దేవుడున్నాడా? లేడా?
>> Thursday, April 25, 2013
పుట్టినప్పటి నుండి దేవుడున్నాడు, ఉన్నాడు అని తల్లిదండ్రులు, సమాజమూ చెప్పడం వల్లనే కదా, మీరూ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు! ఇంట్లోవారు ఏ దేవుడి పార్టీకి సంబంధించిన వారైతే ఆ దేవుణ్ణి మీరూ అంగీకరిస్తారు. ఈ సమాజంలో పుట్టినందున, రాయిని చూపించి దేవుడంటున్నారు. వేరే సమాజంలో రెండు పుల్లలను చూపించి దేవుడంటారు. చిన్నప్పటి నుండే ఒక ఇనుప ముక్కను చూపించి, అదే దేవుడని చెపితే, దాన్ని కూడా దేవుడిగా భావిస్తారు. మీ వరకు మీ దేవుడెలా ఉంటాడు? జరీ వస్త్రాలు, ఆభరణాలు ధరించే కదా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కేలండరులో అచ్చయిన ఆకారంలో కాక, కొంచెం డిఫరెంట్‌గా జీన్స్‌పాంటూ, జుబ్బా ధరించి వస్తే నమ్మి ఇంట్లోకి రానిస్తారా? దేవుడి గురించి మీకు ప్రత్యక్షంగా అనుభవాలేమీ లేవు కాబట్టి ఇతరులు చెప్పింది ఒప్పుకుంటున్నారు.
దేవుడు అంగరక్షకుడా?
గుడికెందుకు వెళ్తున్నారు? దేవుడి అనుభూతి పొందడానికా? "అదివ్వు! ఇదివ్వు! కాపాడు!'' అంటూ వేడుకోవడానికే కదా గుడికే వెళ్తున్నారు. మీ దైవభక్తి పూర్తిగా ఆశతో, భయంతో నిండి పోయింది. మీ ఇంట్లో డజన్లకొద్దీ దేవుడి పటాలు తగిలించారే! అయినా జీవితం గురించిన భయాందోళనలు తొలిగాయా? దేవుణ్ణి కూడా బీరువాలో ఉంచి తాళం వేసి బయటకెళ్ళాల్సి వస్తోంది. ఈ ప్రపంచంలో తమకు కావలసిన దాన్ని పొందడానికి, వానపాము నుంచి ఏనుగు వరకు తమ బలాన్నే నమ్ముకుంటున్నాయి. ఎవరి దగ్గరికీ వెళ్లి సహాయం అడగడం లేదు.
వాటన్నింటికంటే ఎన్నో రెట్లు బుద్ధి కలిగిన మానవుడు మాత్రం తనకు కావలసినదాని కోసం దేవుడిదగ్గర అడుక్కుంటూ కూర్చుంటున్నాడు. శ్రమించకుండా తినడానికి, చదవకుండ పరీక్షల్లో పాస్ కావడానికి, మీ తప్పులు ఎవరూ పట్టించుకోకుండా ఉండడానికి దైవాన్ని తోడుగా ఉండమని అడుగుతుంటారు. జీవితంలో తప్పు జరిగితే, దేవుణ్ణి ఒక ఇన్సూరెన్స్‌గా చేసుకుంటున్నారు. గుళ్ళన్నీ తిరిగి దానిక్కావలసిన ప్రీమియమ్ కడ్తున్నారు. 'అంతా తీసుకొచ్చి ఇవ్వు. దీన్నుంచి కాపాడు' అంటూ మీ సేవకుడిలా, అంగరక్షకుఇలా ఆయనను నియమించుకోవాలని చూస్తున్నారు. జీవితం గురించిన భయంతో దైవనమ్మకాలను పెంచుకుంటూ పోతే, మీ దగ్గర దైవమూ ఉండదు, జీవితమూ దక్కదు.
దిక్సూచిగా చేసుకోవాలి...
జీవితం గురించిన పుస్తకమేదైనా దిక్సూచిగా ఉండాలే తప్ప, జీవితాన్ని నేర్పడానికి కాదు. పూర్తి జాగరూకతతోనే జీవితాన్ని నిజంగా జీవించగలరు. దేవుడు అనేవాడు మీకంటే అతీతంగా ఉండాలని, దేవుడికి పదహారు చేతులున్నట్లు రూపాన్ని సృష్టించారు. దేవుడికి నాలుగు ము ఖాలు, ఆరు ముఖాలు ఇచ్చేశారు. మన పూర్వీకులు దేవతలకు రూపాలివ్వడానికి మేధాపరమైన కారణాలున్నాయి. వాటిని గురించి తెలుసుకోకుండా, దేవుణ్ణి తెలుసుకున్నట్లు భావించడం, మీ అహంకారానికి మేత వేసినట్లే.
"ఆ గుడిలో పదిరూపాయలు వేస్తే, ఇరవై రూపాయలుగా తిరిగి వస్తుంది. ఆ దేవుడికి లాభంలో పది శాతం ఇస్తానని మొక్కుకో. అపరిమితమైన లాభాలు వస్తాయి''అని రికమెండ్ చేయబడ్డ గుళ్లకే కదా వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడతారు. ఆ విధంగా ధర పలికే దేవుడితో ఒక ఆపద ఉంది. లాభంలో పదిశాతం భాగం అని మీరంటూంటే ఇరవై శాతం ఇవ్వడానికి వేరొకరు సిద్ధంగా ఉంటే దేవుడు మిమల్ని పట్టించుకోడే! ఎన్నో లక్షల గుళ్లున్నప్పటికీ ఎటు వెళ్లినా ఎందుకు ఏడుపు ముఖాలనే చూస్తున్నాం? వాస్తవాన్నీ, కల్పితాన్నీ కలిపి కలగాపులగం చేసినందుకు వచ్చిన సమస్య ఇది. దేవుడి కోసం ఎదురు చూడకండి. ఎవరో చెప్పిన వేదాంతాన్ని నమ్మకండి. మహాత్ముల గురించిన పుస్తకాలైనా ప్రేరణగా మాత్రమే తీసుకోండి.
1 వ్యాఖ్యలు:
నీవు మాయమైతే
దేవుడు ఉంటాడు
దేవుడు ఉంటే నీవు లేవు
నీవు వుంటే దేవుడు గాయబ్ !
జిలేబి
Post a Comment