులో శ్రధ్ధ పెరుగుతుంది. పదిమందిచేత భగవన్నామం పలికించినందున అందులోనూ కొంత పుణ్యంమనకు జమ అవుతుంది. ఈకార్యక్రమాలు చేపట్టకుండా ఉన్నా కాలం గడచిపోతుంది ,పొద్దుపొడుస్తుంది,గుంకుతుంది. మనసమయం లో ఎక్కువభాగం వ్యావహారిక విషయాలకే పరిమితమవుతుంది. ఇలా అనుకోండి  కాలం సద్వినియోగ చేసుకోవచ్చు. ఇదీ ఒక సాధనామార్గమే. ఎవరో ఏదో అనుకున్నారని,అంటున్నారని మనం ఆలోచించాల్సిన పనిలేదు. మనపనిగమనిస్తున్న పైవాడు ఏమనుకుంటూన్నాడో! అదొక్కటే మనం ఆలోచించాలి. పదిమంది మేలుకోరితే అదే మనకు మనబిడ్డలకు శ్రీరామ రక్ష అవుతుంది అని మా వాల్లతో మాటామంచీ పంచుకున్నాము.
జైశ్రీరాం .

5 వ్యాఖ్యలు:

Venugopal Reddy Gurram April 29, 2013 at 10:27 AM  

​పోగాలమ్ ​దాపురించి జనాలు మూలాలను మర్చిపోతున్నారు. ఒక రోజు అందరు మూల్యం చెల్లించాల్సివస్తుంది . ​

Venugopal Reddy Gurram April 29, 2013 at 10:27 AM  

​పోగాలమ్ ​దాపురించి జనాలు మూలాలను మర్చిపోతున్నారు. ఒక రోజు అందరు మూల్యం చెల్లించాల్సివస్తుంది . ​

Anonymous April 29, 2013 at 11:07 AM  

మొన్న మైక్ పెడితే ఒకావిడ వచ్చి ఏమిటయ్యా మీ రామనామం గోల! మైక్ ఆపండి టివీ సీరియల్ లో ఒక్కముక్క వినపడిచావటం లేదు . అని తగాదా పెట్టుకున్నది .ఏంచెప్పమంటారిక ? అన్నారు.


కానీ పండుగలు వచ్చినప్పుడు చూదాలండీ!!!మన జనాలు...గుళ్ళ పై ఒక్కసారిగా ఎగ బడతారూ.. ఏం భక్తీ...ఏం భక్తీ ...ఆ ఒక్క రోజూ నూ!!

మనోహర్ చెనికల April 29, 2013 at 7:48 PM  

సరిగా చెప్పారు.
జై శ్రీరాం

రామ్ April 30, 2013 at 8:45 AM  

పండగ రోజు గుడిలో దేవుడి పైన భక్తి అనే కన్నా, ఆ రోజు నగలు, బట్టల పైన మోజు ఎక్కువ. తప్పదు కాబట్టి గుడికి వెళ్తారు. మార్పు ఒకరు నేర్పేది కాదు. ఎవ్వరికి వారు ప్రయత్నిచాలి.

రామా !!! ఈ పాపులను మార్చే మార్గం నువ్వే చూడు తండ్రి....

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP